పనే దైవం అంటారు మన పెద్దలు. పాల్ కురియన్ కూడా తాను చేసే పనిని దైవ సమానంగా భావించాడు. తాను పనిలో చేరినప్పటి నుంచి అంకితభావంతో చాలా శ్రద్ధగా పనిచేశాడు. 18 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన చివరి వరకు అంతే అంకితభావంతో సేవలు అందించాడు. పాల్ కురియన్ ఇటీవల పదవీ విరమణ చేశాడు. రిటైర్మెంట్ చివరి రోజున ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయన పేరు వార్తల్లోకి ఎక్కింది.
ఎవరీ పాల్ కురియన్?
కేరళంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేశారు పాల్ కురియన్. ఇడుక్కిలోని కుమిలీ, కట్టప్పనా డిపోల్లో ఆయన సేవలు అందించారు. ఆయన ఉద్యోగ జీవితం సాఫీగా సాగిందని, బస్సు స్టీరింగ్ పట్టుకున్నప్పటి నుంచి ఒక్క ప్రమాదం కూడా జరగలేదని కేఎస్ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 2న చివరిసారిగా బస్సు నడిపారు. బస్సును వదిలివెళుతూ భావోద్వేగానికి లోనయ్యారు. బస్సును పార్క్ చేసి స్టీరింగ్‌ను అప్యాయంగా ముద్దాడారు. తనకు ఎంతోకాలం ఉపాధి కల్పించిన బస్సుకు శిరసు వంచి నమస్కరించారు. నాలుగు టైర్లను ప్రేమగా తాకి దండాలు పెట్టారు.
చాన్స్ ఇస్తే మళ్లీ వస్తా
ఈ సందర్భంగా పాల్ కురియన్ మాట్లాడుతూ.. ఆగస్టు 31నే అధికారికంగా రిటైర్ అయ్యాను. సెస్టెంబర్ 2న ఫిజికల్ చివరిసారిగా డ్యూటీ చేశాను. గత ఎనిమిదేళ్లుగా తమిళనాడులోని కంబం, కొట్టాయం మధ్య బస్సు ఇంటర్ స్టేట్ సర్వీసు నడిపాను. నేను నడిపిన బస్సుతో చాలా ఏళ్లుగా అనుబంధం ఏర్పడింది. ఇంతకాలం నన్ను, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన బస్సుకు నా రిటైర్మెంట్ రోజున నమస్కారాలు తెలిపానని చెప్పాడు. పనిని ప్రేమిస్తే భారంగా అనిపించదని అన్నారు. కాగా, తనకు మళ్లీ డ్రైవర్‌గా అవకాశం కల్పిస్తే స్టీరింగ్ పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పాల్ కురియన్ చెప్పారు.
ఇదీ చదవండి: హైవేపై 'ఫ్యామిలీ' భోజనం!
నెటిజన్ల ప్రశంసలు
పాల్ కురియన్.. బస్సుకు సమస్కరిస్తున్న వీడియోను కేఎస్ఆర్టీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసినవారంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిబద్ధతతో పనిచేసే వారికి మన్ననలు దక్కుతాయనడానికి పాల్ కురియన్ మంచి ఉదాహరణ అంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
A KSRTC driver in Kerala bid an emotional farewell to his bus after completing his final trip before retirement. Paul Kurian of the Kumily depot kissed the steering wheel and saluted the bus after his last duty on 2 September, a moment that has touched many online.#kerala… pic.twitter.com/xsxNghIBBi
— Salar News (@EnglishSalar) September 3, 2026


