మానవ్ సుతార్ (PC: Warwickshire CCC)
టీమిండియా స్టార్ మానవ్ సుతార్ అదరగొట్టాడు. వార్విక్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు గ్లామోర్గాన్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మానవ్ సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అరంగేట్రంలోనే అదుర్స్
కాగా రాజస్తాన్‌కు చెందిన 24 ఏళ్ల మానవ్ సుతార్ ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీలంకతో ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ సత్తా చాటాడు.
ఇప్పటికి మొత్తంగా మూడు టెస్టులు ఆడిన మానవ్ సుతార్ 23 వికెట్లు పడగొట్టడంతో పాటు.. 79 పరుగులు సాధించాడు. ఇక శ్రీలంక పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన మానవ్.. కౌంటీ చాంపియన్‌షిప్ -2026 ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లాడు. వార్విక్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు గ్లామోర్గాన్‌తో మ్యాచ్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
69 పరుగులకే ఆలౌట్
ఇరుజట్ల మధ్య కార్టిఫ్‌లో మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గ్లామోర్గాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే కుప్పకూలింది. వార్విక్‌షైర్ బౌలర్లలో ఇథాన్ బాంబర్ ఐదు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ ఎడ్ బర్నార్డ్ మూడు వికెట్లు కూల్చాడు. మానవ్ సుతార్, ఒలివిర్ హనాన్ డాల్బీ చెరో వికెట్ పడగొట్టారు.
ఈసారి 65 పరుగులకే కుప్పకూలింది
అనంతరం వార్విక్‌షైర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో గ్లామెర్గాన్ కంటే 322 పరుగుల ఆధిక్యం సంపాదించిన వార్విక్‌షైర్.. గ్లామెర్గాన్‌ను ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో మరోసారి బ్యాటర్లు విఫలం కావడంతో గ్లామోర్గాన్ 65 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా వార్విక్‌షైర్ ఇన్నింగ్స్ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
వార్విక్‌షైర్ బౌలర్లలో కెప్టెన్ ఎడ్ బార్నార్డ్ ఈసారి ఐదు వికెట్లు కూల్చగా.. మానవ్ సుతార్, ఒలివర్ తలా రెండు.. క్రిస్ వోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్ మొత్తంగా 2.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
What a spell 🪄
🐻 #YouBears pic.twitter.com/uEnQTrFixs— Bears (@WarwickshireCCC) September 9, 2026


