నమీబియా వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరింది. శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో ఆతిథ్య నమీబియాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక పరాజయంతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... జింబాబ్వే 2 విజయాలు, 2 ఓటములతో 4 పాయింట్లు సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది.
శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లుహాన్ ప్రిటోరియస్ (53 బంతుల్లో 101; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... మరో ఓపెనర్ కానర్ ఎస్తెర్హుజెన్ (40 బంతుల్లో 88, 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టారు.
ఈ జంట తొలి వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 156 పరుగులు జోడించడం విశేషం. నమీబియా బౌలర్లలో జాన్ బాల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వీరోచితంగా పోరాడిన నమీబియా... చివరకు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 217 పరుగులకు పరిమితమైంది.
ఓపెనర్లు లారెన్ స్టీన్‌క్యాంప్ (44 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాన్ ఫ్రైలింక్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో నొబాని మొకోనా 2 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో జింబాబ్వేతో దక్షిణాఫ్రికా తలపడనుంది.
ప్రిటోరియస్ వరల్డ్ రికార్డ్
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన ప్రిటోరియస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ తరపున సెంచరీ సాధించిన అతి పిన్న వయష్కుడిగా ప్రిటోరియస్ రికార్డులకెక్కాడు. సఫారీ సూపర్ స్టార్ 20 ఏళ్ల 161 రోజుల వయసులో ఈ ఘనతను సాధించాడు.
ఇంతకముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్(20 ఏళ్ల 337 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో జజాయ్‌ను ప్రిటోరియస్ అధిగమించాడు. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధిస్తే.. ప్రిటోరియస్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడు.
చదవండి: నేడు పాకిస్తాన్‌తో భారత్ ఢీ


