తన ప్రాణాలకు ముప్పు లేదని తరచూ చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రత విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడరు. అలాంటిది ప్రాణభయంతో ప్రయాణిస్తున్న విమానాన్ని రహస్యంగా మార్చడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ విషయాలు ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సదస్సు కోసం జూలై 8న టర్కీలోని అంకారాకు వెళ్లారు. సదస్సు ముగించుకుని అమెరికాకు తిరుగు ప్రయాణంలో.. భద్రతా కారణాలతో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి రహస్యంగా మరో సైనిక విమానంలోకి మార్చారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనను.. ‘ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సెప్టెంబర్ 4(ఎల్లుండి) నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇందులో ఏం చూపించబోతున్నారు? ఇది ఎన్ని వివాదాలు.. అభ్యంతరాలకు దారి తీస్తుందో ? అనే ఆసక్తి నెలకొంది.
డీకాయ్ ప్లేన్ అంటే..
ట్రంప్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోనే ప్రయాణిస్తున్నారని బయటకు కనిపించేలా చేస్తూనే.. వాస్తవంగా ఆయనను మరో సైనిక విమానంలోకి తరలించడమే డీకాయ్ ప్లేన్. అసలు ట్రంప్ ఏ విమానంలో ఉన్నారో గుర్తించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలోనే అమెరికా భద్రతా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ముప్పును నిర్ధారించుకోకుండానే అమెరికా బలగాలు ఈ సీక్రెట్ జర్నీ ఆపరేషన్ నిర్వహించినట్లు తర్వాత తేలింది.

క్యాటరింగ్ ట్రక్కులో..
ఈ రహస్య ఆపరేషన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ట్రంప్ విమానం మారిన విధానం. ఒక విమానం నుంచి మరో సైనిక విమానానికి ఆయనను సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాలు తరలించే క్యాటరింగ్ ట్రక్కులో తీసుకెళ్లినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఈ రహస్య బదిలీ గురించి ట్రంప్ వెంట ఉన్న మీడియా ప్రతినిధుల్లో చాలామందికి కూడా సమాచారం లేదని కథనాలు పేర్కొన్నాయి.
కొందరు మాత్రమే వెంట..
ట్రంప్‌తో పాటు ఈ రహస్య బదిలీలో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. వైట్‌హౌస్ సిబ్బంది, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ తదితరులు ఆయనతో వెళ్లినట్లు కథనాలు తెలిపాయి. మరోవైపు అప్పటి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, స్టీఫెన్ మిల్లర్, అప్పటి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తదితరులు డీకాయ్‌గా ఉన్న విమానంలోనే కొనసాగారు.
బ్రిటన్‌లో మళ్లీ విమానం మార్పు?
టర్కీ నుంచి ట్రంప్ ప్రయాణించిన సైనిక విమానం బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ మిల్డెన్‌హాల్ స్థావరానికి చేరినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అక్కడ ఆయన మరోసారి విమానం మార్చి.. ఖతార్ నుంచి అందిన బోయింగ్ 747లో అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం.
ట్రంప్ ఏమన్నారు?
ఈ వ్యవహారం బయటకు రావడంతో ట్రంప్ విమానం ఎందుకు మార్చారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఊహాగానాలు వెల్లువెత్తాయి. అనంతరం ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. తనకు ఇలాంటి ముప్పు పొంచి ఉండడం సహజమేనని, భయపడే రకం తాను కాదని.. అయితే సీక్రెట్ సర్వీస్, మిలిటరీ అధికారులు సురక్షితమైన మార్గమని సూచించడంతో తాను వారి ఆదేశాలను పాటించినట్లు చెప్పారు. ట్రంప్ మాత్రమే కాదు గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు, ఆ మాటకొస్తే పలువురు ప్రపంచ అధినేతల కోసం ఇలాంటి సీక్రెట్ జర్నీలు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కథనం..
ఇప్పటివరకు వార్తలు, ఊహాగానాలకే పరిమితమైన ఈ రహస్య ప్రయాణం వెనుక కథను Instadocs: The Decoy Plane పేరిట నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఘటనను తొలిసారి రిపోర్ట్ చేసిన జర్నలిస్టులతో పాటు వైట్‌హౌస్, విమానయాన రంగానికి చెందినవారు, మాజీ సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో చేసిన ఇంటర్వ్యూలను ఇందులో చూపించనున్నారు. సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో.. ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’ మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదీ చదవండి: అమెరికా సైనికులొస్తున్నారు.. అలర్ట్
This July, while flying back from a NATO summit in Turkey, President Trump slipped off Air Force One in a catering truck and secretly boarded a different aircraft — leaving traveling reporters to fly on, unaware the president was no longer with them.
Instadocs: The Decoy Plane,… pic.twitter.com/iuADnXxMoV— Netflix (@netflix) September 1, 2026


