source: X
దులీప్ ట్రోఫీ 2026 టైటిల్‌ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రా అయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి. పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇషాన్ కిషన్ నేతృత్వంలో ఈ జట్టు చాంపియన్‌గా అవతరించింది.
Handshakes in the middle to conclude a fantastic Final 🤝
East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026
టైటిల్ గెలిచిన తర్వాత ఈస్ట్ జోన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ స్టంప్స్ చేతబట్టి భాంగ్రా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. జట్టు కోచ్ రతన్ కుమార్, సహాయక సిబ్బంది, ఇతర ఆటగాళ్లతో కలిసి ఇషాన్, వైభవ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గెలుపును ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
బ్యాట్‌తోనూ అదరగొట్టిన ఇషాన్ కిషన్
టైటిల్ గెలిచాక తనదైన శైలిలో చిందులేసిన ఇషాన్, ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడంలోనూ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతడు భారీ డబుల్ సెంచరీ (270), హాఫ్ సెంచరీ (80) సాయంతో 350 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో తన జట్టు భారీ స్కోర్ (708) చేయడానికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ స్కోరే (ఆధిక్యం) ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడానికి కారణమైంది.
బ్యాట్‌తో తన అద్భుత ప్రదర్శన కారణంగా ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సౌత్ జోన్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో అద్బుత పోరాటం (99) చేసిన ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తిలక్ అంతకుముందు సెమీఫైనల్లో అద్భుత శతకంతో మెరిశాడు.
చదవండి: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
.


