సుమంత్, ఐశ్వర్య రాజేష్ జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. వేడుకకు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


