ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సుదీర్ఘ విరామం తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బీబీఎల్ 2026-27 సీజన్ కోసం అతడు అడిలైడ్ స్ట్రైకర్స్ (Adelaide Strikers)తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
7 న్యూస్ వెబ్ సైట్ ప్రకారం.. 500,000 ఆస్ట్రేలియా డాలర్ల (రూ. 3.9 కోట్లు) భారీ ధరకు అతడిని అడిలైడ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉండేందుకు అంగీకరించినట్లు సమాచారం.
స్టోక్స్ కోసం ఆడిలైడ్ కంటే ముందు చాలా ఫ్రాంచైజీలు పోటీపడినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అడిలైడ్ హెడ్‌కోచ్ టీమ్ పైన్ స్వయంగా రంగంలోకి దిగి స్టోక్స్‌తో డీల్ పూర్తి చేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. దీంతో బీబీఎల్ 2026-27 సీజన్‌లో అత్యధిక ధర దక్కించుకున్న విదేశీ ప్లేయర్‌గా స్టోక్స్ నిలిచాడు.
"బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున ఆడేందుకు ఆతృతగా ఎదరుచూస్తున్నాను. ఆస్ట్రేలియాలో ఆడటాన్ని నేను ఎక్కువగా అస్వాదిస్తాను" అని స్టోక్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. స్టోక్సీ బిగ్‌బాష్ లీగ్‌లో చివరగా 2015లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఇంగ్లండ్ వన్డే కప్‌లో స్టోక్స్ భాగమయ్యాడు.
12 ఏళ్ల తర్వాత డర్హమ్ తరఫున లిస్ట్-ఏ మ్యాచ్ ఆడిన స్టోక్స్.. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ స్టార్ ఆల్‌రౌండర్ ఆసీస్ గడ్డపై మెరుపులు మెరిపించేందుకు సిద్దమవుతున్నాడు. ఆసీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కారీ సారథ్యంలో స్టోక్స్ ఆడనున్నాడు.
చదవండి: ENG vs PAK: 'నీవొక డమ్మీ కెప్టెన్.. వెంటనే రాజీనామా చేయ్'


