source: X
న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ జాక్‌పాట్ కొట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో అతడికి భారీ మొత్తం లభించనుంది. మెల్‌బోర్న్ స్టార్స్‌తో మూడేళ్ల ఒప్పందం చేసుకున్న అలెన్.. తొలి సీజన్‌లోనే కనీసం 6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అందుకోనున్నాడు. బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన కాంట్రాక్ట్.
కొద్ది రోజుల ముందే ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లకు (ఏడాది కాంట్రాక్ట్) ఒప్పందం చేసుకొని, బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా అలెన్ స్టోక్స్ రికార్డును బద్దలు కొట్టాడు.
27 ఫిన్ అలెన్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌లో విధ్వంసకర వీరుడిగా పేరుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని లీగ్‌ల్లో అతడు మెరుపులు మెరిపించాడు. అలెన్ ఖాతాలో ఇప్పటికే 7 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది అలెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బీబీఎల్‌లోనే పెర్త్ స్కార్చర్స్ తరఫున సుడిగాలి శతకం బాదాడు.
అలాగే మేజర్ లీగ్ క్రికెట్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే శతక్కొట్టి, పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.
గత ఎడిషన్ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. కేకేఆర్ తరఫున 11 మ్యాచ్‌ల్లో 214.11 స్ట్రైక్‌రేట్‌తో 349 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 బంతుల్లోనే సెంచరీ చేయడంతో పాటు.. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో 93 పరుగులు చేశాడు.
మెల్‌బోర్న్ స్టార్స్ జట్టులో అలెన్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పీటర్ సిడిల్ వంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఉన్నారు.
మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు..
ఫిన్ అలెన్, ఆస్టిన్ అన్లెజార్క్, హిల్టన్ కార్ట్‌రైట్, సామ్ హార్పర్, లియామ్ హ్యాచర్, క్యాంప్‌బెల్ కెల్లవే, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టాడ్ మర్ఫీ, టామ్ రోజర్స్, పీటర్ సిడిల్, మార్కస్ స్టోయినిస్, మిచ్ స్వెప్సన్.
చదవండి: గెలుపు జోష్‌లో హల్‌చల్ చేసిన ఇషాన్, వైభవ్


