ఢిల్లీ: ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో వైఎస్సార్ అవార్డ్స్-2026 కార్యక్రమం జరిగింది. స్వామినాథన్ ఫౌండేషన్‌కు వైఎస్సార్-2026 అవార్డ్ ప్రదానం చేశారు. కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు తెలంగాణ మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘‘పేద ప్రజల కోసం పనిచేసిన నాయకుడు వైఎస్సార్. ఆయన వల్లే కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చాం. వైఎస్సార్ వల్లే ఏపీలో 39 లోక్‌సభ సీట్లు గెలిచాం. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దే. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్. స్వామినాథన్ ఫౌండేషన్‌కు వైఎస్సార్ అవార్డు ఇవ్వడం సంతోషం’’ అని ఖర్గే పేర్కొన్నారు.


