సబలెంకా జోరు | Aryna Sabalenka advances to womens singles pre quarterfinals | Sakshi
Sakshi News home page

సబలెంకా జోరు

Sep 5 2026 1:25 AM | Updated on Sep 5 2026 1:25 AM

Aryna Sabalenka advances to womens singles pre quarterfinals

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌

పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ ఫిలిక్స్, ఆరో సీడ్‌ డిమనోర్‌ నిష్క్రమణ

న్యూయార్క్‌: ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ లక్ష్యంతో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఆడుతున్న ఈ బెలారూస్‌ స్టార్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సబలెంకా 6–3, 6–4తో రఖిమోవా (ఉజ్బెకిస్తాన్‌)పై కష్టపడి గెలిచింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో కేవలం 54 నిమిషాల్లో నెగ్గిన సబలెంకా మూడో రౌండ్‌ మ్యాచ్‌లో మాత్రం 89 నిమిషాలు తీసుకుంది. 10 ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక్కటే డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. 

రెండుసార్లు రఖిమోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్‌ పాయింట్‌ ఇవ్వలేదు. 29 విన్నర్స్‌ కొట్టిన 2024, 2025 చాంపియన్‌ 19 అనవసర తప్పిదాలు చేసింది. 11వ సీడ్‌ మార్టా కొస్టుక్‌ (ఉక్రెయిన్‌), మూడో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా), 16వ సీడ్‌ సొరానా కిర్‌స్టియా (రొమేనియా) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కొస్టుక్‌ 6–3, 6–2తో 18వ సీడ్‌ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, పెగూలా 1–6, 6–4, 6–3తో 2021 రన్నరప్‌ లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై, సొరానా 6–3, 6–3తో 19వ సీడ్‌ పావోలిని (ఇటలీ)పై విజయం సాధించారు. 

రెండో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌), నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), ఐదో సీడ్‌ మిరా ఆండ్రీవా (రష్యా), పదో సీడ్‌ అనిసిమోవా (అమెరికా) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో రిబాకినా 6–2, 6–4తో బుజాస్‌ మనెరో (స్పెయిన్‌)పై, కోకో గాఫ్‌ 6–4, 7–6 (7/5)తో పౌలా బదోసా (స్పెయిన్‌)పై, ఆండ్రీవా 6–0, 6–2తో ఇవా లిస్‌ (జర్మనీ)పై, అనిసిమోవా 6–3, 3–6, 6–1తో లిలీ టాగెర్‌ (ఆస్ట్రియా)పై నెగ్గారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement