సిక్కు కథక్‌ నర్తకుడు..! నటి రేఖ మూవీ.. | Sikh Kathak Dancer Asa Willoughby He Inspired From Rekhas Umrao Jaan | Sakshi
Sakshi News home page

సిక్కు కథక్‌ నర్తకుడు..! నటి రేఖ మూవీ..

Sep 2 2026 4:29 PM | Updated on Sep 2 2026 4:41 PM

Sikh Kathak Dancer Asa Willoughby He Inspired From Rekhas Umrao Jaan

శాస్త్రీయ నృత్యం అనగానే సర్వసాధారణంగా అమ్మాయిలే ఎక్కువగా నేర్చుకుంటారు. ఒకప్పుడు నాటకాల్లో అది అబ్బాయిలు చేసిన  సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం జనరేషన్‌లో అబ్బాయిలు శాస్త్రీయ నృత్యం నేర్చుకునే వాళ్లు అరుదు. పైగా వేళ్ల మీద లెక్కించి చెప్పొచ్చు కూడా. కానీ ఒక సిక్కు అబ్బాయి కాళ్లకు గజ్జెలు కట్టుకుని శాస్త్రీయ నృత్యం అంటే..కచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వేళ నేర్చుకున్నా.. అతడిపై ఎన్నో ఆంక్షలు, అవమానాలు తప్పవు. ముందుగా ఈ సవాళ్లని తట్టుకుని నేర్చుకుని మంచి నర్తకుడి అనిపించుకోవం మాటులు కాదు. కానీ సిక్కు అబ్బాయ్‌ నృత్యం ఎంత ముగ్ధమనోహరంగా ఉంటుందంటే..కనులు ఆర్పడమే మర్చిపోతాం. 

అతడే ఆసా విల్లోబీ. భారతీయ శాస్త్రీయ నృత్యానికి  లింగ భేదం లేదు. పైగా నటరాజుకి అంకితమిచ్చేలా మగవాళ్లు కూడా ఆ కాలంలో నృత్యం చేసేవారు. అయితే ప్రస్తుతం మాత్రమే ఆ శాస్త్రీయ నృత్యం కేవలం స్తీలకే పరిమితం అనేలా ఉంది అందరి ధోరణి. అలాంటి కాలంలో ఇంగ్లాండ్‌కి చెందిన ఆసా విలేబీ అనే సిక్కు కథక్‌ నేర్చుకోవాలని ఆశపడ్డాడు. 

అది కూడా బాలీవుడ్‌ ప్రసిద్ద నటి రేఖ నటించిన  'ఉమ్రావ్ జాన్' మూవీ అతడిని కథక్‌ భంగిమల పట్ల ఆకర్షితుడయ్యేలా చేసింది. అలా 17 ఏళ్ల వయసులో ఆ కథక్‌ నృత్యం నేర్చుకోవాలని తరగతులకు వెళ్తే..అక్కడంతా స్త్రీలే..తనొక్కడే మగవాడు. అంతేగాదు సిక్కు మతస్థుడిగా 21 ఏళ్ల వయసు నుంచి తలపాగా ధరించడం మొదలయ్యాక..ఇది నీకు అవసరమా అన్నట్లు చూసే చూపులు, ఈసడింపులు ఎక్కువయ్యాయి. అసలు అతడు మగవాడేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేసి ఇబ్బంది పెట్టేవారు. 

ఆ క్రమంలో అతడికి తన అమ్మే వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించింది. స్టేజ్‌పై ప్రదర్శనలిచ్చేటప్పుడు కూడా ఆమె ఎంతో మద్దతిచ్చారామె. అంతేగాదు మగవాళ్లకు ఇది హుందాతన కాదు అంటూ ఎగతాళి మాటలు కూడా ఎ‍క్కువయ్యాయి. కానీ ఆసా హుందాతనం అనేది లింగ భేధం ‍ద్వారా వచ్చేది కాదని, మనల్ని మనం ఎలా ప్రదర్శించుకుంటున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. అంతేగాదు ఆశా భరత నాట్యం, కథక్‌లో మంచి ప్రావిణ్యం ఉన్న నర్తకుడు. 

ప్రస్తుతం ఆసా సోషల్‌ మీడియాలో ఒక డాన్స్‌ పేజీని ప్రారంభించి భారతీయ శాస్త్రీయ నృత్యానికి లింగభేదం లేదా సరిహద్దులు లేవని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే తానే యూకే నుంచి యూఎస్‌కి రావడంతోనే తన దృక్పథం మారిందని చెబుతున్నాడు. ఇక్కడకు వచ్చాక దేవాలయాలు, ఉత్సవాల బుకింగ్‌ల నుంచి ఆహ్వానాలు అందయాని ఆనందంగా చెబుతున్నాడు. 

కాగా, కథక్‌ని యూకేకి చెందిన అనురాధ చతుర్వేది శిష్యుడు సుజాతా బానర్జీ వద్ద శిక్షణ తీసుకున్నాడు . అలాగే భరతనాట్యం అనన్య ఛటర్జీ, తంగమణి కుట్టి, మార్సియా మాధవి మైల వద్ద నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన యూఎస్‌లో పీహెచ్‌ చేస్తున్నారు. సమాజపు మూస పద్ధతులను సవాలు  చేస్తూ తన కళతోటే నిశబ్దంగా మాట్లాడుతున్నాడు ఆశా విల్లోబీ.
 

(చదవండి: క్లౌడ్‌ కిచెన్‌తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement