ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మెహిందీ పెడుతూ ఎంత ఆదాయం గడిస్తుందో నెట్టింట వీడియో రూపంలో షేర్ చేసింది. భారత్‌లో మెహిందీ పెట్టే స్కిల్‌ని ఎలా చూస్తారు..అదే అమెరికాలో అయితే ఎలా ఉంటుందో పోలుస్తూ చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు పార్ట్‌టైంగా చేస్తున్న ఈ సరదా స్కిల్‌తో తాను ఎంత మేర ఆర్జిస్తుందో కూడా పంచుకుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించి మెహిందీ స్కిల్‌పై చర్చలు రేకెత్తించింది.
అమెరికాలో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రియాం కజైన్ ఈ పోస్ట్ పంచుకుంది. తన ఉద్యోగానికి, అభిరుచికి మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తూ..ప్రొఫెషనల్ మెహిందీ ఆర్టిస్ట్‌గా ఎలా కొనసాగుతుందో చెప్పుకొచ్చింది. కోడింగ్ ద్వారా నెలవారీ ఖర్చులు తీరుతుండగా, మెహిందీ పనితో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది. తన డిజైన్ పనికి గంటకు సుమారు రూ. 9 వేల నుంచి పదివేల దాకా ఛార్జ్ చేస్తుందట.
అంతేగాదు నిర్ణీత గంటల రుసుము తోపాలు ఒక్కోసారి 20 శాతం వరకు టిప్ రూపంలో అదనపు మొత్తాన్ని కూడా ఆర్జిస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు పెళ్లిళ్ల సీజన్‌లో అయితే మెహిందీ పెట్టే పూర్తి స్థాయి బుకింగ్‌ని బట్టి ఒక్క రోజుకి దాదాపు రూ. 1 లక్ష దాక సంపాదించొచ్చని తెలిపింది. తనకు అమెరికా వచ్చిన తర్వాతే కళాకారులకు ఎంత విలువ ఉంటుందో అర్తమైందని అంటోంది. భారత్‌లో మెహిందీ ఆర్టిస్ట్ వృత్తిని అంత గొప్ప పనిగా చూడరు, అంతగా గౌరవించరని వాపోయింది.
కానీ ఇక్కడ తనను కళాకారిణిగా గౌరవిస్తారని అంటోంది. అంతేగాదు తనకు ఏదో ఒక చిన్న పనిచేస్తున్నట్లు అనిపించదని చెబుతోంది. అయినా ఏపని చిన్నిది, పెద్దది అని ఉండదు, పని అంటే పనే అని నొక్కి చెబుతోంది. ఇక అలాగే అమెరికాలో జీవన వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయని ఒప్పుకుందామె. నెటిజన్లు కూడా ఆమె మాటలకు మద్దతిస్తూ..ఔను ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్ప మరే ఏ ఇతర ఉద్యోగాన్నీ అంతగ గౌరవించరంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అద్భుతమైన క్రిమ్సన్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!)


