breaking news
south zone
-
'డీఆర్ఎస్ ఏముందిలే బ్రో.. కాబోయే కెప్టెన్‌వి నువ్వు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మాత్రమే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టిన ఇషాన్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 350కి పైగా పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మరోవైపు సెమీస్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో 92 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ తనకిచ్చిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వైభవ్ సమర్థంగా నిర్వహించాడు. మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు తలలో నాలుకలా కొనసాగుతూ వచ్చిన వైభవ్ తన కెప్టెన్ డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు సెమీస్‌లో ఇషాన్ గాయంతో కొన్ని ఓవర్ల పాటు మైదానంలోకి రాలేదు. ఆ సమయంలో వైభవ్ స్టాండిన్ కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. అతడు తీసుకున్న డీఆర్ఎస్ ఫలితాలు అనుకూలంగా రావడంతో తొలి విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈస్ట్‌జోన్ డగౌట్ వద్ద ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తిన వీడియోను బీసీసీఐ కాస్త ఆలస్యంగా విడుదల చేసింది. ఈ వీడియోలో వైభవ్‌ను ఇషాన్ కిషన్ సరదాగా ఆటపట్టించాడు. వైభవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇషాన్ తన సమక్షంలో వైభవ్ మాట్లాడాలంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.ఇషాన్ మాట్లాడుతూ.."డీఆర్ఎస్ విషయంలోనూ ప్రతి చోటా క్రెడిట్ అంతా వైభవ్‌కే దక్కింది. నిజానికి రివ్యూ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ దగ్గరికి వచ్చి చాలా కాన్ఫిడెంట్‌గా ‘రివ్యూ లే లో భాయ్’ అంటూ చెప్పాడు. అంతే.. ఇంటర్నెట్ అంతా ‘వైభవ్, వైభవ్..’ అంటూ ప్రశంసలు. కెప్టెన్‌గా డీఆర్ఎస్ తీసుకునేది నేను.. క్రెడిట్ అంతా ఈ చిచ్చర పిడుగుకే వచ్చింది" అంటూ ఇషాన్ సరదాగా వైభవ్‌ను ట్రోల్ చేశాడు.దీనికి వైభవ్ సూర్యవంశీ కూడా ఇషాన్‌కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు. "మీరు ఉన్నప్పుడు రివ్యూ తీసుకోమని చెప్పింది నేనే.. కానీ గాయంతో పెవిలియన్‌లో ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి" అంటూ వైభవ్ చురక వేశాడు. వైభవ్ సమాధానాన్ని ఇషాన్ అలా చూస్తూ ఉండిపోయాడు.‘అవును.. అప్పుడు కూడా వైభవే రివ్యూలు తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అతడిలో కెప్టెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అతడి కెరీర్ ఎలా సాగుతుందో. వైభవ్ జట్టులో ఉండటం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరినీ.. అది జూనియర్ అయినా, సీనియర్ అయినా.. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓహ్.. జూనియర్ అంటే నువ్వు ఒక్కడివే కదా! సారీ.. సారీ’ అంటూ ఇషాన్ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.Ishan Kishan with Vaibhav Sooryavanshi. 😂❤️ pic.twitter.com/hAB688xia1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2026Read: ‘వైభవ్.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’ -
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకుంది. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి చాంపియన్‌గా అవతరించింది. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఈ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. సౌత్ జోన్ సారథిగా వ్యవహరించిన తిలక్ వర్మ బ్యాటర్‌గా రాణించినప్పటికీ.. కెప్టెన్‌గా మాత్రం చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆 Congratulations to the Ishan Kishan-led East Zone on winning their third #DuleepTrophy title 👏👏#EZvSZ | @ishankishan51 pic.twitter.com/u6D4UvOTEp— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్ ఆదివారం మొదలైంది. టాస్ గెలిచి తొలి రెండురోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ జట్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఇషాన్ డబుల్ సెంచరీటాపార్డర్లో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44).. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) అదరగొట్టారు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో కదం తొక్కాడు. మరోవైపు.. కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101).. అనుకుల్ రాయ్ (45), ఎండీ కౌనియన్ ఖురేషి (40) రాణించారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ తిలక్ వర్మ 99 పరుగులు చేయగా.. దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో సీవీ మిలింద్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడించకుండా..ఆ తర్వాత సౌత్‌కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బుధవారమే బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.ఇషాన్ 80 పరుగులు చేయగా.. శిఖర్ మోహన్ 52 పరుగులతో రాణించాడు. ఇక ఆఖరిదైన గురువారం నాటి ఐదో రోజు ఆటలో ఆల్‌రౌండర్ ఖురేషి అజేయ శతకం (116)తో రాణించగా.. అనుకుల్ రాయ్ హాఫ్ సెంచరీ (64) సాధించాడు. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా 46 పరుగులు చేశాడు.మ్యాచ్ డ్రా.. ఈస్ట్దే టైటిల్ఈ క్రమంలో 388 పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికి ఈస్ట్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా మొత్తంగా 760 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. దీంతో ఆఖరి రోజు ఆట కాబట్టి సౌత్ జోన్ ‘డ్రా’కు అంగీకరించింది. నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లోనూ ఈస్ట్ ఆధిక్యంలో ఉన్నందున ట్రోఫీ ఈస్ట్ జోన్‌కే దక్కింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026 -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
చెపాక్ వేదికగా సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అసాధరణ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కిన ఇషాన్(270).. రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహాలో మెరుపులు మెరిపించాడు. కేవలం 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు.ఈ భారత వికెట్ కీపర్ బ్యాటర్ మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 350 పరుగులు చేశాడు. తద్వారా 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒక మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా కిషన్ నిలిచాడు. ఇంతకుముందు భారత మాజీ క్రికెటర్ రామణ్ లంబా చేసిన 320 పరుగులే అత్యధికంగా ఉండేది. 1987లో భిలాయ్ వేదికగా వెస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ తరపున లంబా ఈ ఫీట్ సాధించాడు. తాజా నాక్‌తో లంబాను అధిగమించి కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అడుగు దూరంలోఇక ఈ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు నేడు చివరి రోజు కాగా... ప్రస్తుతం ఈస్ట్ ఓవరాల్‌గా 584 పరుగులు ముందంజలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయం కాబట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్న ఈస్ట్ విజేతగా నిలవడం లాంఛనమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 212 పరుగులు చేసింది. తిలక్ వర్మ 99 అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 242/6తో బుధవారం ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ (99; 9 ఫోర్లు) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా, సీవీ మిలింద్ (43; 7 ఫోర్లు) రాణించాడు. ఈస్ట్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత సౌత్‌కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.చదవండి: పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం -
584 పరుగుల ఆధిక్యం.. టైటిల్‌కు అడుగు దూరంలో ఈస్ట్‌జోన్!
దులీప్ ట్రోఫీని అందుకునేందుకు ఈస్ట్‌జోన్ జట్టు అడుగుదూరంలో నిలిచింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (34), ఖురేషీ (26) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈస్ట్‌జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో ఈస్ట్‌జోన్ గెలుపు లాంఛనమే. ఐదోరోజు ఉదయం సెషన్లో వేగంగా బ్యాటింగ్ చేసి సౌత్‌జోన్ ముంగిట 650 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్‌గా ఉంచే అవకాశముంది. ఇంత టార్గెట్ ఛేదించడం అసాధ్యం కాబట్టి మ్యాచ్ డ్రా అవనుంది. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ విజేతగా నిలవనుంది. దీంతో 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీలో ఫైనల్ చేరిన ఈస్ట్‌జోన్ చాంపియన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో ఉంది.Photo Credit: BCCI Twitterతొలి ఇన్నింగ్స్ మాదిరే రెండో ఇన్నింగ్స్‌ను వేగంగా ఆరంభించిన ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్లు వైభవ్ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) శుభారంభం అందించలేకపోయారు. అయితే మిడిలార్డర్లో శిఖర్ మోహన్ (52), కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), కుమార్ కుషాగ్ర (34) రాణించడంతో ఈస్ట్‌జోన్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. సౌత్‌జోన్ బౌలర్లలో సిరాజ్, త్రిపురానా విజయ్, నిదీష్, షేక్ రషీద్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) సెంచరీ చేజార్చుకోగా, పడిక్కల్ (62), సీవీ మిలింద్ (43) పర్వాలేదనిపించారు. ముఖేశ్‌కుమార్ 3 వికెట్లు తీయగా, షమీ, ఖురేషీ, శికర్ మోహన్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు.MD Nidheesh breaks the partnership 👏He gets the crucial wicket of East Zone captain Ishan Kishan who played yet another superb knock of 80(98) 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/j9C01OLgmB— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు! -
ఏ బౌలర్‌ను వదల్లేదు.. భీకర ఫామ్‌లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహా బ్యాటింగ్‌తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్‌జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్‌ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్‌ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్‌జోన్, ఆ తర్వాత సౌత్‌జోన్‌ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్! -
ఈస్ట్‌జోన్‌దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్!
దులీప్ ట్రోఫీని ఈసారి ఈస్ట్ జోన్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్లో సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. ఇదే సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా చరిత్ర సృష్టించనున్నాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్లు కావడంతో, అత్యంత పిన్న వయస్సులో దులీప్ ట్రోఫీ నెగ్గిన జట్టలోని ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటికే టోర్నీలో సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన వైభవ్, కప్‌ను ఈస్ట్‌జోన్ సొంతం చేసుకుంటే మాత్రం పైన చెప్పుకున్న ఘనత కూడా వైభవ్ ఖాతాలో చేరనుంది.డ్యాన్స్ చేసిన వైభవ్..ఇక మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఇన్నింగ్స్ సందర్భంగా త్రిపురానా విజయ్ వికెట్ పడినప్పుడు వైభవ్ సూర్యవంశీ డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 708 పరుగులు చేసిన ఈస్ట్‌జోన్‌కు పోటీ ఇచ్చే క్రమంలో సౌత్‌జోన్ తరఫున ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మతో పాటు దేవదత్ పడిక్కల్, సీవీ మిలింద్ కాస్త ప్రతిఘటించారు. తాను ఒక ఎండ్‌లో పాతుకుపోయినప్పటికీ, మరో ఎండ్‌లో మాత్రం వరుసగా వికెట్లు పడడంతో వైభవ్ ఉబ్బితబ్బియయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన త్రిపురానా విజయ్ కెప్టెన్‌తో ఏర్పడిన సయన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఖురేషీ వేసిన ఆఫ్‌స్టంప్ బంతిని తిలక్ వర్మ కట్‌షాట్ ఆడాడు. తనవైపు వచ్చిన బంతిని అభిజిత్ సర్కార్ వేగంగా అందుకొని అంతే వేగంతో వికెట్ కీపర్ ఇషాన్ వైపు విసిరాడు. అప్పటికే తిలక్ సింగిల్ తీయాలా వద్దా అనే డైలమాలోనే ముందుకు పరిగెత్తాడు. దీంతో కాస్త లేటుగా రనప్ అందుకున్న త్రిపురానా విజయ్ స్ట్రైక్ ఎండ్‌కు చేరేలోపే ఇషాన్ వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్ అయ్యాడు. విజయానికి చేరువ కావడంతో సంతోషం పట్టలేని వైభవ్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీ సాధించగా, కుమార్ కుషాగ్ర (101) సెంచరీ చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థసెంచరీలు సాధించారు. సౌత్‌జోన్ బౌలర్లలో త్రిపురానా విజయ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్‌జోన్ 107.3 ఓవర్లలో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా, పడిక్కల్ (62) అర్థసెంచరీ సాధించాడు. ఈస్ట్‌జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.Excellent reflex catch and run out ⚡️Top-fielding efforts bring wickets for East Zone 👌South Zone are 322/8 Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/FKDmQcDYG3— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: ‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’ -
708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్.. తెలివిలేదా?
దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో అతి భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో.. ఇషాన్ కిషన్ సేన సమిష్టిగా రాణించింది.ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందిస్తే.. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) భారీ స్కోరు దిశగా పునాది వేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం పట్టుదలగా ముందుకు సాగాడు.270 పరుగులుఈ క్రమంలో ద్విశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికీ.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. ఇషాన్‌కు తోడుగా కుమార్ కుశాగ్రా శతకం (101)తో చెలరేగాడు.I.C.Y.M.I2️⃣7️⃣0️⃣ runs3️⃣3️⃣4️⃣ balls3️⃣0️⃣ fours7️⃣ sixes8️⃣0️⃣.8️⃣3️⃣ SRWatch 🎥 highlights of Ishan Kishan's marathon knock 👌👌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/An6sT09tfu— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026708 పరుగులు చేసి ఆలౌట్మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (45) ఎండీ కౌనేన్ ఖురేషి (40) రాణించగా.. టెయిలెండర్ మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ ఈ మేరకు సమిష్టిగా రాణించి రెండు రోజులు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 163 ఓవర్లు ఆడి 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.తెలివిలేదా?.. నిజానికి రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఈ స్థాయి భారీ స్కోరు సాధించడం కంటే.. కాస్త ముందుగానే డిక్లేర్ చేసి.. ఫలితం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం జట్టు ఆలౌట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయించాడు. ఇందుకు రెండు రోజులు తీసుకున్నాడు.నిబంధనల ప్రకారమే తెలివిగానిజానికి ఇలా చేయడం ద్వారా మ్యాచ్ డ్రా అవుతుందే తప్ప ఫలితం తేలదు. అయినా ఇషాన్ ఎందుకిలా చేశాడు?.. ఇషాన్ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా ఇలాగే చేస్తాడు. ఎందుకంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రెడ్‌బాల్ క్రికెట్ నిబంధనల ప్రకారం..రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్ కోసం టెస్టు మాదిరే ఐదు రోజులు కేటాయిస్తారు. అయితే, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే గనుక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసేందుకే మొగ్గుచూపింది.336 పరుగులకే ఆలౌట్.. ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమేఇక సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 709 పరుగులు చేస్తేనే మ్యాచ్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. బుధవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఫలితంగా ఈస్ట్ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక బుధవారం ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. గురువారం ఒక్కరోజు మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడించకుండా డ్రా చేసుకునేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి దులిప్ ట్రోఫీ-2026 విజేతగా ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు.చదవండి: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే? -
పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే?
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి విధించిన ఫాలో-ఆన్ మార్కును సౌత్‌జోన్ అందుకోలేకపోయింది. ఫాలో-ఆన్‌కు 173 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ జట్టుకు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.పాపం తిలక్ వర్మఈ తుది పోరులో సౌత్‌జోన్ కెప్టెన్ తిలక్ వర్మ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు సహచర బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. తిలక్ మాత్రం బాధ్యతాయుతమైన నాక్‌తో జట్టును ముందుకు నడిపించాడు. అయితే దురదృష్టవశాత్తూ తిలక్ తన 9వ ఫస్ట్‌క్లాస్ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఈ హైదరాబాదీ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కౌనైన్ ఖురైషీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అతడితో పాటు దేవ్‌దత్త్ పడిక్కల్(62), సీవీ మిలింద్(43), జగదీశన్(32) రాణించారు. ఈస్ట్‌జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు, ఖురేషీ, మహ్మద్ షమీ, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ డ్రా అయితే ఏ జట్టుకు అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభిస్తుందో ఆ టీమ్‌నే విజేతగా నిర్ణయిస్తారు.చదవండి: వెస్టిండీస్‌తో సిరీస్.. టీమిండియాలోకి ఆర్సీబీ కెప్టెన్? -
షమీకి వార్నింగ్
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చారు. సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో బంతి స్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో షమీతో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లందరినీ అంపైర్ హెచ్చరించారు.మ్యాచ్ మూడో రోజు చివరి సెషన్లో (60వ ఓవర్) ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మ బంతిని పరిశీలించారు. బంతిని మెరిపించేందుకు ఆటగాళ్లు (ఈస్ట్ జోన్) అతిగా చెమటను ఉపయోగించవద్దని సూచించారు. నిబంధనల ప్రకారం బంతి స్వభావాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చడం నిషేధం.కాగా, ఈస్ట్ జోన్ బౌలర్లు పాత బంతితోనూ రివర్స్ స్వింగ్ రాబట్టి సౌత్ జోన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా షమీ (2-17), ముకేశ్ కుమార్ (2-36) అద్బుతంగా బౌలింగ్ చేసి సౌత్ జోన్‌ను కష్టాల్లోకి నెట్టారు. వీరి ధాటికి సౌత్ జోన్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 242 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది. సౌత్ జోన్‌ను కెప్టెన్ తిలక్ వర్మ (56 నాటౌట్) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.చదవండి: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్‌జోన్ కకావికలం -
పోరాడుతున్న తిలక్ వర్మ
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల అతి భారీ స్కోర్ చేయగా.. సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది (మూడో రోజు ఆట ముగిసే సమయానికి). ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆ జట్టు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌత్ జోన్‌ను తిలక్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్మరణ్ రవిచంద్రన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 45 పరుగులు, శ్రేయస్ గోపాల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తిలక్ 56, చామ మిలింద్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.సౌత్ జోన్ ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. రికీ భుయ్ 1, నారాయణ్ జగదీశన్ 32, షేక్ రషీద్ 27, స్మరణ్ రవిచంద్రన్ 23, శ్రేయస్ గోపాల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్, ఖురేషి చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.చదవండి: పాక్‌తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు! -
నిప్పులు చెరిగిన షమీ.. సౌత్‌జోన్ కకావికలం
దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ తరఫున ఆడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సౌత్‌జోన్‌తో ఫైనల్లోనూ చెలరేగుతున్నాడు. సెమీఫైనల్లో ఐదు వికెట్లు తీసిన షమీ ఫైనల్లో బంతులో నిప్పులు చెరిగాడు. 11 ఓవర్లు వేసిన షమీ 4 మెయిడెన్లు సహా 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖేశ్ కుమార్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన షమీని ఎదుర్కోవడంలో సౌత్‌జోన్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సౌత్‌జోన్ జట్టు 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (37), శ్రేయస్ గోపాల్ (13) క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ జట్టు 163 ఓవర్లలో 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీతో మెరవగా, కుమార్ కుశాగ్ర (101) సెంచరీతో రాణించగా, అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థశతకాలతో రాణించారు. త్రిపురణ విజయ్ నాలుగు వికెట్లతో మెరిశాడు.ఇటీవలే షమీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చదవండి: చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో! -
తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్!
ఈస్ట్ జోన్‌తో దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో సౌత్ జోన్ కఠిన సవాలు ముంగిట నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. మొదటి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.టీమిండియా స్టార్లతో కళఈ క్రమంలో సౌత్ జోన్ ఈస్ట్ జోన్‌కు బదులిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్.. సౌత్ జోన్‌కు తిలక్ వర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్లో వైభవ్ సూర్యవంశీ, మహ్మద్ షమీ వంటి స్టార్లు ఉండగా.. సౌత్ జోన్లో దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. కెప్టెన్ తిలక్ వర్మ తనను తుదిజట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణమేంటో తనకు అర్థం కావడం లేదన్న అర్థంలో అతడు వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..రంజీ వీరుడుదేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ఆడుతున్న కరుణ్ నాయర్.. 2025-26 రంజీ సీజన్లో 13 ఇన్నింగ్స్‌లో కలిపి 699 పరుగులు సాధించాడు. మొత్తంగా ఇప్పటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 26 శతకాల సాయంతో 9374 పరుగులు రాబట్టాడు.దురదృష్టవశాత్తూ.. తుదిజట్టు నుంచి తీసేశాఅయితే, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో భాగంగా నార్త్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్ తుదిజట్టులో కరుణ్ నాయర్‌కు చోటు దక్కలేదు. ఈ విషయం గురించి కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘కరుణ్ దురదృష్టవంతుడు. ఈసారి అతడికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము. ప్రత్యర్థి జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున.. నేను కొడిమెల హిమతేజను తుదిజట్టుకు ఎంచుకున్నా.యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి కదా!.. కరుణ్ నాయర్ ఇప్పటికే దేశీ క్రికెట్లో తానేంటో నిరూపించుకున్నాడు. కానీ ఈసారి దురదృష్టవశాత్తూ అతడికి అవకాశం దక్కడం లేదు’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. సౌత్ జోన్ కోచ్ మాత్రం కరుణ్ నాయర్ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడని పేర్కొన్నాడు.శతకంతో కదంతొక్కిఇలాంటి తరుణంలో సౌత్ జోన్‌ను వీడి.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీస్ ఎలెవన్ తరఫున ఛత్తీస్‌గడ్‌తో మ్యాచ్ ఆడాడు కరుణ్ నాయర్. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా 183 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 104 పరుగులు సాధించాడు. ఓవైపు ఈస్ట్ జోన్ బ్యాటర్లు సౌత్ జోన్ బౌలింగ్‌ను చితక్కొడుతున్న వేళ కరుణ్ నాయర్ సెంచరీతో ఈ మేరకు కదం తొక్కాడు.అర్థం కావడమే లేదుఈ పరిణామాల నేపథ్యంలో క్రిక్ఇన్ఫో జర్నలిస్టు ఒకరు.. ‘‘దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆడే తుదిజట్టు నుంచి తప్పించిన మరుసటి రోజే కరుణ్ నాయర్ ప్రి-సీజన్ రెడ్‌బాల్ పోటీలో అద్భుతమైన శతకం సాధించాడు.కరుణ్ జట్టుతో ఉండి ఉంటే సౌత్‌జోన్ 708 పరుగుల మైలురాయిని కాస్త సులువుగానే చేరుకునేది. అయినా అతడిని తుదిజట్టు నుంచి ఎందుకు తప్పించారో అస్సలు అర్థం కావడం లేదు’’ అని ట్వీట్ చేశారు.తిలక్‌ను టార్గెట్ చేసిన కరుణ్!ఇందుకు స్పందనగా.. ‘‘అర్థం కావడం లేదు అనే పెద్ద పెద్ద మాటలు అవసరం లేదేమో!’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని కరుణ్ నాయర్ జోడించాడు. ఈ నేపథ్యంలో.. తనను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారంటూ పరోక్షంగా తిలక్ వర్మను టార్గెట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: టీమిండియాతో టీ20.. జపాన్ జట్టు ప్రకటన -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెన్నై వేదికగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ భారీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ 708 పరుగుల మేర అతి భారీ స్కోరు సాధించింది. An innings of pure class 👌Watch 🎥 snippets of Ishan Kishan's fantastic double century so far 💯💯Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ | @ishankishan51 pic.twitter.com/jOndIaA5Uo— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం మొదలైంది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ సూపర్ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ భారీ అర్ధ శతకం (85)తో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ డబుల్ సెంచరీసౌత్ జోన్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఇషాన్.. డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గాయపడి మైదానం వీడాడు. అయితే, జట్టుకు అవసరమైన మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. శతక్కొట్టిన కుశాగ్రాట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ త్రిపురాన విజయ్ బౌలింగ్‌లో స్మరణ్ రవిచంద్రన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ కిషన్ మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101), అనుకూల్ రాయ్ (45), ఎండీ కొనియన్ ఖురేషి (40) రాణించారు. టెయిలెండర్లలో మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ముకేశ్ కుమార్ డకౌట్ అయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురాణ విజయ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చామా మిలింద్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు నమన్ ఓజా పేరిట ఉండేది. సెంట్రల్ జోన్ తరఫున 2014లో నార్త్ జోన్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు 217 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా ఇషాన్ 270 పరుగులు సాధించి నమన్ ఓజాను అధిగమించాడు.చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించిన పాక్ కెప్టెన్! -
రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి కడుపు కింద భాగంలో బలంగా తాకింది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియన్ దిశగా పరిగెత్తి అక్కడే కూర్చుండిపోయాడు. ఫిజియో వచ్చి ఇషాన్ గాయాన్ని పర్యవేక్షించాడు. అదే సమయంలో ఫిజియోతో వచ్చిన డాక్టర్ ‘రెస్ట్ తీసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన మరో 30 బంతుల్లో 250 మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తిరగబెట్టడంతో ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఇషాన్‌తో మాట్లాడాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మరి మిగతా మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? ఉండడా అనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అయినట్లు ప్రదర్శించడంతో అతడు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈస్ట్‌జోన్ 650 పరుగుల మార్క్‌ను దాటడంతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం లేకపోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్‌జోన్ తాజాగా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈస్ట్‌జోన్ 650 పరుగుల మార్క్‌ను దాటడంతో సౌత్‌జోన్ అంత స్కోరు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది. ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియడం, మరో మూడు రోజులు ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది.Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌What a magnificent knock from the East Zone captain so far 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026Doctor: rest loIshan: century laga deta hu 💀🙏Ishan Kishan during a Duleep Trophy match, sarcastically noting an apparent injury with "oops🤕" before adding he recovered quickly and is batting well. pic.twitter.com/5eZraPJVix— CricketIndian_🚩🇮🇳 (@CricketIndian_) September 7, 2026 That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026చదవండి: భారత్‌తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్ -
సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్‌జోన్‌దే
చెన్నై చిదంరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సౌత్‌జోన్‌తో మొదలైన ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (75 బంతుల్లో 63 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌత్‌జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు తీయగా, త్రిపురాణా విజయ్ ఒక వికెట్ పడగొట్టాడు.వైభవ్ మాస్.. అభిమన్యు, శిఖర్ క్లాస్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72 పరుగులు) మరో ఎండ్‌లో నింపాదిగా ఆడాడు. వైభవ్ ఔటయ్యాకా బరిలోకి దిగిన శ్రీకర్ మోహన్ (120 బంతుల్లో 85 పరుగులు) కూడా తనదైన శైలి బ్యాటింగ్‌తో అలరించాడు. అభిమన్యు, సుదీప్ కుమార్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగిన్పటికీ, శిఖర్‌కు జత కలిసిన ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సౌత్‌జోన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఇషాన్ అర్ధసెంచరీ మార్క్ చేరుకున్నాడు. శిఖర్ ఔటైనప్పటికీ, కుమార్ కుషాగ్ర వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఇషాన్ కిషన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది పదో సెంచరీ. అనంతరం కాసేపటికే కుమార్ కుషాగ్ర కూడా అర్థసెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే బ్యాడ్‌లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.💯 for Ishan Kishan 👏He brings it up in style 💥The East Zone captain leading from the front with a superb knock 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/ql9el4G60Q— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026చదవండి: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. సిరాజ్‌ను సైతం వదల్లేదు
చెన్నై వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తనదైన శైలిలో సూర్యవంశీ విరుచుకుపడ్డాడు. సౌత్‌జోన్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను సైతం వైభవ్ వదల్లేదు. 7వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో వైభవ్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. మరోసారి షార్ట్ లెంగ్త్ డెలివరీకే వైభవ్ తన వికెట్‌ను కోల్పోయాడు. సీవీ మిలింద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద సూర్యవంశీ దొరికిపోయాడు. ఇక ఈస్ట్‌జోన్ 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది.తుది జట్లుఈస్ట్ జోన్: అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ, కుమార్ కుషాగ్రా, సుదీప్ కుమార్ ఘరామి, శిఖర్ మోహన్, ఇషాన్ కిషన్(కెప్టెన్), మహ్మద్ కౌనైన్ ఖురైషి, అనుకుల్ రాయ్, మహమ్మద్ షమీ, అభిజిత్ కె సర్కార్, ముఖేష్ కుమార్సౌత్ జోన్: రికీ భుయ్, నారాయణ్ జగదీషన్(వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షేక్ రషీద్, తిలక్ వర్మ(కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, శ్రేయస్ గోపాల్, త్రిపురాన విజయ్, మహ్మద్ సిరాజ్, చామ వి మిలింద్, మహ్మద్ నిధీష్చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్4️⃣,6️⃣,4️⃣Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026 -
ఈస్ట్ జోన్ X సౌత్ జోన్
చెన్నై: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ అమీతుమీకి సిద్ధమైంది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టులో భారత ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, మొహమ్మద్ సిరాజ్‌తో పాటు రికీ భుయ్, షేక్ రషీద్, జగదీశన్, స్మరణ్, శ్రేయస్ గోపాల్ ఉన్నారు. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ఆడడం లేదని సారథి తిలక్ మ్యాచ్‌కు ముందు రోజు వెల్లడించాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కావెరప్ప స్థానంలో హైదరాబాద్ ఆల్‌రౌండర్ సీవీ మిలింద్కు సౌత్ జోన్ జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్‌లో 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సెమీఫైనల్లో దంచికొట్టిన అతడు ఫైనల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తనలో వాడి తగ్గలేదని చాటుతుండగా... ముకేశ్ కుమార్, అభిజిత్ సర్కార్ అతడికి అండగా నిలుస్తున్నారు. -
‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’
టీమిండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ జాతీయ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్‌జోన్ ఫైనల్‌కు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం నుంచి ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆటగాడు బాగా రాణిస్తున్నాడంటే ఎంపికకు అతడి వయసుతో సంబంధముండదని తెలిపాడు. షమీ విషయంలోనూ అదే వర్తిస్తుందని, జట్టులో చోటు కోల్పోయినప్పటి నుంచి షమీ కసితో ఉన్నాడని, అతడిని టీమిండియాకు ఎంపిక చేయాల్సిన సమయం వచ్చిందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు.Photo Credit: BCCI Twitterఇషాన్ మాట్లాడుతూ.. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లలో షమీ ఒకడని నేను భావిస్తున్నాను. స్టార్‌గా వెలుగొందుతున్న షమీ బెంగాల్ తరఫున ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ కీలక బౌలర్‌గా మారిపోయాడు. ఒక బౌలర్‌గా టీమిండియాకు కూడా ఎంతో సేవ చేశాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని నేను భావిస్తాను. కష్టపడుతున్న సమయంలో వయసును లెక్కలోకి తీసుకోకూడనేది నా అభిప్రాయం. షమీ భాయ్‌లో ఆ కసి నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎలా ఆడాడు అనేదాన్ని పక్కనబెట్టి ఇప్పుడెలా ఆడుతున్నాడనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈస్ట్‌జోన్ జట్టుకు షమీ ఆడుతుండడం మా అదృష్టం. అతడు మా జట్టులో ఉండడం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 36 ఏళ్ల వయసులో ఎక్కువ ఓవర్లు వేస్తే అలసిపోయే బౌలర్లతో పోలిస్తే షమీ వేరుగా కనిపిస్తాడు. Photo Credit: BCCI Twitterనేను అడగకముందే జట్టుకు వికెట్ అవసరమైనప్పుడల్లా తాను బౌలింగ్ చేస్తానంటూ షమీ భాయ్ ముందుకు వచ్చేవాడు. ఒక కెప్టెన్‌గా అతడి కసిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే అతడి తాపత్రయం నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలిగొన్న సింహంలా కనిపిస్తున్నాడు. షమీ భాయ్ రీఎంట్రీని ఎవరూ ఆపలేరు.’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక సౌత్‌జోన్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా షమీపై ప్రసంశల జల్లు కురిపించాడు. షమీ లాంటి చాకచక్యమైన పేసర్‌ను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు. షమీ భాయ్‌తో ఆడడం మాకు ఎప్పుడూ ఇష్టమే అని తిలక్ వెల్లడించాడు. ఇటీవలే షమీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.Read: నాలుగేళ్ల తర్వాత బరిలో విలియమ్స్ సిస్టర్స్.. ఫలితం ఏంటంటే? -
టెస్టు క్రికెట్‌పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
దులీప్ ట్రోఫీలో భాగంగా వన్ మ్యాన్ షో చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. నార్త్‌జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో సౌత్‌జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్థసెంచరీతో జట్టును విజయపథంలో నడిపించి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రజంటేషన్ సందర్భంగా తిలక్ వర్మ తన క్రికెట్ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడడాన్ని ఎంతో ఇష్టపడుతా. వైట్‌బాల్ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని నేనెప్పుడు కల కనలేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నా. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా. అదే నా కల..ఎప్పటికైనా టీమిండియా టెస్టు జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నా. నిజానికి పదేళ్ల వయసు నుంచే క్రికెట్లో కష్టపడుతున్నా. నా కష్టాన్ని ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నా వయసు 23. ఐపీఎల్ కారణంగా వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్‌కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్లో చాలా కష్టంతో కూడిన గ్రౌండ్‌వర్క్ చేశాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. అదే నా బలం కూడా. ఇప్పుడైతే దేశం తరఫున టీ20లు, వన్డేల్లో ఆడుతున్నాను. గత మూడు, నాలుగేళ్లుగా దేశవాళీ క్రికెట్లో రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు సమయం కుదరడం లేదు. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే రెడ్‌బాల్ క్రికెట్లో వీలైనంత మేర రాణించాలని భావించాను.’ అని చెప్పుకొచ్చాడు.ఈజీగా మార్చుకోగలను..అయితే టెస్టుల్లో ఇప్పుడు మూడు లేదా ఆరో స్థానం ఖాళీగా ఉంది. ఒకవేళ మీకు అవకాశమొస్తే ఆ స్థానాలను భర్తీ చేయగలరా అని తిలక్ వర్మకు ప్రశ్న ఎదురైంది. దీనిపై తిలక్ వర్మ స్పందిస్తూ.. ‘నిజానికి రెడ్‌బాల్ నుంచి వైట్‌బాల్‌కు షిఫ్ట్ అవ్వడం ఈజీ. అదే సమయంలో వైట్‌బాల్ నుంచి రెడ్‌బాల్‌కు షిఫ్ట్ అవ్వడం కఠినం. కానీ నేను సాధ్యమైతనంత మేర వైట్‌బాల్ నుంచి రెడ్‌బాల్‌కు సులువుగానే మారగలను. అయితే రెడ్‌బాల్ క్రికెట్లో మంచి టెక్నిక్ ఉన్నప్పుడే మనం అన్ని ఫార్మాట్లలోనూ గుడ్ ప్లేయర్‌గా మారగలం’ అని పేర్కొన్నాడు. ఇక దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు ఫైనల్ చేరడం సంతోషంగా ఉందని తెలిపాడు. తనకు ఫైనల్ మ్యాచ్ ఆడాలని ఉందని, కానీ అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కారణంగా అది సాధ్యపడుతుందా అనేది చూడాలని తెలిపాడు. నిజానికి ఆఫ్గన్‌తో తొలి టీ20 మ్యాచ్ 13న జరగనుండడంతో, 11న టీమిండియాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నాడు. తనకు సాధ్యమైతే మాత్రం ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు రెడీ ఉన్నట్లు తిలక్ వర్మ వెల్లడించాడు.South Zone cruise into the final 🙌They chase down 181 and beat North Zone by 7 wickets 👌Scorecard ▶️ https://t.co/AGjIStrDAT#DuleepTrophy | #SZvNZ pic.twitter.com/UXTDC4wdF4— BCCI Domestic (@BCCIdomestic) September 2, 2026 🚨 CAPTAIN TILAK VARMA SHINES IN THE SEMIFINAL! Tilak Varma led South Zone into the Duleep Trophy final with a brilliant all-round batting display:116* (250) — 1st innings51* (79) — 2nd inningsHighest scorer of the matchPlayer of the Match#TilakVarma #DuleepTrophy… pic.twitter.com/36hLYlXrEX— Clutch Sports (@Clutchsportsz) September 2, 2026చదవండి: లంక జట్టు ప్రకటన; రెండేళ్ల తర్వాత జట్టులోకి మాజీ కెప్టెన్! -
తిలక్ వర్మ వన్‌మ్యాన్ షో.. ఫైనల్లో సౌత్‌జోన్
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్‌జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్‌జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్‌జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. కెప్టెన్ తిలక్ వర్మ (79 బంతుల్లో 51 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో జట్టును విజయపథంలో నడిపించగా, స్మరణ్ రవిచంద్రన్ (32 నాటౌట్) అతడికి సహకరించాడు. అంతకముందు ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయన్ జగదీషన్ (43) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో అబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్థ సెంచరీతో రాణించి మ్యాచ్‌లో వన్‌మ్యాన్ షో ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 9 నుంచి) నుంచి మొదలకానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్‌తో సౌత్‌జోన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక నార్త్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం సౌత్‌జోన్ 312 పరుగులకు ఆలౌట్ కాగా, తిలక్ వర్మ అజేయ సెంచరీతో మెరిశాడు. దీంతో సౌత్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం లభించింది. తమ రెండో ఇన్నింగ్స్‌లో నార్త్‌జోన్ 297 పరుగులకు ఆలౌట్ కావడంతో సౌత్‌జోన్ ముంగిట 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. South Zone cruise into the final 🙌They chase down 181 and beat North Zone by 7 wickets 👌Scorecard ▶️ https://t.co/AGjIStrDAT#DuleepTrophy | #SZvNZ pic.twitter.com/UXTDC4wdF4— BCCI Domestic (@BCCIdomestic) September 2, 2026Read: ‘సీఎం సార్ ప్లీజ్ ఒక్క ఫొటో’.. కేరళలో రొనాల్డో సోదరి -
మరోసారి దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాది దుమ్ములేపాడు. అయితే, ఆఖరికి యశ్ ఠాకూర్ పైచేయి సాధించడంతో.. అదే ఓవర్లో అవుటై వైభవ్ పెవిలియన్ చేరాడు.దులిప్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ఈస్ట్ జోన్- సెంట్రల్ జోన్ తలపడుతున్నాయి. బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌత్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది.ధనాధన్ఆ తర్వాత ఈస్ట్ జోన్ సైతం సరిగ్గా 266 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ (69) సాధించగా.. వైభవ్ సూర్యవంశీ ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొట్టి క్రికెట్ మాదిరి చెలరేగి కేవలం 42 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు. అయితే, హర్ష్ దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విఫలం కాగా.. అర్షద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.నెమ్మదిగా మొదలుపెట్టినా..ఇదిలా ఉంటే.. సౌత్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈస్ట్ జోన్ 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఆడినా.. 14వ ఓవర్లో మాత్రం దూకుడు ప్రదర్శించాడు. 4⃣,6⃣,4⃣,4⃣, 🇼Vaibhav Sooryavanshi 🆚 Yash Thakur battle part 2⃣ 🔥#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/wX8L5AHdTB— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఆఖరి బంతికి అవుట్సౌత్ జోన్ పేస్ బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన వైభవ్.. రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. మూడు, నాలుగు బంతుల్లో మళ్లీ ఫోర్లు బాదాడు. అయితే, ఐదో బంతికి పరుగుకు యత్నించని వైభవ్.. ఆఖరి బంతికి మరోసారి షాట్‌కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.What. A. Catch 😮Central Zone captain Rajat Patidar pulls off an absolute blinder 🔥Scorecard ▶️ https://t.co/kyExeix2VY#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/NfAD3Kk9RH— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026యశ్ ఠాకూర్ వేసిన బౌండరీ వైపు తరలించగా.. సౌత్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. లక్ష్య ఛేదనలో మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 40 పరుగులు చేశాడు. చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
రింకూ సింగ్ విఫలం.. వైభవ్ సూర్యవంశీ దంచికొడితే!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వరుస విరామాల్లో వికెట్లు కూల్చారు. ఫలితంగా సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలింది.నామమాత్రపు లక్ష్యంతద్వారా ఈస్ట్ జోన్‌కు 159 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని విధించగలిగింది. కాగా బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ సెమీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ వైభవ్ సూర్యవంశీ తొలిరోజే తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్.. సెంట్రల్ జోన్‌ను 266 పరుగులకు ఆలౌట్ చేసింది. ముకేశ్ కుమార్, అభిజీత్ సర్కార్ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 266 పరుగులకే ఆలౌట్ అయింది. ఈస్ట్ జోన్ ఈ స్కోరు చేయడంలో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీదే కీలక పాత్ర. అభిమన్యు అర్ధ శతకం (106 బంతుల్లో 69)తో ఆకట్టుకోగా.. వైభవ్ మాత్రం టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్ దంచికొట్టాడు.అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 92 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో సుదీప్ ఘరామి (25) ఒక్కడే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు.చెలరేగిన ముకేశ్ కుమార్, షమీఈ క్రమంలో రెండో రోజు తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్.. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అమన్ మోఖడే (41) రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్‌లో అతడిదే టాప్ స్కోరు.Superb bowling 🙌Mukesh Kumar outsmarts Aman Mokhade with an excellent setup👌#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/voMx1Bt43n— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026మిగిలిన వారిలో రింకూ సింగ్ (20) నిరాశపరచగా.. హర్ష్ దూబే 24, అర్షద్ ఖాన్ 25 పరుగులు రాబట్టారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ మూడు వికెట్లు కూల్చాడు. అనుకుల్ రాయ్, ఎండీ కౌనియన్ ఖురేషి, అభిజిత్ సర్కార్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో రోజు ఆట సందర్భంగా ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ తిరిగి వచ్చాడు. దీంతో బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమైంది.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఇక సౌత్ జోన్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈస్ట్ జోన్ బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరే వైభవ్ సూర్యవంశీ దంచికొడితే మాత్రం ఈస్ట్ జోన్ సులువుగానే ఫైనల్ చేరడం ఖాయం.చదవండి: భారత్‌తో సిరీస్.. ఆసీస్ జట్ల ప్రకటన -
శతక్కొట్టిన తిలక్ వర్మ
నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డ ఈ కెప్టెన్ సాబ్ 218 బంతుల్లో ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 రెండో సెమీ ఫైనల్లో భాగంగా సౌత్ జోన్- నార్త్ జోన్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో తలపడుతున్నాయి.195 పరుగులకే ఆలౌట్ ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నార్త్ జోన్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ అర్ద శతకం (76)తో ఆకట్టుకోగా.. కెప్టెన్ కన్హయ్య వాధ్వాన్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్‌కు అన్షుల్ కాంబోజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ రికీ భుయ్‌ను 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన షేక్ రషీద్ డకౌట్ అయ్యాడు. గుర్నూర్ బ్రార్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 175 పరుగుల భాగస్వామ్యంఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (63 బంతుల్లో 36) కాస్త ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తిలక్ వర్మ సౌత్ జోన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. స్మరణ్ రవిచంద్రణ్ (27)తో కలిసి 37 పరుగులు జోడించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. శ్రేయస్ గోపాల్‌తో కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.పాపం శ్రేయస్అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న శ్రేయస్‌ను అర్ష్‌దీప్ సింగ్ బోల్తా కొట్టించాడు. దీంతో 88 పరుగుల వద్ద శ్రేయస్ అవుటయ్యాడు. దీంతో తిలక్- శ్రేయస్‌ల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత తనయ్ త్యాగరాజన్ (6).. విద్వత్ కావేరప్ప (0), ఎండీ నిధీశ్ (0- రనౌట్) త్వరత్వరగా పెవిలియన్ చేరారు.ఎట్టకేలకు సెంచరీఅప్పటికి 91 పరుగుల వద్ద ఉన్న తిలక్ వర్మకు కావూరి సాయితేజ తోడయ్యాడు. చేతిలో ఒకే ఒక్క వికెట్ ఉండగా.. సాయి తేజ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. తిలక్ వర్మ ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించి శతక మార్కు అందుకున్న తిలక్.. జట్టును భారీ ఆధిక్యం దిశగా నడిపిస్తున్నాడు. ముగిసిన రెండో రోజు ఆటఈ క్రమంలో సోమవారం నాటి ఆట ముగిసే సరికి సౌత్ జోన్ 94 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ 106, సాయితేజ సున్నా పరుగులతో అజేయంగా ఉన్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం -
సౌత్ జోన్ సారథిగా తిలక్ వర్మ
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో పాల్గొనే సౌత్ జోన్ జట్టుకు తిలక్‌వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)లో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం సౌత్ జోన్ సెలక్టర్లు శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. భారత టి20 జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ ఈ జట్టుకు సారథిగా ఎంపిక కాగా... ఆంధ్రప్రదేశ్ సీనియర్ ప్లేయర్ రికూ భుయ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన హిమతేజ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు షేక్ రషీద్‌కు కూడా చోటు దక్కింది. సౌత్ జోన్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్, అభినవ్, షేక్ రషీద్, హిమతేజ, స్మరణ్, జగదీషన్, కరుణ్ నాయర్, త్యాగరాజన్, శ్రేయస్ గోపాల్, సాయితేజ, విజయ్, కవెరప్ప, అమన్ ఖాన్. -
విజేత ఉస్మానియా యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ జట్టు చాంపియన్‌గా అవతరించింది. మైసూర్లో జరిగిన ఫైనల్లో ఉస్మానియా 10 పరుగుల ఆధిక్యంతో విశ్వేశరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ (బెలగావి) జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఉస్మానియా జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు సాధించింది. కునాల్ దాస్వాని (41 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైభవ్ సజానా (27 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించగా... అన్విత్ రెడ్డి (38; 6 ఫోర్లు), పారస్ రాజ్ (37; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విశ్వేశరయ్య జట్టు 204 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సమర్థ్ హెగ్డే (46), విష్ణు గౌడర్ (39) ఆకట్టుకున్నారు. ఉస్మానియా జట్టు బౌలర్లలో కెపె్టన్ వంశీ కుమార్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు... ధర్మపురి సాత్విక్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు... వీఎం ధనుష్ 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. యశ్వీర్కు ఒక వికెట్ లభించింది. -
Duleep Trophy 2025: ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో టైటిల్..
దులీప్ ట్రోఫీ-2025 విజేతగా సెంట్రల్ జోన్ నిలిచింది. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌత్ జోన్‌ను చిత్తు చేసిన సెంట్రల్ జోన్.. ఏడోసారి దులీప్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంతో తమ 11 ఏళ్ల నిరీక్షణకు సెంట్రల్ జోన్ తెరదించింది. రజత్ పాటిదార్ తన అద్బుత కెప్టెన్సీతో సెంట్రల్ జోన్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.కాగా తుది పోరులో తొలి రోజు నుంచే సెంట్రల్ ఆధిపత్యం చెలాయించింది. సౌత్ జోన్ నిర్ధేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది.సెంట్రల్ జోన్ స్పిన్నర్లు శరన్ష్ జైన్ ఐదు వికెట్లతో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు. అనంతరం సెంట్రల్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది.సెంట్రల్ జోన్ బ్యాటర్లలో యశ్ రాథోడ్(194), కెప్టెన్ రజత్ పాటిదార్(101) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సౌత్‌జోన్ బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్, అంకిత్ శర్మ తలా నాలుగు వికెట్లు సాధించారు. నార్త్‌జోన్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 362 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో అదుర్స్..తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించారు. సెకెండ్ ఇన్నింగ్స్ సౌత్ జోన్ 426 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో సౌత్‌జోన్ సెంట్రల్ జోన్ ముందు కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించగల్గింది. సౌత్ జోన్ బ్యాటర్లలో అంకిత్ శర్మ (168 బంతుల్లో 99; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రె సిద్ధార్థ్ (190 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు) అద్బుత ఇన్నింగ్స్‌లతో అలరించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 192 పరుగులు జోడించి తమ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశారు. రవిచంద్రన్ స్మరణ్ (118 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (85 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4, సారాంశ్ జైన్ 3 వికెట్లు పడగొట్టారు. -
విజయం వాకిట్లో రజత్ పాటిదార్ సేన
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టు విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన సెంట్రల్ జోన్ ముందు రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగుల లక్ష్యం నిలిచింది. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... సెంట్రల్ జోన్ విజయం లాంఛనమే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 129/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌత్ జోన్ జట్టు చివరకు 121 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడారు. ముఖ్యంగా అంకిత్ శర్మ (168 బంతుల్లో 99; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రె సిద్ధార్థ్ (190 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌లతో అలరించారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 192 పరుగులు జోడించి జట్టును ఒడ్డున పడేసే ప్రయత్నం చేశారు. రవిచంద్రన్ స్మరణ్ (118 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (85 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4, సారాంశ్ జైన్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 149 పరుగులకు ఆలౌట్ కాగా... సెంట్రల్ జోన్ 511 పరుగులు చేసింది. 192 పరుగుల భాగస్వామ్యం... సెంట్రల్ జోన్ స్పిన్నర్లను ఎదుర్కోలేక తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించారు. రవిచంద్రన్ స్మరణ్, రికీ భుయ్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ఇక సౌత్ జోన్ జట్టు కుదురుకున్నట్లే అనిపించింది. ఈ జంట మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించగా... ఆ తర్వాత కెపె్టన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (27; 2 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ నిజార్ (12) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో 161/2తో పటిష్టంగా కనిపించిన సౌత్ జోన్... 222/6తో ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో అంకిత్, సిద్ధార్థ్ చక్కటి పోరాట పటిమ కనబర్చారు. ఒక్కో పరుగు జోడిస్తూ... ముందుకు సాగిన ఈ జంట... సెంట్రల్ జోన్ స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. ఈ క్రమంలో అంకిత్ శర్మ 84 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... సిద్ధార్థ్ 110 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అంకిత్ అవుట్ అయ్యాడు. దీంతో ఏడో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మిగిలిని మూడు వికెట్లు పడేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మొత్తంగా సౌత్ జోన్ 64 పరుగుల ఆధిక్యం సాధించింది. సెంట్రల్ జోన్ జట్టు 11 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ చేజిక్కించుకోవాలంటే చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేయాల్సి ఉంది. స్కోరు వివరాలు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 149; సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 511; సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) కుల్దీప్ సేన్ 26; మోహిత్ కాలే (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్ 38; స్మరణ్ (సి) యశ్ రాథోడ్ (బి) కార్తికేయ 67; రికీ భుయ్ (సి) శుభమ్ శర్మ (బి) దీపక్ చాహర్ 45; అజహరుద్దీన్ (సి) కుల్దీప్ సేన్ (బి) కార్తికేయ 27; సల్మాన్ నిజార్ (సి) రజత్ పాటీదార్ (బి) కార్తికేయ 12; ఆండ్రె సిద్ధార్థ్ (నాటౌట్) 84; అంకిత్ శర్మ (సి) రజత్ పాటీదార్ (బి) కార్తికేయ 99; గుర్జపనీత్ సింగ్ (సి) మాలేవర్ (బి) సారాంశ్ 3; నిధీశ్ (రనౌట్) 0; వాసుకి కౌశిక్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ జైన్ 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (121 ఓవర్లలో ఆలౌట్) 426. వికెట్ల పతనం: 1–62, 2–76, 3–161, 4–200, 5–221, 6–222, 7–414, 8–419, 99–420, 10–426. బౌలింగ్: దీపక్ చాహర్ 16–2–74–1; ఆదిత్య ఠాకరే 8–2–22–0; కుమార్ కార్తికేయ 39–3–110–4; సారాంశ్ జైన్ 42–8–130–3; కుల్దీప్ సేన్ 12–1–60–1, శుభమ్ శర్మ 4–1–21–0. -
టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో
దులీప్ ట్రోఫీ-2025లో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో సెంట్రల్ జోన్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. క్రీజులో యష్ రాథోడ్(137), శరన్ష్ జైన్ ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 118 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.సెంట్రల్ జోన్ వికెట్ల పడగొట్టడానికి సౌత్ జోన్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతకుముందు సెంట్రల్ జోన్ కెప్టెన్, ఆర్సీబీ సారథి రజత పాటిదార్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 50/0 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన సెంట్రల్ జోన్ ఆరంభంలోనే అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20, 3 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది.ఆ తర్వాత సెంట్రల్ జోన్ శుబ్మ్ శర్మ(6), డానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు) వికెట్లను రెండు ఓవర్ల వ్యవధిలోనే కోల్పోయింది. ఈ సమయంలో పాటిదార్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాటిదార్.. కేవలం 112 బంతుల్లోనే తన 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అంతేకాకుండా యష్ రాథోడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు నెలకొల్పాడు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ మూడు, నిదేశ్, కౌశిక్ తలా వికెట్ సాధించారు. సెంట్రల్ జోన్ ప్రస్తుతం 235 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.టీమిండియాలోకి రీ ఎంట్రీ?వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాటిదార్ సూపర్ సెంచరీతో సెలక్టర్లకు సవాలు విసిరాడు. ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో పాటిదార్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచాడు. గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నప్పటికి పాటిదార్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకులోదు. దులీప్ ట్రోఫీలో కూడా పాటిదార్ దుమ్ములేపుతున్నాడు. ఒకవేళ దులీప్ ట్రోఫీలో ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుంటే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాటిదార్ ఎంపికయ్యే అవకాశముంది. ఇప్పటికే టీమిండియా టెస్టుల్లో అరంగేట్రం చేసిన పాటిదార్ తన మార్క్ చూపించలేకపోయాడు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడి రీ ఎంట్రీ కష్టమే అనే చెప్పాలి.చదవండి: రూట్ ఒక్క సెంచరీ చెయ్.. లేదంటే మా నాన్న అన్నంత పనిచేస్తాడు: హేడెన్ కుమార్తె -
సారాంశ్‌కు ఐదు.. కార్తికేయకు నాలుగు.. చహర్ విఫలమైనా..
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తడబడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన తుదిపోరులో సెంట్రల్‌జోన్ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ (76 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నిజార్ (52 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ శర్మ (64 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. వికెట్ నష్టపోకుండా 50 పరుగులుసెంట్రల్ జోన్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ 24 ఓవర్లలో 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ 53 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న దానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న సెంట్రల్ జోన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 99 పరుగులు వెనుకబడి ఉంది. స్పిన్‌కు విలవిల... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. సెంట్రల్ జోన్ స్పిన్‌ను తట్టుకోలేక సౌత్‌జోన్ ప్లేయర్లు విలవిలలాడారు. హైదరాబాదీ తన్మయ్ అగర్వాల్ ఒక్కడే కాస్త పోరాడగా... మరో ఓపెనర్ మోహిత్ కాలే (50 బంతుల్లో 9), రవిచంద్రన్ స్మరణ్ (19 బంతుల్లో 1) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా పరుగులు సాధించలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (53 బంతుల్లో 15; 2 ఫోర్లు) గంటకు పైగా క్రీజులో ఉన్నా పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (4) విఫలం కాగా... అండ్రె సిద్ధార్థ్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సల్మాన్, అంకిత్ తలా కొన్ని పరుగులు చేయడంతో సౌత్ జోన్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. దీపక్ చహర్ విఫలంసెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ దీపక్ చహర్ ఆరు ఓవర్లకే పరిమితం కాగా... స్పిన్నర్లు చెలరేగిపోయారు. సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ కలిసి 45 ఓవర్లు వేసి 9 వికెట్లు పంచుకున్నారు. మిగిలిన ఒక్క వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. కార్తికేయ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నిర్లక్ష్యంగా స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మోహిత్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. లంచ్ సమయానికే సౌత్ జోన్ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఏమాత్రం ఆటతీరు మార్చుకోలేకపోయింది. దీనికి తోడు పరుగు తీసే క్రమంలో రికీ భుయ్‌తో సమన్వయలోపం కారణంగా తన్మయ్ అగర్వాల్ రనౌట్ కావడం జట్టును మరింత దెబ్బతీసింది. స్కోరు వివరాలు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (రనౌట్) 31; మోహిత్ కాలే (బి) కార్తికేయ 9; స్మరణ్ (సి) సారాంశ్ జైన్ (బి) కార్తికేయ 1; రికీ భుయ్ (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్15; అజహరుద్దీన్ (బి) కార్తీకేయ 4; సల్మాన్ నిజార్ (సి) పాటీదార్ (బి) సారాంశ్ జైన్ 24; సిద్ధార్థ్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ 12; అంకిత్ శర్మ (ఎల్బీ) సారాంశ్ జైన్ 20; గురజపనీత్ సింగ్ (ఎల్బీ) కార్తికేయ 2; నిదీశ్ (సి అండ్ బి) సారాంశ్ జైన్ 12; వాసుకి కౌశిక్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–27, 2–35, 3–47, 4–57, 5–65, 6–97, 7–116, 8–129, 9–142, 10–149. బౌలింగ్: దీపక్ చహర్ 6–1–11–0; ఆదిత్య ఠాకరే 4–2–7–0; కుల్దీప్ సేన్ 8–3–15–0; కుమార్ కార్తికేయ 21–1–53–4; సారాంశ్ జైన్ 24–2–49–5. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: దానిశ్ మాలేవర్ (బ్యాటింగ్) 28; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 50. బౌలింగ్: గుర్జపనీత్ సింగ్ 4–1–21–0; అంకిత్ శర్మ 8–1–22–0; నిధీశ్ 3–1–6–0; వాసుకి కౌశిక్ 4–3–1–0. -
చేతులేత్తేసిన బ్యాటర్లు.. 149 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో దుమ్ములేపిన సౌత్ జోన్.. తుది పోరులో మాత్రం తడబడుతోంది. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 63 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. కుమార్ కార్తికేయ, శరన్ష్ జైన్ స్పిన్ వలలలో చిక్కుకుని సౌత్ జోన్ బ్యాటర్లు విలవిల్లాడారు. శరన్ష్ జైన్ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సౌత్ జోన్ జట్టులో నారయణ్ జగదీశన్, దేవ్‌దత్ పడిక్కల్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక కావడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో భాగం కాలేదు. కాగా సెమీఫైనల్లో జగదీశన్ భారీ సెంచరీతో కదం తొక్కగా.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బ్యాటింగ్‌లో విఫలమైన సౌత్ జోన్ కనీసం బౌలింగ్‌లో నైనా రాణిస్తుందో లేదో వేచి చూడాలి.చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
ఎవరిదో దులీప్ ట్రోఫీ?
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్లో గురువారం ప్రారంభం కానున్న ఈ తుది పోరులో సెంట్రల్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది. ఓ వైపు టీమిండియా ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో పాల్గొంటుండగా... మరోవైపు భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లు తమ సత్తా చాటుకునేందుకు దులీప్ ట్రోఫీ చక్కటి వేదిక కానుంది. గతేడాది మాదిరిగా కాకుండా తిరిగి పాత పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నార్త్ జోన్‌పై విజయంతో సౌత్ జోన్... వెస్ట్ జోన్‌ను ఓడించి సెంట్రల్ జోన్ ఫైనల్‌కు చేరాయి. సౌత్ జోన్ జట్టు చివరిసారిగా 2023లో దులీప్ ట్రోఫీ విజేతగా నిలవగా... 2014–15 సీజన్లో సెంట్రల్ జోన్ ట్రోఫీ చేజిక్కించుకుంది. అప్పుడు కూడా సౌత్జోన్పైనే నెగ్గిన సెంట్రల్ జోన్ అదే ఫలితం పునరావృతం చేయాలని యోచిస్తోంది. రజత్ పాటీదార్, దానిశ్ మాలేవర్, శుభమ్ శర్మ, యశ్ రాథోడ్, దీపక్ చాహర్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, షేక్ రషీద్, రికీ భుయ్, మొహమ్మద్ అజహరుద్దీన్ వంటి వాళ్లు మెరుగైన ప్రద్శన చేసి సెలెక్టర్ల దృష్టిలో పడాలని భావిస్తున్నారు. మనవాళ్లు ఆకట్టుకునేనా... ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ సౌత్ జోన్ జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండగా... ఆసియా కప్‌లో ఆడుతున్న భారత జట్టుకు అతను ఎంపిక కావడంతో ఫైనల్‌కు దూరమయ్యాడు. దీంతో కేరళకు చెందిన మొహమ్మద్ అజహరుద్దీన్‌కు సారథ్య బాధ్యతలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రికీ భుయ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్, జగదీశన్ కూడా అందుబాటులో లేకపోవడంతో... స్మరణ్, సిద్ధార్్థలకు జట్టులో చోటు దక్కింది. హైదరాబాద్ ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, ఆంధ్ర ప్లేయర్లు షేక్ రషీద్, రికీ భుయ్ సౌత్ జోన్ జట్టుకు కీలకం కానున్నారు. మోహిత్ కాలె, స్మరణ్, సల్మాన్ నిజార్‌తో సౌత్ జోన్ బ్యాటింగ్ బలంగానే ఉంది. ఇక అజహరుద్దీన్ సారథిగా, వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా కీలకం కానున్నాడు. గుర్జపనీత్ సింగ్, వాసుకి కౌశిక్, నిదీశ్, తనయ్ త్యాగరాజన్ బౌలింగ్ భారం మోయనున్నారు. పిచ్ అటు బౌలింగ్‌కు ఇటు బ్యాటింగ్‌కు సమానంగా అనుకూలించనుంది. ఆరంభంలో కాస్త జాగ్రత్త వహిస్తే భారీ స్కోర్లు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లోనూ వర్షం ముప్పు ఉంది. బ్యాటింగ్ బలంగా... సౌత్ జోన్‌తో పోల్చుకుంటే... సెంట్రల్ జోన్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సెంట్రల్ జోన్ ప్లేయర్లు ముందు వరుసలో ఉన్నారు. దానిశ్ మాలేవర్ 294 పరుగులతో అగ్రస్థానంలో ఉంటే... రజత్ పాటీదార్ 268, శుభమ్ శర్మ 252 పరుగులతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాటీదార్ 100కు పైగా స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. అతడు ఇదే జోరు తుదిపోరులోనూ కనబరిస్తే సౌత్ జోన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో పాటీదార్ వరుస ఇన్నింగ్స్‌లలో 125, 66, 77 పరుగులు చేశాడు. ఐపీఎల్లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి టైటిల్ అందించిన పాటీదార్ సారథ్య అనుభవం కూడా సెంట్రల్ జోన్‌కు కలిసిరానుంది. ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్ వంటి వాళ్లు అందుబాటులో లేకపోయినా... సెంట్రల్ జోన్‌కు పెద్దగా ఇబ్బందులు లేవు. టీమిండియా ప్లేయర్ దీపక్ చాహర్‌తో పాటు వెస్ట్ జోన్‌తో సెమీఫైనల్లో 8 వికెట్లు పడగొట్టిన సారాంశ్ జైన్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. -
సెంచరీ వీరుడు అవుట్.. ఫైనల్లో కష్టమే!
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) ఫైనల్‌కు చేరిన సౌత్ జోన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సెంచరీ వీరుడు నారాయణ్ జగదీశన్ (N Jagadeesan) జట్టుకు దూరమయ్యాడు.అదే విధంగా.. దేవ్‌దత్ పడిక్కల్ కూడా అందుబాటులో ఉండటం లేదు. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్- ‘ఎ’ తరఫున ఆడబోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబరు 16 నుంచి ప్రారంభం కానుంది.సౌత్ జోన్ వర్సెస్ సెంట్రల్ జోన్మరోవైపు.. దులిప్ ట్రోఫీ-2025 ఫైనల్‌కు సెప్టెంబరు 11- 15 వరకు షెడ్యూల్ ఖరారైంది. సౌత్ జోన్- సెంట్రల్ జోన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నారాయణ్ జగదీశన్, దేవ్‌దత్ పడిక్కల్ స్థానాల్లో ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), స్మరణ్ రవిచంద్రన్ (కర్ణాటక) సౌత్ జోన్ జట్టుకు ఎంపికయ్యారు. అజయ్ రోహెరా, అనికేత్ రెడ్డి స్టాండ్ బై ప్లేయర్లుగా చోటు దక్కించుకున్నారు.ఫైనల్‌కు సౌత్ జోన్ జట్టు (అప్డేటెడ్)అజారుద్దీన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రికీ భుయ్ (వైస్-కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, కాలే ఎమ్, షేక్ రషీద్, తన్మయ్ అగర్వాల్, సల్మాన్ నిజార్, ఆండ్రీ సిద్దార్థ్, తనయ్ త్యాగరాజన్, గుర్జాబ్నీత్ సింగ్, నిధీష్, కౌశిక్ వి, అనికేత్, టి. విజయ్, బాసిల్ ఎన్పీ.స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), స్నేహల్ కౌతంకర్ (గోవా), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), అజయ్ రోహెరా (పాండిచ్చేరి), జి. అనికేత్ రెడ్డి (హైదరాబాద్).వెస్ట్‌జోన్‌కు నిరాశేఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్‌లాంటి భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన వెస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీలో సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సెంట్రల్ జోన్‌తో మ్యాచ్ ‘డ్రా’ కాగా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో దేశవాళీ ఆటగాళ్లతో కూడిన సెంట్రల్ జోన్ ముందంజ వేసింది. మరో సెమీఫైనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, రికీ భుయ్‌లు బాధ్యతగా ఆడటంతో సౌత్‌జోన్ కూడా దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.నార్త్‌జోన్‌తో సౌత్ సెమీస్ పోరు కూడా ‘డ్రా’గానే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో అంతిమ పోరుకు అర్హత సంపాదించిన సౌత్‌జోన్... ఈ నెల 11 నుంచి ఇదే వేదికపై జరిగే టైటిల్ పోరులో సెంట్రల్ జోన్‌తో తలపడుతుంది. విజేతను తేల్చనున్న ఫైనల్ మ్యాచ్ సంప్రదాయ టెస్టులాగా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. సెంట్రల్ 600 ఆలౌట్ వెస్ట్‌జోన్‌తో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఆఖరి రోజు సారాంశ్ జైన్ (108 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ కొట్టాడు. దీంతో క్రీజులోకి దిగిన 11 మందిలో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు అర్ధశతకం పైచిలుకు పరుగులు చేయడం విశేషం. దీంతో నాలుగో రోజు 556/8 ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సెంట్రల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164.3 ఓవర్లలో 600 పరుగుల వద్ద ఆలౌటైంది.టెయిలెండర్లు సారాంశ్, యశ్ ఠాకూర్లపై కూడా వెస్ట్ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. దీంతో వీరిద్దరు అవలీలగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో సారాంశ్ జైన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో వికెట్‌కు 42 పరుగులు జతయ్యాక యశ్ ఠాకూర్ (21; 5 ఫోర్లు)ను అర్జన్ అవుట్ చేయగా, కాసేపటికే ఖలీల్ అహ్మద్ (0) కూడా అతనికే వికెట్ అప్పగించడంతో సెంట్రల్ ఇన్నింగ్స్ సరిగ్గా 600 వద్ద ముగిసింది. అర్జన్ నాగ్వస్వాలాకు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్‌కు 162 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లింది.రాణించిన జైస్వాల్.. శ్రేయస్ ఫెయిల్అప్పటికే ఫలితం ఖాయమైన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్ట్‌జోన్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే సమయానికి 53.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన భారత డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం సాధించిన రుతురాజ్ గైక్వాడ్ (16) ఈసారి విఫలమవగా, శ్రేయస్ అయ్యర్ (12) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మెప్పించలేకపోయాడు. మిగతా వారిలో తనుశ్ కొటియాన్ (72 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు), ఆర్య దేశాయ్ (35; 5 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. బ్యాటింగ్‌లో రాణించిన సెంట్రల్ బౌలర్ సారాంశ్ జైన్ 5, హర్ష్ దూబే 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సారాంశ్‌కు 8 వికెట్లు దక్కాయి. అజేయ అర్ధసెంచరీ కూడా సాధించడంతో అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.నార్త్‌జోన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 278/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్‌జోన్ 100.1 ఓవర్లలో 361 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం ఆటలో 83 పరుగులు జోడించి మిగతా సగం వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ శుభమ్ ఖజురియా (252 బంతుల్లో 128; 20 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరు వద్దే అవుటయ్యాడు. లోయర్ ఆర్డర్లో మయాంక్ డాగర్ (40 బంతుల్లో 31; 5 ఫోర్లు), సాహిల్ లోత్రా (19; 2 ఫోర్లు) కాసేపు సౌత్‌జోన్ బౌలర్లను ఎదుర్కోవడంతో జట్టు 300 పైచిలుకు స్కోరు దాటింది. అయితే 2 పరుగుల వ్యవధిలో ని«దీశ్ వీరిద్ధరిని క్లీన్»ౌల్ట్ చేయడంతో ఆలౌటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. గుర్జప్నీత్ 4 వికెట్లు తీయగా, నిదీశ్‌కు 3 వికెట్లు దక్కాయి. జగదీశన్ అజేయ అర్ధశతకం అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్‌జోన్ మ్యాచ్ ముగిసే సమయానికి 24.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ నార్త్ బౌలర్లపై మళ్లీ ఆడుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల స్వల్ప తేడాతో డబుల్ సెంచరీని కోల్పోయిన జగదీశన్ (69 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించాడు. మొదట హైదరాబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (13)తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 34 పరుగులు జతచేశాడు.తన్మయ్‌ని అకీబ్ నబీ బౌల్డ్ చేయడంతో జగదీశన్‌కు వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (54 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) జతయ్యాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా సౌత్ రెండో ఇన్నింగ్స్‌ను నడిపించారు. ‘డ్రా’ ఫలితం ఖాయమవడంతో జగదీశన్ అర్ధసెంచరీ పూర్తవగానే ఇరుజట్ల కెప్టెన్‌ను మ్యాచ్‌ను ముందుగానే ముగించేందుకు చేతులు కలిపారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన నారాయణ్ జగదీశన్ (తొలి ఇన్నింగ్స్‌లో 197)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
జగదీశన్ భారీ శతకం..దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2025లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ డ్రా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ ఆధారంగా సౌత్ జోన్ జట్టు ఫైనల్‌కు ఆర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నార్త్ జోన్ కెప్టెన్ అంకిత్ కుమార్ తొలుత సౌత్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. ఈ క్రమంలో మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌజ్ జోన్ బ్యాటర్లలో నారయణ్ జగదీశన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జగదీశన్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మొత్తంగా 352 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 197 పరుగులు చేశాడు.అతడితో పాటు జగదీశన్‌తో పాటు దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), రికీ భుయ్(54) తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 5, అన్షుశ్ కంబోజ్ రెండు వికెట్లు వికెట్ తీశారు. అనంతరం నార్త్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులకు ఆలౌటైంది. 258/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన నార్త్‌జోన్.. అదనంగా 103 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది.నార్త్‌జోన్ బ్యాటర్లలో శుభమ్ కజురియా(28) సెంచరీతో కదం తొక్కాడు. అతడితో నిశాంత్ సింధు 82 పరుగులతో రాణించాడు. సౌత్‌జోన్ పేసర్ గుర్జప్నీత్ సింగ్ (4/96) టాపార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడితో పాటు నిదేశ్ మూడు, టి త్యాగరాజన్, కౌశిక్ తలా వికెట్ సాధించారు.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్‌కు 175 పరుగుల ఆధిక్యం లభించింది. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన సౌత్ జోన్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసిపోయింది. జగదీశన్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: Duleep Trophy 2025: ఆసియా కప్ జట్టులో నో ప్లేస్.. సత్తా చాటిన యశస్వి జైస్వాల్ -
రాణించిన ఉపేంద్ర, హర్ష్
బెంగళూరు: బ్యాటర్ల సమష్టిగా రాణించడంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. వెస్ట్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సెంట్రల్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 556 పరుగుల భారీస్కోరు చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్, కెప్టెన్ రజత్ పాటీదార్ (77; 14 ఫోర్లు) సహా ఉపేంద్ర యాదవ్ (87; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్ష్ దూబే (75; 13 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్ట్‌జోన్ (438) తొలి ఇన్నింగ్స్ స్కోరును సెంట్రల్ అధిగమించింది. ప్రస్తుతం 118 పరుగుల ఆధిక్యంలో ఉన్న సెంట్రల్ చేతిలో ఇంకా 2 వికెట్లున్నాయి. వెస్ట్ బౌలర్లలో ధర్మేంద్రసింగ్ జడేజా 4 వికెట్లు తీశాడు. నడిపించిన బ్యాటర్లు సెంట్రల్ బ్యాటర్లంతా మూకుమ్మడిగా ఇన్నింగ్స్ బాధ్యతల్ని మోశారు. మూడో రోజు 229/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట కొనసాగించిన సెంట్రల్ ఇన్నింగ్స్‌కు మిడిలార్డర్ నుంచి టెయిలెండర్ల దాకా వెన్నెముకగా నిలిచారు. ప్రతీ ఒక్కరూ రాణించారు. ఓవర్‌నైట్ బ్యాటర్లలో రజత్ పాటీదార్ అర్ధసెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో వికెట్‌ను కోల్పోయాడు. కానీ శుభమ్ శర్మ (241 బంతుల్లో 96; 11 ఫోర్లు) నింపాదిగా ఆడుతూ సెంచరీ దిశగా పయనించాడు. ఉపేంద్ర అతనికి అండగా నిలిచాడు. ఇద్దరి ఆటతో సెంట్రల్ 300 పరుగులు దాటింది. కాసేపటికి సెంచరీకి చేరువైన శుభమ్ 4 పరుగుల తేడాతో మూడంకెల స్కోరుకు దూరమయ్యాడు. అతను రనౌట్ కాగా, హర్‡్ష దూబే వచ్చాక మళ్లీ వెస్ట్ బౌలర్లకు కష్టాలు మొదలయ్యాయి. దూబే, ఉపేంద్ర ఫిఫ్టీ–ఫిఫ్టీ క్రీజులో పాతుకుపోయిన హర్ష్, ఉపేంద్ర వెస్ట్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. దీంతో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లు సహా ఏకంగా 8 మంది బౌలర్లను వెస్ట్‌జోన్ ప్రయోగించింది. కానీ దూబే, ఉపేంద్ర పరుగులు చక్కబెట్టే పనికి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. ఇద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు కూడా చూస్తుండగానే వెస్ట్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (438)ను దాటింది. బౌండరీలతో దూకుడుగా ఆడుతున్న హర్ష్ దూబేను ఎట్టకేలకు ధర్మేంద్రసింగ్ అవుట్ చేయడంతో ఆరో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపయ్యాక ములానీ బౌలింగ్‌లో ఉపేంద్ర కూడా అవుటయ్యాడు. వీరిద్దరిని పెవిలియన్‌కు చేర్చినప్పటికీ సెంట్రల్ ఆలౌట్ కాకుండా టెయిలెండర్లు సారాంశ్ జైన్ (83 బంతుల్లో 37 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చహర్ (52 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. శుభమ్ ఖజురియా అజేయ శతకంరాణించిన నిశాంత్ నార్త్‌జోన్ 278/5 దులీప్ ట్రోఫీ సెమీస్బెంగళూరు: ఓపెనర్ శుభమ్ ఖజురియా (245 బంతుల్లో 128 బ్యాటింగ్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో నార్త్‌జోన్ పోరాడుతోంది. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట నిలిచే సమయానికి నార్త్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మిడిలార్డర్లో నిశాంత్ సింధు (148 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. సౌత్‌జోన్ పేసర్ గుర్జప్నీత్ సింగ్ (3/67) టాపార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ప్రస్తుతం నార్త్‌జోన్ చేతిలో 5 వికెట్లున్నప్పటికీ ఇంకా 258 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్‌కు కేవలం చివరి రోజు ఆటే మిగిలుంది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్ చేరాలన్నా నార్త్‌జోన్ రోజంతా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఓపెనర్ శుభమ్ మినహా స్పెషలిస్టు బ్యాటర్లెవరూ అందుబాటులో లేరు. ఇది నార్త్‌జోన్‌కు కష్టసాధ్యమైన సవాల్! శతక్కొట్టిన ఖజురియా తాజాగా మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నార్త్‌కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. శుభమ్ కజురియాతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన కెప్టెన్ అంకిత్ కుమార్ (6) ఆరో ఓవర్లోనే వికెట్‌ను పారేసుకున్నాడు. గుర్జప్నీత్ సింగ్ అతన్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 20 పరుగులకే తొలి వికెట్ కూలింది. ఈ గాయం నుంచి కోలుకోకముందే తన మరుసటి ఓవర్లో గుర్జప్నీత్ వన్‌డౌన్ బ్యాటర్ యశ్ ధుల్ (14)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో 38 పరుగులకే రెండు కీలక వికెట్లను నార్త్‌జోన్ కోల్పోయింది. ఈ దశలో శుభమ్‌కు జతయిన ఆయుశ్ బదోని (57 బంతుల్లో 40; 5 ఫోర్లు) చక్కని సహకారం అందించడంతో వికెట్ల పతనం కాసేపు ఆగిపోయింది. ఇద్దరు వికెట్‌ను కాపాడుకుంటూ పరుగులు జతచేశారు. వీరిద్దరి సమన్వయంతో జట్టు స్కోరు వందను దాటింది. ఈ భాగస్వామ్యం బలపడుతున్న క్రమంలో బదోనిని నిధీశ్ ఎల్బీగా పెవిలియన్ పంపాడు. 63 పరుగుల భాగస్వామ్యం ముగియగా... ఈ దశలో క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. నిశాంత్, కజురియా క్రీజులో పాతుకుపోవడంతో సౌత్‌జోన్ బౌలర్లు రెండో సెషన్లో శ్రమించాల్సి వచ్చింది. ఇద్దరూ కుదురుగా ఆడటంతో జట్టు స్కోరు 200 మార్క్‌ను దాటింది. బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన నిశాంత్ బ్యాటింగ్‌లోనూ రాణించి అర్ధసెంచరీ సాధించాడు. మరో వైపు ఓపెనర్ శుభమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరి భాగస్వామ్యం దుర్భేధ్యంగా మారుతున్న దశలో మళ్లీ గుర్జప్నీత్ చావుదెబ్బ తీశాడు. నిశాంత్ సింధును అవుట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. -
జగదీశన్‌కు హార్ట్ బ్రేక్.. డబుల్ సెంచరీకి 3 పరుగుల దూరంలో
దులీప్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ ఓపెనర్, తమిళనాడు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నారయణ్ జగదీశన్‌ను దురదృష్టం వెంటాడింది. డబుల్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో జగదీశన్ ఔటయ్యాడు.అది కూడా రనౌట్ రూపంలో తన వికెట్‌ను జగదీశన్ కోల్పోయాడు. 148 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్‌ను మొదలు పెట్టిన జగదీశన్.. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ తమిళనాడు ఆటగాడు సునాయసంగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించాడు.కానీ 197 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జగదీశన్.. నార్త్ జోన్ ఆటగాడు నిశాంత్ సింధు అద్భుత త్రోకు బలయ్యాడు. జగదీశన్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.128 ఓవర్లు ముగిసే సరికి సౌత్ జోన్ 6 వికెట్లు కోల్పోయి 432 పరుగులు చేసింది. క్రీజులో తనయ్ త్యాగరాజన్(5), సల్మాన్ నిజార్(23) ఉన్నారు. సౌత్ జోన్ బ్యాటర్లలో జగదీశన్‌తో పాటు దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), రికీ భుయ్(54) తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 3, అన్షుశ్ కంబోజ్ రెండు వికెట్లు వికెట్ తీశారు.ఇక ఈ మ్యాచ్‌లో తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న జగదీశన్ త్వరలో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా జగదీశన్ ఎంపికయ్యాడు.లండన్ టెస్టు ముందు భారత జట్టులో చేరిన జగదీశన్‌కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. అయితే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు నారయణ్ను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది. ఎందుకంటే రిషబ్ పంత్‌తో పాటు వికెట్ కీపర్లు ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్ గాయాలతో సతమతమవుతున్నారు. అయితే గత కొంత కాలంగా పంత్‌కు బ్యాకప్‌గా జురెల్ కొనసాగుతున్నాడు. ఇప్పుడు జురెల్ కూడా గాయం బారిన పడడంతో జగదేశన్కు టీమిండియా తరపున డెబ్యూ చేసే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: సారా టెండుల్కర్ నిశ్చితార్థం కూడా అయిపోయిందా?.. ఎవరీ అబ్బాయి? -
సెంచరీతో చెలరేగిన స్టార్ ప్లేయర్.. టీమిండియా అరంగేట్రం ఖాయం!?
దేశవాళీ క్రికెట్లో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో నార్త్ జోన్, సౌత్ జోన్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జగదేశన్ సెంచరీతో చెలరేగాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన జగదీశన్ తన అద్బుతమైన బ్యాటింగ్‌తో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత దేవదత్త్ పడిక్కల్‌తో కలిసి పార్టనర్‌షిప్‌ను జగదీశన్ నమోదు చేశాడు.ఓవరాల్‌గా 260 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 148 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ మూడు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ ఒక్క వికెట్ సాధించాడు.భారత జట్టులోకి జగదీశన్..!?కాగా ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా తరపున జగదీశన్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడ్డ భారత ప్రధాన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు విండీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు.అదేవిధంగా అతడికి ప్రత్నమ్నాయంగా ఉన్న మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సైతం తాజాగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. జురెల్ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత లేదు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు.మరోవైపు ఇషాన్ కిషన్ సైతం గాయంతో సతమతవతున్నాడు. దీంతో జగదీశన్‌కు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ పర్యటనలో ఆఖరి టెస్టుకు ముందు జగదీశన్‌ను భారత జట్టులో చేరాడు. కానీ ఆడే అవకాశం మాత్రం లభించలేదు.చదవండి: ‘తుదిజట్టులో రింకూకు నో ఛాన్స్.. ఏడో స్థానంలో అతడే’ -
మాజీ సీఎస్కే ఆటగాడి కోసం సంజూ శాంసన్‌పై వేటు..!
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో అతను జట్టు మారతాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్కే సంజూను ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేస్తుందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఈ ప్రచారాల నడుమ సంజూకు సంబంధించిన మరో వార్త ట్రెండింగ్‌లోకి వచ్చింది. సీఎస్కేకు చెందిన మాజీ ఆటగాడు ఎన్ జగదీసన్ కోసం సంజూను దులీప్ ట్రోఫీ (సౌత్ జోన్ జట్టు) కోసం ఎంపిక చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సౌత్ జోన్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ తైలవన్ సర్గునమ్ జేవియర్ పరోక్షంగా అంగీకరించారు.దులీప్ ట్రోఫీ కోసం సంజూను ఎంపిక చేయకపోవడానికి గత సీజన్లో అతని గైర్హాజరీ ప్రధాన కారణమని ఆయన చెప్పారు. జట్టు ఎంపిక ఆటగాళ్ల గత సీజన్ ప్రదర్శన ఆధారంగా జరిగిందని తెలిపారు. సంజూతో పోలిస్తే జగదీసన్ గత సీజన్లో ఓ మోస్తరు మ్యాచ్‌లు ఆడాడు. అందులోనూ అతను పర్వాలేదనిపించాడు. అందుకే సంజూను కాకుండా అతన్ని ప్రిఫర్ చేశామని వివరణ ఇచ్చారు.కాగా, గత సీజన్ విజయ్ హజారే ట్రోఫీ నుంచి తప్పుకున్న తర్వాత సంజూను (కేరళ) వరుసగా రెండో దేశవాలీ టోర్నీ కోసం ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టులో ఏకంగా ఐదుగురు కేరళ ఆటగాళ్లను ఎంపిక చేసినా సంజూపై మాత్రం వేటు వేశారు. ప్రస్తుతం సంజూ గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసే భారత టీ20 జట్టులో కూడా అతని స్థానం ప్రశ్నార్థకంగా మారింది. సంజూ దేశవాలీ క్రికెట్‌కు అందుబాటులో ఉండకపోవడాన్ని భారత సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని కారణంగా చూపి సంజూను జాతీయ జట్టు నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదు.ఇదిలా ఉంటే, సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కేరళకు చెందిన మొహమ్మద్ అజహారుద్దీన్ వ్యవహరించనున్నాడు.సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2025 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్) (హైదరాబాద్), మహ్మద్ అజహారుద్దీన్ (వైస్ కెప్టెన్) (కేరళ), తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), మోహిత్ కాలే (పాండిచ్చేరి), సల్మాన్ నిజర్ (కేరళ), నారాయణ్ జగదీసన్ (తమిళనాడు), త్రిపురణ విజయ్ (ఆంధ్ర), ఆర్ సాయి కిషోర్ (తమిళనాడు), తనయ్ త్యాగరాజన్ (హైదరాబాద్), విజయ్‌కుమార్ వైషాక్ (కర్ణాటక), నిధీష్ ఎండి (కేరళ), రికీ భుయ్ (ఆంధ్ర), బాసిల్ ఎన్‌పి (కేరళ), గుర్జప్నీత్ సింగ్ (తమిళనాడు), స్నేహల్ కౌతాంకర్ (గోవా)స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), ఆర్ స్మరణ్ (కర్ణాటక), అంకిత్ శర్మ (పాండిచ్చేరి), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), షేక్ రషీద్ (ఆంధ్ర). -
కౌంటీ క్రికెట్లో భీకర ఫామ్.. కెప్టెన్‌గా ఎంపికైన తిలక్ వర్మ
టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ దులీప్ ట్రోఫీ-2025 కోసం సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కేరళకు చెందిన మహ్మద్ అజహారుద్దీన్ నియమితుడయ్యాడు. దులీప్ ట్రోఫీ కోసం 16 మంది రెగ్యులర్ సభ్యులు, ఆరుగురు స్టాండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును నిన్న ఎంపిక చేశారు. ఈ జట్టులో తిలక్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ లాంటి ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు.ఈ సీజన్ దులీప్ ట్రోఫీ గతంలో జరిగిన జోనల్ విధానంలోనే (ఆరు జట్లు) జరుగనుంది. గత సీజన్లో ఈ టోర్నీని నాలుగు జట్లతో (ఇండియా ఏ, బి, సి, డి) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరుగనుంది.భీకర ఫామ్‌లో తిలక్సౌత్ జోన్ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్ వర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌ల్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌తోనే హ్యాంప్‌షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేసిన తిలక్.. తన తొలి మ్యాచ్‌లోనే అద్బుతమైన సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 56, 47 పరుగులు చేసి, ఆతర్వాత మరో సెంచరీతో మెరిశాడు.అంతర్జాతీయ కమిట్మెంట్స్ కారణంగా గత రంజీ సీజన్లో హైదరాబాద్ జట్టుకు అందుబాటులో లేని తిలక్ ఈ దేశవాలీ సీజన్ ప్రారంభంలోనే సౌత్‌జోన్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2025 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్) (హైదరాబాద్), మహ్మద్ అజహారుద్దీన్ (వైస్ కెప్టెన్) (కేరళ), తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్), దేవదత్ పడిక్కల్ (కర్ణాటక), మోహిత్ కాలే (పాండిచ్చేరి), సల్మాన్ నిజర్ (కేరళ), నారాయణ్ జగదీసన్ (తమిళనాడు), త్రిపురణ విజయ్ (ఆంధ్ర), ఆర్ సాయి కిషోర్ (తమిళనాడు), తనయ్ త్యాగరాజన్ (హైదరాబాద్), విజయ్‌కుమార్ వైషాక్ (కర్ణాటక), నిధీష్ ఎండి (కేరళ), రికీ భుయ్ (ఆంధ్ర), బాసిల్ ఎన్‌పి (కేరళ), గుర్జప్నీత్ సింగ్ (తమిళనాడు), స్నేహల్ కౌతాంకర్ (గోవా)స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), ఆర్ స్మరణ్ (కర్ణాటక), అంకిత్ శర్మ (పాండిచ్చేరి), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), షేక్ రషీద్ (ఆంధ్ర). -
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్‌జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్‌జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా -
శతక్కొట్టిన రోహన్.. మరోసారి మెరిసిన మాయాంక్ అగర్వాల్
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దియోదర్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. కున్నుమ్మల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 68 బంతుల్లో శతక్కొట్టగా (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు).. మాయంక్ అగర్వాల్ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీతో (83 బంతుల్లో 63; 4 ఫోర్లు) మెరిశాడు. ఫలితంగా సౌత్ జోన్ భారీ స్కోర్ సాధించింది. కున్నుమ్మల్, మయాంక్‌లతో పాటు జగదీశన్ (54), ఆఖర్లో సాయి కిషోర్ (24 నాటౌట్) రాణించడంతో సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో ఉత్కర్ష్ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు, మణిశంకర్, ఆకాశ్‌దీప్ చెరో వికెట్ పడగొట్టారు. That celebration 🔥pic.twitter.com/v5gqNKB90i — CricTracker (@Cricketracker) August 3, 2023 సూపర్ ఫామ్‌లో మయాంక్.. దియోదర్ ట్రోఫీ 2023 ఎడిషన్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో అతను ఏకంగా 6 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్‌పై 64 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌పై 98 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్‌పై 32 పరుగులతో పర్వాలేదనిపించిన మయాంక్.. ఆతర్వాత ఈస్ట్ జోన్‌పై మరో అర్ధసెంచరీతో (84) మెరిశాడు. ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0 పరుగులకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన మయాంక్.. తాజాగా ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధశతకంతో (63) రాణించాడు. -
రెచ్చిపోయిన మయాంక్ అగర్వాల్.. సత్తా చాటిన సాయి సుదర్శన్
దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు సహా 194 పరుగులు (64, 98, 32) చేసిన మయాంక్.. ఇవాళ (జులై 30) ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో మ్యాచ్ విన్నింగ్ హాఫ్‌సెంచరీతో (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, సిక్స్) ఇరగదీశాడు. మయాంక్‌కు ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (53) తోడవ్వడంతో ఈస్ట్ జోన్‌పై సౌత్ జోన్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కౌశిక్ (8-1-37-3), సాయి కిషోర్ (10-0-45-3), విధ్వత్ కావేరప్ప (9-2-40-2), విజయ్‌కుమార్ వైశాఖ్ (1/62), వాషింగ్టన్ సుందర్ (1/41) ధాటికి 46 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ విరాట్ సింగ్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సుభ్రాంషు సేనాపతి (44), 9, 10వ నంబర్ ఆటగాళ్లు ఆకాశదీప్ సింగ్ (44), ముక్తర్ హుస్సేన్ (33) రాణించారు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్ (12), రియాన్ పరాగ్ (13) చేతులెత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ జోన్.. 44.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ అగర్వాల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలతో రాణించగా.. జగదీశన్ (32) పర్వాలేదనిపించాడు. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (18), అరుణ్ కార్తీక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. రోహిత్ రాయుడు (24 నాటౌట్).. వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) సాయంతో సౌత్ జోన్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అవినోవ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌పై సెంట్రల్ జోన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సర్వటే (10-2-19-3), యశ్ కొఠారీ (2-1-4-2), సరాన్ష్ జైన్ (10-0-39-2) ధాటికి 49 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ కాగా.. శివమ్ చౌదరీ (85 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశ్ దూబే (72; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో సెంట్రల్ జోన్ 33 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
రాణించిన మయాంక్ అగర్వాల్.. నిప్పులు చెరిగిన కావేరప్ప.. ప్రత్యర్ధి 60కే ఆలౌట్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ జట్టు భారీ విజయం సాధించింది. వి జయదేవన్ (డక్‌వర్త్ లూయిస్‌కు ప్రత్యామ్నాయం) పద్ధతిలో ఆ జట్టు 185 పరుగుల భారీ తేడాతో నార్త్ జోన్‌పై గెలుపొందింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్ కున్నుమ్మల్ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్ జగదీశన్ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో పడిక్కల్ (17), వాషింగ్టన్ సుందర్ (5) విఫలం కాగా.. రికీ భుయ్ (31), అరుణ్ కార్తీక్ (21) పర్వాలేదనిపించారు. నార్త్ జోన్ బౌలర్లలో రిషి ధవన్, మయాంక్ మార్కండే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, మయాంక్ యాదవ్, మయాంక్ డాగర్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు. సౌత్ జోన్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం అడ్డుతగలడంతో విజేడీ (వి జయదేవన్) పద్ధతిన నార్త్ జోన్ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్ కావేరప్ప (5/17), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/12), వాసుకి కౌశిక్ (1/11), నిప్పులు చెరగడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. గుర్తింపు పొందిన ప్లేయర్లు అభిషేక్ శర్మ (1), గత ఐపీఎల్లో సెంచరీ చేసిన ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (2), నితీశ్ రాణా (4), రిషి ధవన్ (6) దారుణంగా విఫలమయ్యారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో శుభమ్ ఖజూరియా (10), మన్దీప్ సింగ్ (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌత్ జోన్ బౌలర్లలో పేసర్లు కాకుండా రవిశ్రీనివాసన్ సాయికిషోర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. విజేడీ పద్ధతి అంటే.. వి జయదేవన్ పద్ధతి.. క్రికెట్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన పద్ధతి. 2007లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సాంకేతిక కమిటీ భారతదేశంలోని అన్ని పరిమిత ఓవర్ల దేశీయ మ్యాచ్‌లకు ఈ పద్ధతిని ఆమోదించింది. వర్షం ప్రభావిత వన్డే, టీ20 మ్యాచ్‌లలో లక్ష్య స్కోర్లను లెక్కించడానికి ఈ పద్దతి ఉపయోగించబడుతుంది. కేరళకు చెందిన భారతీయ ఇంజనీర్ జయదేవన్ రూపొందించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు 2012లో బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్లయివ్ లాయిడ్ నేతృత్వంలోని ఐసీసీ కమిటీ ఇందుకు ఒప్పుకోలేదు. విజేడీ పద్ధతిని తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, గతంలో ఇండియన్ క్రికెట్ లీగ్‌ల్లో ఉపయోగించారు. -
ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2023 విజేతగా సౌత్ జోన్ నిలిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. ఇది సౌత్‌జోన్‌కు 14వ దులీప్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 182/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్‌జోన్.. అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. సౌత్ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57) చెలరేగడంతో వెస్ట్‌జోన్ కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే చాపచుట్టేసింది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్‌ను దెబ్బకొట్టాడు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 230 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ముగించింది. దీంతో వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్‌జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు. చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్! -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 67 పరుగుల లీడ్‌తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్‌కుమార్ వైశాఖ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్‌లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్‌కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్‌ను దెబ్బకొట్టారు. -
మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ మధ్య బుధవారం ఫైనల్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రవికుమార్ సమర్త్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి వన్‌డౌన్‌లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్వల్లా బౌలింగ్‌లో వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్ చేరగా.. షామ్స్ ములాని విహారి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ 9, సచిన్ బేబి 7, సాయి కిషోర్ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్ జోన్ జట్టు. వాషింగ్టన్ సుందర్(9), విజయ్‌కుమార్ వైశాక్(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ సేత్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. విహారి 46వ ఫిఫ్టీ వెస్ట్ జోన్‌తో దులిప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్‌లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 8706 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి! -
అర్జున్ టెండూల్కర్‌కు గోల్డెన్ చాన్స్
దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మంచి గోల్డెన్ చాన్స్ లభించింది. దేవధర్ ట్రోఫీలో భాగంగా అర్జున్ సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్‌లకు స్థానం లభించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దేవధర్ ట్రోఫీ ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరుగుతుంది. సౌత్ జోన్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కెబి అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వి కావరప్ప, వి విక్షక్ వి, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్. చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్‌గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్‌లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్‌తో తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
మాములుగా క్రికెట్లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెప్టెన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించడం విశేషం. అయితే నార్త్‌జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ వైఖరిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్ చేశారు.. సౌత్‌జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్ వర్మ, సాయికిషోర్‌లు జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్ Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి -
మయాంక్ అగర్వాల్ సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్లో సౌత్‌జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ విజయలక్ష్యం 215 పరుగులు...మూడో రోజు 21 పరుగులు చేయగా, చివరి రోజు శనివారం చేతిలో 10 వికెట్లతో మరో 194 పరుగులు సాధించాలి. అయితే రెండు సార్లు మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. చివర్లో కూడా వర్షసూచన కనిపించింది. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరి రోజు సౌత్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. విహారి వెనుదిరిగే సమయానికి సౌత్ మరో 74 పరుగులు చేయాలి. ఈ దశలో భుయ్, తిలక్ 33 బంతుల్లోనే 50 పరుగులు జోడించి మళ్లీ గెలుపు బాట వేశారు. సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెపె్టన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. అయితే చివరకు జయంత్ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. ఫైనల్లో వెస్ట్‌జోన్... సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ మధ్య జరిగిన మరో సెమీస్ ‘డ్రా’గా ముగిసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్ట్‌జోన్ ఫైనల్ చేరింది. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ 4 వికెట్లకు 128 పరుగులే చేసింది. రింకూ సింగ్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. -
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్‌జోన్ సీమర్ వైశాక్ విజయ్‌కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నార్త్‌జోన్‌ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
Duleep Trophy: ఆదుకున్న మయాంక్, తిలక్..
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: కష్టాల్లో ఎదురీదుతున్న సౌత్‌జోన్ జట్టును హైదరాబాద్ రైజింగ్ స్టార్ ఠాకూర్ తిలక్ వర్మ (46; 5 ఫోర్లు, 1 సిక్స్), సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76; 10 ఫోర్లు)తో కలిసి గట్టెక్కించాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. నార్త్‌జోన్ 3 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 63/4తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్‌జోన్‌ను మయాంక్, తిలక్ నడిపించారు. ఐదో వికెట్‌కు ఇద్దరు 110 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్‌జోన్ ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. క్రికెట్‌కు తమీమ్ గుడ్‌బై చిట్టోగ్రామ్: వన్డే ప్రపంచకప్‌కు మూడు నెలల ముందు బంగ్లాదేశ్ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు. బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఓడగా ...తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. 16 ఏళ్ల కెరీర్ లో 34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్... 241 వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలతో 8313 పరుగులు... 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు... 78 టి20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో కలిపి 1758 పరుగులు సాధించాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో -
భారత క్రికెట్ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది.. సిగ్గుతో తలదించుకోవాలి..!
టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై ధ్వజమెత్తాడు. మధ్యప్రదేశ్, భారత-ఏ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా జలజ్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లను నిలదీశాడు. జట్ల ఎంపికలో సెలెక్టర్లు అవళింభిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్లో హాస్యాస్పదమైన విషయాలు చాలా జరుగుతున్నాయని, జలజ్ ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే అని అన్నాడు. రంజీల్లో రాణించినా మిగతా దేశవాలీ టోర్నీలకు ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీ ఆడటంలో అర్ధమే లేదని తెలిపాడు. భారత క్రికెట్లో ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు. There are many laughable things happening in Indian cricket. The highest wicket taker in Ranji Trophy not being picked even for the South Zone team is as baffling as it gets. Just renders the Ranji Trophy useless..what a shame https://t.co/pI57RbrI81 — Venkatesh Prasad (@venkateshprasad) June 18, 2023 ఈ విషయాలను ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఫోరమ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన వెంకటేశ్ ప్రసాద్ ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాగే సెలెక్టర్లను నిలదీశాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌లో లేకపోయినా టీమిండియాకు ఎలా ఎంపిక చేస్తారని ప్రసాద్ నాడు సెలెక్టర్లను ప్రశ్నించాడు. కాగా, 36 ఏళ్ల జలజ్ సక్సేనా 2022-23 రంజీ సీజన్లో 7 మ్యాచ్‌ల్లో 6 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి 50 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో ఇతనే లీడింగ్ వికెట్‌టేకర్. ఓవరాల్‌గా జలజ్ తన దేశవాలీ కెరీర్లో 133 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 104 లిస్ట్-ఏ, 66 టీ20లు ఆడాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఓ మ్యాచ్ ఆడాడు. I DONT understand selection committee these days BABA INDRAJITH plays for Rest of India against MP in the first week of March 2023. There has been no first class matches post that , but he doesn't feature for SOUTH ZONE in the duleep trophy. Can someone tell me why??#bcci — DK (@DineshKarthik) June 14, 2023 ఇదిలా ఉంటే, దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టుపై టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమిళనాడు ఆటగాడు బాబా ఇంద్రజిత్‌ను జట్టుకు ఎంపిక చేయకపోవడంపై డీకే సౌత్ జోన్ సెలెక్టర్లను నిలదీశాడు. -
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్‌బజార్, కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు.. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు మాయమై అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్‌జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్‌బన్‌లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్‌గోపాల్‌పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్‌పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్‌చౌక్, డబీర్‌పుర, మొఘల్‌పుర, రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్‌బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్‌నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్‌నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్‌పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్‌గంజ్, హబీబ్‌నగర్, కుల్సుంపుర, మంగళ్‌హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్‌ట్యాంక్, రెహ్మత్‌నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్‌లో ఆరో జోన్‌గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్‌పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్‌నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్‌బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్‌గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్‌గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్‌నగర్, బేగంబజార్‌తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, బేగంబజార్, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోల్కొండ, లంగర్‌హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్‌గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్‌ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
294 పరుగులతో సౌత్‌జోన్ ఓటమి.. దులీప్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్
దులీప్ ట్రోఫీ 2022 విజేతగా వెస్ట్‌జోన్ నిలిచింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్జోన్రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో 294 పరుగులతో వెస్ట్‌జోన్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన సౌత్‌జోన్ మరో 80 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. సౌత్‌జోన్ బ్యాటింగ్‌లో రోహన్ కన్నుమ్మల్ 93 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హైదరాబాద్‌కు చెందిన రవితేజ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన రవితేజ 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వెస్ట్‌జోన్ బౌలర్లలో షామ్స్ ములాని 4, జైదేవ్ ఉనాద్కట్, అతిత్ సేత్ తలా రెండు వికెట్లు తీయగా.. తనుస్ కొటేన్, చింతన్ గజా చెరొక వికెట్ తీశారు. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. జైదేవ్ ఉనాద్కట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్ 327 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'అండర్సన్ రిటైర్ అయితే ఇలానే ఏడుస్తానేమో!' BGT in 2021, Duleep Trophy in 2022 - Rahane continues to dominate as a captain in red ball format. pic.twitter.com/s3V6bxsUEE — Johns. (@CricCrazyJohns) September 25, 2022 -
శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. సౌత్‌జోన్ విజయలక్ష్యం 529
దులీప్ ట్రోఫీ ఫైనల్ 2022లో భాగంగా వెస్ట్‌జోన్.. సౌత్‌జోన్ ముందు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 3 వికెట్ల నష్టానికి 376 పరుగుల క్రితంరోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా వెస్ట్‌జోన్‌కు 528 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ 265 పరుగులు చేసి ఔటవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శతకంతో చెలరేగాడు. సౌత్‌జోన్ బౌలర్లను ఉతికారేసిన సర్ఫరాజ్ 178 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్‌కు తోడుగా హేల్ పటేల్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 318/7తో ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఫెదరర్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్..
కోయంబత్తూర్ వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతోన్న దులీప్ ట్రోపీ ఫైనల్లో వెస్ట్‌జోన్ భారీ అధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత యువ ఆటగాడు.. వెస్ట్‌జోన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ 235 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా వెస్ఠ్జోన్ మూడో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 376 పరుగులు సాధించింది. ప్రస్తుతం వెస్ట్‌జోన్ ఓవరాల్‌గా 319 పరుగుల అధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(209), సర్ఫరాజ్ ఖాన్(30) పరుగులతో క్రీజులో ఉన్నారు. అదే విధంగా వెస్ట్‌జోన్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్ 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో కేవలం 57 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. సౌత్ జోన్ బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో మెరిశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్ జోన్ 270 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. Yashasvi Jaiswal. Duleep Trophy final. 209* 🔥💗pic.twitter.com/liHFLoalL2 — Rajasthan Royals (@rajasthanroyals) September 23, 2022 చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
యశస్వి జైశ్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్‌జోన్
సౌత్ జోన్, వెస్ట్‌జోన్ మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుంది. టీమిండియా యువ క్రికెటర్.. వెస్ట్‌జోన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 119 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న యశస్వి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం 140 పరుగుల లీడ్‌లో ఉన్న వెస్ట్ జోన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. కాగా శ్రేయాస్ అయ్యర్.. యశస్వి జైశ్వాల్‌కు సహకరిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అంతకముందు సౌత్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 7 వికెట్ల నష్టానికి 318 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన సౌత్‌జోన్ జట్టు మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 327 పరుగులకు ఆలౌట్ అయింది.బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. మనీశ్ పాండే (48), కృష్ణప్ప గౌతమ్ (43), రోహిన్ కున్నుమ్మల్ (31) రాణించారు. వెస్ట్‌జోన్ బౌలర్లో ఉనాద్కట్ 4 వికెట్లు తీయగా.. సేత్ 3, చింతన్ గజా రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
645 పరుగుల తేడాతో భారీ విజయం: కొత్త రికార్డు నమోదు
కోయంబత్తూర్: దేశవాళీ జోనల్ ఫస్ట్‌క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీలో కొత్త రికార్డు నమోదైంది. ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్‌జోన్ ఏకంగా 645 పరుగుల భారీ తేడాతో నార్త్‌జోన్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. దులీప్ ట్రోఫీ చరిత్రలో పరుగుల తేడాపరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 157/1తో ఆదివారం ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 316 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించడం విశేషం. అనంతరం 740 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్‌జోన్ 30.4 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. తనయ్ త్యాగరాజన్, సాయికిశోర్, కృష్ణప్ప గౌతమ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన సాయికిశోర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మరో సెమీస్‌లో సెంట్రల్జోన్ను 279 పరుగులతో ఓడించి వెస్ట్‌జోన్ ఫైనల్ చేరింది. -
రవితేజ మెరుపు శతకం, పదేసిన సాయికిషోర్.. ఫైనల్లో సౌత్ జోన్, వెస్ట్ జోన్
హైదరాబాద్ ఆటగాడు తెలుకపల్లి రవితేజ (120 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తమిళనాడు యువ కిషోరం రవి శ్రీనివాసన్ సాయికిషోర్ (10/98) రెచ్చిపోవడంతో నార్త్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 645 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49) చెలరేగడంతో కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో వెస్ట్ జోన్ 279 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ రెండు జట్లు (సౌత్ జోన్, వెస్ట్ జోన్) ఈనెల 21 నుంచి 25 వరకు కొయంబత్తూర్ వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్ నష్టానికి 157 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. మరో 159 పరుగులు జోడించి 316/4 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 11 పరుగులు జోడించి 64 పరుగుల వద్ద ఔటవగా.. రవితేజ సూపర్ ఫాస్ట్‌గా సెంచరీ సాధించి ప్రత్యర్ధికి 740 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించారు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్త్ జోన్ కృష్ణప్ప గౌతమ్ (3/50), సాయికిషోర్ (3/28), తనయ్ త్యాగరాజన్ (3/12) దెబ్బకు కేవలం 94 పరుగులు మాత్రమే చేసి ఆలౌటై ఓటమిపాలైంది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యష్ దుల్ (59), మనన్ వోహ్రా (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 630/8 డిక్లేర్ (కున్నుమ్మల్ 143, హనుమ విహారి 134, రికీ భుయ్ 103) నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్: 207 ఆలౌట్ (నిషాంత్ సింధు 40, సాయికిషోర్ 7/70) సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 316/4 డిక్లేర్ (రవితేజ 104, కున్నుమ్మల్ 77) నార్త్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 94 ఆలౌట్ (యశ్ ధుల్ 59, సాయికిషోర్ 3/28) ఇక వెస్ట్ జోన్-సెంట్రల్ జోన్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. వెస్ట్ జోన్ నిర్ధేశించిన 500 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగుల స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సెంట్రల్ జోన్ మరో 199 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. రింకూ సింగ్ (65) ఒక్కడే హాఫ్ సెంచరీతో ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49), ఉనద్కత్ (1/44), అతిత్ సేథ్ (1/20) వికెట్లు పడగొట్టారు. వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్: 257 ఆలౌట్ (పృథ్వీ షా 60, రాహుల్ త్రిపాఠి 67, కుమార్ కార్తీకేయ 5/66) సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: 128 ఆలౌట్ (కరణ్ శర్మ 34 , ఉనద్కత్ 3/24, తరుష్ కోటియన్ 3/17) వెస్ట్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 371 ఆలౌట్ (పృథ్వీ షా 142, హెథ్ పటేల్ 67, కుమార్ కార్తీకేయ 3/105) సెంట్రల్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 221 ఆలౌట్ (రింకూ సింగ్ 65, షమ్ ములానీ 5/72) -
Duleep Trophy 2022: సాయికిశోర్‌కు 7 వికెట్లు
సేలం (తమిళనాడు): ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆర్.సాయికిశోర్ (7/70) ఏడు వికెట్లతో తిప్పేయడంతో... నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 17/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 67 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), నిశాంత్ (40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 423 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన సౌత్ జోన్ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. రోహన్ (77; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు), టి.రవితేజ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఓవరాల్ ఆధిక్యం 580 పరుగులకు చేరుకుంది. -
మ్యాజిక్ చేసిన హార్ధిక్ పాండ్యా బౌలర్.. భారీ ఆధిక్యంలో సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్ కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్‌లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్‌ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్‌లో ఉన్నాడు. -
అదనపు సొలిసిటర్ జనరల్‌గా సూర్యకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్‌జోన్ నుంచి భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సూర్యకరణ్‌రెడ్డి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడిన సౌత్‌జోన్ పక్షాన అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి సూర్యకరణ్‌రెడ్డి కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఏపీ, తెలంగాణ స్విమ్మర్లకు పతకాల పంట
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్లో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణ స్విమ్మర్లు తమ పతకాల వేట కొనసాగించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో వారు తొమ్మిదేసి పతకాలను గెల్చుకున్నారు. తెలంగాణ తరఫున గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో వై.జశ్వంత్ రెడ్డి (తెలంగాణ; 2ని:21.14 సెకన్లు) పసిడి పతకం సాధించాడు. గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో సూర్యాన్షు (తెలంగాణ; 28.37 సెకన్లు), గ్రూప్–1 బాలికల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో ముప్పనేని శ్రీజ (తెలంగాణ; 3ని:12.72 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో యష్ వర్మ (తెలంగాణ; 2ని:13.67 సెకన్లు) రజత పతకాలను దక్కించుకున్నారు. గ్రూప్–1 బాలుర 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో చల్లగాని అభిలాష్ (తెలంగాణ; 9ని:30.39 సెకన్లు), గ్రూప్–1 బాలికల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో చెన్నవోజుల కృష్ణప్రియ (తెలంగాణ; 35.15 సెకన్లు), గ్రూప్–2 బాలికల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో కాల్వ సంజన (తెలంగాణ; 32.97 సెకన్లు) కాంస్యాలు కైవసం చేసుకున్నారు. గ్రూప్–3 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–2 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో తెలంగాణ బృందాలకు కాంస్యాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున గ్రూప్–1 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో ఎం.వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 27.11 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్; 2ని:25.76 సెకన్లు), గ్రూప్–4 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఎం. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్; 31.81 సెకన్లు) స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకున్నారు. గ్రూప్–1 బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఎం. వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 2ని: 03.94 సెకన్లు) రజతం గెలిచాడు. గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మొహమ్మద్ పర్వేజ్ మహరూఫ్ (ఆంధ్రప్రదేశ్; 2ని:48.57 సెకన్లు) కాంస్యం నెగ్గాడు. గ్రూప్–1 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో, గ్రూప్–3 బాలుర 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో ఆంధ్రప్రదేశ్ బృందాలకు కాంస్యాలు లభించాయి. -
సౌత్‌జోన్‌కు మరో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ మహిళల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో సౌత్‌జోన్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వడోదరలో శనివారం నార్త్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో సౌత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు సాధించింది. ఎల్. నేత్ర (42; 6 ఫోర్లు), ఎన్. అనూష (36; 5 ఫోర్లు), సంజుల నాయక్ (35 నాటౌట్, 2 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో గులియా, టీపీ కన్వర్, ఎన్ఎం చౌహాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం నార్త్‌జోన్ జట్టు 46.4 ఓవర్లలో 5 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హెచ్‌బీ డియోల్ (64; 11 ఫోర్లు), తానియా భాటియా (71 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. సౌత్‌జోన్ బౌలర్లలో సజన 2 వికెట్లు తీసింది. -
సౌత్‌జోన్ కెప్టెన్‌గా గౌహర్ సుల్తానా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ అండర్–23 మహిళల వన్డే టోర్నమెంట్లో సత్తాచాటిన ముగ్గురు హైదరాబాద్ ప్లేయర్లు సౌత్ జోన్‌కు ఎంపికయ్యారు. కేరళలో ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టుకు హైదరాబాద్‌కు చెందిన గౌహర్ సుల్తానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆమెతో పాటు స్రవంతి నాయుడు, అనన్య ఉపేంద్రన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇదే జట్టులో స్టాండ్ బైగా హిమని యాదవ్, కావ్య కూడా ఉన్నారు. మరోవైపు బరోడాలో ఈ నెల 9 నుంచి 13 వరకు జరుగనున్న ఇంటర్ జోనల్ మ్యాచ్‌లకు డి. రమ్య, రచన ఎస్ కుమార్ ఎంపికయ్యారు. ఇదే జట్టులో స్టాండ్‌బైగా లక్ష్మీ ప్రసన్న కొనసాగుతుంది. మహిళల అండర్–23 క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఎంపికైన వారి జాబితాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ బృందంలో రచన, శ్రావణి, ప్రణతి రెడ్డి, రమ్య, స్నేహ మోరే త్రిష, ప్రసన్న, అనురాధ నాయక్ (వికెట్ కీపర్), చరిష్మ, శ్రావ్య (వికెట్ కీపర్), కె. అనిత, వర్ష, శ్రావీణ, భవ్య, మమత (వికెట్ కీపర్), భావన, ప్రణతి, వినయ శ్రీ, చిత్రా మహేశ్వరి, క్రాంతిలకు చోటు దక్కింది. -
అశ్విన్ అజేయ శతకం
చెన్నై: బీసీసీఐ అండర్–23 సౌత్‌జోన్ వన్డే లీగ్‌లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటకతో సోమవారం మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో అశ్విన్ హెబర్ (121 బంతుల్లో 137 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లోనూ మరో భారీ శతకంతో జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. తొలుత కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసింది. దేవ్ పడిక్కల్ (112; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో పాటు... నిష్కల్ (67; 6 ఫోర్లు), భరత్ (65; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, కేవీ శశికాంత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం అశ్విన్ జోరుతో ఆంధ్ర 44.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. రికీ భుయ్ (52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), చైతన్య (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. -
సౌత్‌జోన్‌కు మరో పరాజయం
సాక్షి, హైదరాబాద్: ఎన్సీఏ అండర్–16 ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో సౌత్‌జోన్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఈసీఐఎల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 140/2తో రెండోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఈస్ట్‌జోన్ జట్టు 67 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. దిబ్యా మజుందార్ (64) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం సౌత్ జోన్ జట్టు 64 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. శుభాంగ్ హెగ్డే (69), ప్రతీక్ రెడ్డి (34) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సుశాంత్ మిశ్రా, పంకజ్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. ఎన్ఎఫ్సీ గ్రౌండ్స్‌లో వెస్ట్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌జోన్ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 158/2తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్‌జోన్ జట్టు 65 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగులు చేసింది. మయాంక్ (63), అన్మోల్ శర్మ (56) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వెస్ట్‌జోన్ బౌలర్లలో యతిన్, యువరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన వెస్ట్‌జోన్ 55.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ప్రజ్ఞ్నేశ్ (52), వరుణ్ (56), యశస్వి జైశ్వాల్ (64) అర్ధసెంచరీలు చేశారు. నార్త్‌జోన్ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ముస్తఫా యూసుఫ్ 54 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. -
సౌత్‌జోన్ కు తొలి విజయం
ముస్తాక్ అలీ టి20 టోర్నీ ముంబై: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు రెండు వరుస పరాజయాల తర్వాత విజయాల బోణీ చేసింది. గురువారం ఇక్కడి వాంఖెడే స్టేడియంలో వెస్ట్‌జోన్ తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. దీపక్ హుడా (21 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆదిత్య తారే (19 బంతుల్లో 26; 4 ఫోర్లు), ఇర్ఫాన్ పఠాన్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించారు. సౌత్‌జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 3 వికెట్లతో చెలరేగగా... రాహిల్ షా, ఎం. అశ్విన్ , విజయ్ శంకర్ తలా రెండు వికెట్లు పడగొటా్టరు. అనంతరం సౌత్‌జోన్ జట్టు 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... విష్ణు వినోద్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. వెస్ట్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ , శౌర్య, ఈశ్వర్, ప్రవీణ్ తాంబే తలా ఓ వికెట్ తీశారు. మరో మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ జట్టు 8 వికెట్ల తేడాతో నార్త్‌జోన్ ను చితు్తగా ఓడించింది. యువరాజ్‌సింగ్ (24 బంతుల్లో 38; 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గౌతమ్ గంభీర్ (13 బంతుల్లో 20; 4 ఫోర్లు), శిఖర్ ధావన్ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్‌జోన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం యువ బ్యాట్స్‌మన్ విరాట్ సింగ్ (48 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మనోజ్ తివారి (43 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో ఈస్ట్‌జోన్ జట్టు 16.3 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. వీరిద్దరూ 87 బంతులో్లనే 149 పరుగులు జతచేసి ఈస్ట్‌ను గెలిపించారు. -
హైదరాబాద్ ఏజీ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఏజీ జట్టు సత్తా చాటింది. లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. ఫైనల్లో హైదరాబాద్ ఏజీ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3-2 గోల్స్ తేడాతో ఏజీ కర్ణాటక జట్టుపై విజయం సాధించింది. నిర్ణీత సమయంతో ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. హైదరాబాద్ జట్టు తరఫున తట్టమ్ నాయుడు, నిజామ్, సయ్యద్ ఖలీల్ గోల్స్ చేయగా...మురళి, నబిల్ ఏజీ కర్ణాటక జట్టుకు గోల్స్ అందించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత హబీబ్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎల్వీ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. -
సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
రాజరాజనరేంద్రపురం (రాజానగరం) : తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ పోటీలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎం.చంటిబాబు (దేవరపల్లి), వై.కుమార్శివదుర్గావెంకటేష్ (రాజమహేంద్రవరం), ఎ¯ŒS.శ్రీరామ్, జి. వీరవెంకటసత్యనారాయణ (గొల్లలమామిడాడ), పి. చంద్రశేఖర్ (అమలాపురం) ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. ఈ క్రీడాకారులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, ఇతర అధ్యాపకులు అభినందనలు తెలిపారు. వాలీబాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : కేరళలోని కాలికట్ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ (మహిళలు) పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 12 మందిఎంపికయ్యారు. వీరిలో ఈ.సంధ్య, ఎం.సుబ్బలక్ష్మి, ఎల్.ఉషారాణి, కె.అరుణ, ఎం.ఈశ్వరి, సీహెచ్.గాయిత్రీ, ఎస్.కుమారి, షేక్, శిరీషా, కె.సంధ్యవెంకటదుర్గ, పి.స్వాతి, ఎం.దుర్గాభవాని, కె.శైలజ ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు అభినందనలు తెలిపారు. -
హాకీలో ఎస్ఆర్కేఆర్ విద్యార్థుల ప్రతిభ
భీమవరం : అంతర్ కళాశాలల హాకీ పోటీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ చెప్పారు. సోమవారం కళాశాల వద్ద విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఎల్.బుల్లయ్య కళాశాలలో ఈనెల 2 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రా వర్సిటీ అంతర్ కళాశాల హకీ పోటీలు జరిగాయన్నారు. తమ కళాశాల హాకీ జట్టులోని జె.మహేష్‌కుమార్, ఏవీఎస్ పవ¯ŒS ఈనెల మూడో వారంలో చెన్నైలో నిర్వహించే సౌత్జో¯ŒS పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరితో పాటు ఎ¯ŒS.సాయికిరణ్‌ను బైస్టాండ్గా ఎంపిక చేశారన్నారు. అంతర్ కళాశాలల పోటీల్లో విజయం సాధించిన హాకీ బృందాన్ని కళాశాల డైరెక్టర్ సాగి విఠల్ రంగరాజు, ప్రిన్సిపాల్ పార్థసారథివ ర్మ, పీడీ పి.సత్యనారాయణరాజు అభినందించారు. -
సెమీస్‌లో సౌత్‌జోన్, ఈస్ట్ జోన్
ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారుు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన టీమ్ చాంపియన్‌షిప్ తొలి క్వార్టర్స్ ఫైనల్లో సౌత్‌జోన్ జట్టు... వెస్ట్ జోన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్ ఠాకూర్ 21-8, 21-8తో లిఖిత్‌పై గెలుపొందాడు. డబుల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్- సృజన్ జోడీ 21-15, 21-10తో లిఖిత్- సుశ్రుత్ జంటపై విజయం సాధించింది. రెండో క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు... నార్త్ ఈస్ట్ జట్టును ఓడించి సెమీస్‌కు చేరుకుంది. మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నార్త్‌జోన్ జట్టు... ఈస్ట్ జోన్‌పై గెలుపొందింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో బుధవారం జరిగిన పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో నార్త్ఈస్ట్, వెస్ట్‌జోన్ జట్లు... మహిళల విభాగంలో ఈస్ట్‌జోన్, హెడ్‌క్వార్టర్ జట్లు గెలుపొందాయి. ఈ పోటీలను ఎఫ్‌సీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఒ.పి. డాని ప్రారంభించారు. -
టెన్నికాయిట్ జట్ల ఎంపిక
హైదరాబాద్: సౌత్ జోన్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపికచేశారు. జాతీయ టెన్నికాయిట్ సమాఖ్య కార్యదర్శి లక్ష్మీకాంతం ఈ టోర్నీలో పాల్గొనే పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగనుంది. పురుషుల జట్టు ఎన్. రాకేశ్, డి. వెంకటేశ్, ఎస్. సందీప్, ఎన్. ప్రవీణ్, మొహమ్మద్ యాసీన్, బి. చందర్ మహిళల జట్టు బి. ప్రియాంక, కె. శిరీష, ఎం. హేమలత, వి. నర్మద, వై. అర్చన, డి. అనూష -
పాతబస్తీలో లేట్‌నైట్ రోమియో
- పోలీసుల అదుపులో 170 మంది యువకుల చార్మినార్ (హైదరాబాద్) పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ లేట్ నైట్ రోమియో పేరుతో 17పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు జరిగాయి. పనీ పాట లేకుండా రోడ్లపై తిరుగుతున్న సుమారు 170 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి శనివారం ఉదయం 11 గంటలకు చార్మినార్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి యువకుల తల్లిదండ్రులు కూడా హాజరు కానున్నారు. -
నగరంలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సౌత్ జోన్ పరిధిలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హుక్కా సెంటర్లు, హార్స్ రైడింగ్ సెంటర్లు, రిసార్ట్స్‌పై దాడులు చేశారు. ఈ దాడుల్లో 250మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. 11 గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులున్నారు. హుక్కా సెంటర్లలో పట్టుబడిన యువకులకు ఆదివారం కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. అలాగే సైబరాబాద్ అదనపు డీజీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రాయదుర్గం అంజయ్య నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపించని 40 బైక్‌లు, 7 ఆటోలు, 5 పెద్ద సిలిండర్లు, 9 చిన్న సిలిండర్లు, విద్యుత్ వైర్లు, టపాసులు స్వాధీనం చేసుకున్నారు. -
సిటీలో యువకులకు కౌన్సెలింగ్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో పలువురు యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరుగుతూ.. ఫైటింగ్‌లకు దిగుతున్న యువకులను సక్రమ మార్గంలో పెట్టడానికి సౌత్‌జోన్ పోలీసులు నూతన మార్గాలను ఆశ్రయించారు. బుధవారం రోజున పాతబస్తీలో 102 మంది యువకులను గుర్తించి ఒక్కచోటకు చేర్చి రాత్రిళ్లు రోడ్లపై తిరిగితే జరిగే పరిణామాలు, పర్యావసనాలను అర్థమయ్యే విధంగా చెప్పారు. యువకులతో పాటు తల్లిదండ్రులను కూడా పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో ఇదే ప్రాంతంలో స్ట్రీట్‌ఫైట్‌కు దిగి నబీల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అప్రమత్తమైనట్టు సమాచారం. ఇకపై ఎలాంటి నేరాలు జరగకుండా చూస్తామని పోలీసులు తెలపారు. -
కొనసాగిన 'లేట్ నైట్ రోమియో'
చాంద్రాయణగుట్ట: అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ, కాలక్షేపం చేసే పోకిరీ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ లేట్‌నైట్ రోమియో' మంగళవారం రాత్రి కూడా సాగింది. మొత్తం 17 పోలీస్స్టేషన్ల పరిధిలో అర్థరాత్రి పనీపాటా లేకుండా తిరిగే 110 మంది యువకులను సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఫలక్‌నుమా నబీల్ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. బుధవారం ఉదయం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయనున్నారు. తమ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, మరోసారి వారు అర్థరాత్రి రోడ్లపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించనున్నారు. -
రామగుండంలో ప్రారంభమైన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్
జ్యోతినగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించి తొలిరోజు మహిళా అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎత్తు, బరువులను పరిశీలించడంతోపాటు పరుగుపందెం నిర్వహిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 62,500 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, సౌత్‌జోన్ పరిధిలో కరీంనగర్లో ఇవి జరుగుతున్నాయి. -
పోలీసుల అదుపులో 106మంది యువకులు
హైదరాబాద్: అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై సంచరిస్తున్న జులాయిల పనిపట్టేందుకు పోలీసులు మరోసారి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. 110 మందిని అదుపులోకి తీసుకుని వారిని ఫలక్‌నుమాలోని బషేరా ఫంక్షన్ హాల్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, ఫలక్‌నుమా, కాంచన్‌బాగ్, మెయిన్‌బజార్ తదితర ప్రాంతాల్లో మొత్తం 17 పోలీస్ స్టేషన్ల పరిధిల్లో శనివారం అర్ధరాత్రి సౌత్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులను పిలిపించి అడిషినల్ డీసీపీ బాబూరావు ఆదివారం ఉదయం బషేరా ఫంక్షన్ హాల్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి కూడా 300 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
30 ఏళ్ల తర్వాత ‘తూర్పు’ క్రీడాకారుడు
క్రికెట్లో రాణిస్తున్న పేదింటి కుసుమం లెప్ట్ హ్యాండ్ బౌలర్‌గా ప్రతిభ కాకినాడ స్పోర్ట్స్ : అతడు పుట్టింది నిరుపేద కుటుంబంలోనే. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. చిన్నతనం నుంచీ క్రికెట్ అంటే అతడికి ప్రాణం. కృషి, పట్టుదల ఉంటే క్రికెట్లో రాణించవచ్చని నిరూపించాడు. వసీం అక్రం, జహీర్‌ఖాన్ తన ఆదర్శ బౌలర్లు. ఎడమ చేతి బౌలరుగా అంచెలంచెలుగా రాణిస్తూ దాదాపు 30 ఏళ్ల తరువాత జిల్లా నుంచి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై రికార్డు సృష్టించాడు. పెద్దాపురానికి చెందిన సీహెచ్ వీరరాఘవులు, మణిల కుమారుడు స్టీఫెన్. పెద్దాపురం ఏఆర్ కళాశాలలో ఇంటర్ చదివిన స్టీఫెన్ ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చేస్తున్నాడు. ఈ నెల 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లో జరిగిన సుబ్బయ్య పిళ్ళై ట్రోఫీలో స్టీఫెన్ ఆంధ్రా తరఫున ఆడి హైదరాబాద్‌పై 3, కేరళపై 4, గోవాపై 3, కర్నాటకపై 1 చొప్పున వికెట్లు తీశాడు. తద్వారా ముంబైలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3 వరకూ జరగనున్న సౌత్‌జోన్ దియాధర ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఎంపిక పత్రాలను జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి కె.బాపిరాజుకు ఏసీఏ ఆపరేషన్స్ డెరైక్టర్, మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్, కార్యదర్శి గోకరాజు గంగరాజు శనివారం అందజేశారు. స్టీఫెన్ 2010-11లో బీసీసీఐ బౌలింగ్ శిక్షణకు హాజరయ్యాడు. గతంలో అండర్-16, 19, 22, 25, రంజీ పోటీలకు జిల్లా నుంచి ఎంపికై ప్రతిభ చూపాడు. స్టీఫెన్‌ను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కేటీ మ్యాథ్యూస్, కార్యదర్శి కె.బాపిరాజు, కోశాధికారి సత్యనారాయణ, కోచ్ డి.రవికుమార్ అభినందించారు. -
విజయం దిశగా సౌత్
సెంట్రల్తో దులీప్ ట్రోఫీ ఫైనల్ న్యూఢిల్లీ: ఓపెనర్ లోకేశ్ రాహుల్ (132 బంతుల్లో 121 బ్యాటింగ్; 12 ఫోర్లు; 5 సిక్సర్లు) భీకరమైన ఫామ్‌తో రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయ సెంచరీతో అదరగొట్టడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ విజయం దిశగా దూసుకెళుతోంది. 301 పరుగుల లక్ష్యంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ జోన్ రాహుల్ దూకుడుతో ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. ఆటకు నేడు (ఆదివారం) చివరి రోజు . సౌత్ జట్టు మరో 117 పరుగులు చేస్తే ట్రోఫీ దక్కించుకోవచ్చు. సౌత్ చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉండడంతో సెంట్రల్ జోన్ పరాభవం ఇక లాంఛనమే. రాహుల్‌తో పాటు అపరాజిత్ (60 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు; 1 సిక్స్)క్రీజులో ఉన్నాడు. అంతకుముందు తమ రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ 105.5 ఓవర్లలో 403 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రాబిన్ బిస్త్ (174 బంతుల్లో 112; 8 ఫోర్లు; 4 సిక్సర్లు) శతకం సాధించాడు. ముర్తజా (67 బంతుల్లో 50; 6 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. ఎస్.గోపాల్‌కు నాలుగు, ఓజాకు మూడు వికెట్లు దక్కాయి. -
ఫైనల్లో సౌత్‌జోన్
సెమీస్‌లో చిత్తుగా ఓడిన ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీ క్రికెట్ రోహ్టక్: దేశవాళీ జోనల్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ మూడో రోజే ముగిసిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఇన్నింగ్స్ 118 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను చిత్తుగా ఓడించింది. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఈస్ట్‌జోన్ 23.4 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. శుక్లా (18), సౌరభ్ తివారి (13) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. శరత్‌కు 4 వికెట్లు దక్కగా, స్టువర్ట్ బిన్నీ 3 వికెట్లు తీశాడు. అంతకు ముందు గురువారం ఈస్ట్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కూడా పేలవ ప్రదర్శన కనబర్చి 84 పరుగులకే ఆలౌటైంది. సౌరభ్ తివారి (17), రాణా దత్తా (17)లదే అత్యధిక స్కోరు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా 4 వికెట్లు పడగొట్టిన బిన్నీ.. ఈస్ట్‌ను దెబ్బ తీశాడు. ప్రజ్ఞాన్ ఓజాకు 3 వికెట్లు దక్కాయి. గంభీర్ సెంచరీ: సెంట్రల్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో నార్త్‌జోన్ కెప్టెన్ గంభీర్ (242 బంతుల్లో 167; 18 ఫోర్లు) సెంచరీ చేశాడు. నార్త్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 538 పరుగులు చేసిన సెంట్రల్‌జోన్‌కు 81 పరుగుల ఆధిక్యం లభించింది. నార్త్ బ్యాట్స్‌మెన్‌లో సెహ్వాగ్ (32), యువరాజ్ (47), రసూల్ (44) ఫర్వాలేదనిపించారు. గురువారం సెంట్రల్ బ్యాట్స్‌మన్ నమన్ ఓజా (348 బంతుల్లో 217; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు. -
30 నుంచి సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్
హైదరాబాద్ జట్లకు రవీందర్, సవిత నేతృత్వం సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌నకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ పోటీలకు కొంపల్లిలోని శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీ వేదికగా నిలువనుంది. మహిళలు, పురుషుల విభాగాల్లో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. టీమ్ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళలు, పురుషులు, జూనియర్ బాలురు, బాలికల సింగిల్స్ పోటీలు కూడా నిర్వహిస్తారు. టీమ్ ఈవెంట్ మాత్రం రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో, వ్యక్తిగత పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లతో పాటు కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే హైదరాబాద్ జట్లను ఎంపిక చేశారు. పురుషుల జట్టుకు రవీందర్ గౌడ్ (ఏజీ ఆఫీస్), మహిళల బృందానికి సవితాదేవి సారథ్యం వహిస్తారు. సురేశ్ కుమార్ కోచ్‌గా వ్యవహరిస్తారు. పురుషుల జట్టు: రవీందర్ గౌడ్ (కెప్టెన్), ఎండీ అహ్మద్, నవీన్, వసీమ్, సాయి సంతోష్, సాయిబాబా, నరేశ్, మహేశ్, మేనేజర్: ఆర్. బాల రాజు. మహిళల జట్టు: సవితా దేవి (కెప్టెన్), శ్రీవాణి, పద్మజ, మాధవి, మౌనిక, అశ్విని, శ్వేత, సాయిలక్ష్మి, మేనేజర్: ఎస్. భావన. జూనియర్ బాలురు: కళ్యాణ్, రమేశ్, శ్యామ్, వినీత్; జూనియర్ బాలికలు: స్రవంతి, చరిష్మా గౌడ్, రాశి, అమృత. -
నాకౌట్ ఆశలు గల్లంతు
బెంగళూరు: రంజీ ట్రోఫీలో ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ ఇప్పుడు దేశవాళీ వన్డేల్లోనూ అదే బాట పట్టింది. గత మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో చిత్తుగా ఓడిన జట్టు...ఇప్పుడు ఆంధ్ర చేతిలోనూ పరాజయం పాలైంది. సౌత్‌జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో భాగంగా సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి ముందుగా హైదరాబాద్ 47.5 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలగా, ఆంధ్ర 40.1 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. తాజా ఓటమితో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. సౌత్‌జోన్ నుంచి తమిళనాడు, కర్ణాటక జట్లు అర్హత సాధించాయి. ఆదుకున్న విహారి, హబీబ్... టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 7 పరుగులకే ఓపెనర్లు సుమన్ (5), అక్షత్ (1) పెవిలియన్ చేరారు. అయితే ఈ దశలో హనుమ విహారి (70 బంతుల్లో 43; 5 ఫోర్లు) ఆదుకున్నాడు. రవితేజ (11)తో కలిసి అతను మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. అయితే రవితేజతో పాటు సందీప్ రాజన్ (7), విహారి వెంటవెంటనే వెనుదిరిగారు. ఫామ్‌లో ఉన్న ఆశిష్ రెడ్డి (9)తో పాటు షిండే (15), కనిష్క్ (0) కూడా ఏడు పరుగుల వ్యవధిలోనే నిష్ర్కమించారు. అయితే వికెట్ కీపర్ హబీబ్ అహ్మద్ (49 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఆటగాళ్లు ఓజా (11), రవికిరణ్ (11)ల అండతో అతను స్కోరును 150 పరుగులు దాటించాడు. ఆంధ్ర బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ దాసరి స్వరూప్ కుమార్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, విజయ్‌కుమార్‌కు 2 వికెట్లు దక్కాయి. గెలిపించిన భరత్... సునాయాస విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 9 పరుగుల వద్ద ఓపెనర్ ప్రశాంత్ (6) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ శ్రీకర్ భరత్ (87 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రెండో వికెట్‌కు జ్యోతి కృష్ణ (55 బంతుల్లో 36; 5 ఫోర్లు) తో 60 పరుగులు జోడించిన భరత్, మూడో వికెట్‌కు బోడ సుమంత్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)తో 56 పరుగులు జత చేశాడు. భరత్ వెనుదిరిగినా...రికీ భుయ్ (28 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) మ్యాచ్‌ను ముగించాడు. -
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్
చెన్నై: బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సౌత్‌జోన్... దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా (6/48) కీలక వికెట్లు తీయడంతో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 258 పరుగులు చేయాల్సిన దశలో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 57.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా ఓజా నాలుగు ఓవర్ల వ్యవధిలో రాబిన్ బిస్త్ (20), శలభ్ శ్రీవాస్తవ (2), నమన్ ఓజా (0)లను అవుట్ చేయడంతో సౌత్ విజయం ఖరారైంది. అంతకుముందు 467/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సౌత్ జట్టు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. -
సెంట్రల్ జోన్ 209 ఆలౌట్
చెన్నై: సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. పీయూష్ చావ్లా (56) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిథున్, ఓజా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 2 వికెట్లకు 137 పరుగులు చేసింది. ముకుంద్ (61), అపరాజిత్ (35) క్రీజులో ఉన్నారు. ఉన్ముక్త్ సెంచరీ: కొచ్చిలో ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో నార్త్‌జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఉన్ముక్త్ చంద్ (116), ఇయాన్ దేవ్‌సింగ్ (95 రిటైర్డ్‌హర్ట్) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లలో 2 వికెట్లకు 329 పరుగులు చేసింది. -
సెంట్రల్ జోన్ 123/5 : దులీప్ ట్రోఫీ
చెన్నై: సౌత్ జోన్ పేసర్ అభిమన్యు మిథున్ (3/24) పదునైన బంతులతో రెచ్చిపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సెంట్రల్ జోన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసమయానికి సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 123 పరుగులు చేసింది. వర్షం కారణంగా పూర్తి స్థాయి ఓవర్లు ఆడేందుకు వీలు పడలేదు. మూడో ఓవర్ నుంచే మిథున్ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. దీంతో 13 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన సెంట్రల్‌ను ఓపెనర్ ముకుల్ దాగర్ (105 బంతుల్లో 45; 6 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకున్నాడు. బిస్త్ (18)తో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. తనను కూడా మిథున్ పెవిలియన్‌కు చేర్చడంతో సెంట్రల్ కష్టాల్లో పడింది. నార్త్ జోన్ 33/0 కొచ్చి: మరో సెమీఫైనల్‌కు వర్షం అడ్డంకిగా నిలి చింది. దీంతో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ 4 రోజుల మ్యాచ్‌లో కేవలం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్త్ జోన్ నిదానంగా ఆడడంతో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేయగలిగింది. క్రీజులో జీవన్‌జ్యోత్ (18), ఉన్ముక్త్ చంద్ (12) ఉన్నారు.


