లండన్ రోడ్డును డ్రైవర్‌లెస్ టాక్సీ పలకరించింది. ఊబర్ యాప్‌లో ఊబర్ ఎక్స్, ఊబర్ ఎలక్ట్రిక్ లేదా ఊబర్ కంఫర్ట్ బుక్ చేసినవారికి ఈ కార్లు అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రస్తుతం భద్రత కోసం కారులో ఓ నిపుణుడు ఉంటాడు. పూర్తిగా డ్రైవర్‌లెస్‌గా నడిపేందుకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. అయినప్పటికీ యుకేలో ప్రయాణికుల కోసం మొదలైన తొలి డ్రైవర్‌లెస్ టాక్సీ సర్వీస్ ఇదే...!
గేమ్ ఛేంజర్
గేమింగ్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనం మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్ల జనాభా గేమ్స్ ఆడుతారని అంచనా. మరి వారి కోసం ఎప్పటికప్పుడు టెక్ గ్యాడ్జెట్స్ మారుతూ ఉండాలిగా? అందుకే ప్రముఖ ల్యాప్ టాప్ తయారీ సంస్థ ఏసర్ ఓ గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చింది. ప్రాజెక్ట్ డ్యుయల్ ప్లే మిని’గా పిలిచే ఈ డివైస్‌లో 8 అంగుళాల తెర ఉంటుంది.
రెండు వైపులా చివరన గేమింగ్ కన్సోల్ ఉంటుంది. కాని ఆసక్తికరమైన విషయం ఏంటంటే టైల్స్ రూపంలో మడతపెట్టి ఉన్న ఈ గ్యాడ్జెట్‌ని అన్‌ఫోల్డ్ చేయగానే కీ ప్యాడ్ కనిపిస్తుంది. స్క్రీన్ రివర్స్ చేస్తే దాన్నే ల్యాప్‌ట్యాప్‌గానూ, చిన్నసైజు పీసీలా ఉపయోగించుకోవచ్చు. ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్యూల్ ప్లే మిని తాలూకు ప్రోటోటైప్‌ను ఐఎఫ్‌ఏ 2026లో ప్రదర్శనకు ఉంచగా గేమింగ్ ప్రియులు తెగ ఆసక్తిగా చూస్తున్నారు.
(చదవండి: చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శుతి ధరివాల్ గేమ్ స్ట్రాటజీ..!)


