584 ప‌రుగుల ఆధిక్యం.. టైటిల్‌కు అడుగు దూరంలో ఈస్ట్‌జోన్‌! | Duleep Trophy Final-Day-4 Stumps-East Zone Lead By 584 Runs Vs South Zone | Sakshi
Sakshi News home page

584 ప‌రుగుల ఆధిక్యం.. టైటిల్‌కు అడుగు దూరంలో ఈస్ట్‌జోన్‌!

Sep 9 2026 6:16 PM | Updated on Sep 9 2026 6:55 PM

Duleep Trophy Final-Day-4 Stumps-East Zone Lead By 584 Runs Vs South Zone

Photo Credit: BCCI Twitter

దులీప్ ట్రోఫీని అందుకునేందుకు ఈస్ట్‌జోన్ జ‌ట్టు అడుగుదూరంలో నిలిచింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఫైన‌ల్లో నాలుగోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఈస్ట్‌జోన్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (34), ఖురేషీ (26) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం ఈస్ట్‌జోన్ 584 ప‌రుగుల భారీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. 

గురువారం ఆట‌కు చివ‌రి రోజు కావ‌డంతో ఈస్ట్‌జోన్ గెలుపు లాంఛ‌న‌మే. ఐదోరోజు ఉద‌యం సెష‌న్‌లో వేగంగా బ్యాటింగ్ చేసి సౌత్‌జోన్ ముంగిట 650 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టార్గెట్‌గా ఉంచే అవ‌కాశ‌ముంది. ఇంత టార్గెట్ ఛేదించ‌డం అసాధ్యం కాబ‌ట్టి మ్యాచ్ డ్రా అవనుంది. దీంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ విజేత‌గా నిల‌వ‌నుంది. దీంతో 13 ఏళ్ల త‌ర్వాత దులీప్ ట్రోఫీలో ఫైన‌ల్ చేరిన ఈస్ట్‌జోన్ చాంపియ‌న్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో ఉంది.


Photo Credit: BCCI Twitter

తొలి ఇన్నింగ్స్ మాదిరే రెండో ఇన్నింగ్స్‌ను వేగంగా ఆరంభించిన ఈస్ట్‌జోన్‌కు ఓపెన‌ర్లు వైభ‌వ్ (8), అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్ (3) శుభారంభం అందించ‌లేక‌పోయారు. అయితే మిడిలార్డ‌ర్‌లో శిఖ‌ర్ మోహ‌న్ (52), కెప్టెన్ ఇషాన్ కిష‌న్ (80), కుమార్ కుషాగ్ర (34) రాణించ‌డంతో ఈస్ట్‌జోన్ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. 

సౌత్‌జోన్ బౌల‌ర్ల‌లో సిరాజ్‌, త్రిపురానా విజ‌య్‌, నిదీష్‌, షేక్ ర‌షీద్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అంత‌క‌ముందు సౌత్‌జోన్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 336 ప‌రుగుల‌కు ఆలౌటైంది.  తిల‌క్ వ‌ర్మ (99) సెంచ‌రీ చేజార్చుకోగా, ప‌డిక్క‌ల్ (62), సీవీ మిలింద్ (43) ప‌ర్వాలేదనిపించారు. ముఖేశ్‌కుమార్ 3 వికెట్లు తీయ‌గా, ష‌మీ, ఖురేషీ, శిక‌ర్ మోహ‌న్‌లు త‌లా 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

Read: షాకింగ్‌.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మ‌హిళా ప్లేయర్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement