source: X
2019లో జరిగిన వైమానిక ఘర్షణలో పాకిస్తాన్‌కు చెందిన ఓ శత్రు విమానాన్ని కూల్చివేసిన మాజీ భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్, వీర్ చక్ర అవార్డు గ్రహీత అభినందన్ వర్ధమాన్ కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో పైలట్‌గా చేరినట్లు వార్తాలు వస్తున్నాయి. అభినందన్ గత నెలలోనే FLY91లో చేరినట్లు సమాచారం. FLY91 ప్రస్తుతం ATR 72-600 విమానాలను నడుపుతోంది. గోవా, హైదరాబాద్‌లలో FLY91కు రెండు బేస్‌లు ఉన్నాయి.
2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌తో జరిగిన వైమానిక ఘర్షణలో అభినందన్ మిగ్-21 బైసన్‌ను నడిపారు. ఆయన విమానం కూలిపోవడంతో పాకిస్తాన్ భూభాగంలో దిగిన ఆయనను పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల తర్వాత ఆయన భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ ఘటనలో చూపిన ధైర్యసాహసాలకు అభినందన్ వర్ధమాన్ 2021లో వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు.
అభినందన్ మిగ్-21 ఫైటర్ జెట్ నుంచి ATR-72 ప్యాసింజర్ విమానం వైపు అడుగులు మార్చడం ఆసక్తికరంగా మారింది. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, ఆయన ATR విమానంపై అవసరమైన శిక్షణ పొందుతున్నారని, శిక్షణ మరియు నియంత్రణ అనుమతులు పూర్తయ్యాక వాణిజ్య విమాన సర్వీసుల్లోకి రావచ్చు.
చదవండి: ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం


