రెస్ట్ తీసుకోమ‌న్నా విన‌లేదు; నొప్పిని భ‌రిస్తూనే డ‌బుల్ సెంచ‌రీ | Ishan Kishan Battles Through Injury To Smash Double Century In Duleep Trophy Final, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

రెస్ట్ తీసుకోమ‌న్నా విన‌లేదు; నొప్పిని భ‌రిస్తూనే డ‌బుల్ సెంచ‌రీ

Sep 7 2026 3:32 PM | Updated on Sep 7 2026 4:23 PM

Ishan Kishan Ignored Doctor Message-Continued-Bags-Double Century

Photo Credit: BCCI Twitter

చెన్నై చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైన‌ల్లో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. ఇషాన్ 128 ప‌రుగుల వ్యక్తిగత స్కోరు వ‌ద్ద ఉన్న‌ప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి క‌డుపు కింద భాగంలో బ‌లంగా తాకింది. బంతి బ‌లంగా తాకడంతో నొప్పితో విల‌విల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియ‌న్ దిశగా ప‌రిగెత్తి అక్క‌డే కూర్చుండిపోయాడు. 

ఫిజియో వ‌చ్చి ఇషాన్ గాయాన్ని ప‌ర్య‌వేక్షించాడు. అదే స‌మ‌యంలో ఫిజియోతో వ‌చ్చిన డాక్ట‌ర్ ‘రెస్ట్ తీసుకో’ అని స‌ల‌హా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తాన‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత నొప్పిని భ‌రిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డ‌బుల్ సెంచ‌రీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ సాధించిన మ‌రో 30 బంతుల్లో 250 మార్క్‌ను చేరుకున్నాడు.  

ఆ త‌ర్వాత నొప్పి తిర‌గ‌బెట్ట‌డంతో ఇషాన్ చాలా ఇబ్బంది ప‌డ్డాడు. ఫిజియో వ‌చ్చి ఇషాన్‌తో మాట్లాడాడు. ఆ వెంట‌నే ఇషాన్ కిష‌న్ రిటైర్డ్ హ‌ర్ట్‌గా మైదానం వీడాడు. మ‌రి మిగ‌తా మ్యాచ్‌కు ఇషాన్ కిష‌న్ అందుబాటులో ఉంటాడా? ఉండ‌డా అనే ప్ర‌శ్న అభిమానుల‌ను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్‌ రెస్ట్‌ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్‌ బ్యాటింగ్‌ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.

అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హ‌ర్ట్ అయిన‌ట్లు ప్ర‌ద‌ర్శించ‌డంతో అత‌డు మ‌ళ్లీ బ్యాటింగ్‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే ఈస్ట్‌జోన్ 650 ప‌రుగుల మార్క్‌ను దాట‌డంతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్‌జోన్ తాజాగా టైటిల్  గెలుచుకునే అవకాశం ఉంది. 

ఇప్ప‌టికే ఈస్ట్‌జోన్ 650 ప‌రుగుల మార్క్‌ను దాట‌డంతో సౌత్‌జోన్ అంత స్కోరు చేయాల‌న్నా రెండు రోజులు ప‌డుతుంది. ఇప్ప‌టికే రెండు రోజుల ఆట ముగియ‌డం, మ‌రో మూడు రోజులు ఉండ‌డంతో మ్యాచ్ డ్రా అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ లెక్క‌న‌ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది.

 

చదవండి: భార‌త్‌తో టీ20 సిరీస్ ముంగిట‌ చెల‌రేగిన ఆఫ్గ‌న్ బౌల‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement