చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శుతి ధరివాల్‌ గేమ్‌ స్ట్రాటజీ..! | shruti dhariwal whose coco is changing how children learn Ai | Sakshi
Sakshi News home page

చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శుతి ధరివాల్‌ గేమ్‌ స్ట్రాటజీ..!

Sep 4 2026 5:42 PM | Updated on Sep 4 2026 5:52 PM

shruti dhariwal whose coco is changing how children learn Ai

పిల్లలు డిజిటల్‌ మీడియాకి బానిసైపోతున్నారు తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన చెందుతున్న తరుణంలో ఎంఐటీ స్టూడెంట్‌ సరికొత్త స్ట్రాటజీతో వస్తోంది. ఇదేంటి అనుకోకండి వాళ్లు ఏఐ స్కిల్క్‌ అందిపుచ్చుకునేలా గేమ్స్‌తో వ్యూహం రచిస్తోందామె. చిన్నారులు గేమ్స్‌ అంటే ఎంతో ఇష్టమో తెలిసిందే. ఆన్‌లైన్‌ ఆడే ఆ గేమ్స్‌కి ఏఐ సాంకేతికతను మేళవించి వాళ్లే స్వయంగా ఏఐ ఉపయోగించడం నేర్చుకునేలా చేస్తూ..ప్రయోగాలు చేసేలా చేస్తుందట. 

అంతేగాదు అది నేర్చుకునే విధానాన్నే మార్చి..వాళ్లను మంచి మేధావులుగా తీర్చిదిద్దుతుందట. ఈ సరికొత్త ఆవిష్కరణకు తెరతీసింది మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిని. భారతీయ పరిశోధకురాలు, శృతి ధరివాల్. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి అయినా ఆమె ఎడ్యుగేషన్‌ గేమ్‌ని రూపొందించి దానికి ఏఐని మేళవించింది. 

దీన్ని పిల్లలు, టీనేజర్లకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారామె. వాళ్లందర్నీ ఏఐ సాధనాలను ఎలా వాడుకోవచ్చో, ఎలా ప్రయోగాలు చేయాలో ట్రైన్‌ చేస్తుందట. దాని పేరే కో క్రియేటివ్‌ ఏఐ టూల్స్‌(కోకో). ఈ ఎడ్యుకేషన్‌ గేమ్‌కి అంతర్జాతీయ విద్యా సాంకేతిక వర్గాల నుంచి మంచి గుర్తింపు, స్పందన వచ్చింది. ఈ కోకో పిల్లలు నేర్చుకునే  విధానాన్ని మారుస్తుందట. 

ఎవరీ ధరివాల్‌..?
దరీవాల్‌ అకాడమీ జర్నీ జైపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మొదలైంది . అక్కడ ఆమె 2008లో బీటెక్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత 2011లో గుర్గావ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ఎయిర్‌టెల్‌లో యంగ్‌ లీడర్‌గా పనిచేసింది. అక్కడ నుంచి బెంగళూరుకు చెందిన మ్యాడ్‌రాట్ గేమ్స్‌లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్‌గా రేంజ్‌కి చేరుకుంది. ఆ తర్వాత టెక్నాలజీ, విద్యా, క్రియేటివిటీ వంటిపై పరిశోధనలు చేసే దిశగా అడుగులు వేస్తూ విద్యా సంబంధిత ఆటలను రూపొందిచడం ప్రారంభించింది. 

అంతేగాదు మ్యాడ్‌రేట్‌ గేమ్స్‌లో విద్యా సామాజిక ఆటల రూపకల్పనకు నాయకత్వం వహించారు. అవి భారతదశవ వ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలకు చేరాయి. ఆ తర్వాత ఆమె టెక్నాలజీని సాఫ్ట్‌వేర్‌గా చూడకుండా పిల్లలు కూడా నేర్చుకునేలా, సృష్టించేలా ప్రభావితం చేయొచ్చా అనే దిశగా పరిశోధనలు చేసింది. అలా ఆమె ఎంఐటీ ల్యాబ్‌లో చేరారు. అక్కడే 2016, 2018 మధ్య మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి, 2018, 2025 పిల్లల కోసం కొత్త డేటా-విజువలైజేషన్ సాధనాలకు సంబంధిన అంశంపై పీహెచ్‌డీ చేశారు. 

అలా వచ్చిందే ఈ కోకో. ఆ పరిశోధనకుగానూ ఏసీఎం కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ డిజైన్ అండ్ చిల్డ్రన్‌లో బెస్ట్ షార్ట్ పేపర్ అవార్డును కూడా గెలుచుకుంది. అంతేగాదు  2023–24 లెర్నింగ్ ఇంజనీరింగ్ టూల్స్ కాంపిటీషన్‌లో కోకో విజయం సాధించిది.  ఈ పరిశోధన ఎంఐటీ న్యూస్‌, టెక్నాలజీ రివ్యూ, ఎడ్‌సర్జ్‌లలో ప్రచురితమైంది కూడా. 

ఇక్కడ ధరివవాల్‌ తయారు చేసిన కోకో పిల్లలను ఏఐ వినయోగదారులగా కాకుండా క్రియేటర్స్‌గా మారుస్తుందన్న కోణమే హైలెట్‌ అయ్యి అందరీ ప్రశంసలు అందుకుంది. అంతేగాదు ధరీవాల్‌ పిల్లలు ఏఐ ఉయోగించొచ్చా అన్నది ప్రశ్న కాదు, వాళ్లకు దాన్ని సృజనాత్మక భాగస్వామిగా ఉపయోగించేలా చేయడమే ప్రధానం అంటుందామె. ఇది వాళ్లలోని టాలెంట్‌ని బయటకు తీసేందుకు దోహదపడుతుదంని నమ్మకంగా చెబుతోందామె. 

(చదవండి: సీఏ వదిలేసి మరి దోసె వ్యాపారం..నెలకు రూ. 12 లక్షలు!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement