breaking news
england
-
టీ20ల్లోనూ రూట్ హవా.. వరుస విధ్వంసాలతో హంగామా
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్, ఫాబ్ ఫోర్లో ముఖ్యుడు జో రూట్ గత కొన్నేళ్లుగా టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఫాబ్ ఫోర్లో మిగతా ముగ్గురు (కోహ్లి, స్మిత్, కేన్) సహా ఈతరం బ్యాటర్లలో ఎవ్వరూ ఈ మధ్యకాలంలో రూట్ జోరును అందుకోలేకపోతున్నారు. 2021 ముందు వరకు ఓ మోస్తరుగా సాగిన రూట్ కెరీర్.. ఆ ఏడాది నుంచి కట్టలు తెంచుకుంది.అప్పటివరకు 17 టెస్ట్ సెంచరీలు మాత్రమే చేసిన రూట్.. ఈ ఐదేళ్లలో ఏకంగా 22 శతకాలు బాదాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో మెజార్టీ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టెస్ట్‌ల్లో రూట్ ముందున్న ప్రధాన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు. ఈ రికార్డుకు రూట్ మరో 3000 పైచిలుకు పరుగుల దూరంలో ఉన్నాడు.టెస్ట్‌ల్లో హవా కొనసాగిస్తూనే రూట్ ఈ మధ్యకాలంలో వన్డేల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది రూట్ వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్పై అద్భుత శతకాలు బాదాడు. అప్పటివరకు వన్డేల్లో తన పని అయిపోయిందన్న వారికి రూట్ వరుస సెంచరీలతో సమాధానం చెప్పాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో సత్తా చాటుతున్నా రూట్ పొట్టి క్రికెట్‌కు పనికి రాడన్న అపవాదు మాత్రం నిన్నమొన్నటి వరకు ఉండింది.అయితే దీన్ని కూడా రూట్ అధిగమించడం మొదలుపెట్టాడు. ఇటీవలే భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉండిన రూట్.. అదే ఫామ్‌ను ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే జరుగుతున్న ద హండ్రెడ్ లీగ్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌ల్లో తేలిపోయిన రూట్.. ఆతర్వాత వరుస మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఇరగదీశాడు. ఆగస్ట్ 21న ఓవల్ ఇన్విన్సిబుల్స్పై 41 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 76 పరుగులు చేసిన రూట్.. తాజాగా వెల్ష్ ఫైర్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి తన జట్టును నాకౌట్‌కు కూడా చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూట్లోని భారీ హిట్టర్ కోణం బయటపడింది. సహజంగా గ్రౌండ్ స్ట్రోక్స్ మాత్రమే ఆడే రూట్.. ఈ మ్యాచ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. -
4 బంతుల్లో 32 పరుగులు.. చరిత్రలో చెత్త గణాంకాలు
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కుక్ హండ్రెడ్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ (సెట్) వేశాడు. ఈ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న కుక్.. ఇవాళ (ఆగస్ట్ 22) ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో 4 బంతుల్లో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు.66వ బంతికి 12 పరుగులిచ్చిన (5 వైడ్లు, మరో వైడ్, సిక్సర్) కుక్.. 67 బంతికి బౌండరీ.. 68 బంతికి రికార్డు స్థాయిలో 14 పరుగులు (సిక్సర్ ప్లస్ నో బాల్ (హండ్రెడ్ లీగ్‌లో నో బాల్‌కు 2 పరుగులు), సిక్సర్), 69వ బంతికి 2 పరుగులిచ్చాడు. 70వ బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. దీంతో కుక్ సెట్లో (ఓవర్) మొత్తం 32 పరుగులు వచ్చాయి. హండ్రెడ్ లీగ్‌లో 5 బంతులను ఓ సెట్‌గా పరిగణిస్తారు. ఈ లీగ్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన సెట్‌గా రికార్డుల్లోకెక్కింది.కుక్ చెత్త ప్రదర్శన కారణంగా అతని జట్టు ట్రెంట్ రాకెట్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. కుక్ బంతిని అందుకోకముందు ప్రత్యర్థి ఇన్విన్సిబుల్స్ 35 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉండింది. ఈ సెట్లో కుక్ స్వయంకృతాపరాథాలతో పాటు సామ్ కర్రన్ బ్యాట్ ఝులిపించడంతో సమీకరణలు ఒక్కసారిగా 30 బంతుల్లో 51 పరుగులకు మారాయి. సామ్ కర్రన్‌తో పాటు (24 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) జోర్డన్ కాక్స్ (32 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హుద్దగా చెలరేగి ఇన్విన్సిబుల్స్‌కు అద్భుత విజయాన్ని అందించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. జో రూట్ (41 బంతుల్లో 76; 11 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇన్విన్సిబుల్స్.. ఆదిలో నిదానంగా ఆడినా, ఆతర్వాత గేర్ మార్చి ఊహించని విజయం సాధించింది. కర్రన్, కాక్స్ విధ్వంసం ధాటికి ఆ జట్టు 89 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. -
వన్డే ప్రపంచకప్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
మహిళల వన్డే ప్రపంచకప్-2025కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ వ్యవహరించనుంది. ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్లో స్కైవర్-బ్రంట్ బ్రంట్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి.అదేవిధంగా తొడ కండరాల గాయం కారణంగా గత కొన్ని నెలలగా ఆటకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ హీథర్ నైట్ తిరిగి జట్టులోకి వచ్చింది. నైట్ తిరిగి రావడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారింది. ఉపఖండ పరిస్థితులకు తగ్గట్టు సెలక్టర్లు ఎక్కవగా స్పిన్ విభాగంపై దృష్టిసారించారు.దీంతో స్పిన్నర్ల కోటాలో గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లిన్సే స్మిత్‌లకు చోటు దక్కింది. కాగా ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక వేదికలగా జరగనుంది. ఇటీవల సిరీస్‌లలో నిరాశపరిచిన కేట్ క్రాస్, మైయా బౌచియర్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ అత్యంత అనుభవజ్ఞులైన బౌలర్లలో ఒకరిగా నిలిచిన క్రాస్.. గతేడాది నుంచి గాయాలు,పేలవ ఫామ్‌తో సతమతమవుతోంది. ఆమె స్ధానాన్ని యువ పేసర్ ఎమ్ ఆర్లోట్తో భర్తీ చేశారు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 3న బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఐదవ వన్డే ప్రపంచ కప్ టైటిలే లక్ష్యంగా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.మహిళల ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టు: ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్.చదవండి: సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్ -
రికార్డు హాఫ్ సెంచరీ.. తండ్రికి అంకితమిచ్చిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ ఇటీవల చనిపోయిన తన తండ్రి జాన్ బట్లర్‌కు ఓ అపూర్వ కానుక ఇచ్చాడు. హండ్రెడ్ లీగ్‌లో చేసిన రికార్డు హాఫ్ సెంచరీని తండ్రికి అంకితమిచ్చాడు. తండ్రి మరణం తీవ్రంగా కలచి వేస్తున్నప్పటికీ హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్న జోస్ (మాంచెస్టర్ ఒరిజినల్స్).. తాజాగా వెల్ష్ ఫైర్‌పై మెరుపు అర్ద సెంచరీ చేశాడు.ఈ ఫీట్ సాధించిన అనంతరం జోస్ తండ్రిని స్మరించుకుంటూ.. "నాన్నా, ఇది నీ కోసమే" అన్నట్లు బ్యాట్‌ను ఆకాశానికెత్తి చూపాడు. ఈ సీన్లు క్రికెట్ అభిమానులను కదలించాయి. బట్లర్ తన తండ్రిని ఎంత మిస్ అవుతాన్నాడో వ్యక్తపరిచాయి.కొద్ది రోజుల కిందటే జోస్ తన తండ్రి మరణ వార్తను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మాకు ప్రతిదీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తండ్రితో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు.అనంతరం ఆగస్టు 9న ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ సభ్యులంతా నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి జోస్ తండ్రి మృతికి నివాళులు అర్పించారు. అయితే ఆ మ్యాచ్‌లో జోస్ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు.రికార్డు హాఫ్ సెంచరీతాజాగా వెల్ష్ ఫైర్‌పై జోస్ చేసిన హాఫ్ సెంచరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డుపుటల్లోకెక్కింది. ఈ హాఫ్ సెంచరీ జోస్‌కు టీ20ల్లో 94వది. దీంతో జోస్ పొట్టి క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. వెల్ష్ ఫైర్‌తో మ్యాచ్‌లో జోస్ హాఫ్ సెంచరీతో మెరిసిరా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒరిజినల్స్ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. జోస్ రికార్డు హాఫ్ సెంచరీ వృధా అయిపోయింది. టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్: 113 అర్ద సెంచరీలు (418 ఇన్నింగ్స్)విరాట్ కోహ్లీ: 105 అర్ధ సెంచరీలు (397 ఇన్నింగ్స్)జోస్ బట్లర్: 94 అర్ధ సెంచరీలు (436 ఇన్నింగ్స్)బాబర్ అజామ్: 93 అర్ధ సెంచరీలు (309 ఇన్నింగ్స్)క్రిస్ గేల్: 88 అర్ధ సెంచరీలు (455 ఇన్నింగ్స్) -
తండ్రి మరణం.. స్టార్ క్రికెటర్ భావోద్వేగం
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ చేదు వార్తను బట్లర్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మాకు ప్రతిదీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తన నాన్నతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో బట్లర్ పోస్ట్ చేశాడు.అయితే జాన్ బట్లర్ మరణించి దాదాపు వారం రోజులు అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు తండ్రి మరణం బాధిస్తున్నప్పటికి ది హాండ్రడ్ లీగ్‌లో ఆడుతూ బట్లర్ క్రికెట్‌పై తనకు ఉన్న అంకిత భావాన్ని చాటుకున్నాడు. హాండ్రడ్ లీగ్-2025లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు జోస్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ టోర్నీలో భాగంగా ఆగస్టు 9న ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు మొత్తం నల్లటి ఆర్మ్ బ్యాండ్ ధరించి ఆయన మృతికి నివాళులు అర్పించారు. అయితే ఈ మ్యాచ్‌లో బట్లర్ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మాంచెస్టర్ ఒరిజినల్స్ పై ఓవల్ ఇన్విన్సిబుల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 128 పరుగులకు ఆలౌటైంది. మాంచెస్టర్ బ్యాటర్లలో కెప్టెన్ ఫిల్ సాల్ట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అనంతరం స్పల్య లక్ష్యాన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ 57 బంతుల్లోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి చేధించింది. ఓపెనర్లు విల్ జాక్స్ (61), టవాండా ముయేయే (59) హాఫ్ సెంచరీలతో మ్యాచ్ ఫినిష్ చేశారు.చదవండి: కొత్త కారు కొన్న రోహిత్ శర్మ.. ఎన్ని కోట్లంటే? -
చరిత్ర సృష్టించిన ఫిల్ సాల్డ్.. తొలి పురుష క్రికెటర్‌గా..!
ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. హండ్రెడ్ లీగ్ 1000 పరుగులు సాధించిన తొలి పురుష బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2025 ఎడిషన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్తో నిన్న (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సాల్ట్ (మాంచెస్టర్ ఒరిజినల్స్).. 32 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు.సాల్ట్ ఓ మోస్తరు స్కోర్‌తో రాణించినా ఈ మ్యాచ్‌లో అతని జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 100 బంతుల్లో 128కి ఆలౌటైన ఒరిజినల్స్.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇన్విన్సిబుల్స్ కేవలం 57 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. విల్ జాక్స్ (26 బంతుల్లో 61; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), తవండ ముయేయే (28 బంతుల్లో 59; 10 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఇన్విన్సిబుల్స్‌ను గెలిపించారు.చెలరేగిన రషీద్ ఖాన్ఈ మ్యాచ్‌లో ఇన్విన్సిబుల్స్ బౌలర్ రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. తన కోటా 20 బంతుల్లో కేవలం 19 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్‌తో పాటు ఇన్విన్సిబుల్స్ బౌలర్లు బెహ్రెన్‌డార్ఫ్, సాకిబ్ మహమూద్, సామ్ కర్రన్ కూడా రాణించారు. వీరంతా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు తలో 2 వికెట్లు తీశారు. -
‘నా జీవితంలో అత్యంత మధుర క్షణాలవి’
ఎనిమిదేళ్ల విరామం తర్వాత టెస్టు క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత బ్యాటర్ కరుణ్ నాయర్ తన ఇంగ్లండ్ పర్యటన మర్చిపోలేని విధంగా సాగిందని వ్యాఖ్యానించాడు. హెడింగ్లీలో తొలి టెస్టు మొదటి రోజు జాతీయ గీతం పాడుతున్నప్పుడు నేను సాధించగలిగాను అనే గర్వంతో భావోద్వేగానికి లోనయ్యానని అతను గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన నాయర్ 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 205 పరుగులు చేశాడు.అయితే చివరి టెస్టులో చేసిన అర్ధసెంచరీ భారత్ విజయానికి కీలకంగా మారింది. ‘ఓవల్ టెస్టులో అర్ధ సెంచరీని శతకంగా మలచలేకపోవడం కొంత నిరాశ కలిగించింది. అయితే టెస్టు తొలి రోజు కఠిన పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడగలిగాను. మొత్తంగా చూస్తే ఎత్తుపల్లాలతో నా సిరీస్ సాగింది. అయితే ఆ అంకం ముగిసింది. ఇకపై రాబోయే రోజుల్లో నాకు అవకాశం దక్కినప్పుడు భారీ స్కోర్లు సాధించగలనని నమ్ముతున్నా’ అని నాయర్ చెప్పాడు. త్వరలో జరిగే మహరాజా టి20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ తరఫున కరుణ్ నాయర్ బరిలోకి దిగనున్నాడు. -
ఇంగ్లండ్‌లో పాక్ క్రికెటర్ అరెస్ట్
పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఇంగ్లండ్‌లో అత్యాచార ఆరోపణల కేసు నమోదైంది. ఈ కేసులో అతన్ని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతను బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ కేసు విషయం తెలిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) హైదర్ అలీని సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది.ఓ యువతి ఫిర్యాదు మేరకు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు హైదర్ అలీని ఈ నెల 3వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను పాకిస్తాన్-ఏ (షాహీన్స్) తరఫున బెకెన్హెయిమ్‌లో ఇంగ్లండ్-ఏ జట్టుతో వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. గత ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందని పీసీబీ ప్రకటించింది.పోలీసుల ప్రాథమిక విచారణ సందర్భంగా హైదర్ అలీ కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తాను నిర్దోషినంటూ వాదించినట్లు సమాచారం. 24 ఏళ్ల హైదర్ అలీ పాక్ జాతీయ జట్టు తరఫున ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అతను పాక్ తరఫున 35 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 547 పరుగులు చేశాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన హైదర్ అలీ 2020లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు.కాగా, పాక్ క్రికెటర్లకు ఇంగ్లండ్‌లో వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ లైంగిక వేధింపులు సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైదర్ అలీ విషయంలో పాక్ క్రికెట్ పైకి హుందాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ, లోలోపల తమ దేశ క్రికెటర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హైదర్‌కు కావాల్సిన లీగల్ సపోర్ట్‌కు పీసీబీనే సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే, పాక్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో పాక్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 8) ఆ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఆడనుంది. -
‘బుమ్రా లేకుండా గెలవడం యాదృచ్ఛికమే
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా అనుకున్నట్లుగా మూడు మ్యాచ్‌లే ఆడాడు. అయితే అతను బరిలోకి దిగని బర్మింగ్‌హామ్, ఓవల్ టెస్టులలోనే టీమిండియా గెలిచింది. దాంతో బుమ్రా లేకపోయినా పెద్దగా తేడా రాదని, అతను లేకపోయినా మ్యాచ్‌లు గెలవగలమని కొన్ని విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అసాధారణ బౌలర్ అయిన బుమ్రా గురించి తప్పుగా మాట్లాడవద్దంటూ అండగా నిలిచాడు. ‘బుమ్రా సిరీస్‌ను చాలా బాగా మొదలు పెట్టాడు. ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా... తొలి టెస్టులో ఒకసారి, మూడో టెస్టులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ప్రజలు వేరే అంశాలు ముందుకు తెచ్చి అతను లేని టెస్టుల్లో భారత్ గెలిచిందంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ నా అభిప్రాయ ప్రకారం అది యాదృచ్ఛికం మాత్రమే. బుమ్రా ఒక అసాధారణ బౌలర్. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలా కాలంగా నిలకడగా రాణించాడు. నా దృష్టిలో నిస్సందేహంగా అందరికంటే అతను అగ్ర స్థానంలో ఉంటాడు’ అని సచిన్ కితాబిచ్చాడు. మాంచెస్టర్ టెస్టులో స్టోక్స్ ‘షేక్ హ్యాండ్’కు నిరాకరించి జడేజా, సుందర్ ఆటను కొనసాగించడంలో ఎలాంటి తప్పూ లేదని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘డ్రా’కు అంగీకరించాలని ఇంగ్లండ్ కోరడంలో అర్థం లేదన్న సచిన్... భారత బ్యాటర్లు స్పందించిన తీరుతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని అన్నాడు. -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడాన్ కార్స్ ది హాండ్రెడ్ లీగ్-2025 నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ఏడాది సీజన్లో కార్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ అతడు ప్రస్తుతం పాదం, బొటనవేలు గాయంతో బాధపడుతున్నాడు.కార్స్ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగమయ్యాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా ఈ స్పీడ్ స్టార్ రాణించాడు. అయితే గాయం కారణంగా కీలకమైన ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు వైద్యల సలహా మెరకు హాండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని కార్స్ ధ్రువీకరించాడు."భారత్‌తో జరిగిన సుదీర్ఘ టెస్టు సిరీస్ అనంతరం వైద్య సిబ్బందితో నా గాయం గురించి సంప్రదింపులు జరిపాను. వైద్యుల సూచన మేరకు ఈ ఏడాది ది హండ్రెడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీకి నేను దూరంగా ఉన్నప్పటికి నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను.భవిష్యత్తులో ఈ జట్టుకు మళ్లీ ప్రాతినిధ్యం వహించడానికి ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో కార్స్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు కూడా కార్స్ దూరమయ్యే అవకాశముంది. అతడు తిరిగి మళ్లీ యాషెస్ సిరీస్‌లో ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే? -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హాండ్రడ్ లీగ్-2025ను అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ ఖాన్.. మంగళవారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తాచాటాడు.తన 20 బంతుల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో 650 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ చరిత్ర సృష్టించాడు. రషీద్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 478 ఇన్నింగ్స్‌లలో 18.54 సగటుతో 651 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట నాలుగు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. 26 ఏళ్ల రషీద్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడుతుంటాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ ఐపీఎల్-2025లో మాత్రం ఈ అఫ్గానీ దారుణంగా విఫలమయ్యాడు. 15 మ్యాచ్‌లు ఆడి కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లండన్ స్పిరిట్‌పై 6 వికెట్ల తేడాతో ఇన్విన్సిబుల్స్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. ఇన్విన్సిబుల్స్ బౌలర్లు రషీద్ ఖాన్, సామ్ కర్రన్ (19-10-18-3), జోర్డన్ క్లార్క్ (10-6-8-2) చెలరేగడంతో 80 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇన్విన్సిబుల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.చదవండి: Mohammad Siraj: సిరాజ్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా? -
‘పని భారం’ను పక్కన పెట్టాల్సిందే!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఒక కీలక అంశం భారత క్రికెట్లో చర్చకు వచ్చింది. గత కొంత కాలంగా బీసీసీఐ ప్రధాన ఆటగాళ్లకు ‘పనిభారం’ ఎక్కువగా ఉంటుందని, వారికి మ్యాచ్‌లు, సిరీస్‌ల మధ్యలో తగినంత ‘విశ్రాంతి’ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో మూడు టెస్టులే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ముందే ప్రకటించింది. చివరకు అదే జరిగింది. అయితే తొలి టెస్టు తర్వాత వారం రోజుల విరామం వచ్చినా బుమ్రా రెండో టెస్టు ఆడకపోవడం, కీలకమైన, సిరీస్‌ను సమం చేయాల్సిన చివరి టెస్టుకు కూడా అతను దూరం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు ఎలాంటి విరామం లేకుండా పూర్తి ఫిట్నెస్తో మొహమ్మద్ సిరాజ్ ఐదు టెస్టులూ ఆడి వేయికి పైగా బంతులు వేయడం ఈ అంశాన్ని మరింతగా చర్చించేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇకపై ‘పనిభారం’ పేరుతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కాకుండా నిబంధనలు విధించాలని బోర్డు యోచిస్తోంది. దీంతో పాటు కొందరు క్రికెటర్లు ప్రత్యేక హోదాను ప్రదర్శిస్తూ తమకు నచ్చిన మ్యాచ్‌లు ఎంచుకుంటూ మిగతా కొన్ని మ్యాచ్‌ల నుంచి వేర్వేరు కారణాలతో తప్పుకుంటున్నారు. దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టే ప్రతిపాదన ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.‘సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరికీ ఈ సమాచారం అందిస్తాం. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఆడే ప్లేయర్లు ఇకపై తమ ఇష్టానుసారం మ్యాచ్‌లను ఎంపిక చేసుకునే వీలుండదు’ అని ఆయన అన్నారు. ‘పనిభారం’ అంటూ ఆటగాళ్లను మ్యాచ్‌లకు దూరం పెట్టే విషయంపై కూడా సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘పేస్ బౌలర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. ఈ విషయంలో వైద్యబృందం సలహాలతోనే ముందుకు వెళతాం. అయితే పనిభారం పేరుతో కీలక మ్యాచ్‌లకు దూరం కావడం మాత్రం జరగదు. ఆటకంటే ఆటగాళ్లు ఎక్కువ కాదని సందేశం అందరికీ వెళ్లాలి’ అని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు... మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ‘పనిభారం’ విషయంలో ఘాటుగా స్పందించారు. ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు గాయం, నొప్పిలాంటివాటిని మర్చిపోవాలి. సరిహద్దుల్లో చలి ఎక్కువగా ఉందని సైనికులు ఫిర్యాదు చేస్తున్నారా. పంత్ ఫ్రాక్చర్‌తో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి తత్వం ఆటగాళ్ళలో ఉండాలి. కోట్లాది మంది భారతీయులకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.సిరాజ్ ఐదు టెస్టుల్లోనూ కెప్టెన్ అడిగిన ప్రతీసారి 7–8 ఓవర్ల స్పెల్‌లు బౌలింగ్ చేశాడు. అసలు ‘పనిభారం’ అనే చర్చనే అతను తీసిపడేశాడు. నేను చాలా కాలంగా చెబుతున్నా. ఈ పదాన్ని భారత క్రికెట్ డిక్షనరీ నుంచి పూర్తిగా తొలగించాలి’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.సిరీస్ విజయంతో స్వదేశానికి... న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఓవల్‌లో చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు ప్రత్యేకంగా ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. సుదీర్ఘ సిరీస్ ముగిసిన వెంటనే జట్టును వీడేందుకు సిద్ధమయ్యారు. కొందరు విశ్రాంతి కోసం ఇంగ్లండ్‌లోనే ఆగిపోయేందుకు సిద్ధపడగా...మరికొందరు సాధ్యమైనంత తొందరగా అందుబాటులో ఉన్న ఫ్లయిట్ ద్వారా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. మ్యాచ్ ముగిశాక లండన్ వీధుల్లో సహచరుడు కుల్దీప్తో కలిసి సరదాగా తిరిగిన అనంతరం అర్ష్ దీప్ స్వదేశానికి బయల్దేరాడు. అతనితో పాటు సిరాజ్, శార్దుల్ కూడా భారత్‌కు చేరుకున్నారు. -
IND Vs ENG: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం
-
చిరస్మరణీయ విజయం.. ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టిన టీమిండియా
ఓవల్ టెస్ట్ విజయానంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మూడో ప్లేస్‌లో ఉండింది.ఈ మ్యాచ్ విజయానంతరం భారత్ విజయాల శాతం 46.67గా ఉండగా.. ఇంగ్లండ్ విన్నింగ్ పర్సంటేజ్ 43.33కు పడిపోయింది. ఆస్ట్రేలియా (100), శ్రీలంక (66.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16.67 విజయాల శాతంతో బంగ్లాదేశ్ ఐదో ప్లేస్‌లో ఉంది. వెస్టిండీస్ ఈ సైకిల్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఆరో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఈ సైకిల్లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టు 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. 1, 3 టెస్ట్ మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. డబ్ల్యూటీసీలో భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ వెస్టిండీస్‌తో ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ భారత్ వేదికగా ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్‌లో, రెండో టెస్ట్ (అక్టోబర్ 10 నుంచి) ఢిల్లీలో జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఓవల్ టెస్ట్‌లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్ మ్యాజిక్ చేసి ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ENG Vs IND: వాట్ ఏ స్పెల్.. సిరాజ్ మియ్యా.. దర్శకధీరుడు ఫిదా!
టీమిండియా చివరి టెస్ట్‌లో విజయం సాధించడంపై దర్శకధీరుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. వాట్ ఏ స్పెల్ సిరాజ్ మియా అంటూ మహమ్మద్ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రసిధ్ కృష్ణను సైతం కొనియాడారు. ఓవల్‌లో టీమిండియా తిరిగి పుంజుకుని అద్భుతంగా పోరాడిందని ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్రికెట్‌కు మరేది సాటిరాదని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో మనోళ్లు విజయకేతనం ఎగరేశారు. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రసిధ్ కృష్ణ సైతం నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేశ్ బాబు మూవీతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.SIRAJ MIYAA… 🔥What a spell!!!Prasidh’s double blow!!!India fights back at The Oval!!!Test cricket… nothing comes close. 🥰🥰Team India 🇮🇳🫡— rajamouli ss (@ssrajamouli) August 4, 2025 -
England Vs India: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం
-
ENG Vs IND: క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగిన వోక్స్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఎంట్రీకి వేదికైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లండ్ గెలుపుకు 18 పరుగులు అవసరమైన దశలో వోక్స్ 11వ నంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్‌ను తలపించింది.వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రయిక్ రొటేట్ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్ చేతిలో 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.ఇదే సిరీస్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకున్నాడు. 1984లో విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్ కూడా వోక్స్ తరహాలోనే ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మార్షల్ ఒంటిచేత్తో బౌండరీ బాదిన సన్నివేశాన్ని క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు.Arm in a sling, Chris Woakes has arrived to the crease 😱 pic.twitter.com/D4QDscnfXE— Sky Sports Cricket (@SkyCricket) August 4, 2025మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ వీరోచితంగా పోరాడినప్పటికీ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్బుతమైన శతకాలతో గెలుపుకు గట్టి పునాది వేసినా చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. టీమిండియా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా సిరాజ్ చివరి రోజు సింహంలా గర్జించి ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సిరాజ్ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. అతనికి ప్రసిద్ద్ కృష్ణ (27-3-126-4), ఆకాశ్‌దీప్ (20-4-85-1) సహకరించాడు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్‌లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్‌ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. -
IND VS ENG: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్‌ల టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఈ సిరీస్‌లో ఏళ్ల నాటి రికార్డులు తిరగరాయబడ్డాయి. కొన్ని విభాగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పబడ్డాయి. ఐదో టెస్ట్‌లో రికార్డుల పరంపర తారాస్థాయికి చేరింది.ఈ మ్యాచ్ నాలుగో రోజు సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఈ సిరీస్‌లో ఏకంగా 9 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సిరీస్‌లోనూ ఇంత మంది 400 ప్లస్ పరుగులు చేయలేదు.ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 754 పరుగులు చేశాడు. గిల్ తర్వాత జో రూట్ (537), కేఎల్ రాహుల్ (532), రవీంద్ర జడేజా (516), హ్యారీ బ్రూక్ (481), రిషబ్ పంత్ (479), బెన్ డకెట్ (462), జేమీ స్మిత్ (434), యశస్వి జైస్వాల్ (411) 400 ప్లస్ పరుగులు చేశారు.గతంలో ఇలా..!వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 1975-76 సిరీస్‌లో ఇరు జట్లకు చెందిన 8 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. ఆతర్వాత 1993 యాషెస్ సిరీస్‌లోనూ ఇదే ఫీట్ రిపైటైంది. అయితే 9 మంది 400 ప్లస్ పరుగులు నమోదు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.భారత క్రికెట్ చరిత్రలోనూ ఇదే మొదటిసారిఈ సిరీస్‌లో ఏకంగా ముగ్గురు భారత బ్యాటర్లు (గిల్, రాహుల్, జడేజా) 500 ప్లస్ పరుగులు చేయడం మరో విశేషం. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఫీట్ నమోదు కాలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. 1, 3 టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్ గెలిచింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. స్కోర్ వివరాలు..భారత్ 224 & 396ఇంగ్లండ్ 247 & 339/6 (76.2) -
ENG VS IND 5th Test: ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.అంత ఈజీ కాదుఐదో రోజు ఇంగ్లండ్ ఛేదించాల్సిన లక్ష్యం 35 పరుగులే అయినప్పటికీ ఇది అంత ఈజీ కాదు. 22 బంతుల తర్వాత భారత బౌలర్ల చేతికి కొత్త బంతి వస్తుంది. కొత్త బంతితో భారత బౌలర్లను ఎదుర్కోవడం ఇంగ్లండ్ టెయిలెండర్లకు కత్తి మీద సామే అవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వికెట్ సమర్పించుకోక తప్పదు.ఇలాంటి పరిస్థితుల్లో భారత పేసర్లు సర్వశక్తులు ఒడ్డి వికెట్ల కోసం ప్రయత్నిస్తారు. నాలుగో రోజు చివర్లోనే సిరాజ్, ప్రసిద్ద్ లయను అందుకున్నారు. ఐదో రోజు ఆరంభంలోనే వికెట్ పడితే ఇంగ్లండ్‌పై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. క్రీజ్‌లో ఉన్న ఆటగాళ్లలో జేమీ స్మిత్‌ను తప్పిస్తే ఆట భారత్‌వైపుకు మళ్లే అవకాశం లేకపోలేదు.ఇంగ్లండ్‌కు శుభవార్తఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త వినిపించింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ అవసరమైతే బ్యాటింగ్‌కు వస్తాడని జో రూట్ తెలిపాడు. వోక్స్‌కు ఎడమ భుజం మిస్ లొకేట్ అయినప్పటికీ జట్టు కోసం గాయాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్‌కు వస్తాడని రూట్ స్పష్టం చేశాడు. అయినా, మ్యాచ్ అంతవరకు (వోక్స్ బ్యాటింగ్ చేసేంత వరకు) వస్తుందని అనుకోవట్లేదని రూట్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఈ సిరీస్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా గాయాన్ని (విరిగిన పాదం) లెక్క చేయకుండా బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే.బ్రూక్, రూట్ సెంచరీలు భారీ లక్ష్య ఛేదనలో బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలు చేసి ఇంగ్లండ్‌ను గెలుపుతీరాల వరకు తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో ఇంగ్లండ్ డిఫెన్స్‌లో పడింది. 36 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ బ్రూక్, రూట్‌తో పాటు జేకబ్ బేతెల్ వికెట్ కూడా కోల్పోయి తడబాటుకు లోనైంది. జైస్వాల్ సూపర్ శతకంఅంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
India vs England: ఆఖరి పంచ్ ఎవరిది..?
-
India vs England: ఇంకా ఉంది!
ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్ 3–1 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్‌కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది. లండన్: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడంతో ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’ సిరీస్ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్‌కు ఒక వికెట్ దక్కింది. ‘టాప్’ లేపడంతో ఉత్సాహం తొలి సెషన్ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓవర్‌నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన డకెట్ (54, 6 ఫోరు), కెప్టెన్ ఒలీ పోప్ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్‌నైట్ బ్యాటర్ డకెట్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్ చక్కని డెలివరీతో కెపె్టన్ పోప్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్లోనే బ్రూక్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్ 164/3 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. బ్రూక్, రూట్ శతకాలు నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి సెషన్లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్‌తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్ భారత్ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్లో రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్ (5), రూట్ అవుటవడంతోనే డ్రామా మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 54; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసి«ద్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్‌దీప్ 111; బెథెల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 5; స్మిత్ బ్యాటింగ్ 2; ఓవర్టన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–4–85–1, ప్రసి«ద్‌కృష్ణ 22.2–3–109–3, సిరాజ్ 26–5–95–2, సుందర్ 4–0–19–0, జడేజా 4–0–22–0. -
ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వెలుతురులేమి వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఆతర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌ల్లో సేద తీరుతున్నారు.ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5() ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు, భారత గెలుపుకు 4 వికెట్లు కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
శతక్కొట్టిన బ్రూక్.. సెంచరీకి చేరువలో రూట్.. గెలుపు దిశగా ఇంగ్లండ్
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. 374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నాలుగో రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్ గెలుపుకు గట్టి పునాది వేయగా.. రూట్ (98 నాటౌట్) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. రూట్‌కు జతగా జేకబ్ బేతెల్ (1) క్రీజ్‌లో ఉన్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111) ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 5 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ల భారత్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది (1-3లో).అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఏకంగా 50 అర్ద సెంచరీలు బాదారు. టెస్ట్ క్రికెట్ ఆరంభం నుంచి ఓ సిరీస్‌లో అత్యధిక హాఫ్ సెంచరీల సంఖ్య ఇదే. 1993 యాషెస్ సిరీస్‌లోనూ ఇన్నే హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసింది. ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చేసిన హాఫ్ సెంచరీ ఈ సిరీస్‌లో 50వది.టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వ్యక్తిగత 50+ స్కోర్లు50* - ఇంగ్లండ్‌లో టీమిండియా, 202550 - ది యాషెస్, 199349 - ది యాషెస్, 1920/2146 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్, 1960/6146 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ 1968/69మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. నాలుగో రోజు రెండో సెషన్ డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి ఇంకా 128 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఆ జట్టు స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 246/3గా ఉంది.క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
ది ఓవల్ టెస్ట్ లో ముగిసిన మూడో రోజు ఆట
-
చిలకపచ్చ పావురం..!
పావురాలు ఎక్కువగా కాసింత నీలిఛాయ కలగలసిన బూడిద రంగులో ఉంటాయి. తెల్ల పావురాలు కూడా సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని పావురాలు గోధుమరంగులో ఉంటాయి. ఇంకొన్ని ఇవన్నీ కలగలసిన రంగుల్లో ఉంటాయి. వీటికి భిన్నంగా చిలకపచ్చ రంగులో ఉన్న పావురం ఒకటి ఇటీవల ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్ పట్టణంలో కనిపించి, స్థానికులను అబ్బురపరచింది. ఈ అరుదైన పావురాన్ని చూడగానే కొందరు ఔత్సాహికులు దీనిని తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. కొద్ది వారాలుగా ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ వీథుల్లో మిగిలిన పావురాల గుంపుతో కలసి చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కువగా నార్తాంప్టన్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆల్ సెయింట్స్ చర్చ్ ప్రాంగణంలోను, ఆ పరిసరాల్లోని వీథుల్లో ఉన్న ఇళ్ల వద్ద కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు దీని వీడియోలను ‘టిక్‌టాక్’లో పోస్ట్ చేస్తే, అవి వైరల్‌గా మారాయి. మొదటిసారిగా ఈ పావురాన్ని తన ఇంటి ముందున్న తోటలో జూన్ 28న చూసినట్లు రాబిన్ హింక్మాట్ అనే స్థానికులు చెప్పారు. ఆయన దీని ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు స్థానికులు కూడా దీని ఫొటోలు, వీడియోలు తీసి ఆన్లైన్లో పెట్టారు. మొత్తానికి ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. (చదవండి: ప్రాణం తీసిన ఫ్లాస్కు) -
IND vs ENG: 9 తీస్తారా... సిరీస్‌ను వదిలేస్తారా?
ఆఖరి పోరులో గెలవాలన్నా... సిరీస్‌ను సమం చేయాలన్నా... ఇప్పుడు భారత్ భారమంతా బౌలర్లమీదే ఉంది. బ్యాట్ పట్టి అర్ధశతకాలతో రెండో ఇన్నింగ్స్‌లో నిలబెట్టిన బౌలర్లే... ఇప్పుడు 9 వికెట్లు తీస్తే 2–2తో ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ సిరీస్‌ను సమం చేసిన గర్వంతో భారత్ స్వదేశానికి బయల్దేరుతుంది. ఇదే జరిగితే టీమిండియా టెస్టుల భవిష్యత్తుకు ఇక ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ ఫార్మాట్ నుంచి స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తప్పుకోవడంతో డీలాపడిన టెస్టు జట్టుకు నూతనోత్సాహాన్ని ఇంగ్లండ్ పర్యటన ఇచ్చినట్లు అవుతుంది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 324 పరుగులు చేయాలి. భారత్ నెగ్గాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి. మొత్తానికి సిరీస్‌లోని చివరి టెస్టులోనూ ఫలితం రావడం ఖాయమైంది. లండన్: కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్, కరుణ్ నాయర్... వీళ్లంతా స్పెషలిస్టు బ్యాటర్లు. కానీ కీలకమైన చివరి టెస్టులో బ్యాట్లెత్తారు. పేసర్ ఆకాశ్‌దీప్ సహా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు ప్రధానంగా బౌలర్లు. బౌలింగ్ ఆల్‌రౌండర్లు అయినా భారత బ్యాటింగ్ భారాన్ని మోశారు. ప్రధాన బ్యాటింగ్ బలగమే కనీసం 20 పరుగులైనా చేయలేకపోయిన చోటు ఈ ముగ్గురు అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... ఆకాశ్‌దీప్, జడేజా, సుందర్ తమ విలువైన అర్ధశతకాలతో ఈ టెస్టులో పోరాడే స్కోరును జత చేశారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 396 పరుగులు చేసింది. ఆకాశ్‌దీప్ (66; 12 ఫోర్లు), జడేజా (53; 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు, అట్కిన్సన్ 3 వికెట్లు, ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట నిలిచే ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రాలీ (14)ని సిరాజ్ బౌల్డ్ చేయగా, డకెట్ (34 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఊహించని ఫిఫ్టీ... ఓవర్‌నైట్ స్కోరు 75/2 శనివారం మూడో రోజు ఆట రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు, ఓపెనర్ జైస్వాల్‌కు ఆకాశ్‌దీప్ కొండంత అండగా నిలిచాడు. ‘నైట్ వాచ్‌మన్’గా వచ్చిన ఆకాశ్‌దీప్ ఊహించని విధంగా ఆతిథ్య బౌలర్లను ఎదుర్కొన్నాడు. తొలిసెషన్లో తేలిగ్గానే అతని వికెట్‌ను దక్కించుకుందామనుకున్న ప్రధాన పేసర్లు అట్కిన్సన్, టంగ్‌లకు కొరకరాని కొయ్యగా మారాడు. మరోవైపు జైస్వాల్ కూడా అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డును కదిలించాడు. మూడో వికెట్‌కు 100 పరుగులు జతయ్యాక 70 బంతుల్లో ఆకాశ్‌దీప్ టెస్టుల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతే జట్టు స్కోరు 177 వద్ద వెనుదిరిగాడు. జైస్వాల్ ‘శత’క్కొట్టినా... రెండో సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు ప్రభావం చూపెట్టారు. గిల్ (11), కరుణ్ నాయర్ (17)లను అట్కిన్సన్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో జైస్వాల్ ... జడేజా అండతో పరుగులు చక్కబెట్టాడు. ఈ క్రమంలో జైస్వాల్ టెస్టుల్లో ఆరో సెంచరీని 127 బంతుల్లో పూర్తిచేసుకున్నాడు. భాగస్వామ్యం బలపడుతుండగానే టంగ్... జైస్వాల్ వికెట్ తీసి దెబ్బకొట్టాడు. ధ్రువ్ జురేల్ (34; 4 ఫోర్లు)తో కలిసి జడేజా జట్టు స్కోరును 300 దాటించాడు. 304/6 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. ఆఖరి సెషన్ మొదలైన కొద్దిసేపటి తర్వాత జురేల్ అవుటవ్వగా... జడేజా, సుందర్ టీమిండియాను నడిపించారు. జడేజా 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే వికెట్‌ను సమరి్పంచుకోగా, సుందర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో మెరుపు ఫిఫ్టీని సాధించి స్కోరు పెంచే క్రమంలో అవుట్‌కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఓవర్టన్ (బి) టంగ్ 118; రాహుల్ (సి) రూట్ (బి) టంగ్ 7; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; ఆకాశ్‌దీప్ (సి) అట్కిన్సన్ (బి) ఓవర్టన్ 66; శుబ్‌మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; నాయర్ (సి) స్మిత్ (బి) అట్కిన్సన్ 17; జడేజా (సి) బ్రూక్ (బి) టంగ్ 53; ధ్రువ్ జురేల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఓవర్టన్ 34; సుందర్ (సి) క్రాలీ (బి) టంగ్ 53; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్ 0; ప్రసిధ్‌కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (88 ఓవర్లలో ఆలౌట్) 396. వికెట్ల పతనం: 1–46, 2–70, 3–177, 4–189, 5–229, 6–273, 7–323, 8–357, 9–357, 10–396. బౌలింగ్: అట్కిన్సన్ 27–3–127–3, టంగ్ 30–4–125–5, ఓవర్టన్ 22–2–98–2, బెథెల్ 4–0–13–0, రూట్ 5–1–15–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (బ్యాటింగ్) 34; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 50. వికెట్ల పతనం: 1–50. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 5–1–15–0, ప్రసిధ్ 5–1–23–0, సిరాజ్ 3.5–0–11–1. -
ఓవల్ టెస్ట్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడు
-
గ్రాహం థోర్ప్‌కు నివాళిగా...
మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ స్మరణార్ధం ఇంగ్లండ్ ఆటగాళ్లు ‘ఎ డే ఫర్ థోర్పీ’ పేరుతో నివాళి అర్పించారు. ఆటగాడిగా ఉన్నప్పుడు తలకు హెడ్‌బ్యాండ్ ధరించి బ్యాటింగ్‌కు వచ్చే థోర్ప్‌ను గుర్తు చేసుకుంటూ...ఇంగ్లండ్ క్రికెటర్లు మ్యాచ్ రెండో రోజు అదే తరహా తెలుపు హెడ్బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. థోర్ప్ సొంత మైదానమైన ఓవల్ గ్రౌండ్‌లోనే టెస్టు జరుగుతున్న నేపథ్యంలో అతని భార్య, కూతురు ఆటకు ముందు గంట మోగించారు.మ్యాచ్ సందర్భంగా ప్రత్యేకంగా నిధుల సేకరణ కూడా జరిగింది. శుక్రవారం థోర్ప్ పుట్టిన రోజు కాగా...ఏడాది క్రితం 55 ఏళ్ల వయసులో అతను చనిపోయాడు. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన థోర్ప్ 44.66 సగటుతో 6744 పరగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 82 వన్డేల్లో 37.18 సగటుతో 2380 పరుగులు సాధించాడు. -
ENG VS IND 5th Test: ఆటను శాసించిన బౌలర్లు
లండన్: అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు రసకందాయంగా జరుగుతోంది. రెండో రోజును ఇరు జట్ల బౌలర్లు శాసించారు. దీంతో ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్ ఇలా మొదలవగానే అలా 224 పరుగుల వద్ద ముగిసింది. మరోవైపు జోరుగా మొదలైన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ అంతే జోరుగా కుప్పకూలింది. 92 పరుగుల వరకు వికెట్ కోల్పోని ఆతిథ్య జట్టు 247 పరుగులకే ఆలౌటైంది. కేవలం 23 పరుగుల ఆధిక్యమే లభించగా... అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రాహుల్ (7), సాయి సుదర్శన్ (11) వెనుదిరగ్గా... యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 51 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి అజేయ అర్ధ శతకంతో నిలిచాడు. జైస్వాల్‌తో ఆకాశ్‌దీప్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జైస్వాల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేయడం కలిసొచ్చింది. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. 34 బంతుల్లోనే ముగిసె... రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే భారత్ ఆలౌటైంది. 204/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మిగిలిన నాలుగు వికెట్లను తొలి అర గంటలోనే కోల్పోయింది. మూడో ఓవర్లోనే ఓవర్‌నైట్ స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను (109 బంతుల్లో 57; 8 ఫోర్లు) టంగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 218 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. ఆ తర్వాత 6 పరుగుల వ్యవధిలోనే అట్కిన్సన్... వాషింగ్టన్ సుందర్ (55 బంతుల్లో 26; 3 ఫోర్లు), సిరాజ్ (0), ప్రసిధ్ కృష్ణ (0) వికెట్లను పడగొట్టాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 224 వద్ద ముగిసింది. రెండో రోజు భారత్ కేవలం 20 పరుగులే చేయగలిగింది. అట్కిన్సన్కు ఐదు వికెట్లు దక్కాయి. ఓపెనింగ్ జోరులో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా మొదలైంది. క్రాలీ, డకెట్ పేసర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. సిరాజ్ మూడో ఓవర్లో క్రాలీ 2 ఫోర్లు కొడితే... ఆకాశ్‌దీప్ ఓవర్లో డకెట్ మూడు ఫోర్లు బాదాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఇలా ఎవరిని విడిచిపెట్టకుండా యథేచ్చగా ఆడేశారు. బౌండరీలు, సిక్స్‌లతో వన్డేను తలపించే ‘పవర్ ప్లే’లా సాగిన ఓపెనింగ్ జోరుతో ఇంగ్లండ్ 12 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది. ఈ దూకుడుకు మరుసటి ఓవర్లో డకెట్ (38 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను అవుట్ చేయడం ద్వారా ఆకాశ్‌దీప్ బ్రేకులేశాడు. 15వ ఓవర్లో ఇంగ్లండ్ వందకు చేరగా, క్రాలీ 42 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 109/1 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్లో బౌలర్ల హవా ఆ తర్వాత కూడా బజ్‌బాల్ ఆట ఆడిన క్రాలీని ప్రసి«ద్‌కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ఇక్కడి నుంచి బౌలింగ్ ప్రతాపం మొదలైంది. సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విలువైన వికెట్లను పడేశాడు. పోప్ (22; 4 ఫోర్లు), జో రూట్ (29; 6 ఫోర్లు), బెథెల్ (6)లను వరుస విరామాల్లో సిరాజ్ అవుట్ చేయడంతో 196 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 200 దాటాక స్మిత్ (8), ఓవర్టన్ (0)లను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. 215/7 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. టెయిలెండర్ల అండతో 57 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన బ్రూక్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. తొలి రోజు ఫీల్డింగ్‌లో భుజానికి గాయమైన వోక్స్ ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో 9 వికెట్లకే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.జట్టునుంచి బుమ్రా విడుదలఐదో టెస్టుకు దూరమైన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ జట్టు నుంచి విడుదల చేసింది. దీని వల్ల అతను ఈ టెస్టు జరిగే సమయంలో టీమ్‌తో పాటు ఉండాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో ముందుగా అనుకున్నట్లుగానే 3 టెస్టులే ఆడిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చే నెలలో భారత్ ఆసియా కప్ టి20 టోర్నీ ఆడనుంది. బుమ్రా ఇందులో ఆడతాడా లేదా అనే విషయంపై సెలక్టర్లు తర్వాత నిర్ణయం తీసుకుంటారు.స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 2; రాహుల్ (బి) వోక్స్ 14; సుదర్శన్ (సి) స్మిత్ (బి) టంగ్ 38; గిల్ రనౌట్ 21; కరుణ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్ 57; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 9; జురేల్ (సి) బ్రూక్ (బి) అట్కిన్సన్ 19; సుందర్ (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 26; ఆకాశ్‌దీప్ నాటౌట్ 0; సిరాజ్ (బి) అట్కిన్సన్ 0; ప్రసి«ద్‌కృష్ణ (సి) స్మిత్ (బి) అట్కిన్సన్ 0; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 224. వికెట్ల పతనం: 1–10, 2–38, 3–83, 4–101, 5–123, 6–153, 7–218, 8–220, 9–224, 10–224. బౌలింగ్: వోక్స్ 14–1–46–1, అట్కిన్సన్ 21.4–8–33–5, టంగ్ 16–4–57–3, ఓవర్టన్ 16–0–66–0, బెథెల్ 2–1–4–0. ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: క్రాలీ (సి) జడేజా (బి) ప్రసిధ్ 64, డకెట్ (సి) జురేల్ (బి) ఆకాశ్‌దీప్ 43; ఒలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 22; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 29; బ్రూక్ (బి) సిరాజ్ 53; బెథెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 6; స్మిత్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 8; ఓవర్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 0; అట్కిన్సన్ (సి) ఆకాశ్‌దీప్ (బి) ప్రసిధ్ 11; టంగ్ నాటౌట్ 0; వోక్స్ అబ్సెంట్ హర్ట్; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1–92, 2–129, 3–142, 4–175, 5–195, 6–215, 7–215, 8–235, 9–247. బౌలింగ్: సిరాజ్ 16.2–1–86–4, ఆకాశ్‌దీప్ 17–0–80–1, ప్రసి«ద్‌కృష్ణ 16–1–62–4, జడేజా 2–0–11–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ బ్యాటింగ్ 51; రాహుల్ (సి) రూట్ (బి) టంగ్ 7; సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; ఆకాశ్‌దీప్ బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–46, 2–70. బౌలింగ్: అట్కిన్సన్ 6–2–26–1, టంగ్ 7–1–25–1, ఓవర్టన్ 5–1–22–0. -
ENG VS IND 5th Test: చెలరేగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్
ఓవల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (16.2-1-86-4), ప్రసిద్ద్ కృష్ణ (16-1-62-4), ఆకాశ్‌దీప్ (17-0-80-1) చెలరేగడంతో ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ మ్యాచ్ మొత్తానికి దూరం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 247 పరుగుల వద్ద పుల్ స్టాప్ పడింది. ఆ జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, హ్యారీ బ్రూక్ 53, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యరు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా
ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టీమిండియా చెత్త ఆటతీరును ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.204/6 వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్‌కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్‌ను టంగ్ బోల్తా కొట్టించాడు.భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
భారత్‌తో ఐదో టెస్ట్.. ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
టీమిండియాతో ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వోక్స్ తొలి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. జేమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడగా.. వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ తీయగా బలమైన గాయమని తేలింది.దీంతో అతను ఐదో టెస్ట్ నుంచి అర్దంతరంగా వైదొలిగాడు. ఈ మ్యాచ్‌లో వోక్స్ లేని లోటు ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్ తమ స్టార్ పేసర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. తాజాగా వోక్స్ కూడా దూరం కావడంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడినైట్లంది.ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన వోక్స్ 181 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. గాయపడటానికి ముందు కూడా వోక్స్ ఓ వికెట్ తీశాడు. టీమిండియా తరుపుముక్క అయిన కేఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్ తలో 2 వికెట్లు తీయగా.. వోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. గిల్ రనౌటయ్యాడు. -
యూకే ఏటీసీలో సమస్య.. 100 విమానాలపై ప్రభావం
లండన్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సమస్య తలెత్తడంతో గురువారం దక్షిణ ఇంగ్లండ్‌లోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమాన సర్వీసులు, ఆలస్యంగా నడవడం లేదా రద్దవడం సంభవించాయి. దీంతో వేలాదిగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. హీత్రూ, గాట్విక్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, కార్డిఫ్, ఎడిన్‌బరో తదితర విమానాశ్రయాల్లో పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించినప్పటికీ ఆ ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తాము వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి దరిద్రంగా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నామని నేషనల్ ఎయిర్‌ట్రాఫిక్ సర్వీసెస్(ఎన్ఏటీఎస్) తెలిపింది. -
బుమ్రా ఎంత కాలం ఇలా..!
టెస్టు బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాపై మరోసారి చర్చ మొదలైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన టెస్టులో ఆడించకుండా ‘పని భారం’ పేరుతో అతడిని పక్కన పెట్టడం మళ్లీ అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు రేకెత్తించింది. నిజానికి సిరీస్‌కు ముందే అతను మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ చేసిన ప్రకటనే తప్పు. ప్రతీ మ్యాచ్‌కు ముందు పరిస్థితిని బట్టి తుది జట్టును ఎంపిక చేసే సమయంలో నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ‘మూడే టెస్టులు’ అంటూ మళ్లీ మళ్లీ చెప్పడం అర్థరహితం. అలా ప్రకటించినా... పేస్, స్వింగ్‌కు అనుకూలంగా ఉన్న ఓవల్ పిచ్‌పై అతను ఆడతాడని అంతా భావించారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో నాలుగు, ఐదు రోజుల్లో బుమ్రాకు బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. మూడు రోజుల విరామం కలిపితే ఐదు రోజుల పాటు అతని పూర్తి విశ్రాంతి లభించింది. లీడ్స్‌తో మొదటి టెస్టు, బరి్మంగ్‌హామ్‌లో రెండో టెస్టుకు మధ్య ఏడు రోజుల వ్యవధి వచ్చినా బుమ్రాను ఆడించకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తప్పు పట్టగా, ఇప్పుడు అదే పునరావృతమైంది. బుమ్రా అత్యద్భుత బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒంటి చేత్తో అతను జట్టుకు విజయాలు అందించాడు. 48 టెస్టుల కెరీర్లో 35 టెస్టుల్లో విదేశాల్లోనే ఆడి కేవలం 20 సగటుతో 172 వికెట్లు పడగొట్టిన రికార్డు అతని సొంతం. అయితే ఇలా అప్పుడప్పుడు ఆడుతూ 31 ఏళ్ల బుమ్రా ఎంత కాలం టెస్టు కెరీర్‌ను కొనసాగించగలడనేదే చర్చనీయాంశం. టెస్టుల్లో అతను రిటైర్ కావడం మంచిదనే సూచనలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అతను పూర్తిగా తప్పుకోవడంకంటే ఇదే తరహాలో వ్యూహాత్మకంగా వాడుకోవడం సరైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే బుమ్రాను నమ్ముకొని మ్యాచ్‌లు గెలవాలనుకునే ఆలోచనను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టాల్సిందే. అతను అందుబాటులో ఉంటే మంచిదే కానీ లేకపోయినా అన్ని రకాలుగా సిద్ధం కావడం సరైన ప్రణాళిక అవుతుంది. ఇతర బౌలర్లతో పోలిస్తే బుమ్రా తక్కువ ఓవర్లు ఏమీ వేయలేదు. ఆ్రస్టేలియా సిరీస్‌లో 151.2 ఓవర్లు వేసిన అతను...ప్రస్తుత సిరీస్‌లో మూడు టెస్టుల్లో 5 ఇన్నింగ్స్‌లోనే 119.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతని భిన్నమైన బౌలింగ్ శైలితోనే సమస్య. అదే అతని వెన్నుభాగంపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. బౌలింగ్ సమయంలో శరీరాన్ని ఒక వైపు వంచే ‘లేటరల్ ఫ్లెక్సియాన్’తో అతను ఇంత కాలం కొనసాగడమే గొప్ప. నిజానికి ఈ సిరీస్‌లో అతను ఆడిన మూడు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లలో 140 కిలోమీటర్లకు పైగా వేసిన బంతుల శాతం 42.7 నుంచి 22.3కి, ఆపై 0.5 శాతానికి తగ్గుతూ వచ్చింది. మాంచెస్టర్‌లో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లు వేసిన బుమ్రా తొలిసారి 100కు పైగా పరుగులు ఇచ్చాడు. కాబట్టి అతడిని ఓవల్‌లోనూ ఆడిస్తే సమస్య తీవ్రంగా మారేదేమో! ఇలాంటి స్థితిలో బుమ్రాకు విరామాలు ఇవ్వడంలో తప్పు లేదనేది మేనేజ్మెంట్ వాదన. – సాక్షి క్రీడా విభాగం -
తొలిరోజు తడబాటు
సిరీస్ సమం కోసం గెలవాల్సిన సమరాన్ని భారత్ సరిపోలని ఆటతీరుతో మొదలు పెట్టింది. ప్రతికూల వాతావరణం, కలిసిరాని పిచ్, నిలకడలేని బ్యాటింగ్... అన్నీ టీమిండియాకు ప్రతికూలంగా మారాయి. వాన చినుకులు పదేపదే ఇబ్బంది పెట్టిన తొలిరోజు ఆటలో భారత్ అడుగడుగునా కష్టాల్నే ఎదుర్కొంది. బ్యాటర్ల వైఫల్యంతో సెషన్, సెషన్‌కు వికెట్లను కోల్పోయిన భారత్ మొదటి రోజు అతికష్టంగా 200 పరుగుల స్కోరు దాటింది. లండన్: చికాకు పెట్టిన చినుకులు, ప్రతికూల పరిస్థితుల మధ్య ఆఖరి టెస్టును భారత్ అతిక్లిష్టంగా మొదలు పెట్టింది. విలువైన వికెట్లను తక్కువ స్కోరుకే కోల్పోయి కష్టంగా బ్యాటింగ్ చేసింది. మరోవైపు సిరీస్‌లో ఇదివరకే ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... ఆధిపత్యంతో ఐదో టెస్టుకు శ్రీకారం చుట్టింది. సమష్టి బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియాను బెంబేలెత్తించింది. దీంతో తొలిరోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (98 బంతుల్లో 52 బ్యాటింగ్; 7 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (45 బంతల్లో 19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్‌ను, వెటరన్ సీమర్ బుమ్రా, అన్షుల్ కంబోజ్, శార్దుల్ ఠాకూర్ స్థానాల్లో వరుసగా ఆకాశ్‌దీప్, ప్రసిధ్ కృష్ణ, కరుణ్ నాయర్లను తుది జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరమవగా ఒలీ పోప్ సారథ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, జోష్ టంగ్ రెండు వికెట్ల చొప్పున తీశారు. వర్షం కారణంగా తొలి రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. జైస్వాల్ 2, రాహుల్ 14... టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ ఒలీ పోప్ పరిస్థితులను గమనించి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆరంభ ఓవర్లలోనే భారత్‌ను కష్టాల్లోకి నెట్టేశారు. నాలుగో ఓవర్ తొలి బంతికే యశస్వి జైస్వాల్ (2)ను అట్కిన్సన్, కాసేపటికి కేఎల్ రాహుల్ (14)ను వోక్స్ అవుట్ చేశారు. సాయి సుదర్శన్ (38; 6 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (21; 4 ఫోర్లు) నిలదొక్కుకునే ప్రయత్నాలపై చినుకులు కురవడంతో 72/2 స్కోరు వద్ద ఆట ఆగింది. ముందు వాన... తర్వాత తడారని మైదానం కోసం మ్యాచ్ చాలా సేపు నిలిపివేశారు. ఈ లోపే లంచ్ బ్రేక్‌ను కానిచ్చారు. ఫీల్డ్ అంపైర్లు పిచ్, అవుట్ ఫీల్డ్‌ను పరిశీలించిన తర్వాత రెండో సెషన్ ఆలస్యంగానే మొదలైంది. గిల్ నిర్లక్ష్యం తొలి సెషన్ ఎదురుదెబ్బల నుంచి ఇంకా కోలుకోకముందే రెండో సెషన్లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అవుట్‌తో కోలుకోలేని దెబ్బ తగిలింది. బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళుతున్న క్రమంలోనే పరుగుకు ప్రయత్నించి గిల్ వికెట్‌ను సమర్పించుకున్నాడు. కవర్స్ దిశగా బంతిని బాదిన శుబ్‌మన్... ఫీల్డర్ అట్కిన్సన్ను సమీపిస్తున్న బంతిని చూసుకోకుండానే పరుగు కోసం సగం పిచ్‌ను దాటేశాడు. సాయి సుదర్శన్ వారించినా పట్టించుకోలేదు. అట్కిన్సన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని నేరుగా వికెట్లకు (డైరెక్ట్ హిట్) త్రో చేయడంతో గిల్ నిష్క్రమించాడు. దీంతో 45 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం రనౌట్‌తో కూలింది. టెస్టుల్లో శుబ్‌మన్ ఇలా రనౌట్ కావడం ఇది రెండోసారి. ఏడాది క్రితం రాజ్‌కోట్‌లో అదికూడా ఇంగ్లండ్‌తోనే జరిగిన టెస్టులో అతను రనౌటయ్యాడు. రవీంద్ర జడేజా (9), ధ్రువ్ జురేల్ (19) తక్కువే చేశారు. నాయర్ ఫిఫ్టీ భారత బ్యాటింగ్ బలగమంతా చేతులెత్తేయడంతో ఒకదశలో 153 పరుగులకే 6 ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఇలా క్లిష్టపరిస్థితుల్లో కరుణ్ నాయర్ టీమిండియా పాలిట ఆపద్భాంధవుడయ్యాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి వికెట్‌ను కాపాడుకుంటూనే ఒక్కో పరుగు జతచేస్తూ జట్టు స్కోరును 200 పరుగులు దాటించిన పోరాటం అద్భుతం. ఈ క్రమంలోనే అతను 89 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు అబేధ్యమైన ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 2; రాహుల్ (బి) వోక్స్ 14; సుదర్శన్ (సి) స్మిత్ (బి) టంగ్ 38; గిల్ (రనౌట్) 21; కరుణ్ నాయర్ (బ్యాటింగ్) 52; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 9; జురేల్ (సి) బ్రూక్ (బి) అట్కిన్సన్ 19; సుందర్ (బ్యాటింగ్) 19; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (64 ఓవర్లలో 6 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–10, 2–38, 3–83, 4–101, 5–123, 6–153. బౌలింగ్: వోక్స్ 14–1–46–1, అట్కిన్సన్ 19–7–31–2, టంగ్ 13–3–47–2, ఓవర్టన్ 16–0–66–0, బెథెల్ 2–1–4–0.743 ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా శుబ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో గిల్ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 743 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు సునీల్ గావస్కర్ (1979లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో 732 పరుగులు) పేరిట ఉండేది. -
ENG VS IND 5th Test: మళ్లీ టాస్ ఓడిన భారత్.. జట్టులో ఎవరూ ఊహించని ఆటగాడు
ఇంగ్లండ్ గడ్డపై భారత్ వరుసగా ఐదో మ్యాచ్‌లో టాస్ ఓడింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదనంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ఇంగ్లండ్ తాత్కాలిక సారధి ఓలీ పోప్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్ ఠాకూర్‌ను పక్కకు పెట్టి మరీ కరుణ్‌కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ మ్యాచ్‌లో విఫలమైతే కరుణ్ కెరీర్ సమాప్తమైనట్లే.మరోవైపు ఇంగ్లండ్ సైతం ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్
-
సమమా... సమర్పణమా!
మాంచెస్టర్‌లో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు 0/2 కాగానే మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా ముగిసినట్లే అనిపించింది. కానీ మన ఆటగాళ్ల అసాధారణ పోరాటం సిరీస్ ఆశలు సజీవంగా ఉంచగలిగింది. గత మ్యాచ్‌తో పెరిగిన ఆత్మవిశ్వాసం, ఉత్సాహంతో ఇప్పుడు భారత్ గెలుపుపై దృష్టి పెట్టింది. సీనియర్లు తప్పుకున్న తర్వాత తొలి సిరీస్, యువ జట్టు, కొత్త కెప్టెన్... ఇలాంటి ప్రతికూలతలతో బరిలోకి దిగిన జట్టు ప్రత్యర్థి వేదికపై సిరీస్‌ను సమం చేసినా అది గెలుపుతో సమానమే! అలాంటి అవకాశం ముందుండగా టీమిండియా చివరి పోరుకు సిద్ధమైంది. మరోవైపు అన్నీ తానే అయి జట్టును నడిపించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కావడంతో బలహీనపడిన ఇంగ్లండ్ ఆఖరి టెస్టును ఎలా ముగిస్తుందో చూడాలి. లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ చివరి అంకానికి చేరింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఓవల్ మైదానంలో చివరిదైన ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో ఉండగా...భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2–2తో సిరీస్ సమంగా ముగుస్తుంది. మ్యాచ్ గెలిచినా లేక ‘డ్రా’ అయినా ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ సిరీస్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంటుంది. బుమ్రా, పంత్ లేకపోవడంతో పాటు పలు ఇతర మార్పులతో భారత్ సన్నద్ధం కాగా, స్టోక్స్ దూరం కావడంతో నాలుగు మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. 2007లో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ నెగ్గిన తర్వాత ఆడిన నాలుగు సిరీస్‌లనూ భారత్ చేజార్చుకుంది. ఓవల్‌లో గెలుపు దక్కితే సమంగా నిలిచి సగర్వంగా జట్టు స్వదేశానికి చేరవచ్చు. జురేల్, ఆకాశ్‌దీప్‌కు చోటు... సిరీస్‌కు ముందు అనుకున్నట్లుగానే బుమ్రా మూడు టెస్టులకే పరిమితమవుతూ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో మరో పేసర్ ఆకాశ్‌దీప్ ఆడటం ఖాయమైంది. గత టెస్టులో పూర్తిగా విఫలమైన అన్షుల్ కంబోజ్ను కూడా జట్టు పక్కన పెట్టాలని నిర్ణయించడంతో ప్రసిధ్ కృష్ణ టీమ్‌లోకి రానున్నాడు. వీరితో పాటు సిరాజ్ పేస్ బౌలింగ్‌ను నడిపించనున్నాడు. ఓవల్ పిచ్, వాతావరణాన్ని బట్టి చూస్తే స్పిన్నర్‌కంటే నాలుగో పేసర్ అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది. పైగా ముందే చెప్పినట్లు టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్‌కంటే బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అదే జరిగితే గత మ్యాచ్‌లో విఫలమైనా సరే... శార్దుల్‌కే మరో అవకాశం దక్కుతుంది. లేదంటే అర్ష్ దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేయవచ్చు. ఎలా చూసినా ‘చైనామన్ స్పిన్నర్’ కుల్దీప్ యాదవ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సిరీస్‌ను ముగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. పంత్ స్థానంలో గత రెండు టెస్టుల్లో సబ్‌స్టిట్యూట్‌గా చేసిన జురేల్ తుది జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్‌కు సంబంధించి సానుకూల స్థితి ఉండటం జట్టుకు మేలు చేసే అంశం. సిరీస్‌లో టాప్–5 పరుగుల జాబితాలో గిల్, రాహుల్, జడేజా ఉన్నారు. ఈ ముగ్గురూ మరో సారి సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. యశస్వి జైస్వాల్ కాస్త మెరుగ్గా ఆడాల్సి ఉండగా, సాయి సుదర్శన్ కూడా రాణించడం అవసరం. సుందర్ తన బ్యాటింగ్ పదునేమిటో మాంచెస్టర్‌లో చూపించాడు. నాలుగు మార్పులతో... ఓల్డ్ ట్రఫోర్డ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 143 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి ఇంగ్లండ్ బాగా అలసిపోయింది. కోలుకునేందుకు మూడు రోజుల విరామం కూడా చాలా తక్కువ. అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా జట్టు కాస్త దెబ్బ తిని ఉంది. ఇలాంటి స్థితిలో కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆటగాడిగా మాత్రమే కాకుండా సారథిగా అతను మైదానంలో ఉండే విలువేమిటో ఇంగ్లండ్‌కు బాగా తెలుసు. కానీ ఈ మ్యాచ్ కూడా ఆడితే గాయం మరింత ముదిరే ప్రమాదం ఉండటంతో స్టోక్స్ దూరమయ్యాడు. కెపె్టన్‌గా, బ్యాటర్‌గా కూడా ఓలీ పోప్ ప్రభావం చూపించాల్సి ఉంది. క్రాలీ, డకెట్ శుభారంభం ఇవ్వాల్సి ఉండగా, రూట్ బ్యాటింగ్ జట్టుకు ప్రధాన బలం. గత టెస్టులో విఫలమైన బ్రూక్ ఇక్కడ రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. ఆరో స్థానంలో బెతెల్‌కు అవకాశం దక్కింది. అయితే ఇంగ్లండ్ బౌలింగ్ ఒక్కసారిగా బలహీనంగా కనిపిస్తోంది. ఆర్చర్, కార్స్‌లకు విశ్రాంతినివ్వగా...గత టెస్టులో పూర్తిగా విఫలమైన స్పిన్నర్ డాసన్‌ను ముందే పక్కన పెట్టారు. అయితే అతి పేలవంగా 52.80 సగటుతో 10 వికెట్లు తీసిన వోక్స్ మళ్లీ బౌలింగ్ భారాన్ని మోయాల్సి వచ్చింది. మిగతా ముగ్గురు పేసర్లలో టంగ్‌కు మళ్లీ అవకాశం దక్కగా... అట్కిన్సన్, ఒవర్టన్‌లకు సిరీస్‌లో ఇదే తొలి మ్యాచ్ కానుంది. తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్. ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్.2 ఓవల్ మైదానంలో 15 టెస్టులు ఆడిన భారత్ 2 గెలిచి, 6 ఓడింది. 2021 సిరీస్‌లో ఇంగ్లండ్‌పై నెగ్గిన టీమిండియా... 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.పిచ్, వాతావరణంబౌన్సీ వికెట్‌తో పేస్ బౌలింగ్‌కు అనుకూలం. పిచ్‌పై పచ్చిక కనిపిస్తోంది. టాస్ గెలిచే జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజుల్లో అప్పుడప్పుడు వర్ష సూచన ఉంది. -
భారత్‌తో ఐదో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. తుది జట్టులో 4 మార్పులు
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా రేపటి నుంచి (జులై 31) టీమిండియాతో ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఇన్ ఫామ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ భుజం గాయం కారణంగా కీలకమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. స్టోక్స్ మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఏకంగా 35 ఓవర్లు వేసి గాయాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడుతున్న సమయంలోనే స్టోక్స్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. అప్పుడే అతని పని అయిపోయిందని అంతా అనుకున్నారు. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఐదుకు పైగా సెషన్లలో ఏకంగా 143 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్ల రసాన్ని పీల్చారు. స్టోక్స్ దాని బాదితుడే. ఆ మ్యాచ్‌లో స్టోక్స్ బంతితో పాటు బ్యాట్‌తోనూ చెలరేగి (5 వికెట్ల ప్రదర్శన సహా 6 వికెట్లు, సెంచరీ) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.అంతకుముందు వారు గెలిచిన మూడో టెస్ట్‌లోనూ స్టోక్సే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో అతను 77 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలవడంతో పాటు బ్యాట్‌తోనూ మంచి టచ్‌లో ఉన్న స్టోక్స్ కీలకమైన ఐదో టెస్ట్‌కు దూరం కావడం ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.కెప్టెన్‌గా పోప్స్టోక్స్ గైర్హాజరీలో ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తుది జట్టును కూడా ప్రకటించింది. ఇందులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. గాయపడిన స్టోక్స్ స్థానంలో జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి రాగా.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్‌లకు తుది జట్టులో స్థానం కల్పించింది. జేకబ్ బేతెల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని స్పష్టం చేసింది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనుకపడి ఉంది. ఇందులో 1,3 మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఐదో టెస్ట్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండ్ వశమవుతుంది. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఇన్ ఫామ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ లేకపోవడం భారత్‌కు తప్పక కలిసొచ్చే విషయమే. -
Gautam Gambhir: ‘నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’
లండన్: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు రెండు రోజుల ముందు భారత జట్టును మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం మొదలైంది. అయితే ఇది ఆటగాళ్ల నుంచి రాలేదు. చివరి టెస్టు జరిగే ఓవల్ పిచ్ క్యురేటర్ చేసిన ‘అతి’ మైదానంలో చర్చకు దారి తీసింది. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహానికి ఇది కారణమైంది. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో కొందరు భారత ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం ఓవల్ మైదానానికి వెళ్లింది. టెస్టుకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇరు జట్ల కెప్టెన్ లేదా కోచ్‌లు పిచ్‌ను పరిశీలించడం, దానిపై ఒక అంచనాకు రావడం సాధారణ ఆనవాయితీ. గంభీర్ కూడా తన సహచర కోచింగ్ సిబ్బందితో పిచ్ వద్దకు వెళ్లాడు. అయితే క్యురేటర్ లీ ఫోర్టస్ బృందంలోని ఒక సభ్యుడు అక్కడికి వచ్చి పిచ్‌కు బాగా దగ్గరగా వెళ్లవద్దని, అక్కడి నుంచి 2.5 మీటర్ల దూరం ఉండాల్సిందిగా కోరాడు. ఇది గంభీర్‌కు కాస్త అసహనం తెప్పించింది. పిచ్ పాడు కాకుండా క్యురేటర్లు జాగ్రత్తలు చెప్పడం సహజమే అయినా ఒక జట్టు కోచ్‌ను నిలువరించడం ఎప్పుడూ జరగదు. మ్యాచ్ జరిగే ప్రధాన పిచ్‌కు బాగా దగ్గరగా భారత ఆటగాళ్లు పదే పదే రావడం క్యురేటర్‌కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అయితే ప్రాక్టీస్‌కు కేటాయించిన మూడు పిచ్‌లకు ఇది బాగా దగ్గరగా ఉందని, పూర్తిగా అటు వెళ్లకుండా ఉండటం సాధ్యం కాదని మన కోచింగ్ బృందం జవాబి చ్చినట్లు తెలిసింది. అయితే వివాదం అక్కడితో ముగిసిపోలేదు. భారత్‌కు చెందిన సహాయకుడు ఒకరు కూలింగ్ బాక్స్‌ను ఆటగాళ్ల ప్రాక్టీస్ నెట్స్ వద్దకు తీసుకెచ్చే ప్రయత్నం చేయగా, దీనిని కూడా క్యురేటర్ వారించాడు. దాంతో కోపం వచ్చిన గంభీర్ ఏదో మాట అనడం... ఇలా మాట్లాడవద్దని, మళ్లీ ఇలా చేస్తే ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని క్యురేటర్ అన్నాడు. అంతే...ఏం చేసుకుంటావో చేసుకోమంటూ తనదైన శైలిలో తీవ్రంగా బదులిచ్చాడు. ‘మేం ఏం చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. మా బృందం ఏం చేయాలో కూడా నువ్వు చెప్పవద్దు. నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కేవలం గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే. అంతకు మించి ఏమీ కాదు. నీ పరిధిలో ఉండు. నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’ అని గంభీర్ తీవ్రంగా జవాబిచ్చాడు. చివరకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కలగజేసుకొని ఫోర్టిస్‌ను దూరంగా తీసుకెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చి oది. -
ఇంగ్లండ్... తగ్గేదేలే
బాసెల్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల జట్టు యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన హోరాహోరీ తుది పోరులో ఇంగ్లండ్ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఆఖరి క్షణం దాకా పోటాపోటీగా పోరాడిన స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో అనూహ్యంగా చిత్తయ్యింది. కేవలం ఒకే ఒక్క స్ట్రయికర్ గోల్ చేయడం గమనార్హం. మరోవైపు ఇంగ్లండ్ బృందంలో ఇద్దరు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమవగా... ముగ్గురు గోల్స్ చేశారు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి ఇంగ్లండ్, స్పెయిన్ జట్లు 1–1 స్కోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. ముందుగా స్పెయిన్ శిబిరం నుంచి గోల్ నమోదైంది. తొలి అర్ధభాగంలోనే మరియాన కాల్డెంటే (25వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు శుభారంభాన్నిచి్చంది. 1–0తో ఆధిక్యంతోనే ప్రథమార్ధాన్ని ముగించింది. ద్వితీయార్ధం మొదలవగానే ఇంగ్లండ్ ప్లేయర్లు దాడులకు పదును పెట్టారు. ఈ క్రమంలో అలెసియా రుసో (57వ నిమిషంలో) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. తర్వాత ఇరుజట్ల ప్లేయర్లు ఎంతగా శ్రమించిన ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నిరీ్ణత సమయంలో ఫలితం తేలకపోవడంతో అదనపు సమయం ఆడించారు. అయినా... స్కోరులో ఏ మార్పు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ తొలి షాట్ నుంచే ‘డ్రా’ మొదలైంది. స్పెయిన్ ఒకటే గోల్ చేసినా... ఇంగ్లండ్ గెలిచేందుకు ఆఖరి షాట్ గోల్దాకా వేచిచూడక తప్పలేదు. ఎందుకంటే మొదట కిక్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో బెత్ మీడ్ విఫలమైంది. స్పెయిన్ తరఫున ప్యాట్రిసియా గూజారో గోల్ కొట్టడంతో నిరీ్ణత సమయం మ్యాచ్‌లోలానే 1–0తో ‘షూటౌట్’లోనూ తొలుత పైచేయి సాధించింది. అయితే ఇంగ్లండ్ ప్లేయర్లు అలెక్స్ గ్రీన్వుడ్, నియామి చార్లెస్‌లు వరుసగా షాట్లు కొట్టడంతో రేసులో పడగా... మరోవైపు స్పెయిన్ శిబిరంలో మరియానా, ఐతాన బొన్మటి విఫలమవడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా 2–1తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. నాలుగో షాట్ లియా విలియమ్సన్ (ఇంగ్లండ్), సాల్మ పారాల్యులో (స్పెయిన్) ఎవరి వల్లా కాలేదు. 2–1తో ఇక ఆఖరి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఇంగ్లండ్ ఐదో షాట్ విఫలమై, స్పెయిన్ చేసి ఉంటే 2–2తో సమమై విజేత కోసం డ్రామా కొనసాగేది. కానీ క్లో కెల్లీ (ఇంగ్లండ్) స్పెయిన్‌కు ఆ ఆఖరి ఛాన్స్ ఇవ్వకుండా గోల్ చేసింది. 3–1తో ఫలితం రావడంతో స్పెయిన్ ఆఖరి షాట్ తీసుకోలేదు. 2022లో జరిగిన అమ్మాయిల యూరోలోనూ ఇంగ్లండే చాంపియన్‌గా నిలిచింది. స్టేడియానికి ‘రాయల్’ కళసెయింట్ జాకబ్ పార్క్‌లో జరిగిన ఈ టైటిల్ పోరుకు ‘రాయల్’ హాజరు లభించింది. తుదిపోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు బ్రిటన్ యువరాజు విలియమ్స్ (కింగ్ చార్లెస్ తనయుడు) కుమార్తె ప్రిన్సెస్ చార్లట్తో విచ్చేశారు. ప్రిన్స్ విలియమ్స్ ఇంగ్లిష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు స్పెయిన్ రాజవంశానికి చెందిన యువరాణి ప్రిన్సెస్ లియోనర్ తన సోదరి ఇన్ఫాంటా సోఫియాతో కలిసి టైటిల్ పోరును వీక్షించింది. సోఫియా 2023లో సిడ్నీలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ను తల్లి, స్పెయిన్ రాణి లెటిజియాతో కలిసి వీక్షించింది. ఆ మ్యాచ్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. మొత్తానికి 2023 ప్రపంచకప్, 2024 యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లతో జోరుమీదున్న స్పెయిన్ వరుసగా మూడో ఏడాది ప్రతిష్టాత్మక టైటిల్ గెలవాలనే గంపెడాశలతో బరిలోకి దిగింది. కానీ తుదిమెట్టుపై చతికిలబడింది. దీంతో ‘యూరో’ కప్ స్పెయిన్ మహిళల జట్టుకు ఇన్నేళ్లయినా అందని ద్రాక్షగానే ఉంది. -
బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నారు. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అనూహ్య రీతిలో పుంజుకుంది. రాహుల్, గిల్, సుందర్, జడ్డూ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కడంతో 669 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.స్టోక్స్ సరికొత్త చరిత్రఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (141 పరుగులు, 6 వికెట్లు) ఇరగదీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శన అనంతరం స్టోక్స్ చరిత్రలో ఏ ఇంగ్లండ్ కెప్టెన్‌కు సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. ఈ సిరీస్‌లో స్టోక్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 300 పైచిలుకు (304) పరుగులు చేసి, 15కు పైగా (17) వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర కెప్టెన్ ఓ సిరీస్‌లో 300 ప్లస్ పరుగులు చేసి 15 ప్లస్ వికెట్లు తీయలేదు. మరో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఈ ఘనత సాధించినప్పటికీ సాధారణ ఆటగాడిగానే సాధించాడు. ఈ సిరీస్‌లో స్టోక్స్ మరో టెస్ట్ ఆడేది ఉండగా.. మరిన్ని పరుగులు, వికెట్లు తీసే అవకాశం ఉంది.నాలుగో టెస్ట్ డ్రా అయినా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం 2-1తో కొనసాగుతూ ఉంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఒకటి, మూడు మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
భారత్‌తో ఐదో టెస్ట్.. మరో ఫాస్ట్ బౌలింగ్ అస్త్రాన్ని ప్రయోగించనున్న ఇంగ్లండ్
జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగబోయే ఐదో టెస్ట్ కోసం అప్డేటెడ్ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇవాళ (జులై 28) ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం నాలుగో టెస్ట్ ఆడిన జట్టును యధాతథంగా కొనసాగించిన ఈసీబీ అదనంగా మరో ఫాస్ట్ బౌలర్‌ను జట్టులో చేర్చుకుంది. 31 ఏళ్ల జేమీ ఓవర్టన్ ఐదో టెస్ట్ కోసం జట్టులో భాగం కానున్నాడు.నాలుగో టెస్ట్ సందర్భంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ అసౌకర్యంగా కనిపించడంతో అతనికి బ్యాకప్‌గా జేమీని ఎంపిక చేశారు. జేమీ చేరికతో జట్టులో పేసర్ల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ లాంటి పేసర్లు జట్టులో ఉన్నారు.జేమీ చివరిగా 2022లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతనికి కెరీర్లో అదే ఏకైక టెస్ట్ మ్యాచ్. నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమీ 97 పరుగులు (ఒకే ఇన్నింగ్స్‌లో) చేసి, 2 వికెట్లు తీశాడు. జేమీ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.భారత్‌తో ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్కాగా, మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఊహకందని రీతిలో పుంజుకుంది.కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) న భూతో న భవిష్యతి అన్న రీతితో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేశారు. ముఖ్యంగా సుందర్-జడేజా జోడీ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో ఒకటి, మూడు మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. -
ఇంగ్లండ్ తో నాలుగో టెస్ట్ డ్రా
-
IND vs ENG: పోరాటం కూడా గర్వించేలా...
ఇది నాలుగో రోజు సంగతీ! ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైనపుడు... భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలైనపుడు 0/2 స్కోరు! 5 బంతులకే ఆ 2 వికెట్లను టీమిండియా కోల్పోయింది. తర్వాత మిగిలున్న ఆ రోజు, అనంతరం ఆఖరి రోజు కలిపి 852 బంతులు పడ్డాయి. కానీ ఇంకో రెండే వికెట్లు పడ్డాయి! జట్టు ఆలౌట్ కాలేదు. ఇంగ్లండ్ నెగ్గలేదు. కానీ భారత్ నెగ్గింది. అదేంటి మ్యాచ్ ‘డ్రా’ కదా అయింది. భారత్ గెలిచిందంటారేంటి? అనే సందేహం రావొచ్చు. అవును... నిజమే. ఫలితం ముమ్మాటికి ‘డ్రా’నే! డౌటయితే లేదు టెస్టులో! కానీ భారత్ గెలిచింది ఫైట్‌లో! ఇన్నింగ్స్ పరాజయం తప్పదనుకున్న చోట... నాలుగున్నర సెషన్లు మిగిలిన ఆటలో... శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ముగ్గురి ‘త్రి’ శతకాల శక్తి... ఎంతటి ప్రతికూలతలనైనా తట్టుకొని నిలబడగలదనే స్ఫూర్తిని రగిల్చింది. మొత్తానికి భారత జట్టు పోరాటం కూడా గర్వపడేలా అసాధారణ ఆటతీరుతో నాలుగో టెస్టును ‘డ్రా’గా ముగించింది. ఈ సిరీస్‌లోని చివరిదైన ఐదో టెస్టు ఈనెల 31 నుంచి ఓవల్‌లో జరుగుతుంది. మాంచెస్టర్: ‘ఘోర పరాజయం తప్పదు’! ‘నాలుగో రోజు ఆట ముగిసేలోపే స్పెషలిస్టు బ్యాటర్లెవరూ మిగలరు’! ‘టెయిలెండర్ల వికెట్లు ఆఖరి రోజు మొదలవడంతోనే పడిపోతాయి’! ‘ఇంగ్లండ్ బౌలింగ్ దెబ్బకు ఇన్నింగ్స్ పరాజయం తప్పదు’! ‘ఇంగ్లండ్‌కు 3–1తో సిరీస్ విజయం ఖాయం’! ఇవన్నీ కూడా నాలుగో రోజు ఆఖరి సెషన్‌కు ముందు మాంచెస్టర్ ముచ్చట్లు!! కానీ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి అదే మాంచెస్టర్‌లో చప్పట్లు! అంచనాలన్నీ తలకిందులు. విశ్లేషణలన్నీ పటాపంచలు. భారత్‌ను తక్కువ చేసిన నోళ్లే... టీమిండియా ఆటగాళ్లు గొప్పొళ్లు అని పొగిడాయి. 311 పరుగులు వెనుకబడిన జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో పరుగైనా చేయకుండానే 2 వికెట్లు కోల్పోయిన జట్టు మలి రోజు (తర్వాతి ఐదో రోజు) కూడా రెండే వికెట్లు కోల్పోవడమేంటి. ఇది సాధారణ టెస్ట్! కానీ టీమిండియా పోరాటం గ్రేటెస్ట్. సంప్రదాయ క్రికెట్లో ఇటు గెలవకుండా... అటు ఓడకుండా... ‘డ్రా’తోనే పుటల్లోకెక్కిన ఘనతంటూ దక్కితే ముమ్మాటికి అది భారత్‌కే దక్కుతుందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. శతకాల పరాక్రమం ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు ఎవరూహించని విధంగా ‘డ్రా’గా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 174/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ గ్రే‘టెస్టు’ ముగిసే సమయానికి 143 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. 2... 2... అంటే ఇంగ్లండ్ బౌలర్లు నాలుగో రోజు, ఐదో రోజు తీసిన వికెట్ల సంఖ్య అది. 3... భారత దళంలో ఇంగ్లండ్‌ను వందలకొద్దీ బంతులనునెదుర్కొని సాధించిన శతకాల సంఖ్య. కేఎల్ రాహుల్ (230 బంతుల్లో 90; 8 ఫోర్లు) వికెట్టే ఇంగ్లండ్ శిబిరానికి దక్కిన ఏకైక ఆనందం. ఎందుకంటే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (238 బంతుల్లో 103; 12 ఫోర్లు)ను అవుట్ చేసినా అప్పటికే అతను శతకం సాధించేశాడు. ఇక మరో వికెట్ పడితే ఒట్టు! అన్నట్లుగా రవీంద్ర జడేజా (185 బంతుల్లో 107 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (206 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) తొలి సెషన్ నుంచి ఆఖరి సెషన్ ఆట ముగించమని ప్రత్యర్థి కెప్టెన్ ప్రార్థించేంతవరకు కనికరించకుండా ఆడేశారు. శతకాలు పూర్తి చేశారు. భారత్‌ను ఈ టెస్టులోనే కాదు... సిరీస్‌ను ఓడకుండా కాపాడారు. ఇప్పటికి 2–1తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ భారత్‌కు లభించిన ఈ సమరోత్సాహంతో ఐదో టెస్టును సానుకూల దృక్పథంతో మొదలుపెట్టడం ఖాయం. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 358; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) రూట్ (బి) వోక్స్ 0; కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్ 90; సాయి సుదర్శన్ (సి) బ్రూక్ (బి) వోక్స్ 0; శుబ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 103; వాషింగ్టన్ సుందర్ (నాటౌట్) 101; రవీంద్ర జడేజా (నాటౌట్) 107; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (143 ఓవర్లలో 4 వికెట్లకు) 425. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–188, 4–222. బౌలింగ్: క్రిస్ వోక్స్ 23–4–67–2, ఆర్చర్ 23–3–78–1, బ్రైడన్ కార్స్ 17–3–44–0, డాసన్ 47–11–95–0, జో రూట్ 19–2–68–0, బెన్ స్టోక్స్ 11–2–33–1, బ్రూక్ 3–0–24–0. 4 ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో గిల్ సెంచరీల సంఖ్య. ఒకే సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో గావస్కర్ (1971, 1979లో వెస్టిండీస్‌పై; 4 చొప్పున), కోహ్లి (2014–15 సిరీస్‌లో ఆస్ట్రేలియాపై; 4 సెంచరీలు ) కూడా ఉన్నారు.3 ఒకే టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో కెప్టెన్‌గా గిల్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (1947–48లో భారత్‌పై), సునీల్ గావస్కర్ (1978–79లో వెస్టిండీస్‌పై) కూడా ఉన్నారు. -
0/2 నుంచి 174/2 వరకు...
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఏకంగా 311 పరుగుల ఆధిక్యం అప్పగించేశాం. లక్ష్యం నిర్దేశించడం సంగతి తర్వాత... ముందు ఈ లోటును ఎలా పూడ్చాలా అనే ఆందోళన... రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి స్కోరు 0/2... మిగిలిన అరవైకి పైగా ఓవర్లను ఆడగలరా అనే సందేహం. నాలుగో రోజే కుప్పకూలి మ్యాచ్‌ను అప్పగించేస్తారేమో అనిపించింది. కానీ రాహుల్, గిల్ అసాధారణ రీతిలో గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో కాస్త తడబడ్డా ఏకాగ్రత చెదరకుండా రెండు సెషన్లు పట్టుదలగా ఆడారు. ఏకంగా 62.1 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వకుండా రోజును ముగించారు. అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా దాటిపోలేదు. మరో 137 పరుగులు వెనుకంజలో ఉన్న జట్టు ప్రస్తుతానికి మ్యాచ్‌ను రక్షించుకునేందుకు బాటలు వేసుకుంది. ఆపై ఎన్ని పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సవాల్ విసరగలదా అనేది చూడాలి.మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న భారత్ సురక్షిత స్థితికి చేరుతోంది. మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 141; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజాకు 4 వికెట్లు దక్కాయి. 22.1 ఓవర్లలో 125 పరుగులు... నాలుగో రోజు ఇంగ్లండ్ మెరుపు బ్యాటింగ్‌తో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. స్టోక్స్ చాలా కాలం తర్వాత చెలరేగిపోగా, బ్రైడన్ కార్స్ (54 బంతుల్లో 47; 3 ఫోర్లు 2 సిక్స్‌లు), డాసన్ (26) అండగా నిలిచారు. ఆట ఆరంభంలోనే డాసన్‌ను బుమ్రా బౌల్డ్ చేసినా... స్టోక్స్, కార్స్ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ దూసుకుపోయింది. సిరాజ్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా కొట్టిన బౌండరీతో 164 బంతుల్లో స్టోక్స్ సెంచరీ పూర్తయింది. రెండేళ్ల తర్వాత, 35 ఇన్నింగ్స్‌లలో స్టోక్స్‌కు ఇది తొలి శతకం కావడం విశేషం. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన స్టోక్స్ తర్వాతి 34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు రాబట్టడం విశేషం. మరో ఎండ్‌లో కార్స్ కూడా భారత బౌలర్లపై ధాటిని చూపించాడు.తొమ్మిదో వికెట్‌కు స్టోక్స్, కార్స్ కేవలం 95 బంతుల్లోనే 97 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు జడేజా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి స్టోక్స్ వెనుదిరగ్గా... తన తర్వాతి ఓవర్లో కార్స్‌ను అవుట్ చేసి జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు. 2015 తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బౌలర్లు తలా 100కు పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. భారీ భాగస్వామ్యం... భారత జట్టు ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. వోక్స్ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే వరుస బంతుల్లో జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత రాహుల్, గిల్ చక్కటి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో సెషన్లో ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్నా... ఆ తర్వాత వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూడచక్కటి షాట్లతో అలరించారు. 46 పరుగుల వద్ద గల్లీలో డాసన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన గిల్ 77 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.26 ఓవర్ల రెండో సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. టీ విరామం తర్వాత కూడా గిల్, రాహుల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. పరుగుల రాక కాస్త తగ్గినా ప్రమాదం కూడా ఏమీ కనిపించలేదు. ఒక దశలో వరుసగా 21.4 ఓవర్ల పాటు బౌండరీనే రాలేదు! 137 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లను మార్చి మార్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. అప్పుడప్పుడు కొన్ని చక్కటి బంతులు ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించినా భారత్‌కు నష్టం జరగలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 358; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) (సబ్) జురేల్ (బి) కంబోజ్ 94; పోప్ (సి) రాహుల్ (బి) సుందర్ 71; రూట్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) జడేజా 150; బ్రూక్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) సుందర్ 3; స్టోక్స్ (సి) సుదర్శన్ (బి) జడేజా 141; స్మిత్ (సి) (సబ్) జురేల్ (బి) బుమ్రా 9; డాసన్ (బి) బుమ్రా 26; వోక్స్ (బి) సిరాజ్ 4; కార్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 47; ఆర్చర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (157.1 ఓవర్లలో ఆలౌట్) 669.వికెట్ల పతనం: 1–166, 2–197, 3–341, 4–349, 5–499, 6–515, 7–528, 8–563, 9–658, 10–669.బౌలింగ్: బుమ్రా 33–5–112–2, కంబోజ్ 18–1–89–1, సిరాజ్ 30–4–140–1, శార్దుల్ 11–0–55–0, జడేజా 37.1–0–143–4, సుందర్ 28–4–107–2. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రూట్ (బి) వోక్స్ 0; రాహుల్ (బ్యాటింగ్) 87; సుదర్శన్ (సి) బ్రూక్ (బి) వోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 78; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (63 ఓవర్లలో 2 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–0, 2–0. బౌలింగ్: వోక్స్ 15–3–48–2, ఆర్చర్ 11–2–40–0, కార్స్ 10–2–29–0, డాసన్ 22–8–36–0, రూట్ 5–1–17–0.⇒ 3 టెస్టుల్లో 7 వేలకు పైగా పరుగులు చేసి 200కు పైగా వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్, జాక్ కలిస్ మాత్రమే ఈ ఘనత సాధించారు.⇒ 5 ఒకే టెస్టులో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు కూడా తీసిన ఐదో కెప్టెన్ స్టోక్స్. గతంలో అట్కిన్సన్, సోబర్స్, ముస్తాక్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్లకు మాత్రమే ఇది సాధ్యమైంది.⇒1 టెస్టుల్లో బుమ్రా ఒక ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులివ్వడం ఇదే మొదటి సారి. అతను తన కెరీర్లో 48వ టెస్టు ఆడుతున్నాడు. -
టెస్టు చేజారిపోతోంది!
మాంచెస్టర్‌లో మూడు రోజూ భారత్‌కు నిరాశ తప్పలేదు. ఇంగ్లండ్ దూకుడు కొనసాగగా, పస లేని బౌలింగ్‌తో భారత్ డీలా పడింది. రూట్ రికార్డుల సెంచరీకి తోడు పోప్, స్టోక్స్ కూడా రాణించడంతో ఆతిథ్య జట్టు పూర్తిగా పైచేయి సాధించింది. మన బౌలర్లు 89 ఓవర్లు శ్రమించి ఐదు వికెట్లు తీయగలిగినా... ఇంగ్లండ్ ఆధిక్యం దాదాపు రెండు వందలకు చేరింది. ఈ స్థితిలో నాలుగో రోజు ప్రత్యర్థిని వీలైనంత వేగంగా నిలువరించడంతో పాటు మిగిలిన లోటును పూరించేందుకు మన బ్యాటర్లు పోరాడాల్సి ఉంటుంది. మాంచెస్టర్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ఆ జట్టు ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. జో రూట్ (248 బంతుల్లో 150; 14 ఫోర్లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... ఒలీ పోప్ (128 బంతుల్లో 71; 7 ఫోర్లు), బెన్ స్టోక్స్ (134 బంతుల్లో 77 బ్యాటింగ్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. పోప్‌తో మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించిన రూట్... ఐదో వికెట్‌కు స్టోక్స్‌తో 142 పరుగులు జత చేశాడు. స్టోక్స్‌తో పాటు డాసన్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. వికెట్ కోల్పోకుండా... ఓవర్‌నైట్ స్కోరు 225/2తో ఆట కొనసాగించిన పోప్, రూట్ ఇంగ్లండ్‌ను మరింత మెరుగైన స్థితికి చేర్చారు. రెండో రోజు తరహాలోనే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. రూట్ 22 పరుగుల వద్ద ఉన్నప్పుడు సులువైన రనౌట్ చేసే అవకాశం వచ్చినా భారత్ చేజార్చుకుంది. సిరాజ్ బౌలింగ్‌లో రూట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడగా... మరోవైపు నుంచి పోప్ దూసుకొచ్చాడు. దాంతోఆలస్యంగా రూట్ పరుగు కోసం వెళ్లాల్సి వచ్చింది. జడేజా విసిరిన బంతి నాన్‌స్ట్రయికింగ్ స్టంప్స్‌కు నేరుగా తగల్లేదు. అయితే దగ్గరలో ఒక్క బ్యాకప్ ఫీల్డర్ ఉన్నా రూట్ రనౌటయ్యేవాడు! దీనిపై జడేజా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 93 బంతుల్లో పోప్ హాఫ్ సెంచరీని అందుకోగా, 99 బంతుల్లో రూట్ అర్ధసెంచరీ పూర్తయింది. తొలి సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, ఇంగ్లండ్ 28 ఓవర్లలో 107 పరుగులు చేసింది. సుందర్ ఆలస్యంగా వచ్చినా... రెండో రోజు ఆటలో భారత్ 46 ఓవర్లు వేయగా, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది. మూడో రోజు కూడా చాలా ఆలస్యంగా లంచ్‌కు కాస్త ముందు అతనికి కెప్టెన్ బంతిని అప్పగించాడు. ఇన్నింగ్స్ 69వ ఓవర్‌తో సుందర్ మొదలుపెట్టాడు. అప్పటికే జడేజా 12 ఓవర్లు వేశాడు. అయితే రెండో సెషన్ మొదలు కాగానే సుందర్ తన విలువేమిటో చూపించాడు.8 పరుగుల వ్యవధిలో అతను 2 వికెట్లు తీసి భారత్‌కు ఊరట అందించాడు. సుందర్ వేసిన చక్కటి బంతిని ఆడలేక పోప్ స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇవ్వగా... షాట్ కోసం ముందుకొచ్చిన బ్రూక్ (3) స్టంపౌటయ్యాడు. స్పిన్‌కు వికెట్లు దక్కడంతో భారత్ కొత్త బంతిని తీసుకోవడంలో 10 ఓవర్లు ఆలస్యం చేసింది. అయితే రూట్, స్టోక్స్ కలిసి మళ్లీ ఇంగ్లండ్‌ను ముందంజలో నిలిపారు. కంబోజ్ వేసిన బంతిని ఫైన్‌లెగ్ దిశగా ఆడి బౌండరీ రాబట్టడంతో 178 బంతుల్లో రూట్ శతకం పూర్తయింది. రెండో సెషన్లో ఇంగ్లండ్ 28 ఓవర్లలో 2 వికెట్లు చేజార్చుకొని 101 పరుగులు సాధించింది. మరో 3 వికెట్లు... టీ తర్వాత కూడా రూట్, స్టోక్స్ భాగస్వామ్యం కొనసాగింది. భారత బౌలర్లు వీరిని ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో 97 బంతుల్లో స్టోక్స్ ఈ సిరీస్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే కొద్ది సేపటికే తీవ్ర అలసటతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా మైదానం వీడాడు. మరోవైపు 150 మార్క్‌ను అందుకున్న వెంటనే రూట్... జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి డిఫెన్స్ ఆడబోయి స్టంపౌటయ్యాడు. సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న జేమీ స్మిత్ (9), క్రిస్ వోక్స్ (4) కూడా తక్కువ వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఈ దశలో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్... డాసన్‌తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించాడు. చివరి సెషన్లో ఇంగ్లండ్ 33 ఓవర్లలో 111 పరుగులు సాధించింది. మూడో రోజు 89 ఓవర్లు ఆడిన జట్టు 3.58 రన్‌రేట్‌తో 319 పరుగులు చేసింది.స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 358ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) (సబ్) జురేల్ (బి) కంబోజ్ 94; పోప్ (సి) రాహుల్ (బి) సుందర్ 71; రూట్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) జడేజా 150; బ్రూక్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) సుందర్ 3; స్టోక్స్ (బ్యాటింగ్) 77; స్మిత్ (సి) (సబ్) జురేల్ (బి) బుమ్రా 9; డాసన్ (బ్యాటింగ్) 21; వోక్స్ (బి) సిరాజ్ 4; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (135 ఓవర్లలో 7 వికెట్లకు) 544.వికెట్ల పతనం: 1–166, 2–197, 3–341, 4–349, 5–499, 6–515, 7–528.బౌలింగ్: బుమ్రా 28–5–95–1, అన్షుల్ కంబోజ్ 18–1–89–1, సిరాజ్ 26–4–113–1, శార్దుల్ 11–0–55–0, జడేజా 33–0–117–2, సుందర్ 19–4–57–2. -
రూట్ రికార్డు శతకం.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
Update: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 77, లియాం డాసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.రూట్ రికార్డు శతకం: మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. 127 ఓవర్ల తర్వాత ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ రికార్డు శతకం (150) సాధించి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. అతనికి స్టోక్స్ (66 రిటైర్డ్ హర్ట్) అండగా నిలిచాడు. క్రిస్ వోక్స్ (2), లియామ్ డాసన్ (7) క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
38వ సెంచరీ పూర్తి చేసిన రూట్.. రికార్డుల జాతర
మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే రెండు భారీ రికార్డులు సాధించిన రూట్.. తాజాగా సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 178 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన రూట్.. టెస్ట్‌ల్లో 38వ శతకాన్ని, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 56 శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. సంగక్కర్ కూడా టెస్ట్‌ల్లో 38 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈ ఇన్నింగ్స్‌లో రూట్ తొలుత టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్‌ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. ఆతర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, జాక్ కల్లిస్‌ను దాటేసి రెండో స్థానానికి చేరాడు. తాజాగా సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంగక్కరతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సింగిల్‌గా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ సెంచరీకి ముందు రూట్, హాషిమ్ అమ్లా తలో 55 సెంచరీలతో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉండేవారు. 56వ సెంచరీతో రూట్ సింగిల్‌గా ఆరో స్థానానికి చేరాడు.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13358*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 119జో రూట్- 104రికీ పాంటింగ్- 103జాక్ కల్లిస్- 103రాహుల్ ద్రవిడ్- 99టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 51జాక్ కల్లిస్- 45రికీ పాంటింగ్- 41జో రూట్- 38కుమార సంగక్కర- 38అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-6 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 100విరాట్ కోహ్లి- 82రికీ పాంటింగ్- 71కుమార సంగక్కర- 63జాక్ కల్లిస్- 62జో రూట్- 56ఈ సెంచరీతో రూట్ సాధించిన మరిన్ని ఘనతలు..టెస్ట్‌ల్లో ఫాబ్-4 ఆటగాళ్లు చేసిన సెంచరీలురూట్-38 స్టీవ్ స్మిత్- 36కేన్ విలియమ్సన్- 33విరాట్ కోహ్లి- 30అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్ ఉండి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 82జో రూట్- 56రోహిత్ శర్మ- 49కేన్ విలియమ్సన్- 48స్టీవ్ స్మిత్- 48టెస్ట్‌ల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లురూట్- 12స్టీవ్ స్మిత్- 11గత ఐదేళ్లలో 21 సెంచరీలు చేసిన రూట్2021లో 62022లో 52023లో 22024లో 62025లో 2మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో రూట్ సెంచరీ పూర్తి చేసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 407/4గా ఉంది. రూట్ 104, స్టోక్స్ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ENG VS IND 4th Test: దుమ్మురేపిన ఓపెనర్లు.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
బెన్ డకెట్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కాగా 40 ఓవర్ల తర్వాత ప్రస్తుతం స్కోరు 205/2గా ఉంది.మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే చెలరేగిపోయారు. తొలి వికెట్‌కు మెరుపు వేగంతో 166 పరుగులు జోడించారు. అనంతరం 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాక్ క్రాలే (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు.క్రాలే ఔటైనా బెన్ డకెట్ ధాటిగా ఆడుతున్నాడు. 91 పరుగుల వద్ద (98 బంతుల్లో 13 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 37 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 192/1గా ఉంది. డకెట్‌కు జతగా ఓలీ పోప్ (8) క్రీజ్‌లో ఉన్నాడు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్‌కు సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ENG VS IND 4th Test: దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు
మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు (14 ఓవర్లలో) చేసింది. బెన్ డకెట్ 43, జాక్ క్రాలే 33 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ సెషన్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్ దక్కలేదు. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో 5, సిరాజ్ 4 ఓవర్లు వేయగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డేలను తలపించి ఆడారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 281 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
విజృంభించిన బెన్ స్టోక్స్.. ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన ఘనత
మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో అరుదైన ఐదు వికెట్ల ఘనత సాధించాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో అన్షుల్ కంబోజ్ వికెట్ స్టోక్స్‌కు ఈ మ్యాచ్‌లో ఐదో వికెట్. కంబోజ్ను ఔట్ చేయకముందు స్టోక్స్ అదే ఓవర్లో వాషింగ్టన్ సుందర్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన భారత ఇన్నింగ్స్ స్టోక్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో ఒక్కసారిగా కుదుపుకులోనైంది. కంబోజ్ వికెట్‌తో స్టోక్స్ ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు (16) తీసిన బౌలర్‌గానూ అవతరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్టోక్స్ కంబోజ్, సుందర్ వికెట్లతో పాటు కీలకమైన సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీశాడు.లంచ్ విరామం తర్వాత భారత్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులుగా ఉంది. రిషబ్ పంత్ 54, జస్ప్రీత్ బుమ్రా 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
పవన్.. చేతనైతే ‘కోహినూర్’ను వెనక్కి రప్పించు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన హరిహర వీరమల్లు చిత్రం ఇవాళ రిలీజ్ అయ్యింది. కోహినూర్ వజ్రం సీక్వెన్స్ ఈ చిత్ర కథలో భాగమని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్... దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి” అని పవన్ పేల్చిన డైలాగూ ఉంది. అయితే బ్రిటిషర్లు తీసుకెళ్లిన ఆ వజ్రాన్ని నిజంగానే వెనక్కి తేవాలంటూ పవన్‌కు ఓ లేఖ చేరింది ఇప్పుడు. కోహినూర్.. ఒక వజ్రం(Kohinoor Diamond) మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఓ చిహ్నం కూడా. భారత్‌తో పాటు పాక్, అఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఈ వజ్రం తమదేనంటూ వాదిస్తుంటాయి. చివరకు.. 1849లో లాహోర్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా చేతికి వెళ్లింది. అక్కడి నుంచి క్వీన్ విక్టోరియా కిరీటంలో పొదిగారు. రాజకుటుంబంలో మగవాళ్లు కోహినూర్‌ను అరిష్టంగా భావించి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లండన్ టవర్ జ్యువెల్స్ టవర్‌లో ప్రదర్శనగా ఉంటోంది. కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ విజ్ఞప్తులను ఇంగ్లండ్ తోసిపుచ్చుతూ వస్తోంది. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత మరోసారి ఈ డిమాండ్ ఊపందుకుంది. 2025లో బ్రిటన్ మంత్రి లీసా నాండీ(Lisa Nandy) భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ చర్చ జోరుగా సాగింది. కోహినూర్‌ను ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు అంటూ కామెంట్ చేశారామె. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం సంతృప్తికర పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతోందని అంటోంది. ఈ నేపథ్యంలో.. పవన్‌కు చేరిన లేఖలో అంశాలు ఇలా.. ‘‘మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన "హరిహర వీరమల్లు" చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ ఆని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను.బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు. వాస్తవాలకు కట్టు కథలను జోడించడంవల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం ఆనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించింది.బ్రిటిష్‌వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది.యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు.కోహినూర్ డైమండ్.. మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహినూర్ డైమండ్ కథాంశంగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కావడం గమనార్హం.VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan ) says, "The Kohinoor should definitely be brought back to India. I personally feel it belongs to our nation, it is the property of Bharat. That is our heart and soul, that is our Ratnagarbha. I think it should be… pic.twitter.com/sPZHjsBJjM— Press Trust of India (@PTI_News) July 22, 2025 -
మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనున్న టీమిండియా.. షెడ్యూల్ విడుదల
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు వచ్చే ఏడాది మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న టీమిండియా.. 2026 జులైలో ఇంగ్లండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ మేరకు ఇవాళ (జులై 24) షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జులై 1 (డర్హమ్), 4 (మాంచెస్టర్), 7 (నాటింగ్హమ్), 9 (బ్రిస్టల్), 11 (సౌతాంప్టన్) తేదీల్లో ఐదు టీ20లు.. ఆతర్వాత 14 (బర్మంగ్హమ్), 16 (కార్డిఫ్), 19 (లార్డ్స్) తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లతో పాటు వచ్చే ఏడాది హెం సమ్మర్ షెడ్యూల్ మొత్తాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషులతో పాటు మహిళల క్రికెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. వచ్చే ఏడాది హోం సమ్మర్లో భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనలో భారత్ 3 టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పురుషుల హోం సమ్మర్ షెడ్యూల్..మొదటి టెస్ట్ న్యూజిలాండ్‌తో జూన్ 4-8 లార్డ్స్, లండన్రెండవ టెస్ట్ న్యూజిలాండ్‌తో జూన్ 17-21 ది కియా ఓవల్, లండన్మూడవ టెస్ట్ న్యూజిలాండ్‌తో జూన్ 25-29 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్మొదటి T20I ఇండియాతో జూలై 1 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హమ్రెండవ T20I ఇండియాతో జూలై 4 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్3వ T20I ఇండియాతో జూలై 7 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్4వ T20I ఇండియాతో జూలై 9 సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్5వ T20I ఇండియాతో జూలై 11 యుటిలిటా బౌల్, సౌతాంప్టన్మొదటి వన్డే ఇండియాతో జూలై 14 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్హామ్రెండవ వన్డే ఇండియా తోజూలై 16 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్మూడవ వన్డే ఇండియాతో జూలై 19 లార్డ్స్, లండన్మొదటి టెస్ట్ పాకిస్తాన్‌తో ఆగస్టు 19-23 హెడింగ్లీ, లీడ్స్రెండవ టెస్ట్ పాకిస్తాన్‌తో ఆగస్టు 27-31 లార్డ్స్, లండన్మూడవ టెస్ట్ పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 9-13 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్హామ్మొదటి T20I శ్రీలంకతో సెప్టెంబర్ 15 యుటిలిటా బౌల్, సౌతాంప్టన్రెండవ T20I శ్రీలంకతో సెప్టెంబర్ 17 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్3వ T20I శ్రీలంకతో సెప్టెంబర్ 19 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్మొదటి ODI శ్రీలంకతో సెప్టెంబర్ 22 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హామ్రెండవ ODI శ్రీలంకతో సెప్టెంబర్ 24 హెడింగ్లీ, లీడ్స్మడవ ODI శ్రీలంకతో సెప్టెంబర్ 27 ది కియా ఓవల్, లండన్వచ్చే ఏడాది ఇంగ్లండ్ మహిళల హోం సమ్మర్ షెడ్యూల్..మొదటి వన్డే న్యూజిలాండ్‌తో మే 10 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హామ్రెండవ వన్డే న్యూజిలాండ్‌తో మే 13 ది కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్మూడవ వన్డే న్యూజిలాండ్‌తో మే 16 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్1వ T20I న్యూజిలాండ్‌తో మే 20 ది సెంట్రల్ కో-ఆప్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ2వ T20I న్యూజిలాండ్‌తో మే 23 ది స్పిట్ఫైర్ గ్రౌండ్, కాంటర్బరీ3వ T20I న్యూజిలాండ్‌తో మే 25 ది 1వ సెంట్రల్ కౌంటీ గ్రౌండ్, హోవ్1వ T20I ఇండియాతో మే 28 అంబాసిడర్ క్రూయిజ్ లైన్ గ్రౌండ్, చెల్మ్స్ఫోర్డ్2వ T20I ఇండియాతో మే 30 సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్3వ T20I ఇండియాతో జూన్ 2 ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్, టౌంటన్టెస్ట్ ఇండియాతో జూలై 10-14 లార్డ్స్, లండన్1వ వన్డే ఐర్లాండ్‌తో సెప్టెంబర్ 1 ది అప్టన్స్టీల్ కౌంటీ గ్రౌండ్, లీసెస్టర్2వ వన్డే ఐర్లాండ్‌తో సెప్టెంబర్ 3 ది సెంట్రల్ కో-ఆప్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ3వ వన్డే ఐర్లాండ్‌తో సెప్టెంబర్ 6 వోర్సెస్టర్షైర్ న్యూ రోడ్, వోర్సెస్టర్ -
మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో భారత్ నాలుగో టెస్ట్
-
Anshul Kambo: జెర్సీ నంబర్ 'ఏకే-47'
దాదాపు ఆరు వారాల క్రితం... నార్తాంప్టన్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్ ‘ఎ’ తలపడిన అనధికారిక టెస్టులో అన్షుల్ కంబోజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడంతో పాటు అతను అర్ధ సెంచరీ కూడా సాధించాడు. మరో 10 రోజుల్లో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా జట్టులో ప్రధాన పేసర్ ఒకరు గాయంతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా మరో పేసర్‌ను టీమ్‌తో చేర్చాలని మేనేజ్మెంట్ భావించింది. ‘ఎ’ తరఫున ప్రదర్శన చూసిన తర్వాత కంబోజ్‌కు అవకాశం దక్కవచ్చని అంతా అనుకున్నారు. అయితే హర్షిత్ రాణాను జట్టు ఎంచుకుంది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాతి రోజు ఉదయమే తాను రోజూ సాధన చేసే అకాడమీకి కంబోజ్ చేరుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి వస్తూ వస్తూ అతను కొన్ని డ్యూక్స్ బంతులను వెంట తెచ్చుకున్నాడు. సింగిల్ స్టంప్‌ను పెట్టుకొని వాటితో ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు. కోచ్ ఎలా ఉన్నావు అడిగితే ‘అంతా బాగుంది సర్. కానీ నాకు ఇంకా నమ్మకం ఉంది’ అంటూ జవాబిచ్చాడు. జట్టులో స్థానంపై ఆశలు కోల్పోని కంబోజ్‌కు కొద్ది రోజులకే తీపి కబురు వచ్చింది. డ్యూక్స్ బంతులతో సాధన ఇంగ్లండ్‌తో మ్యాచ్ కోసమేనా అన్నట్లుగా వచ్చీ రాగానే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం కూడా లభించింది. – సాక్షి క్రీడా విభాగంహరియాణాలో బాక్సర్లకు అడ్డా అయిన కర్నాల్ సమీపంలో ఫజీల్పూర్ అన్షుల్ స్వస్థలం. చాలా మందిలాగే అతనూ మట్టి మైదానాల్లో క్రికెట్ ఆడుతూ వచ్చాడు. 14 ఏళ్ల వయసు వచ్చాకే బౌలింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. తండ్రి ఉధమ్ సింగ్ అన్ని రకాలుగా అండగా నిలవగా... స్థానిక కోచ్ సతీశ్ రాణా అతడిని తీర్చి దిద్దాడు. అకాడమీలో చేర్పించిన అనంతరం అన్షుల్ ఆట పదునెక్కింది. ఆ్రస్టేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌ను విపరీతంగా అభిమానించే అతను... మెక్‌గ్రాత్ తరహాలోనే పేస్ కంటే కూడా కచ్చితత్వంపైనే ఎక్కువగా ఆధారపడతాడు. భారత్‌లో స్వింగ్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే మైదానంగా గుర్తింపు పొందిన లాహ్లిలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కలిసి రాగా, తీవ్ర సాధనతో అన్షుల్ సీమ్ బౌలింగ్‌లో రాటుదేలాడు. ఇప్పుడే అదే ప్రత్యేకత అతడిని తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. నాన్నకు ఆనందం పంచుతూ... ఆరేళ్ల క్రితం భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం అన్షుల్ కెరీర్లో కీలక మలుపు. నిజానికి అంతకు కొద్ది రోజుల ముందే అండర్–19 వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టులో చోటు లభించే అవకాశం రాగా, గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆ సమయంలో తీవ్రంగా బాధపడిన అన్షుల్ ఆటను వదిలేద్దామనుకున్నాడు. కానీ అతనిలోని ప్రతిభ గురించి తెలిసిన తండ్రి కొనసాగమని గట్టిగా ప్రోత్సహించాడు. దాంతో పట్టుదలగా ఆడుతూ ముందుకు వెళ్లిన అన్షుల్ 2022లో తొలిసారి హరియాణా తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగాడు. మూడేళ్లు గడిచేసరికి ఇప్పుడు భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటంతో తండ్రి ఆనందానికి అవధుల్లేవు. గత పదేళ్లుగా ఉధమ్ సింగ్ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కంబోజ్ ఎంపిక తండ్రి బాధలన్నీ ఒక్క క్షణంలో దూరం చేసిందని అతని సోదరుడు సంయమ్ చెప్పాడు. కంబోజ్ మ్యాచ్ ఆడే సమయంలోనే అతని తల్లికి కిడ్నీ సంబంధిత సర్జరీ కూడా ఉంది. ఆ సమయంలో కొడుకు లేకపోయినా... కోలుకున్న తర్వాత ఆ కుటుంబంలో కనిపించే సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టిన అన్షుల్ తొలి టెస్టులో బౌలింగ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.ఆ రెండు ప్రదర్శనలు...అన్షుల్ అనూహ్యంగా దూసుకు వచ్చిన తరహా ఆటగాడు కాదు. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. 2023–24 సీజన్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని హరియాణా గెలుచుకోవడంలో 17 వికెట్లతో అతను కీలక పాత్ర పోషించాడు. ఇది అతనికి రూ.20 లక్షలతో తొలి ఐపీఎల్ అవకాశం ఇప్పించింది. 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడగలిగాడు. తొలి మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయగా... అది నోబాల్‌గా తేలింది. ఈ స్థాయిలో ఆడటం అంత సులువు కాదని అది తనకు నేర్పించిందని అతను గుర్తు చేసుకున్నాడు. అన్షుల్ ప్రతిభకు ఐపీఎల్ 2025లో గుర్తింపు దక్కింది. వేలంలో రూ.3 కోట్ల 40 లక్షలకు అతడిని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చింది. ఈ హరియాణా ప్లేయర్ తన పేరును, జెర్సీ నంబర్‌ను ఒకే చోట చేర్చి (అన్షుల్ కంబోజ్–ఏకే 47) పేరుతో జెర్సీని ధరించి ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. గత సీజన్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ తరఫున ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన అన్షుల్, రంజీ మ్యాచ్‌లో కేరళపై ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఘనతను అందుకున్నాడు. అనంతపురంలో జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై భారత్ ‘సి’ 525 పరుగులు చేయగా... అన్షుల్ దెబ్బకు ‘బి’ 332 పరుగులకే ఆలౌటైంది. ‘ప్రతిభ మాత్రమే కాదు...జహీర్, బుమ్రా తరహాలో తనదైన వ్యూహంతో బౌలింగ్ చేయగల అరుదైన పేసర్ అన్షుల్’ అంటూ అతని సీఎస్కే సహచరుడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ గడ్డపై తనకు లభించిన అవకాశాలను అన్షుల్ సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లడం ఖాయం. -
IND Vs ENG: ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత జట్టు.. సిరీస్ కైవసం
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లాండ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ చేజిక్కించుకున్న జోష్‌లో వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి మూడో వన్డేలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (102; 84 బంతుల్లో 14×4) మెరుపు శతకానికి క్రాంతి గౌడ్ (6/52) సూపర్ బౌలింగ్ తోడవడంతో భారత్ 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. 319 పరుగుల టార్గెట్ ఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది.వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (45), ప్రతీక రావల్ (26) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఇద్దరూ కొద్ది తేడాలో ఔటయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (84 బంతుల్లో 102; 14 ఫోర్లు) మెరుపు శతకంతో చెలరేగింది. ప్రతీక అవుటయ్యాక వచ్చిన హర్లీన్ డియోల్ (45; 4 ఫోర్లు) కూడా నింపాదిగా ఆడటంతో భారత్ స్కోరు సాఫీగా సాగిపోయింది. టాపార్డర్ బ్యాటర్లు ఔటయ్యే సమయానికే భారత్ 162/3 స్కోరు వద్ద పటిష్టస్థితిలో నిలిచింది.Harmanpreet kaur ne lambe samay bad century banai pic.twitter.com/lecFzHE5Nl— Rosesh (@roseshpoet) July 22, 2025కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ (50; 7 ఫోర్లు) క్రీజులోకి వచ్చాక స్కోరులో వేగం పెరిగింది. ఇద్దరు చకచకా పరుగులు చక్కబెట్టే పనిలో సఫలమయ్యారు. బౌండరీలతో ధాటిని ప్రదర్శించారు. దీంతో హర్మన్ 54 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 41వ ఓవర్లోనే జట్టు స్కోరు 200 దాటింది. అనంతరం జెమీమా 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. కానీ అదేస్కోరు వద్ద ఆమె ఆట ముగియడంతో నాలుగో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అర్ధసెంచరీ తర్వాత హర్మన్ బ్యాట్ ఝుళిపించడంతో రెండో ఫిఫ్టీని చేసేందుకు కేవలం 28 బంతులే అవసరమయ్యాయి. తద్వారా 82 బంతుల్లోనే ఆమె సెంచరీ పూర్తయ్యింది.What a spell by Kranti Gaud to bag a maiden 6️⃣-wicket haul 🙌Watch #ENGWvINDW 3️⃣rd ODI - LIVE NOW on #SonyLIV & Sony Sports Network. pic.twitter.com/3lhu0QURWC— Sony LIV (@SonyLIV) July 22, 2025వన్డేల్లో హర్మన్‌కిది ఏడో సెంచరీ..వన్డేల్లో హర్మన్‌ప్రీత్‌కు ఇది ఏడో సెంచరీ కాగా... మిథాలీ రాజ్, స్మృతి మంధాన తర్వాత 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గా ఘనతకెక్కింది. స్కోరు పెంచే క్రమంలో హర్మన్ నిష్క్రమించగా... ఆఖర్లో రిచా ఘోష్ (18 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. దీంతో భారత్ 300 పైచిలుకు స్కోరును చేయగలిగింది. 318 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో నాట్ సీవర్ (98; 105 బంతుల్లో 11×4) గొప్పగా ఆడినా.. ఇంగ్లాండ్‌ను గెలిపించలేకపోయింది. ఎమ్మా లాంబ్ (68), అలిస్ (44) రాణించారు.Shree Cha𝐑𝐀𝐍𝐈 coming in clutch with a crucial wicket 🙌Watch #ENGWvINDW 3️⃣rd ODI - LIVE NOW on #SonyLIV & Sony Sports Network. pic.twitter.com/udQ9BO5JK0— Sony LIV (@SonyLIV) July 22, 2025 -
IND vs ENG 4th Test: ‘సమం’ చేసే లక్ష్యంతో...
భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ సిరీస్‌లో జరిగిన మూడు టెస్టులూ ఆసక్తికరంగా సాగాయి. మొత్తం 15 సెషన్ల పాటు కూడా ఆట నడిచింది. టీమిండియా కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఎక్కడా తగ్గకపోయినా కొన్ని కీలక సందర్భాల్లో తమకు వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంది. ఫలితంగా ఇప్పుడు సిరీస్‌లో వెనుకబడింది. అయితే ఆటతీరులో, పోరాటంలో ఆతిథ్య జట్టుతో సమానంగా ఉన్న గిల్ బృందం కోలుకొని సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్‌లో విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో పోరుకు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై గత నాలుగు టెస్టు సిరీస్‌లను కూడా కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నేటి నుంచి జరిగే నాలుగో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇక్కడా ఓడితే సిరీస్ భారత్ చేజారుతుంది. అయితే రెండో టెస్టు తరహాలో సత్తా చాటి పైచేయి సాధిస్తే సిరీస్ ఫలితం చివరి మ్యాచ్‌కు చేరుతుంది. ఇంగ్లండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, బౌలర్ల గాయాలు గిల్ బృందానికి సమస్యగా మారాయి. ఈ గ్రౌండ్లో పేలవ రికార్డు (0–4) ఉన్నా... స్థాయికి తగినట్లుగా చెలరేగితే భారత్ గత రికార్డులు మార్చివేయగలదు. అన్షుల్ అరంగేట్రం! ఆటగాళ్లు గాయపడటంతో భారత తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. గత రెండు టెస్టుల్లో అనుసరించిన వ్యూహాన్ని కూడా జట్టు మార్చుకోనుంది. లార్డ్స్‌లో ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. బుమ్రా, సిరాజ్‌లతో పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండగా ఆకాశ్‌దీప్ స్థానంలో అదే తరహా బౌలింగ్ శైలి ఉన్న కొత్త పేసర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కెప్టెన్ గిల్ చెప్పినట్లుగా మూడో పేసర్‌గా అన్షుల్‌తో పాటు ప్రసిధ్ కూడా పోటీలో ఉన్నాడు. ఇక్కడి పిచ్ స్పిన్‌కు పెద్దగా అనుకూలించే అవకాశం లేకపోవడంతో సుందర్ స్థానంలో శార్దుల్‌ను ఆడించే విషయాన్ని జట్టు పరిశీలిస్తోంది. ఇక టాప్–6 బ్యాటింగ్ విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. నితీశ్ స్థానంలో రెగ్యులర్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కనుంది. వరుసగా విఫలమవుతున్నా... టీమ్ మేనేజ్మెంట్ కరుణ్ నాయర్‌కు మరో అవకాశం ఇస్తోంది. అతను తన రెగ్యులర్ స్థానమైన ఆరులో బ్యాటింగ్‌కు రానున్నాడు.యశస్వి, రాహుల్ మరోసారి శుభారంభం అందించాల్సి ఉంది. సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన గిల్ గత మ్యాచ్ వైఫల్యాన్ని మరచి చెలరేగితే భారీ స్కోరు ఖాయం. లార్డ్స్‌లో పంత్ రనౌట్ మ్యాచ్ గమనాన్ని మార్చింది. అతను ఈ సారి అలాంటి తప్పులు చేయకుండా ఆడాలని జట్టు కోరుకుంటోంది. పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు కాబట్టి కీపింగ్ కూడా చేస్తాడని గిల్ ఇప్పటికే స్పష్టం చేశాడు. నాలుగు వరుస హాఫ్ సెంచరీలతో జడేజా ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. డాసన్ ఎనిమిదేళ్ల తర్వాత... ఇంగ్లండ్ ఎప్పటిలాగే రెండు రోజుల ముందే తమ తుది జట్టును ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ బ్యాటింగ్ బలహీనంగానే కనిపిస్తోంది. టాప్–3 ఆశించిన ప్రభావం చూపలేకపోతున్నా క్రాలీ, డకెట్, పోప్‌లపై మేనేజ్మెంట్ ఇంకా నమ్మకముంచింది. 57 టెస్టుల తర్వాత కూడా 30 సగటుతో క్రాలీ ఇంకా జట్టులో కొనసాగడం ఆశ్చర్యకరం! దాంతో ప్రధాన బ్యాటర్లయిన రూట్, బ్రూక్‌పై బ్యాటింగ్ భారం పడుతోంది. కీపర్ స్మిత్ రూపంలో ఇంగ్లండ్‌తో సమర్థుడైన బ్యాటర్ లభించాడు. అసాధారణ బౌలింగ్‌తో పాటు నాయకుడిగా కూడా అద్భుతంగా నడిపిస్తున్న స్టోక్స్ బ్యాటింగ్ మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఆరు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇక్కడైనా స్టోక్స్ రాణించడం అవసరం. లెఫ్టార్మ్ స్పిన్నర్ డాసన్ ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 18 సెంచరీలు ఉన్న అతని బ్యాటింగ్ జట్టుకు అదనపు బలం. వోక్స్, కార్స్, ఆర్చర్లతో పేస్ దళం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా ఆర్చర్ లార్డ్స్ భారత్‌ను ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యాడు.04 ఇంగ్లండ్‌లో ఇతర మైదానాలతో పోలిస్తే ఓల్డ్ట్రఫోర్డ్లో భారత్ తక్కువ మ్యాచ్‌లు ఆడింది. 1936–2014 మధ్య 9 టెస్టులు ఆడగా ఒక్కటీ గెలవలేదు. 4 ఓడి మరో 5 డ్రా చేసుకుంది. పిచ్, వాతావరణంగత మూడు టెస్టులతో పోలిస్తే ఇది వేగవంతమైన పిచ్. చక్కటి బౌన్స్ ఉంది. గత వారం రోజులుగా వానలు కురుస్తున్నాయి. తేమ కారణంగా తొలి రోజు పేస్ బౌలింగ్‌కు అనుకూలించవచ్చు. మ్యాచ్ జరిగే రోజుల్లోనూ వర్ష సూచన ఉంది.తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పంత్, కరుణ్ నాయర్, జడేజా, సుందర్/ శార్దుల్, సిరాజ్, ప్రసిధ్/ కంబోజ్ ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, డాసన్, వోక్స్, కార్స్, ఆర్చర్. -
భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్.. అభిమానులకు చేదు వార్త
భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం పడే అవకాశాలున్నాయని అంచనా.వెదర్ రిపోర్ట్‌ను నిజం చేస్తూ మాంచెస్టర్‌లో ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. స్టేడియం చుట్టూ దట్టమైన మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మైదానం చిత్తడిగా మారి, రేపు ఆట ప్రారంభ సమయానికి ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణం ఇలాగే కొనసాగితే పిచ్ ప్రభావంలో కూడా మార్పు రావచ్చు. BAD NEWS FOR CRICKET FANS 📢- It's raining in Manchester ahead of the 4th Test. [Bharat Sharma from PTI] pic.twitter.com/OF0PgPhzxv— Johns. (@CricCrazyJohns) July 22, 2025ప్రస్తుతానికి పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమాంతరంగా సహరించవచ్చు. తొలి మూడు రోజుల్లో ఉదయం పూట (తొలి సెషన్లో) బంతి బౌన్స్ అవుతుంది. దీన్ని బ్యాటర్లు అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు. ఆట గడిచే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని అంచనా. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు లబ్ది చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.టీమిండియా విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డై అన్నట్లుగా మారింది. మాంచెస్టర్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ పిచ్‌పై టీమిండియా ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు సార్లు ఓటమిపాలై, ఐదు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. చివరిగా భారత్ ఈ పిచ్‌పై 2014లో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. 2014లో ఆడిన భారత్ జట్టు సభ్యుల్లో ప్రస్తుతం రవీంద్ర జడేజా ఒక్కడే ఉన్నాడు. ఇది ఓ రకంగా భారత్‌కు కలిసొచ్చే విషయం. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకుంటుందో, లేక ఓడి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను చేజార్చుకుంటుందో చూడాలి.నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవెన్..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.టీమిండియా (అంచనా)..యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్/కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
‘మా అంచనా తప్పింది’
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో పరిస్థితులను సరిగా అంచనా వేయడంలో విఫలమయ్యాయని, అందుకే పరాజయం ఎదురైందని భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన అభిప్రాయపడింది. శనివారం లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ పోరులో భారత్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్ మహిళల జట్టు సిరీస్‌ను 1–1తో సమం చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో కుదించిన ఈ మ్యాచ్‌లో మన బ్యాటర్లు విఫలం కాగా, స్మృతి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ‘పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మా బ్యాటింగ్ బృందం విఫలమైంది. కొన్ని అనవసరపు షాట్లకు ప్రయతి్నంచడంతో తప్పిదం జరిగింది. లార్డ్స్ మైదానంలో అలాంటి షాట్లు ఆడటం సరైంది కాదు. ముఖ్యంగా వర్షం కూడా లయ తప్పడానికి ఒక కారణం. ఇలాంటి మ్యాచ్‌లలో పదే పదే విరామాలతో ఏకాగ్రత కోల్పోతాం. టాస్ ఓడిపోవడం కూడా ప్రతికూలంగా మారుతుంది. అయినా సరే మేం మరికొంత మెరుగ్గా ఆడాల్సింది. జట్టులో చాలా మందికి ఈ మైదానంలో ఇదే తొలి మ్యాచ్. వారంతా ఉత్సాహంగా బరిలోకి దిగారు. కొన్ని జ్ఞాపకాలతో పాటు మరికొన్ని విషయాలు వారు ఇక్కడే నేర్చుకున్నారు’ అని స్మృతి వ్యాఖ్యానించింది. 2017లో లార్డ్స్ మైదానంలోనే జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎంతో ఎదిగిన భారత జట్టు గత ఎనిమిదేళ్లలో తమ స్థాయిని పెంచుకుందని భారత ఓపెనర్ గుర్తు చేసుకుంది. ‘ఫైనల్లో ఓడి నిరాశ చెందినా స్వదేశానికి తిరిగి వచ్చాక లభించిన ఆదరణ చూస్తే మహిళల క్రికెట్‌కు దక్కుతున్న గుర్తింపు ఏమిటో అర్థమైంది. గత ఎనిమిదేళ్లలో మేం ఏ దేశానికి వెళ్లి ఆడినా పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు వస్తున్నారు. ఎన్నో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. ఏదైనా సరే మన మహిళల క్రికెట్‌కు లభించిన గుర్తింపుగా దీనిని చూడవచ్చు. ఇది ఎంతో మంచి విషయం’ అని స్మృతి పేర్కొంది. -
ఇంగ్లండ్‌లోనే తర్వాతి మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్
సింగపూర్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ మ్యాచ్‌ను వరుసగా ఇంగ్లండ్ గడ్డపైనే నిర్వహించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం మరోసారి దానికే ఓటు వేసింది. వచ్చే మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. 2027, 2029, 2031లకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకే ఆతిథ్య హక్కులు కట్టబెడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఫైనల్స్ (2021–సౌతాంప్టన్, 2023–ఓవల్, 2025–లార్డ్స్) సమర్థ నిర్వహణే అందుకు కారణమని వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే జూన్ నెలలో ఇతర క్రికెట్ దేశాలతో పోలిస్తే ఒక్క ఇంగ్లండ్‌లోనే ఆటకు అంతరాయం కలిగించని, సరైన వాతావరణం ఉండటం ప్రధాన కారణం. పైగా తుది పోరులో ఎవరు తలపడినా... టెస్టు క్రికెట్ అభిమానులైన అక్కడి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై మ్యాచ్‌లకు ఆదరించడం కూడా ఐసీసీ నిర్ణయానికి కారణమైంది. ఐసీసీ సమావేశంలో రెండు కొత్త జట్లకు అసోసియేట్ సభ్యులుగా అవకాశం కల్పించారు. తిమోర్ లెస్టె, జాంబియా క్రికెట్ జట్లు ఇప్పుడు ఐసీసీలో భాగమయ్యాయి. దాంతో ఐసీసీ మొత్తం సభ్య దేశాల సంఖ్య 110కి చేరింది. -
నితీశ్ రెడ్డి అవుట్!
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు గాయాల సమస్య ఎదురైంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఆదివారం జిమ్‌లో ట్రైనింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. పరీక్షల అనంతరం అతని గాయం తీవ్రత తెలిసింది. సిరీస్‌లో రెండో, మూడో టెస్టు ఆడిన నితీశ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. లార్డ్స్ టెస్టులో 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తం 43 పరుగులు చేశాడు. తొలి టెస్టులో శార్దుల్ ఠాకూర్ బరిలోకి దిగగా, అతని వైఫల్యంతో అదే తరహా ఆల్‌రౌండర్ అయిన నితీశ్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ఇదే కూర్పుతో తుది జట్టును ఎంపిక చేస్తే మళ్లీ శార్దుల్ ఆడే అవకాశం ఉంది. మరోవైపు పేసర్లు ఆకాశ్‌దీప్, అర్ష్ దీప్ సింగ్ కూడా గాయాలతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఆకాశ్‌దీప్ తొడ కండరాల గాయంతో బాధపడుతుండగా, అర్ష్ దీప్ ఎడమ చేతికి గాయమైంది. రెండో టెస్టులో 10 వికెట్లతో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్‌దీప్ లార్డ్స్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో లయను అందుకోలేక ఇబ్బంది పడిన అతను నాలుగో రోజు మధ్యాహ్నమే చికిత్స కోసం మైదానం వీడాడు. బెకెన్‌హామ్‌లో జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొన్నప్పుడు ఆకాశ్‌దీప్ అసలు బౌలింగ్‌కే దిగలేదు. మరోవైపు ఇంకా అరంగేట్రం చేయని అర్ష్ దీప్ సింగ్ నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు. ఆకాశ్‌దీప్ ఆడకపోతే అతని స్థానంలో అర్ష్ దీప్ బరిలోకి దిగేవాడు. అయితే అతను కూడా అనూహ్యంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేస్తున్న సమయంలో సాయి సుదర్శన్ కొట్టిన షాట్‌ను ఫాలో త్రూలో ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతికి గట్టి దెబ్బ తగిలింది. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్ దీప్ ఆపై చేతికి కట్టుతో వెనుదిరిగాడు. అతని చేతికి కుట్లు వేసినట్లు సమాచారం. ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు... ప్రధాన బౌలర్లు గాయాలబారిన పడటంతో ముందు జాగ్రత్తగా సెలక్టర్లు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అన్షుల్ కంబోజ్ను జట్టులోకి ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందు అన్షుల్ భారత్ ‘ఎ’ జట్టు తరఫున రెండు అనధికారిక టెస్టులు ఆడాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హరియాణాకు చెందిన అన్షుల్ 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 79 వికెట్లు తీసి 486 పరుగులు చేశాడు. గత రంజీ ట్రోఫీలో సీజన్లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్ పది వికెట్లు (10/49) పడగొట్టి సంచలనం సృష్టించిన అతను...రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. -
గిల్‌కు ఇప్పుడే అసలు పరీక్ష!
న్యూఢిల్లీ: సారథి అంటే కేవలం మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడం... బౌలర్లను మార్చడం మాత్రమే కాదని నాయకుడిగా జట్టులో స్ఫూర్తి నింపాలని ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. ఇంగ్లండ్‌తో ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీలో భాగంగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 1–2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్ ద్వారానే భారత జట్టు పగ్గాలు అందుకున్న 25 ఏళ్ల శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి చాపెల్ ఓ వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. గిల్‌కు అసలు పరీక్ష ఇక ముందే ఎదురవనుందన్న చాపెల్... అతడు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అన్నాడు. నాయకుడంటే సహచరుల్లో నమ్మకం నింపే వాడని... జట్టు సమావేశాల్లో తనకు ఏం కావాలో అది స్పష్టంగా వెల్లడించగలిగినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్న గిల్... మున్ముందు సారథిగాను విజయవంతమవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో చాలా సందర్భాల్లో పైచేయి కనబర్చే విధంగా కనిపించిన టీమిండియా... చివరకు పరాజయం పాలవగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. పనిభారం కారణంగా ఈ సిరీస్‌లో బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ఇదివరకే స్పష్టం చేయగా... ఇప్పటి వరకు అతడు రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. మరి సిరీస్ సమం చేయాల్సిన అవసరమున్న ఈ కీలక పోరులో అతడు ఆడతాడా లేడా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెపె్టన్... గిల్‌కు పలు సూచనలు చేశాడు. అవి అతడి మాటల్లోనే... ‘ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా సిరీస్ గెలవాలంటే ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాలి. ఇలాంటి సమయంలో శుబ్‌మన్ గిల్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు అతడు బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. కెపె్టన్‌గానూ కొన్ని సందర్భాల్లో ఫర్వాలేదనిపించాడు. అయితే ఇలాంటి ఎన్నో కఠిన క్షణాలు ఎదుర్కొన్నప్పుడే సారథిలోని సామర్థ్యం బయటపడుతుంది. జట్టును ఎలా తీర్చిదిద్దాలకుంటున్నాం అనే స్పష్టత కెప్టెన్‌కు ఉండాలి. అది కేవలం తన మాటల ద్వారానే కాకుండా తన చర్యల ద్వారా ప్రస్ఫుటించాలి. ఫీల్డ్‌లో మరింత కఠినంగా ఉండాలి. లార్డ్స్ టెస్టులో ప్రత్యర్థులు సమయాన్ని వృథా చేస్తున్న సమయంలో గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథిగా అది అతడి బాధ్యత. మున్ముందు కూడా దీన్ని కొనసాగిస్తాడా చూడాలి. ఈ సిరీస్‌ను పరిశీలించుకుంటే భారత జట్టు ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చింది. దీంతో పాటు కొన్ని సులువైన క్యాచ్‌లు సైతం నేలపాలు చేసింది. అలాంటివి తగ్గించుకోవాల్సిన అవసరముంది. స్లిప్ ఫీల్డింగ్ మరింత మెరుగవ్వాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి. కోర్ గ్రూప్‌ను సిద్ధం చేసుకోవాలి. జట్టులోని ప్రతి ఆటగాడికి వారి బాధ్యతలు వివరించాలి. అప్పుడే ప్లేయర్లకు తమ కర్తవ్యం బోధపడుతుంది. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఆటగాళ్లకు కోలుకునే అవకాశం ఇచ్చేందుకు జాతీయ జట్టు సరైన స్థానం కాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా ఆటగాళ్లపై విశ్వాసం ఉంచి వారిలో నమ్మకం పెంచాల్సిన బాధ్యత సారథిదే. ఇప్పుడు భారత జట్టు అలాంటి పరిస్థితిలోనే ఉంది. సిరీస్‌లో వెనుకబడి ఉన్న దశలో అతడు జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. తనదైన ముద్ర వేసేందుకు ఇదే సరైన సమయం. మంచి జట్టును ఎంపిక చేసుకోవాలి. క్రికెట్ జట్టు క్రీడ. ఇందులో ఒక్కరిద్దరు మెరుగైన ప్రదర్శన చేస్తే సరిపోదు. సమష్టిగా సత్తాచాటాలి. భాగస్వామ్యాలతోనే భారీ స్కోర్లు సాధ్యమవుతాయి. ఒక్క ప్లేయర్ ఎప్పుడూ మ్యాచ్‌ను గెలిపించలేడు. మంచి స్పెల్‌లు, మంచి సెషన్లతోనే మ్యాచ్ ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఆలోచనలు స్పష్టంగా ఉండాలి. అప్పుడే ఈ సిరీస్‌తో పాటు భవిష్యత్తులోనూ అతడు జట్టును మెరుగైన దిశలో నడిపించగలడు’ -
రాహుల్ గొప్పగా ఆడుతున్నాడు
న్యూఢిల్లీ: నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకున్న భారత బ్యాటర్ కేఎల్ రాహుల్... ఇంగ్లండ్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. మరో మూడు నాలుగేళ్ల పాటు అతడు ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉందని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అండర్సన్–టెండూల్కర్’ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ 62.50 సగటుతో 375 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ప్రస్తుతం సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జేమీ స్మిత్ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ... ‘రాహుల్ తన బ్యాటింగ్ శైలిలో స్వల్ప మార్పులు చేసుకున్నాడు. బ్యాటింగ్ స్టాన్స్‌తో పాటు డిఫెన్స్ ఆడే తీరులో మరింత మెరుగయ్యాడు. దీంతో పరుగులు చేయడం అతడికి మరింత సులువవుతోంది. దీంతో పాటు బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గాయి. గతంలో ఇలా చాలా సార్లు అతడు అవుటయ్యేవాడు. నైపుణ్యం పరంగా రాహుల్ చాలా మెరుగ్గా ఉన్నాడు. ఈ సిరీస్‌లో బంతి ఎక్కువ స్వింగ్ అయిన దాఖలాలు లేవు. ఒకవేళ అనుకోకుండా ఏదైన బంతి అనూహ్యంగా దూసుకొచి్చనా దాన్ని ఎదుర్కొనేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే తీరు కొనసాగితే మరి కొన్నేళ్ల పాటు రాహుల్ అత్యున్నత స్థాయి ప్రదర్శన కొనసాగించగలడు. ఈ సిరీస్‌లో అతడి బెస్ట్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాహుల్ కెరీర్ అత్యుత్తమ దశలో ఉంది. ఇలాగే సాగితే మరెన్నో శతకాలు అతడి ఖాతాలో చేరతాయి.మున్ముందు టీమిండియా స్వదేశంలో చాలా మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో కెరీర్ ముగించే సమయానికి అతడి టెస్టు సగటు 50కి చేరువవడం ఖాయం’ అని వివరించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 61 టెస్టులు ఆడిన 33 ఏళ్ల రాహుల్ 35.26 సగటుతో 3632 పరుగులు చేశాడు. అందుటో 10 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. -
రెండో వన్డే ఇంగ్లండ్‌దే
లండన్: బ్యాటర్ల వైఫల్యంతో ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం వర్షం అంతరాయం మధ్య జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది. భారీ వర్షం కారణంగా ఆట నిర్ణీత సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో... మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 29 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (51 బంతుల్లో 42; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (34 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు) కీలక పరుగులు చేసింది. మేఘావృతమైన వాతావరణంలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (7), ప్రతీక రావల్ (3), జెమీమా రోడ్రిగ్స్ (3), రిచా ఘోష్ (2) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకెల్‌స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... ఎల్ అర్లాట్, లిన్సీ స్మిత్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 18.4 ఓవర్లలో 102/1తో ఉన్న సమయంలో మరోసారి వరుణుడు ఆటకు అడ్డుపడటంతో డక్‌వర్త్ ప్రకారం ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 పరుగులకు కుదించారు. ఛేదనలో ఇంగ్లండ్ 21 ఓవర్లలో 2 వికెట్లకు 116 పరుగులు చేసింది. అమీ జోన్స్ (57 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు), బ్యూమౌంట్ (35 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఎకెల్‌స్టోన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది. స్మృతి, దీప్తి మాత్రమే... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించగా... రెండో ఓవర్లో ప్రతీక రావల్ ఓ చక్కటి యార్కర్‌కు అవుట్ అయింది. ఈ దశలో హర్లీన్ డియోల్ (16)తో కలిసి స్మృతి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో ఇక కుదురుకున్నట్లే అనుకుంటే... ఆ తర్వాతే టీమిండియాకు అసలు కష్టాలు ఎదురయ్యాయి. ఎకెల్‌స్టోన్ వరుస ఓవర్లలో హర్లీన్, హర్మన్‌ప్రీత్‌ను ఔట్ చేసింది. జెమీమా కీలక దశలో చార్లీ డీన్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వగా... రిచా ఘోష్ వికెట్ల ముందు దొరికిపోయింది. దీంతో భారత జట్టు 72/5తో కష్టాల్లో పడింది. అంతసేపు పోరాడిన స్మృతి కూడా వెనుదిరగగా... చివర్లో దీప్తి శర్మ కీలక పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో చక్కటి పోరాటంతో జట్టును గెలిపించిన దీప్తి అదే జోరు ఇక్కడ కూడా కొనసాగించింది. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (14; 2 ఫోర్లు)తో కలిసి జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించింది. ఆదినుంచే జోరు... ఏ క్షణమైన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉండటంతో... ఇంగ్లండ్ ఛేదనలో ముందు నుంచే ధాటిగా ఆడింది. ఇంగ్లండ్ పేసర్లు ప్రభావం చూపిన చోట మన స్పిన్నర్లు ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఓపెనర్లు అమీ జోన్స్, బ్యూమౌంట్ సులువుగా పరుగులు రాబట్టారు. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం బ్యూమౌంట్ అవుటైనా... కెప్టెన్ నటాలియా సీవర్ బ్రంట్ (21; 2 ఫోర్లు) అండతో అమీ జోన్స్ జట్టును విజయానికి చేరువ చేసింది. చివర్లో మరోసారి వర్షం ముంచెత్తడంతో ఇంగ్లండ్ లక్ష్యం మరింత కుచించుకుపోవడంతో ఆతిథ్య జట్టు సిరీస్ సమం చేసింది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (బి) అర్లాట్ 3; స్మృతి (సి) చార్లీ డీన్ (బి) లిన్సీ 42; హర్లీన్ (సి అండ్ బి) ఎకెల్‌స్టోన్ 16; హర్మన్‌ప్రీత్ (బి) ఎకెల్‌స్టోన్ 7, జెమీమా (సి అండ్ బి) డీన్ 3; రిచా (ఎల్బీ) (బి) ఎకెలస్టోన్ 2; దీప్తి శర్మ (నాటౌట్) 30; అరుంధతి (ఎల్బీ) (బి) లిన్సీ 14; స్నేహ్ రాణా (బి) అర్లాట్ 6; క్రాంతి గౌడ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (29 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–6, 2–46, 3–57, 4–69, 5–72, 6–98, 7–124, 8–135. బౌలింగ్: లారెన్ బెల్ 6–0–29–0; ఎమ్ అర్లాట్ 6–1–26–2; చార్లీ డీన్ 6–0–31–1; సోఫీ ఎకెల్‌స్టోన్ 6–0–27–3; లిన్సీ స్మిత్ 5–0–28–1 ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: అమీ జోన్స్ (నాటౌట్) 46; బ్యూమౌంట్ (ఎల్బీ) (బి) స్నేహ్ రాణా 34; సీవర్ బ్రంట్ (బి) క్రాంతి గౌడ్ 21; డంక్లి (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (21 ఓవర్లలో 2 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–54, 2–102. బౌలింగ్: అరుంధతి 5–0–21–0; క్రాంతి గౌడ్ 3–0–29–1; శ్రీ చరణి 5–0–28–0; దీప్తి శర్మ 5–0–23–0; స్నేహ్ రాణా 3–0–12–1. -
చరిత్ర సృష్టించిన 17 ఏళ్ల కుర్రాడు.. హ్యాట్రిక్ వికెట్లతో రికార్డు! వీడియో
ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ యువ స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ సంచలనం సృష్టించాడు. శుక్రవారం ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా లంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల ఫర్హాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన ఫర్హాన్ అహ్మద్.. ఆఖరి మూడు బంతుల్లో వరుసగా ల్యూక్ వుడ్, టామ్ ఆస్పిన్‌వాల్, మిచెల్ స్టాన్లేలను పెవిలియన్‌కు పంపాడు.దీంతో అతడి ఖాతాలో తొలి హ్యాట్రిక్ చేరింది. అంతేకాకుండా టీ20 క్రికెట్లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా అతడు రికార్డు సాధించాడు. ఈ ఫర్హాన్ ఎవరో కాదు, ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ ఆహ్మద్ తమ్ముడే.గతేడాది జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో కూడా ఫర్హాన్ ఇంగ్లండ్ తరపున ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ యువ సంచలనం ఇప్పటికే నాటింగ్‌హామ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ 126 పరుగులకు ఆలౌటైంది. నాటింగ్‌హామ్ బౌలర్లలో ఫర్హాన్‌తో పాటు మోంట్గోమేరీ,ప్యాటర్సన్-వైట్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని నాటింగ్‌హామ్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది.చదవండి: IND vs ENG: టీమిండియాతో నాలుగో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జో రూట్FARHAN AHMED HAS A VITALITY BLAST HAT-TRICK AT 17 YEARS OLD!!!!! 😱 pic.twitter.com/dTThC98cwB— Vitality Blast (@VitalityBlast) July 18, 2025 -
చరిత్రపుటల్లోకెక్కిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఆటగాడు జోస్ బట్లర్ పొట్టి క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని అధిగమించాడు. టీ20 ఫార్మాట్లో జోస్ 13000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ ప్లేయర్‌గా, ఓవరాల్‌గా ఏడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బట్లర్‌కు ముందు ఇంగ్లండ్ తరఫున అలెక్స్ హేల్స్ (503 మ్యాచ్‌ల్లో 13814 పరుగులు) ఈ ఘనత సాధించాడు.ఓవరాల్‌గా క్రిస్ గేల్ (14562), కీరన్ పోలార్డ్ (13854), అలెక్స్ హేల్స్ (13814), షోయబ్ మాలిక్ (13571), విరాట్ కోహ్లి (13543), డేవిడ్ వార్నర్ (13395), బట్లర్ (13046) మాత్రమే టీ20 ఫార్మాట్లో 13000 పరుగులు పూర్తి చేసుకున్నారు.టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా నిన్న (జులై 17) యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసిన బట్లర్.. తన జట్టు (లాంకాషైర్) విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్.. బట్లర్‌తో పాటు ఫిల్ సాల్ట్ (29 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. వీరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో లాంకాషైర్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్ కూడా తడబడింది. జేమ్స్ ఆండర్సన్ (4-0-25-3), క్రిస గ్రీన్ (4-0-27-3), లూక్ వుడ్ (4-0-33-2) చెలరేగడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. తద్వారా లాంకాషైర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. యార్క్‌షైర్‌ను గెలిపించేందుకు అబ్దుల్లా షఫీక్ (54) విఫలయత్నం చేశాడు. -
‘బుమ్రాను ఆడించాలనే ఉంది’
బెకెన్హామ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించింది. పని భారాన్ని తగ్గించడంలో భాగంగా తొలి మూడు టెస్టుల్లో అతను రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగగా... మిగిలిన రెండు టెస్టుల్లో ఒక మ్యాచ్‌కు దూరం కావచ్చు. అయితే అతను ఏ టెస్టులో ఆడతాడనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సిరీస్ సమం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనిపై మ్యాచ్ సమయానికే తుది నిర్ణయం తీసుకుంటామని జట్టు అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే వెల్లడించాడు. ‘బుమ్రా మరో మ్యాచ్‌కే అందుబాటులో ఉంటాడనే విషయం మాకు తెలుసు. మాంచెస్టర్‌లో సిరీస్ సమం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు బుమ్రా కీలకం. కాబట్టి ఆడించే ఆలోచన అయితే ఉంది. అయితే ఇతర ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టులు, వాటిలో మా అవకాశాలను దృష్టిలో పెట్టుకుంటూ తుది జట్టు ఎంపిక చేయాలి. అందుకే ఇప్పుడే ఏమీ చెప్పలేం. మాంచెస్టర్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని డస్కటే స్పష్టం చేశాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సుదీర్ఘ స్పెల్‌లు బౌలింగ్ చేయడాన్ని బుమ్రా ఫిట్నెస్తో పోలుస్తూ వచ్చిన విమర్శలను డస్కటే కొట్టిపారేశాడు. అందరూ ఒకే తరహాలో బౌలింగ్ చేయరని, మరో బౌలర్‌తో పోల్చుకోవాల్సిన అవసరం లేదన్న డస్కటే... చిన్న చిన్న స్పెల్‌లలో బౌలింగ్ చేయడం బుమ్రా శైలి అని గుర్తు చేశాడు. మరో పేసర్ సిరాజ్ నిర్విరామంగా బౌలింగ్ చేసిన విషయాన్ని మర్చిపోవద్దని కూడా అతను అన్నాడు.గురువారం భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ దీనికి దూరంగా ఉన్నాడు. అయితే పంత్ కోలుకునేందుకు తగినంత విశ్రాంతి ఇస్తున్నామని, తర్వాతి టెస్టులోనూ అతను బ్యాటింగ్ చేస్తాడని కూడా భారత అసిస్టెంట్ కోచ్ స్పష్టం చేశాడు. ప్రాక్టీస్‌లో ఆటగాళ్లు... లార్డ్స్ టెస్టులో ఓటమి నుంచి కోలుకున్న భారత జట్టు తర్వాతి టెస్టుపై దృష్టి పెట్టింది. మాంచెస్టర్ టెస్టుకు ముందు అందుబాటులో ఉన్న ఏకైక ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా ఆటగాళ్లు శ్రమించారు. ఇంకా మాంచెస్టర్‌కు వెళ్లని మన జట్టు లండన్ శివార్లలో బెకెన్‌హామ్‌లో ఉన్న కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో గురువారం సాధన చేసింది. కేఎల్ రాహుల్ మినహా ఇతర బ్యాటర్లంతా ఇందులో పాల్గొన్నారు. గాయం నుంచి కోలుకుంటున్న రిషభ్ పంత్‌తో పాటు పేసర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. వీరంతా స్వల్పంగా వామప్ చేసి ఆపై జిమ్‌కే పరిమితమయ్యారు. మరోవైపు సుదర్శన్ ఆడిన షాట్‌ను ఆపే క్రమంలో పేసర్ అర్ష్ దీప్ సింగ్ చేతికి బలంగా దెబ్బ తగిలింది. స్వల్ప చికిత్స అనంతరం బ్యాండేజీతో అతను మైదానం వీడాడు. బుమ్రా ఆడకపోతే అతని స్థానంలో అర్ష్ దీప్ తో అరంగేట్రం చేయించాలని మేనేజ్మెంట్ భావిస్తున్న స్థితిలో ఈ గాయం తీవ్రత ఎలాంటిదో చూడాలి. అర్ష్ దీప్ వెనుదిరిగాక టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వయంగా బౌలింగ్‌కు దిగి భారత బ్యాటర్లకు సహకరించాడు. లార్డ్స్‌లో పరాజయాన్ని మరచి మళ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించిన జట్టు ఉత్సాహంగా, సరదాగా సాధనలో పాల్గొనడం విశేషం. -
మూడు వన్డేల సిరీస్ లో భారత్ శుభారంభం
-
Ravindra Jadeja: అసలు సిసలు ఆల్‌రౌండర్
రెప్ప పాటులో దూసుకొచ్చే బంతులను ఒడిసి పట్టాలంటే అతడు ఉండాలి...పాయింట్, కవర్స్, మిడాన్, మిడాఫ్ ఇలా ఎక్కడైనా నమ్మశక్యం కాని క్యాచ్‌లు అందుకోవాలంటే అతడు కావాలి...అవుట్‌ఫీల్డ్ నుంచి నేరుగా వికెట్లను గురిచూసి గిరాటేయాలంటే బంతి అతడికి చేతికి చిక్కాలి!పిచ్ నుంచి కాస్త సహకారం లభిస్తుందంటే చాలు ప్రత్యర్థిని చుట్టేయడానికి అతడు కావాలి...ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్నారంటే భాగస్వామ్యాన్ని విడదీయడానికి అతడు రావాలి...స్లో ఓవర్‌రేట్ బారిన పడకుండా చకచకా ఓవర్లు ముగించాలంటే అతడికి బౌలింగ్ ఇవ్వాలి!!టాపార్డర్ బ్యాటర్లకు సరైన సహకారం లభించాలంటే నాన్‌స్ట్రయికర్‌గా అతడు ఉండాలి...లోయర్ ఆర్డర్‌ను కాచుకుంటూ విలువైన పరుగులు చేయాలంటే క్రీజులో అతడు ఉండాలి...గడ్డు పరిస్థితుల్లో జట్టును గట్టెక్కించాలంటే అతడు బ్యాట్‌తో ‘కత్తిసాము’ చేయాలి!!ఇలా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో అతి ముఖ్యమైన ఆ అతడు మరెవరో కాదు... రవీంద్ర సింగ్ జడేజా. పుష్కర కాలానికి పైగా భారత టెస్టు జట్టులో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్ తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తన విలువ చాటుకుంటున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలతో మెరిసిన ‘జడ్డూ’... లార్డ్స్‌లో ఓటమి అంచున నిలిచిన జట్టును దాదాపు విజయానికి చేరువ చేశాడు. ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అనే విమర్శల నుంచి... పరిపూర్ణ ఆల్‌రౌండర్ అనిపించుకును స్థాయికి ఎదిగిన జడేజాపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగంఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ విజయానికి 193 పరుగులు అవసరం కాగా... 82 పరుగులకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. ఇంకేముంది మరో పది, ఇరవై పరుగుల వ్యవధిలో మిగిలిన మూడు వికెట్లు కూలడం ఖాయమే అనే ఊహగానాల మధ్య భారత జట్టు చివరకు 170 పరుగులు చేయగలిగింది. చివరి ముగ్గురు బ్యాటర్లు వీరోచిత పోరాటం చేసిన మాట వాస్తవమే అయినా... దానికి నాయకత్వం వహించింది మాత్రం ముమ్మాటికీ రవీంద్ర జడేజానే. యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఇలా నమ్ముకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతుంటే జడేజా మాత్రం మొక్కవోనిసంకల్పంతో బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో కట్టిపడేశాడు. మరో ఎండ్‌లో వికెట్ కాపాడుకోవడం కూడా ముఖ్యమైన తరుణంలో నితీశ్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్ అండతో జట్టును గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అతడు స్టోక్స్, ఆర్చర్, వోక్స్, కార్స్ వేసిన బౌన్సర్లకు ఎదురు నిలిచిన తీరు... పోరాట యోధుడిని తలపించింది. స్కోరు బోర్డు పరిశీలిస్తే జడేజా పేరిట అర్ధశతకం మాత్రమే కనిపిస్తుంది కానీ... లార్డ్స్‌లో అతడు చేసిన పోరాటం సెంచరీకి తీసిపోనిది. కఠిన క్షణాలు, పరీక్ష పెడుతున్న బంతులు, బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన పరిస్థితులు... వీటన్నిటితో పోరాడిన జడ్డూ క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్నాడు. వరుసగా నాలుగు ఫిఫ్టీలు... 11, 25 నాటౌట్, 89, 69 నాటౌట్, 72, 61 నాటౌట్... తాజా ఇంగ్లండ్ సిరీస్‌లో జడేజా గణాంకాలివి. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తప్ప అతడు విఫలమైంది లేదు. లీడ్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ తరఫున జైస్వాల్, గిల్, రాహుల్ ఒక్కో సెంచరీ చేస్తే పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదాడు. దీంతో జడేజాకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ గిల్ అనితరసాధ్యమైన బ్యాటింగ్ ప్రదర్శనకు సంపూర్ణ సహకారం అందించిన ఘనత జడేజాదే. తొలి ఇన్నింగ్స్‌లో ఆరో వికెట్‌కు గిల్‌తో కలిసి 203 పరుగులు జోడించి జట్టుకు కొండంత స్కోరు అందించిన ‘జడ్డూ’... రెండో ఇన్నింగ్స్‌లోనూ సారథితో కలిసి ఐదో వికెట్‌కు 175 పరుగులు జతచేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెపె్టన్‌కు అండగా నిలుస్తూ స్ట్రయిక్ రొటేట్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ ఓ మాదిరిగా రాణించిన సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన అతడు... రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణంగా పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లంతా ఒకదశలో జడేజాను అవుట్ చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకొని అవతలి ఎండ్‌లో వికెట్ పడగొట్టేందుకే ప్రయత్నించారంటే అతడు ఎంత పట్టుదలగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. వికెట్ విలువ గుర్తెరిగి... గత ఏడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు జడేజా కూడా వీడ్కోలు పలికాడు. తదనంతరం ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించగా... ‘జడ్డూ’ మాత్రం కొనసాగుతున్నాడు. జైస్వాల్, గిల్, సుదర్శన్, సుందర్, నితీశ్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో... రాహుల్, పంత్ కన్నా ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం ఉన్న జడేజా ఈ సిరీస్‌లో తన వికెట్ విలువ గుర్తెరిగి బ్యాటింగ్ చేస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు తన బ్యాటింగ్‌ను మార్చుకుంటూ ప్రతి కెప్టెన్ తన జట్టులో ఇలాంటి ప్లేయర్ ఉండాలనుకునే విధంగా ఆడుతున్నాడు. గతంలో కేవలం తన బౌలింగ్, ఫీల్డింగ్‌తోనే జట్టులో చోటు దక్కించుకున్న ‘జడ్డూ’... ఇప్పుడు నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగాడు. ఒకప్పుడు ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అని విమర్శలు ఎదుర్కొన్న అతడు... వాటికి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. భారత గడ్డపై మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు తీసిన జడేజా... విదేశాల్లో బౌలింగ్‌తో అద్భుతాలు చేయలేకపోయినా... నిఖార్సైన బ్యాటర్‌గానూ జట్టులో చోటు నిలుపుకునే స్థాయికి ఎదిగాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటుండగా... ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్‌కు ముందు చివరి ఓవర్లో స్టోక్స్ అవుట్ కావడం వెనక ‘జడ్డూ’ కృషి ఉంది. అంతకుముందు ఓవర్ వేసిన అతడు కేవలం 90 సెకన్లలోనే ఆరు బంతులు వేయడంతో మరో అదనపు ఓవర్ వేసే అవకాశం దక్కగా... అందులో సుందర్ బౌలింగ్‌లో స్టోక్స్ పెవిలియన్ చేరాడు. ఎప్పుడూ తెరవెనుకే! జడేజా టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి చూసుకుంటే... అతడి కంటే ఐదుగురు బౌలర్లు మాత్రమే ఎక్కువ బంతులు వేశారు. 2018 తర్వాతి నుంచి అతడు 42.01 సగటుతో పరుగులు రాబట్టాడు. 83 టెస్టుల్లో జడ్డూ 4 సెంచరీలు, 26 అర్ధసెంచరీలతో 3697 పరుగులు చేయడంతో పాటు... 326 వికెట్లు పడగొట్టాడు. అందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అయితే ఇందులో అధిక శాతం ఉపఖండ పిచ్‌లపైనే నమోదవడం... జడేజా మంచి స్కోరు చేసిన మ్యాచ్‌ల్లో టాపార్డర్ భారీగా పరుగులు రాబట్టడంతో ఎప్పుడూ అతడి పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. పదకొండేళ్ల క్రితం 2014లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులో ధనాధన్ హాఫ్ సెంచరీతో పాటు ఆఖర్లో చక్కటి త్రోతో అండర్సన్‌ను రనౌట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజా ఈసారి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అయితే ఈ క్రమంలో తన పోరాటంతో మాత్రం అందలమెక్కాడు. ఇకపై కూడా అతడు ఇదే నిలకడ కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఆరు బంతులను ఒకే ప్రాంతంలో వేయగల నైపుణ్యంతో పాటు... వేర్వేరుగా సంధించగల వైవిధ్యం గల జడేజా... నోబాల్స్ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది! -
‘కీబోర్డ్ వారియర్స్’ను సైలెంట్ చేశా
లండన్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ క్రమంలో ఆర్చర్ విమర్శకులను ఉద్దేశించి ‘కీబోర్డ్ వారియర్స్’ అనే పదాన్ని ఉపయోగించాడు. 2021లో చివరిసారి ఇంగ్లండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన ఆర్చర్... టీమిండియాతో జరిగిన లార్డ్స్ టెస్టుతో పునరాగమనం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించిన ఆర్చర్... రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.‘ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇన్నాళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి విజయంలో భాగమవడం సంతోషంగా ఉంది. గత మూడు నాలుగేళ్లుగా ఎంతమంది ‘కీబోర్డ్ వారియర్స్’ నన్ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారో లెక్కచెప్పలేను. ఎన్నో గాయాలు, మరెన్నో పునరావాస శిబిరాల తర్వాత వచ్చిన ఈ గెలుపు చాలా ప్రత్యేకం’ అని ఆర్చర్ అన్నాడు. మోచేయి, వెన్నునొప్పి, కండరాలు ఇలా ఎన్నో గాయాల బారిన పడిన 30 ఏళ్ల ఆర్చర్... గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సంతరించుకోవడంతో సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి అడుగు పెట్టాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు పంత్, వాషింగ్టన్ సుందర్‌ను ఆర్చర్ పెవిలియన్‌కు పంపాడు. పంత్ వికెట్‌తో జట్టులో నూతనోత్సాహం వచ్చిందని ఆర్చర్ వెల్లడించాడు. ‘ఇన్నాళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశా. ఇది శుభసూచకం. పంత్ వికెట్‌తో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మరింత పట్టుబిగించగలిగాం’ అని ఆర్చర్ అన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్ల మధ్య ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో నాలుగో మ్యాచ్ ప్రారంభం కానుంది. -
రాణించిన జెమీమా, దీప్తి
సౌతాంప్టన్: ఇంగ్లండ్ మహిళలతో టి20 సిరీస్‌ను గెలుచుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌లో శుభారంభంపై దృష్టి పెట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... కడపటి వార్తలందేసరికి 45 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు), దీప్తి శర్మ (57 బంతుల్లో 57 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 86బంతుల్లో 90 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ‘బర్త్‌డే గర్ల్’ సోఫియా డంక్లీ (92 బంతుల్లో 83; 9 ఫోర్లు), అలైస్ డేవిడ్సన్ (73 బంతుల్లో 53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శతక భాగస్వామ్యం... భారత పేసర్, మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. తన తొలి ఓవర్లోనే ఎమీ జోన్స్ (1)ను బౌల్డ్ చేసిన ఆమె, తన తర్వాతి ఓవర్లో బీమాంట్ (5)ను ఎల్బీగా పంపడంతో ఇంగ్లండ్ స్కోరు 20/2 వద్ద నిలిచింది. ఈ దశలో నాట్ సివర్ బ్రంట్ (52 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమా ల్యాంబ్ (50 బంతుల్లో 39; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 87 బంతుల్లో 71 జత చేశారు. అయితే ఆఫ్‌స్పిన్నర్ స్నేహ్ రాణా ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టింది. తన వరుస ఓవర్లలో ఆమె ల్యాంబ్, నాట్ సివర్లను పెవిలియన్‌కు పంపించడంతో భారత్ పైచేయి సాధించింది. అయితే డంక్లీ, అలైస్ చక్కటి బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఐదో వికెట్‌కు 23.4 ఓవర్లలో 106 పరుగులు జోడించారు. ఎట్టకేలకు అలైస్‌ను అవుట్ చేసి ఆంధ్ర బౌలర్ శ్రీచరణి ఈ జోడీని విడగొట్టింది. చివర్లో సోఫీ ఎకెల్‌స్టోన్ (19 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడటంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 49 పరుగులు సాధించింది. భారత ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. కెప్టెన్ విఫలం... ఛేదనను భారత ఓపెనర్లు ధాటిగా మొదలు పెట్టారు. తొలి వికెట్‌కు ప్రతీక రావల్ (51 బంతుల్లో 36; 3 ఫోర్లు)తో కలిసి 8 ఓవర్లలోనే 48 పరుగులు జోడించిన అనంతరం స్మృతి మంధాన (24 బంతుల్లో 28; 5 ఫోర్లు) వెనుదిరిగింది. ఆ తర్వాత 8 పరుగుల వ్యవధిలో ప్రతీక, హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 27; 4 ఫోర్లు) పెవిలియన్ చేరారు. నిర్లక్ష్యంగా పరుగెత్తిన హర్లీన్ అనూహ్యంగా రనౌటైంది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17) విఫలమైంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బీమాంట్ (ఎల్బీ) (బి) క్రాంతి 5; ఎమీ జోన్స్ (బి) క్రాంతి 1; ఎమా ల్యాంబ్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) రాణా 39; నాట్ సివర్ (సి) జెమీమా (బి) రాణా 41; డంక్లీ (బి) అమన్‌జోత్ 83; అలైస్ డేవిడ్సన్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) శ్రీచరణి 53; ఎకెల్‌స్టోన్ (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–8, 2–20, 3–91, 4–97, 5–203, 6–258. బౌలింగ్: అమన్‌జోత్ 10–0–58–1, క్రాంతి గౌడ్ 9–0–55–2, దీప్తి శర్మ 10–0–58–0, శ్రీచరణి 10–0–46–1, స్నేహ్ రాణా 10–0–31–2, ప్రతీక 1–0–7–0. -
ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
తాజాగా ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో భారత్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించి, గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసినందుకు గానూ ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించడంతో పాటు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను కట్ చేసింది. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ సభ్యుడు రిచీ రిచర్డ్సన్ ఇంగ్లండ్‌పై చర్యలకు ఆదేశించాడు.నిర్దేశిత సమయంలోపు ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడిందని రిచర్డ్సన్ తెలిపాడు. స్లో ఓవర్ రేట్ అనేది ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి వస్తుందని అన్నాడు. స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘన కింద ఒక్కో ఓవర్‌కు 5 శాతం మ్యాచ్ ఫీజ్ కోత ఉంటుందని గుర్తు చేశాడు.దీని అదనంగా ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక్కో స్లో ఓవర్‌కు ఓ రేటింగ్ పాయింట్ కోత ఉంటుందని తెలిపాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నేరాన్ని అంగీకరించడంతో పాటు ప్రతిపాదిత శిక్షను స్వీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేదని రిచర్డ్సన్ ప్రకటించాడు.కాగా, లార్డ్స్ టెస్ట్‌లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బోల్తా పడింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి ప్రారంభం కానుంది. -
భారత్‌తో తొలి టెస్ట్.. బ్యాట్‌తో విఫలమైనా, బంతితో చెలరేగిన మైఖేల్ వాన్ తనయుడు
భారత్, ఇంగ్లండ్ అండర్ 19 జట్ల మధ్య జరిగిన తొలి యూత్ టెస్ట్ డ్రాగా ముగిసింది. బెకెన్హమ్లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆట చివరి రోజు అయిన నాలుగో రోజు భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 270 పరుగుల స్కోర్ వద్ద ఆగిపోయింది. భారత బౌలర్లకు మరికాస్త సమయం దొరికివుంటే ఈ మ్యాచ్‌లో ఫలితం తేలిది. విజయానికి యంగ్ ఇండియా మరో 3 వికెట్ల దూరంలో మాత్రమే ఉండింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ సారధి హమ్జా షేక్ (112) అద్భుతమైన సెంచరీతో ప్రతిఘటించారు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లు బెన్ మేస్ (51), థామస్ రూ (50) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అంబరీష్ 2, దేవేంద్రన్, అన్మోల్జీత్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (56), విహాన్ మల్హోత్రా (63), అంబరీష్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కెప్టెన్ ఆయుశ్ మాత్రే 32 పరుగులకు ఔటయ్యాడు.బ్యాట్‌తో విఫలమైనా, బంతితో చెలరేగిన ఆర్చీ వాన్ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ మైఖేల్ వాన్ తనయుడు ఆర్చీ వాన్ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో (2, 3) విఫలమైనా బంతితో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన వాన్.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.మాత్రే సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (14) ఈ ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు.సెంచరీ మిస్ చేసుకున్న ఫ్లింటాఫ్ తనయుడుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ (93) సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీతో పాటు కెప్టెన్ హమ్జా షేక్ (84) సత్తా చాటారు. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు ఎకాంశ్ సింగ్ (59), రాల్ఫీ ఆల్బర్ట్ (50) అర్ద సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, వైభవ్ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్ దేవేంద్రన్, మొహమ్మద్ ఎనాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు. రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. -
ఇక వన్డే సిరీస్ లక్ష్యంగా...
సౌతాంప్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత మహిళల జట్టు మొదటి మిషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు టి20ల సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండో మిషన్ కోసం శ్రమించేందుకు సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ తొలి వన్డే జరుగుతుంది. పొట్టి సిరీస్ ఇచ్చిన విజయోత్సాహంతో హర్మన్‌ప్రీత్ బృందం ఆత్మవిశ్వాసంతో ఉండగా... సొంతగడ్డపై సిరీస్‌ను కోల్పోయామన్న కసితో ఇంగ్లండ్ ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా వన్డే సిరీస్‌నూ కోల్పోయేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్ నుంచి పట్టుబిగించాలని భావిస్తోంది. జోరు మీదున్న టీమిండియా ఇక్కడ తాజా టి20 సిరీస్‌లోనే కాదు... ఇటీవల శ్రీలంక గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ భారత్ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా, శ్రీలంకలను మట్టికరిపించింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లోనూ గెలిచి వన్డే ప్రపంచకప్‌కు ముందు పూర్తిస్థాయి సన్నద్ధతను చాటాలని హర్మన్‌ప్రీత్ బృందం ఆశిస్తోంది. షఫాలీ వర్మ స్థానంలో యువ ఓపెనర్ ప్రతీక రావల్, స్మృతి మంధాన భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ముక్కోణపు సిరీస్‌లో చెలరేగిన ప్రతీక, ఇక్కడ టి20 సిరీస్‌లో అదరగొట్టిన మంధాన వన్డేల్లో శుభారంభమిస్తే... జెమీమా, హర్మన్‌ప్రీత్, హర్లీన్, రిచా ఘోష్ మిడిలార్డర్‌ను చక్కబెట్టేస్తారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే తెలుగుతేజం స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి మ్యాచ్ మ్యాచ్‌కి పురోగతి సాధిస్తోంది. ఇంగ్లండ్‌లాంటి పిచ్‌లపై స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థుల్ని కట్టిపడేయడం భారత జట్టుకు అదనపు బలం కానుంది. అనుభవజ్ఞులైన దీప్తి శర్మ, అరుంధతి రెడ్డిలతో కూడిన బౌలింగ్ దళం ఓవరాల్ పటిష్టంగా ఉంది. ఇక ఆతిథ్య జట్టు విషయానికొస్తే రెగ్యులర్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ అందుబాటులోకి రావడం జట్టుకు కాస్త లాభించే అంశం. అయితే 20 ఓవర్లనే సరిగ్గా ఎదుర్కోలేకపోయిన బాధ్యతలేని బ్యాటింగ్ దళంతో 50 ఓవర్ల వన్డేలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్, అరుంధతి. ఇంగ్లండ్: నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), సోఫియా, టామీ బ్యూమోంట్, సోఫీ ఎకిల్‌స్టోన్, లారెన్ బెల్, బౌచియర్, క్యాప్సీ, కేట్ క్రాస్, చార్లీ డీన్, అమీ జోన్స్, లారెన్ ఫిలెర్.76 భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 76 వన్డేలు జరిగాయి. 34 మ్యాచ్‌ల్లో భారత్, 40 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.35 ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడిన మ్యాచ్‌లు. ఇందులో 9 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 24 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. -
గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా నిన్న (జులై 14) ముగిసిన మూడో టెస్ట్‌లో (లార్డ్స్) భారత్‌పై ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. లార్డ్స్ టెస్ట్‌లో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది.ఆ జట్టు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఎడమ చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సిరీస్‌లోని తదుపరి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. బషీర్ చేతి వేలికి ఈ వారం చివర్లో శస్త్రచికిత్స జరుగనున్నట్లు ఈసీబీ తెలిపింది. బషీర్ లార్డ్స్ టెస్ట్‌లో మూడో రోజు తన బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజా (తొలి ఇన్నింగ్స్) క్యాచ్ అందుకోబోయి గాయపడ్డాడు. ఆ గాయం తర్వాత బషీర్ ఆ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు.అయితే బషీర్ రెండో ఇన్నింగ్స్‌లో గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్‌కు దిగాడు. 9 బంతుల్లో 2 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత బషీర్ ఐదో రోజు ఎక్కువ భాగం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు.అయితే ఛేదనలో టీమిండియా టెయిలెండర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్న దశలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బషీర్‌ను తిరిగి బరిలోకి దించాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయని బషీర్.. చాలా సేపు తమ సహనాన్ని పరీక్షించిన మహ్మద్ సిరాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ గెలుపును ఖరారు చేశాడు. ఈ సిరీస్‌లో బషీర్ 3 మ్యాచ్‌ల్లో 54.1 సగటున 10 వికెట్లు తీశాడు.బషీర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ హార్ట్లీ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది.కాగా, తాజాగా ముగిసిన లార్ట్స్ టెస్ట్ టీమిండియాకు గుండెకోత మిగిల్చింది. విజయానికి అత్యంత చేరువగా వచ్చినా భారత్‌ను ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) వీరోచితంగా పోరాడాడు. అయినా లాభం లేకుండా పోయింది.అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. -
లార్డ్స్ టెస్ట్ లో భారత్ ఓటమి
-
ENG Vs IND: పోరాడినా... పరాజయమే
లార్డ్స్ టెస్టులో భారత్ గుండె పగిలింది. విజయానికి ఎంతో చేరువగా వచ్చినా చివరకు ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా పోరాడినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ జట్టును ముందుండి నడిపించగా... పట్టుదలగా బౌలింగ్ చేసిన ఆతిథ్య జట్టు మ్యాచ్ చేజారకుండా కాపాడుకోగలిగింది. ఈ టెస్టులో పలు సందర్భాల్లో శుబ్‌మన్ గిల్ బృందం ఆధిక్యం ప్రదర్శించినా... కీలక క్షణాలను ఇంగ్లండ్ సరిగ్గా ఒడిసి పట్టుకుంది. టీమ్ వెనుకబడిన ప్రతీసారి పోరాటయోధుడిలా నేనున్నానంటూ ముందుకొచ్చి సత్తా చాటిన స్టోక్స్‌దే ఈ గెలుపు అనడం అతిశయోక్తి కాదు. లండన్: ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’లో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్ మైదానంలో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌పై విజయం సాధించింది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్‌తో స్వల్ప స్కోరును కూడా కాపాడుకోవడంలో సఫలమైంది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 77 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. సిరీస్‌లో ఇంగ్లండ్ 2–1తో ముందంజలో ఉండగా... నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది. ఆర్చర్ పదునైన బౌలింగ్... ఓవర్‌నైట్ స్కోరు 58/4తో ఆటను కొనసాగించిన భారత్‌కు చివరి రోజు సరైన ఆరంభం లభించలేదు. 11 పరుగుల వ్యవధిలో జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న పంత్ తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఆర్చర్ అద్భుత బంతితో పంత్ (9)ను క్లీన్‌బౌల్డ్ చేయగా, స్టోక్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 6 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరిన ఇంగ్లండ్ ఫలితం సాధించింది. తర్వాతి ఓవర్లోనే ఆర్చర్ తన బౌలింగ్‌లో అద్భుత రిటర్న్ క్యాచ్‌తో సుందర్ (0)ను పెవిలియన్ పంపించాడు. 82/7 వద్ద పరిస్థితి చూస్తే భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. జడేజా పోరాటం... అప్పటి వరకు 15 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసిన జడేజా... జట్టు భారాన్ని తనపై వేసుకున్నాడు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ తర్వాతి ముగ్గురు బ్యాటర్లతో అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌తోనే ఒక్కో పరుగు జోడించడంతో పాటు అవతలి బ్యాటర్లను కాపాడుకుంటూ అతని ఇన్నింగ్స్ సాగింది. ఈ క్రమంలో పరుగుల రాక కూడా బాగా తగ్గిపోయింది. పదునైన డిఫెన్స్ చూపించగలిగినా... నితీశ్ కుమార్ రెడ్డి (53 బంతుల్లో 13; 1 ఫోర్) లంచ్‌కు ముందు వోక్స్ చక్కటి బంతికి వెనుదిరిగాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5; 1 ఫోర్), జడేజా భాగస్వామ్యం ఏకంగా 22 ఓవర్ల పాటు సాగింది. సహనం కోల్పోయిన బుమ్రా భారీ షాట్ ఆడబోయి అవుట్ కాగా... మొహమ్మద్ సిరాజ్ (40 బంతుల్లో 4) అండతో జడేజా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే చివర్లో పెరిగిన ఉత్కంఠ మధ్య స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ వికెట్‌తో భారత్ ఓటమి ఖాయయైంది. అలా ముగిసింది... భారత్ విజయానికి మరో 46 పరుగులు కావాల్సిన సమయంలో జడేజాతో సిరాజ్ జత కలిశాడు. జడేజా జాగ్రత్తగా స్ట్రయికింగ్ నిలబెట్టుకుంటుండగా... సిరాజ్ కూడా పట్టుదలగా 29 బంతులు ఆడి సహకరించాడు. మెలమెల్లగా భాగస్వామ్యం 13.1 ఓవర్లలో 23 పరుగులు పూర్తి చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వికెట్ తీయలేక ఇంగ్లండ్ శిబిరంలో అసహనం పెరిగిపోతోంది. ఇలాగే సాగితే సింగిల్స్‌తో మరో 23 పరుగులు కావడం సాధ్యమే అనిపించింది. అయితే సిరాజ్ అనూహ్య వికెట్‌తో ఆట ముగిసింది. బషీర్ వేసిన బంతిని సిరాజ్ దానిని చక్కగా డిఫెన్స్ ఆడాడు. అయితే కింద పడిన బంతి నెమ్మదిగా అతని కాలి వెనక భాగం వైపు వెళ్లగా, దానిని సిరాజ్ గుర్తించలేకపోయాడు. తేరుకునేలోపే బంతి స్టంప్స్‌ను తాకి ఒక బెయిల్ కింద పడటంతో ఇంగ్లండ్ సంబరాలు చేసుకుంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387; భారత్ తొలి ఇన్నింగ్స్: 387; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 192; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 0; రాహుల్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 39; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) కార్స్ 14; గిల్ (సి) స్మిత్ (బి) కార్స్ 6; ఆకాశ్‌దీప్ (బి) స్టోక్స్ 1; పంత్ (బి) ఆర్చర్ 9; జడేజా (నాటౌట్) 61; సుందర్ (సి అండ్ బి) ఆర్చర్ 0; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) వోక్స్ 13; బుమ్రా (సి) (సబ్) కుక్ (బి) స్టోక్స్ 5; సిరాజ్ (బి) బషీర్ 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (74.5 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58, 5–71, 6–81, 7–82, 8–112, 9–147, 10–170. బౌలింగ్: వోక్స్ 12–5–21–1, ఆర్చర్ 16–1–55–3, స్టోక్స్ 24–4–48–3, కార్స్ 16–2–30–2, రూట్ 1–0–1–0, బషీర్ 5.5–1–6–1. -
లార్డ్స్ టెస్ట్: ముగిసిన నాలుగో రోజు ఆట
-
బ్యాటర్లదే భారం
లార్డ్స్ విజేత... సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లే జట్టేదో నేడు తేలనుంది. నాలుగో రోజు 14 వికెట్లు పడ్డాయి. ఆఖరి రోజూ వికెట్ల జోరు కొనసాగితే మాత్రం ఎవరి అంచనాలకు అందని ఫలితమే వస్తుంది. పిచ్ మారుతున్న ధోరణి, బ్యాటర్లకు ఎదురవుతోన్న పరిస్థితి చూస్తుంటే... అగ్ని పరీక్ష తప్పదేమో! దీంతో బంతిని ఎదుర్కోవడం కంటే ప్రతి ఓవర్లో బ్యాటర్లు సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్‌ను మిగిలున్న 135 పరుగుల లక్ష్యం ఊరిస్తుంటే... పిచ్ ఇంగ్లండ్‌ను ఉత్సాహపరుస్తోంది. లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ఆఖరి మజిలీకి చేరింది. మూడో రోజు ముగిసేసరికి సమంగా నిలిచిన జట్లు... నాలుగో రోజు బౌలర్ల పట్టుదలకు తలొగ్గాయి. భారత బ్యాటర్లు రాణిస్తే గెలుపు... ఇంగ్లండ్ బౌలర్లు పడగొడితే ముప్పు... ఏదేమైనా ఐదో రోజు ఆట రసవత్తర ముగింపునకు తెరలేపనుంది. ఇంగ్లండ్‌ను 200 పరుగుల్లోపే ఆలౌట్ చేశామన్న ఆనందాన్ని భారత టాపార్డర్ వికెట్లు ఆవిరి చేశాయి. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 33 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బ్రైడన్ కార్స్ 2 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ మొదలైన రెండో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (0) నిర్లక్ష్యంగా వికెట్‌ను పారేసుకోగా... కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (6) కార్స్ అద్బుతమైన బంతులకు వికెట్ల ముందు దొరికిపోయారు. ‘నైట్‌వాచ్‌మన్’ ఆకాశ్‌దీప్ (1)ను స్టోక్స్ క్లీన్‌బౌల్ట్ చేశాడు. భారత్ చేతిలో 6 వికెట్లుండగా... గిల్ బృందం విజయానికి 135 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 62.1 ఓవర్లలో 192 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్ (96 బంతుల్లో 40; 1 ఫోర్), కెపె్టన్ బెన్ స్టోక్స్ (96 బంతుల్లో 33; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 12.1–2–22–4 చక్కని స్పెల్‌తో తిప్పేశాడు. సిరాజ్ మొదలుపెడితే... అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 2/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్‌ను సిరాజ్ తన పేస్ బౌలింగ్‌తో వణికించాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో డకెట్ (12)ను అవుట్ చేశాడు. కాసేపటికి ఒలీ పోప్ (4)ను ఎల్బీగా పంపాడు. సిరాజ్ పేస్‌ను గమనించిన కెప్టెన్ గిల్ మరో ఎండ్‌లో బుమ్రాను తప్పించి నితీశ్ కుమార్‌కు బంతిని అప్పగించడం ఫలితాన్నిచ్చింది. ఓపెనర్ క్రాలీ (22)ని నితీశ్ అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ అతని వికెట్‌ను నితీశే తీశాడు. దీంతో 50 పరుగులకే ఇంగ్లండ్ 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రూట్, హ్యారీ బ్రూక్ నిలబడేందుకు చేసిన ప్రయత్నం లంచ్వరకైనా నిలువలేదు. ఆకాశ్‌దీప్ ఓవర్లో మిడాఫ్ దిశగా భారీ సిక్సర్ బాదిన బ్రూక్ అదే జోరులో స్వీప్‌షాట్ ఆడే యత్నంలో బోల్తా పడ్డాడు. స్టంప్స్ లక్ష్యంగా సంధించిన ఆకాశ్ బంతి బ్రూక్ మిడిల్ స్టంప్‌ను పడేసింది. దీంతో 87 పరుగుల వద్ద అతను క్లీన్»ౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ కీలకమైన నాలుగో వికెట్ కోల్పోయింది. 98/4 వద్ద లంచ్‌బ్రేక్‌కు వెళ్లారు. సుందర్ ఉచ్చులో... రెండో సెషన్లో ఇంగ్లండ్ తేరుకుంది. ఇటు రూట్, అటు కెప్టెన్ స్టోక్స్ నిలకడగా ఆడారు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశారు. దీంతో ఈ సెషన్లో భారత బౌలర్లు పడిన కష్టానికి తగిన ఫలితమైతే రాలేదు. అయితే సుందర్ మాయాజాలం మొదలవడంతో జట్టు స్కోరు 150 దాటిన తర్వాత రూట్, స్వల్ప వ్యవధిలోనే స్మిత్ (8) అవుటయ్యారు. ఈ సెషన్లో కేవలం 2 వికెట్లనే కోల్పోయి 77 పరుగులు జతచేసింది. అయితే మూడో సెషన్ ఇంగ్లండ్‌ను ముంచింది. స్టోక్స్ వికెట్‌ను పడేయడంతో సుందర్ ఆలౌట్‌కు సిద్ధం చేశాడు. వోక్స్ (10), కార్స్ (1)లను బుమ్రా బౌల్డ్ చేయగా, బషీర్ (2)ను బౌల్డ్ చేసి సుందర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387; భారత్ తొలిఇన్నింగ్స్: 387; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) జైస్వాల్ (బి) నితీశ్ 22; డకెట్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 12; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 4; జో రూట్ సుందర్ 40; బ్రూక్ (బి) ఆకాశ్‌దీప్ 23; స్టోక్స్ (బి) సుందర్ 33; స్మిత్ (బి) సుందర్ 8; వోక్స్ (బి) బుమ్రా 10; కార్స్ (బి) బుమ్రా 1; ఆర్చర్ (నాటౌట్) 5; బషీర్ (బి) సుందర్ 2; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం (62.1 ఓవర్లలో ఆలౌట్) 192. వికెట్ల పతనం: 1–22, 2–42, 3–50, 4–87, 5–154, 6–164, 7–181, 8–182, 9–185, 10–192. బౌలింగ్: బుమ్రా 16–3–38–2, సిరాజ్ 13–2–31–2, నితీశ్ 5–1–20–1, ఆకాశ్‌దీప్ 8–2–30–1, జడేజా 8–1–20–0, సుందర్ 12.1–2–22–4. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 0; రాహుల్ (బ్యాటింగ్) 33; కరుణ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కార్స్ 14; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కార్స్ 6; ఆకాశ్ దీప్ (బి) స్టోక్స్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 58. వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58. బౌలింగ్: వోక్స్ 5–2–11–0, ఆర్చర్ 4–0–18–1, స్టోక్స్ 4.4–0–15–1, కార్స్ 4–1–11–2. -
లార్డ్స్ టెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట
-
తొలిరోజు ఆటలో భారత్‌దే పైచేయి
-
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. వరుసగా రెండు ఓవర్లలో రెండు హ్యాట్రిక్‌లు
క్రికెట్ చరిత్రలో ఊహలకందని అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ బౌలర్ ఓ మ్యాచ్‌లో వరుసగా రెండో ఓవర్లలో రెండు హ్యాట్రిక్‌లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టూ కౌంటీస్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఇది జరిగింది. ఈ టోర్నీ డివిజన్-6లో భాగంగా కెస్గ్రేవ్తో జరిగిన మ్యాచ్‌లో ఐప్స్విచ్ అండ్ కోల్చెస్టర్ క్రికెట్ క్లబ్ స్పిన్ బౌలర్ కిషోర్ కుమార్ సాథక్ వరుస ఓవర్లలో రెండు హ్యాట్రిక్‌లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 6 ఓవర్లు వేసిన సాథక్ 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా అతని జట్టు కెస్గ్రేవ్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఓ ఫీట్ నమోదైన దాఖలాలు ఎక్కడా లేవు. 2017లో ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో న్యూసౌత్ వేల్స్‌కు ఆడుతూ రెండు హ్యాట్రిక్‌లు తీశాడు. అలాగే 113 ఏళ్ల కిందట ఓల్డ్ ట్రాఫర్డ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ జిమ్మీ మాథ్యూస్ కూడా ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీశాడు.అయితే ఈ రెండు సందర్భాల్లో రెండు హ్యాట్రిక్‌లు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో నమోదయ్యాయి.కాగా, ఇంచుమించు ఇలాంటి ఘటనే ఒకటి నిన్న పొట్టి క్రికెట్లో కూడా నమోదైంది. ఐర్లాండ్ ఇంటర్ ఫ్రావిన్సియల్ టోర్నీలో ఓ బౌలర్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో మన్స్టర్ రెడ్స్‌కు ఆడుతున్న (కెప్టెన్ కూడా) ఐర్లాండ్ జాతీయ జట్టు ప్లేయర్ కర్టిస్ క్యాంఫర్.. నార్త్ వెస్ట్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కర్టిస్ 11వ ఓవర్ చివరి 2 బంతులకు 2 వికెట్లు, 13వ ఓవర్ తొలి మూడు బంతులకు 3 వికెట్లు తీశాడు. టెక్నికల్‌గా కర్టిస్ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీశాడు.పురుషుల ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో (అంతర్జాతీయ క్రికెట్, దేశవాలీ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్) మునుపెన్నడూ ఏ బౌలర్ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీయలేదు. అయితే ఓ స్థానిక మ్యాచ్‌లో మాత్రం ఇటీవలే ఈ ప్రదర్శన నమోదైంది. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడే దిగ్వేశ్ రాఠీ ఒకే ఓవర్లో వరుసగా 5 వికెట్లు తీశాడు. ఇందులో తొలి నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం మరో విశేషం. -
ENG Vs IND 3rd Test: 99 నాటౌట్.. జో రూట్ సాధించిన రికార్డులు
లార్డ్స్ వేదికగా టీమిండియాతో నిన్న (జులై 10) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.రెచ్చిపోయిన నితీశ్ కుమార్13 ఓవర్ల వరకు స్థిరంగా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ ధాటికి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నితీశ్ 14వ ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్, ఆరో బంతికి జాక్ క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.అయితే ఓలీ పోప్.. రూట్ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 109 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరింది. అనంతరం జడేజా పోప్‌ను ఔట్ చేశాడు. 50వ ఓవర్ తొలి బంతికి జడ్డూ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి పోప్ పెవిలియన్‌కు చేరాడు.ఆతర్వాత కొద్ది సేపటికే ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. బుమ్రా అద్భుతమైన బంతితో హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో రూట్‌తో జతకట్టిన స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయమైన 79 పరుగులు జోడించి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.ముఖ్యంగా రూట్ తనలోని అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టి భారత్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నాడు. రూట్ 99 పరుగుల వద్ద తొలి రోజు ఆటను ముగించాడు. రూట్ తొలి రోజు సెంచరీ పూర్తి చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. చివరి ఓవర్లో రూట్ సెంచరీ పూర్తి చేయాలని ప్రయత్నించినా కుదర్లేదు.రూట్ సాధించిన రికార్డులుఏది ఏమైన ఈ ఇన్నింగ్స్‌తో రూట్ పలు రికార్డులను సాధించాడు. 45 పరుగుల స్కోర్ వద్ద భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఓ జట్టుపై ఓ బ్యాటర్ 3000 పరుగులు చేయడం ఇది మూడో సారి. రూట్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇంగ్లండ్‌పై, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు.ఈ ఇన్నింగ్స్‌తో రూట్ మరో 3 రికార్డులు కూడా సాధించాడు. 99 పరుగుల స్కోర్ వద్ద రూట్ ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తొలి ఫోర్‌తో రూట్ టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అలిస్టర్ కుక్ (816) తర్వాత ఈ ఫీట్‌ను నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 33 పరుగుల వద్ద రూట్ భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. -
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ ఆచితూచి...
ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్‌ను లేటెస్ట్గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్‌కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. లండన్: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్‌దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది. జో రూట్ (191 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్ (44; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు. బాగుందిరా... మామ! ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్ డకెట్ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్‌లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడినా... బ్యాట్‌కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్ కీపర్‌కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్ దీప్, సిరాజ్‌లు బౌలింగ్‌కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్ వేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో బంతికి డకెట్‌ను, ఆరో బంతికి క్రాలీని అవుట్ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్‌లో రికార్డు కావడంతో ‘ఎక్స్’లో ఈ క్లిప్ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్లో ఇంకో వికెట్‌కు ఆస్కారం లేకపోయింది. ‘నీరు’గార్చిన రెండో సెషన్ భారత బౌలర్లను రెండో సెషన్ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు. షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్ విరామం తర్వాతే రూట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్‌తోపాటు పోప్ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్ వికెట్ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది. రూట్ 99 బ్యాటింగ్ మూడో సెషన్ మొదలైన బంతికే పోప్ వికెట్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్ (11)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్ టర్నింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు రూట్, స్టోక్స్ 79 పరుగులు జోడించారు. రూట్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.పంత్‌కు గాయం... జురేల్ కీపింగ్! భారత డాషింగ్ వికెట్‌కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్ నుంచి ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్‌కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 23; ఒలీ పోప్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్: బుమ్రా 18–3–35–1, ఆకాశ్‌దీప్ 17–2–75–0, సిరాజ్ 14–5–33–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్ సుందర్ 10–1–21–0. -
T20 WC 2026: వార్మప్ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించిన ఐసీసీ
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు సంబంధించిన అంతర్జాతీయ మండలి (ICC) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా జట్లు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. కాగా వచ్చే ఏడాది జూన్ 12- జూలై 5 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహణకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్‌లు ఇప్పటికే అర్హత సాధించగా.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లను ఆడిస్తారు.ఇక ఈ టోర్నీని 24 రోజుల పాటు నిర్వహించనుండగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయని ఐసీసీ.. వేదికలకు మాత్రం ఫైనల్ చేసింది. కార్డిఫ్స్ సోఫియా గార్డెన్స్, డెర్బీ కౌంటీ గ్రౌండ్, లొబరో యూనివర్సిటీ మైదానాల్లో సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయని గురువారం వెల్లడించింది.కాగా 2024 నాటి మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈసారి భారత్ జూన్ 14 నాటి తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత గ్లోబల్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సౌతాఫ్రికాతో జూన్ 21, క్వాలిఫయర్ జట్టుతో జూన్ 25, ఆస్ట్రేలియాతో జూన్ 28న భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి.చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ అతడే: శిఖర్ ధావన్ -
చరిత్ర సృష్టించేందుకు 45 పరుగుల దూరంలో ఉన్న రూట్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా ఇవాల్టి (జులై 10) నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ పలు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని రూట్.. మూడో టెస్ట్‌లో చెలరేగవచ్చు. రూట్ గత రెండు టెస్ట్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 36.33 సగటున కేవలం 109 పరుగులు మాత్రమే చేశాడు.నేటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్‌లో రూట్ బద్దలు కొట్టే ఆస్కారం ఉన్న రికార్డులు ఇవే..!టెస్ట్‌ల్లో భారత్‌పై 3000 పరుగులులార్డ్స్ టెస్ట్‌లో రూట్ 45 పరుగులు చేస్తే భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇదే జరిగితే రూట్ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 99 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకుంటాడు. అతి తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లుఈ మ్యాచ్‌లో రూట్ మరో ఫోర్ కొడితే టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ ఫీట్‌ను అలిస్టర్ కుక్ (816) ఒక్కడే సాధించాడు.భారత్‌పై 50 క్యాచ్లుఈ మ్యాచ్‌లో రూట్ మూడు క్యాచ్‌లు పడితే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 50 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసే రూట్ టెస్ట్‌ల్లో కొన్ని సందర్భాల్లో ఇంగ్లండ్‌ను క్యాచ్‌లతోనే గెలిపించాడు.భారత్‌పై 4000 పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 33 పరుగులు చేస్తే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫీట్‌ను చాలా తక్కువ మంది సాధించారు.ఇంగ్లండ్‌లో 11000 పరుగులుఈ మ్యాచ్‌లో రూట్ 189 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లలో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును కూడా చాలా తక్కువ మంది సాధించారు.కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. మూడో మ్యాచ్ ఇవాళ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. -
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మరో టెస్ట్ మ్యాచ్ కు రంగం సిద్ధం
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్ కైవసం
మహిళల క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 9) జరిగిన నాలుగో టీ20 భారత్ 6 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించకుంది. 2012 నుంచి ఇంగ్లండ్‌లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు ఆడుతున్న భారత్ తొలిసారి విజయఢంకా మోగించింది. భారత్‌కు ఇంగ్లండ్‌పై వారి దేశంలో కాని స్వదేశంలో కాని ఇదే తొలి టీ20 సిరీస్ గెలుపు. టీమిండియా ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు నాలుగు టీ20 సిరీస్‌లు ఆడగా.. ఇంగ్లండ్ 3, భారత్ 1 గెలిచాయి. 2012, 2021, 2022 సిరీస్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ప్రస్తుత సిరీస్‌లో (2025) భారత్ విజేతగా నిలిచింది. ఈ సిరీస్‌లో నామమాత్రపు చివరి మ్యాచ్ బర్మింగ్హమ్ వేదికగా జులై 12న జరుగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. జులై 16, 19, 22 తేదీల్లో సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్ లీ స్ట్రీట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.నాలుగో టీ20 విషయానికొస్తే.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా.. టీమిండియా స్పిన్నర్లు చెలరేగిపోయారు. రాధా యాదవ్ (4-0-15-2), శ్రీ చరణి (4-0-30-2), దీప్తి శర్మ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. పేసర్లు అమన్‌జోత్ కౌర్ (4-0-20-1), అరుంధతి రెడ్డి (3-0-16-0) కూడా పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డంక్లీ (22) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ బేమౌంట్ (20), అలైస్ క్యాప్సీ (18), స్కోల్ఫీల్డ్ (16), ఎక్లెస్టోన్ (16 నాటౌట్), వాంగ్ (11 నాటౌట్) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 3 ఓవర్లు మిగిలుండగానే సునాయాసంగా ఛేదించింది. స్మృతి మంధన 32, షఫాలీ వర్మ 31, జెమీమా రోడ్రిగెజ్ 24 (నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ 26 , రిచా ఘోష్ 7 (నాటౌట్) పరుగులు చేసి భారత్‌ను గెలపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లోట్ డీన్, ఎక్లెస్టోన్, వాంగ్ తలో వికెట్ తీశారు. -
ఆధిక్యమే లక్ష్యంగా...
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ గ్రౌండ్‌లోనే మూడు టెస్టులు గెలిచింది. ఇతర ఏ మైదానంలోనూ రెండుకు మించి విజయాలు సాధించలేదు. మనకు కలిసొచ్చిన వేదికపై ఇప్పుడు మరో సమరం. మ్యాచ్‌లో బుమ్రా పునరాగమనంతో పెరిగిన పేస్ బలం. గత టెస్టులో సాధించిన ఘన విజయం ఇచి్చన అంతులేని ఆత్మవిశ్వాసం. వెరసి కొత్త ఉత్సాహంతో భారత జట్టు మూడో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు బలహీనమైన ఆటతో రెండో టెస్టును కోల్పోయిన ఆతిథ్య ఇంగ్లండ్ కోలుకోవాలని ఆశిస్తోంది. ఇక్కడా ఆ జట్టు ఓడిందంటే సిరీస్ చేజారినట్లే! లండన్: భారత్, ఇంగ్లండ్ సుదీర్ఘ టెస్టు సమరంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. 1–1తో సిరీస్ సమంగా ఉన్న స్థితిలో నేడు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మొదలవుతుంది. భారత జట్టు బర్మింగ్‌హామ్ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని అస్త్రశ్రస్తాలతో ఎలాంటి లోపాలు లేకుండా జట్టు సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇక్కడా విజయం సాధిస్తే 2–1తో దూసుకుపోయి ఆపై సిరీస్ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గిల్ బృందం మరింత పట్టు బిగించాలని భావిస్తోంది. జట్టులో అక్కడక్కడా పూరించలేని లోపాలు కనిపిస్తున్న ఇంగ్లండ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. ప్రసిధ్ స్థానంలో బుమ్రా... సిరీస్‌లో రెండు టెస్టుల్లో భారత జట్టు బలమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చించింది. టాప్–6లో కరుణ్ నాయర్ మినహా మిగతా వారంతా సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీలు నమోదు చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్, రిషభ్ పంత్ శతకాలు బాదగా... రవీంద్ర జడేజా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలు చేసి తన బ్యాటింగ్ పదును చూపించాడు. ముఖ్యంగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న గిల్‌ను ఇంగ్లండ్ బౌలర్లు నిలువరించలేకపోతున్నారు. వైఫల్యాలు ఉన్నా సరే, నాయర్‌కు సిరీస్‌లో మరో అవకాశం దక్కవచ్చు. కాబట్టి బ్యాటింగ్ బృందంలో ఎలాంటి మార్పూ ఉండదు. బౌలింగ్‌లో బుమ్రా ఆడటం ఖాయం కావడంతో ప్రసిధ్ కృష్ణ స్థానంలో అతను నేరుగా జట్టులోకి వస్తాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చెలరేగిన ఆకాశ్‌దీప్, సిరాజ్‌లకు ఇప్పుడు బుమ్రా జత కలిస్తే బౌలింగ్‌కు తిరుగుండదు. అదనపు స్పిన్నర్ కావాలని భావిస్తే నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ వస్తాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ మరోసారి కీలకం కానున్నారు. నాలుగేళ్ల తర్వాత... ఎప్పటిలాగే ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందు రోజే తమ తుది జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించింది. అతని వేగం తమకు అదనపు బలంగా మారుతుందని జట్టు నమ్ముతోంది. అయితే ఆర్చర్ ఏకంగా నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. అతను ఏమాత్రం ప్రభావం చూపుతాడనే చెప్పలేం. మరో ఇద్దరు పేసర్లు వోక్స్, కార్స్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. వీరిద్దరు సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా... ఈ టెస్టు కోసం ఎంపిక చేసిన అట్కిన్సన్ గాయంతో తప్పుకోవడంతో మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 71 ఓవర్లలో 286 పరుగులు ఇచ్చినా స్పిన్నర్‌గా షోయబ్ బషీర్‌పైనే ఇంగ్లండ్ నమ్మకం ఉంచింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంగ్లండ్ బ్యాటింగ్ పదునెక్కాల్సి ఉంది. బ్యాటింగ్‌కు మరీ అనుకూలం కాని లార్డ్స్ పిచ్‌పై ఆతిథ్య బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ భారత పేసర్లను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఒలీ పోప్‌తో పాటు జో రూట్ కూడా అంచనాలను అందుకోవాల్సి ఉంది. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ ఫామ్ సానుకూలాంశం కాగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఆందోళన రేకెత్తిస్తోంది. అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. ఇప్పుడైనా స్టోక్స్ తన బ్యాటింగ్ బలాన్ని చూపించడం జట్టుకు ఎంతో అవసరం. తుది జట్ల వివరాలు భారత్ (అంచనా): గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, నాయర్, పంత్, జడేజా, సుందర్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.పిచ్, వాతావరణంఅటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమాన అనుకూలతగా జీవం ఉన్న పిచ్ ఇది. ఆరంభంలోనే కాస్త పేస్‌కు అనుకూలిస్తుంది. ఆపై మంచి బ్యాటింగ్‌కు అవకాశం ఉంది. ఈసారి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజుల్లో వర్ష సూచన లేదు.19 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులు. 3 టెస్టుల్లో భారత్, 12 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచాయి. 4 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.148 లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టులు. 97 టెస్టుల్లో ఫలితాలు రాగా, 51 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికపై ఇంగ్లండ్ 145 టెస్టులు ఆడింది. 59 టెస్టుల్లో నెగ్గి, 35 టెస్టుల్లో ఓడింది. 51 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. -
ముగిస్తారా... ఆఖరిదాకా లాక్కొస్తారా?
మాంచెస్టర్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టుకు గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఆతిథ్య ఇంగ్లండ్ బ్రేకులేసింది. దీంతో మూడో టి20 ఓటమితో ‘వాయిదా’ పడిన సిరీస్ విజయాన్ని మాంచెస్టర్‌లో రాబట్టాలని హర్మన్‌ప్రీత్ బృందం పట్టుదలతో ఉంది. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాన్ని అడ్డుకున్న ఇంగ్లండ్ అదే ఊపుతో ఇప్పుడు సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య బుధవారం జరిగే నాలుగో టి20 ఆసక్తికరంగా జరుగనుంది. బర్మింగ్‌హామ్ (12న ఐదో టి20) దాకా సాగదీయకుండా ఎలాగైనా ఇక్కడే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని అమ్మాయిల జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ స్మృతి మంధాన సూపర్‌ఫామ్, తెలుగమ్మాయి శ్రీచరణి స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ కంటే ఓ మెట్టుపైనే ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్, సిరీస్ విజయం ఏమంత కష్టం కానేకాదు. హర్మన్‌ప్రీత్ రాణిస్తే... పొట్టి సిరీస్‌లో ఎవరైనా ప్రదర్శన పరంగా బాకీ పడ్డారంటే అది కెప్టెన్ హర్మన్‌ప్రీతే! తొలి మ్యాచ్‌కు గైర్హాజరైన సారథి తర్వాత మ్యాచ్‌లాడినా... ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మూడో టి20లో హర్మన్ తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచి ఉంటే ఇదివరకే సిరీస్ దక్కేది. కేవలం 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గడ్డపై ‘హ్యట్రిక్’ విజయం దూరమవగా... సిరీస్ కోసం ఇంకా పోరాడాల్సి వస్తోంది. మిగతా వారిలో గత మ్యాచ్‌లో ఓపెనర్ ఫషాలీ వర్మ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. ఓపెనర్లతో పాటు జెమీమా రోడ్రిగ్స్, హర్మన్లు కూడా రాణిస్తే... రిచా ఘోష్ తన హిట్టింగ్తో ఆదరగొట్టేందుకు అవకాశముంటుంది. ఈ సిరీస్‌లో శ్రీచరణి అత్యంత నిలకడగా స్పిన్నేస్తోంది. అరుంధతి రెడ్డి, దీప్తి శర్మలు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఎలా చూసినా కూడా భారత బౌలింగ్ దళం మెరుగ్గానే ఉంది. సమం కోసమే సమరం ఈ సిరీస్‌లోనే నిలకడలేమి ఆటతీరుతో అగచాట్లు పడుతున్న ఇంగ్లండ్ గత మ్యాచ్ గెలిచిందంటే ఓపెనర్లే కారణం. సోఫియా డంక్లీ, డానీ వ్యాట్లు తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ చేతులెత్తేశారు. కానీ గెలిచి నిలవాల్సిన మ్యాచ్‌లో నిలబెట్టారు. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు తెలివిగానే బోల్తాకొట్టించారు. ఈ నేపథ్యంలో బ్యూమోంట్ సేన అందివచి్చన అవకాశాన్ని జారవిడువకుండా వరుసగా ఈ మ్యాచ్‌లోనూ పుంజుకొంటే సిరీస్ రేసులో పడొచ్చని భావిస్తోంది. పటిష్టమైన భారత బృందాన్ని ఎదుర్కోవాలంటే ఒకరిద్దరు రాణిస్తే సరిపోదని సమష్టి బాధ్యత తీసుకోవాలని అనుకుంటుంది. తుదిజట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, అమన్‌జోత్, దీప్తిశర్మ, రాధా యాదవ్, అరుంధతీ, స్నేహ్ రాణా, శ్రీచరణి. ఇంగ్లండ్: టామీ బ్యూమోంట్ (కెప్టెన్ ), సోఫియా డంక్లీ, డానీ వ్యాట్, అలైస్ క్యాప్సీ, స్కాలిఫీల్డ్, అమీ జోన్స్, సోఫీ ఎకిల్‌స్టోన్, ఇసీ వాంగ్, చార్లీ డీన్, లారెన్ ఫిలెర్, లారెన్ బెల్. -
బూమ్ బూమ్ బుమ్రా
లండన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం భారత టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. రేపటి నుంచి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పని భారం కారణంగా ఈ సిరీస్‌లో మూడు టెస్టులే ఆడాలని నిర్ణయించుకున్న బుమ్రా బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు తగినంత విరామం తర్వాత పూర్తి ఫిట్‌గా మ్యాచ్‌కు అతను సన్నద్ధమయ్యాడు. టెస్టుకు రెండు రోజుల ముందు మంగళవారం బుమ్రా సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించాడు. విరామం లేకుండా అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ రోజు కావడంతో ప్రధాన బ్యాటర్లు గిల్, రాహుల్, జైస్వాల్, పంత్‌తో పాటు సుందర్, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా మంగళవారం సాధన చేయలేదు. దాంతో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురేల్‌లకు బుమ్రా బౌలింగ్ చేశాడు. వీరందరినీ తన బౌలింగ్‌తో బుమ్రా ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి రనప్‌తో అతను బౌలింగ్ చేశాడు. నెట్స్‌కు వచ్చీ రాగానే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను అడిగి తనకు కొత్త బంతి మాత్రమే కావాలని ఎంచుకున్న బుమ్రా దాంతో ప్రాక్టీస్ కొనసాగించాడు. 2021లో లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రివర్స్ స్వింగ్‌తో మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా భారత్ ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి లార్డ్స్ పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అతను ఎలా చెలరేగుతాడనేది ఆసక్తికరం -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్.. నిన్న (జులై 7) జరిగిన చివరి మ్యాచ్‌లో ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు) సరిపెట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితమై.. ఆతర్వాత ఆ స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియా 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ 1,3,4 వన్డేలు గెలువగా.. ఇంగ్లండ్ 2, 5 వన్డేల్లో నెగ్గింది. భారత్ త్వరలో ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్లో జరుగనుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్‌దే. రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలుత బెన్ డాకిన్స్ (66), ఆతర్వాత బెన్ మేస్ (82 నాటౌట్), కెప్టెన్ థామస్ రూ (49 నాటౌట్) రాణించి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 2, దిపేశ్ దేవేంద్రన్ ఓ వికెట్ తీశాడు.శాంతించిన వైభవ్ఈ సిరీస్‌లో వైభవ్ 100 లోపు స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 130కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్‌ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు. ఐదో వన్డేలో నిదానంగా ఆడినా 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. -
పదేసిన ఆకాశ్‌దీప్.. ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇదే భారీ విజయం. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత). ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఆకాశ్‌దీప్‌కు కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.ఈ మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచిన జేమీ స్మిత్ (88) డ్రా కోసం విఫలయత్నం చేశాడు.అంతకుముందు టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ భారత్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మూడో టెస్ట్ జులై 10 నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనుంది. గిల్ కెప్టెన్సీలో భారత్‌కు ఇదే తొలి గెలుపు. -
చెలరేగిన ఆకాశ్‌దీప్.. చారిత్రక గెలుపునకు 2 వికెట్ల దూరంలో టీమిండియా
Update: లంచ్ తర్వాత మరో 2 వికెట్లు తీసిన టీమిండియా. క్రిస్ వోక్స్‌ను (7) ప్రసిద్ద్ కృష్ణ.. జేమీ స్మిత్‌ను ఆకాశ్‌దీప్ (88) ఔట్ చేశారు. 56 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 226/8గా ఉంది. భారత్ గెలుపుకు కేవలం 2 వికెట్లు మాత్రమే కావాలి. ఆకాశ్‌దీప్ ఈ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి 10 వికెట్ల ప్రదర్శనపై కన్నేశాడు. ఆకాశ్‌దీప్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చారిత్రక గెలుపుకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు. వారి ఆరాటం మరికొద్ది గంటల్లో తీరే అవకాశం ఉంది.608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 455 పరుగులు కావాలి. అది అసాధ్యం. భారత్ గెలలాంటే మాత్రం కేవలం 4 వికెట్లు తీస్తే చాలు.వర్షం కారణంగా ఇవాల్టి ఆట గంట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా 10 ఓవర్లు కోతకు గురైంది. ఈ రోజు కేవలం 80 ఓవర్ల ఆట మాత్రమే జరుగుతుంది. ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ ఆకాశ్‌దీప్ ఇంగ్లండ్‌ను భారీ దెబ్బేశాడు. అతని బౌలింగ్‌లో ఓలీ పోప్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (23) ఎల్బీడబ్ల్యూ చేసి ఇంగ్లండ్ డ్రా ఆశలపై నీళ్లు చల్లాడు. అనంతరం స్టోక్స్, జేమీ స్మిత్ ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బంతితో బెన్ స్టోక్స్‌ను (33) పెవిలియన్‌కు సాగనంపాడు. స్టోక్స్ వికెట్ పడగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. 32 పరుగులతో జేమీ స్మిత్ క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో రోజు ఆటలో బెన్ డకెట్ (25), రూట్‌ను (60) ఔట్ చేసిన ఆకాశ్‌దీప్ ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 4 వికెట్లు తీయగా.. సిరాజ్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 153/6 (40.3) -
ENG Vs IND 2nd Test Day 5: గుడ్ న్యూస్.. ఆట మొదలైంది.. అయితే..!
ఎడ్జ్‌బాస్టన్ నుంచి టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ తెలుస్తుంది. చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఆటంకం కలిగించిన వరుణుడు ప్రస్తుతం శాంతించాడు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మైదానంలో కప్పి ఉంచిన కవర్లను తొలగించారు. ఔట్ ఫీల్డ్‌ను వేగంగా డ్రై చేశారు. సూర్యుడు మేఘాలను ముసుగు నుంచి బయటికి వచ్చాడు.అయితే ఓవర్ల కోత మాత్రం తప్పలేదు. ఇవాల్టి ఆటలో 90 కాకుండా 80 ఓవర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా 10 ఓవర్ల కోత పడింది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. దాదాపు 2 గంటలు ఆలస్యంగా భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:10 గంటలకు ప్రారంభమయ్యింది.సవరించిన సెషన్ టైమింగ్స్‌ను కూడా అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్ 5:10 నుంచి 7 గంటల వరకు.. రెండో సెషన్ 7:40 నుంచి 9:40 వరకు.. మూడో సెషన్ రాత్రి 10 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగనుంది.కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. ఇంగ్లండ్.. భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్‌రేట్: 4.5 -
ENG VS IND 2n Test Day 5: టీమిండియాకు చేదు వార్త
ఇంగ్లండ్‌పై చారిత్రక గెలుపు సాధించేందుకు 7 వికెట్ల దూరంలో టీమిండియాకు చేదు వార్త. రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం కురుస్తుంది. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. అక్కడ వాతావరణం రాత్రిని తలపిస్తుంది. ఫ్లడ్ లైట్లు ఆన్ చేశారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఇది సాధ్యపడేలా లేదు. మరో గంట పాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ నివేదించింది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని తెలుస్తుంది. వర్షం కారణంగా తొలి సెషన్ రద్దైతే టీమిండియాకు భారీ నష్టం సంభవిస్తుంది. మిగతా రెండు సెషన్లలో భారత బౌలర్లు ఏడు వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.HEAVY RAIN AT EDGBASTON...!!!! [Amit Shah from RevSportz] pic.twitter.com/zdrYfwj3ri— Johns. (@CricCrazyJohns) July 6, 2025కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.గిల్‌పై విమర్శలుటీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను లేట్‌గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్‌రేట్: 4.5 -
విజయం వాకిట్లో...
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయం వాకిట్లో నిలిచింది. బ్యాటర్ల అసమాన ప్రదర్శనకు బౌలర్ల సహకారం తోడవడంతో భారీ విజయంపై కన్నేసింది. గిల్ రికార్డు శతకానికి పంత్, జడేజా, రాహుల్ హాఫ్ సెంచరీలు జతవడంతో ఆతిథ్య జట్టు ముందు కొండంత లక్ష్యం నిలవగా... 608 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉండగా... ఇక్కడి నుంచి ఆ జట్టు గెలవాలంటే మహాద్భుతం జరగాల్సిందే! భారత బౌలర్ల జోరు చూస్తుంటే ఆదివారం వేగంగా ఏడు వికెట్లు తీయడం ఖాయంగా అనిపిస్తుండగా... రోజంతా వర్షం కురవాలని ప్రార్థించడం తప్ప ఇంగ్లండ్ ముందు మరో అవకాశం కనిపించడం లేదు!బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో దంచి కొట్టిన టీమిండియా... ప్రత్యర్థి ముందు ఏకంగా 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత స్కోరును చేరుకునే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రాలీ (0), డకెట్ (15 బంతుల్లో 25; 5 ఫోర్లు), రూట్ (6) పెవిలియన్ చేరగా... పోప్ (24 బ్యాటింగ్; 3 ఫోర్లు), బ్రూక్ (15 బ్యాటింగ్; 2 ఫోర్లు) పోరాడుతున్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 64/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో, యువ సారథి శుబ్‌మన్ గిల్ (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) మరో శతకంతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. ఈ క్రమంలో టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక (1014) స్కోరు నమోదు చేసుకోగా... గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 430 పరుగులతో విజృంభించాడు. పంత్ ఫటాఫట్... గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా... పరాజయం పాలైన టీమిండియా ఈ సారి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపించింది. నాలుగో రోజు తొలి సెషన్ ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా... వాటిని అధిగమించి భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పరుగుల రాక కష్టం కాగా... కరుణ్ నాయర్ (26; 5 ఫోర్లు) మరోసారి మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్నాడు. కాసేపటికి అర్ధశతకం అనంతరం రాహుల్ కూడా వెనుదిరగగా... పంత్ వచ్చిరావడంతో విరుచుకుపడ్డాడు.ఎదుర్కొన్న మూడో నాలుగు బంతులకు వరుసగా 4, 6 కొట్టి తన ఉద్దేశం చాటాడు. అతడి దూకుడుకు ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్ కూడా తోడ్పడింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను క్రాలీ అందుకోలేకపోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతడు... తదుపరి ఓవర్లో మరో 4, 6 బాదాడు. బషీర్‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన పంత్... చిత్రవిచిత్రమైన షాట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. గిల్ నిలకడ... రెండో సెషన్లో పంత్‌తో పాటు గిల్ కూడా దంచి కొట్టడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. టంగ్ బౌలింగ్‌లో 6, 4, 4 కొట్టిన గిల్.. అతడి తదుపరి ఓవర్లో మరో 6, 4తో 57 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పంత్ 48 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. స్కోరు పెంచే క్రమంలో పంత్ ఔట్ కాగా... జడేజా రాకతో పరుగుల వేగం మందగించింది. ఈ మధ్యలో కొన్ని చక్కటి షాట్లతో అలరించిన గిల్ 129 బంతుల్లో మ్యాచ్‌లో రెండో సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రెండో సెషన్లో టీమిండియా 30 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక మూడో సెషన్లో గిల్, జడేజా దుమ్మురేపారు. బంతి తమ పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన ఈ జంట స్కోరు బోర్డుకు రాకెట్ వేగాన్నిచ్చింది. వోక్స్ ఓవర్లో గిల్ 6, 4, 4తో చెలరేగాడు. మరోవైపు జడేజా కూడా మ్యాచ్‌లో రెండో అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. రూట్ బౌలింగ్ 6, 4తో గిల్ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. పంత్‌తో నాలుగో వికెట్‌కు 110 పరుగులు జోడించిన గిల్... జడేజాతో ఐదో వికెట్‌కు 175 పరుగులు జతచేశాడు. ఎట్టకేలకు బషీర్ బౌలింగ్‌లో గిల్ ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. వాషింగ్టన్ సుందర్ (12 నాటౌట్) అండతో జడేజా జట్టు ఆధిక్యాన్ని 607కు చేర్చాడు. స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) టంగ్ 28; రాహుల్ (బి) టంగ్ 55; నాయర్ (సి) స్మిత్ (బి) కార్స్ 26; గిల్ (సి అండ్ బి) బషీర్ 161; పంత్ (సి) డకెట్ (బి) బషీర్ 65; జడేజా (నాటౌట్) 69; నితీశ్ రెడ్డి (సి) క్రాలీ (బి) రూట్ 1; సుందర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (83 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 427. వికెట్ల పతనం: 1–51, 2–96, 3–126, 4–236, 5–411, 6–412. బౌలింగ్: వోక్స్ 14–3–61–0; కార్స్ 12–2–56–1; టంగ్ 15–2–93–2; స్టోక్స్ 7–1–26–0; బషీర్ 26–1–119–2; రూట్ 9–1–65–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్‌దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బ్యాటింగ్) 24; రూట్ (బి) ఆకాశ్‌దీప్ 6; బ్రూక్ (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 72. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, బౌలింగ్: ఆకాశ్‌దీప్ 8–1–36–2; సిరాజ్ 5–1–29–1; ప్రసిధ్ కృష్ణ 3–0–6–0.430 ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి గిల్ చేసిన పరుగులు. భారత్ తరఫున ఇదే అత్యధికం. సునీల్ గావస్కర్ (344; 1971లో వెస్టిండీస్‌పై)ను అతను అధిగమించాడు. ఓవరాల్‌గా గూచ్ (456; 1990లో భారత్‌పై) అగ్ర స్థానంలో ఉండగా... గిల్ రెండో స్థానంలో నిలిచాడు.1014 ఈ మ్యాచ్‌లో భారత్ చేసిన పరుగులు. మన టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం. 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగుల స్కోరును టీమ్ దాటింది.2 ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. గతంలో సునీల్ గావస్కర్ ఒక్కడే ఈ ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 150+స్కోర్లు చేసిన రెండో బ్యాటర్‌గాను గిల్ నిలిచాడు. గతంలో అలెన్ బోర్డర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. -
ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
-
ENG VS IND 2nd Test: శతక్కొట్టిన బ్రూక్.. కేవలం 44 ఇన్నింగ్స్‌ల్లోనే..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్న బ్రూక్ తన శైలికి విరుద్దంగా ఎంతో సంయమనంతో ఆడి 137 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రూక్‌కు ఇది టెస్ట్‌ల్లో తొమ్మిదో సెంచరీ. బ్రూక్ ఈ తొమ్మిది సెంచరీలను కేవలం 44 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. తద్వారా ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత వేగంగా తొమ్మిది సెంచరీలు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఇంగ్లండ్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు37 - డెనిస్ కాంప్టన్43 - హెర్బర్ట్ సట్‌క్లిఫ్44 - హ్యారీ బ్రూక్50 - వాలీ హామండ్52 - మైఖేల్ వాన్26 ఏళ్ల బ్రూక్ 44 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, 9 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 60.48 సగటున 2540 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్‌రేట్ 87కి పైగా ఉండటం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 284/5గా ఉంది. బ్రూక్ (102), జేమీ స్మిత్ (126) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది. బ్రూక్, స్మిత్ ఆరో వికెట్‌కు అజేయమైన 200 పరుగులు జోడించారు.లంచ్‌కు ముందు జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్న ఔట్ కాగా.. రూట్ (22), స్టోక్స్ (0) ఇవాళ ఆట ప్రారంభం కాగానే పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన బ్రూక్.. కొనసాగుతున్న పరుగుల ప్రవాహం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. బంతుల పరంగా (2832) టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ 62 ఇన్నింగ్స్‌ల్లో 3806 బంతులు ఎదుర్కొని ఈ మైలురాయిని తాకాడు.అయితే బ్రూక్ బాబర్ కంటే చాలా తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ పరంగా కూడా బాబర్‌కు బ్రూక్‌కు భారీ తేడాతో ఉంది. ఈ మైలురాయిని చేరుకునేందుకు బాబర్‌కు 62 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. బ్రూక్ కేవలం 44 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.బ్రూక్ టెస్ట్ కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 26 ఏళ్ల బ్రూక్ కేవలం 44 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లోనే ఓ డబుల్ సెంచరీ, 8 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 60.21 సగటున 2529 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్‌రేట్ 88కి పైగా ఉండటం విశేషం. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బ్రూక్ ఈ ఘనత సాధించాడు.మెరుపు శతకంఈ మ్యాచ్‌లో బ్రూక్ 127 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 91 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్‌లో జేమీ స్మిత్ మెరుపు సెంచరీ సాధించాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్మిత్ 82 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 338 పరుగులు వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్ననే ఔటయ్యారు. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. నిప్పులు చెరిగిన సిరాజ్.. ఆదుకున్న బ్రూక్, స్మిత్ఇవాళ ఆట ప్రారంభం కాగానే సిరాజ్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో రూట్ (22), స్టోక్స్ (0) వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను బ్రూక్, స్మిత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 165 పరుగులు జోడించారు. ఓవర్‌నైట్ స్కోర్ 77/3 వద్ద ఇంగ్లండ్ ఇవాల్టి ఆటను ప్రారంభించింది.ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test Day 2: పట్టుబిగిస్తున్న భారత్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 20 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్‌లో ఉన్నారు. -
గిల్ 'శతక' మోత
యువ సారథి శుబ్‌మన్ గిల్ మరో సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరిస్తే... రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్‌తో తన విలువ చాటుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రెండో రోజు గిల్, జడేజా జంట ఎంతసేపు నిలుస్తుందనే దానిపైనే భారత స్కోరు ఆధారపడి ఉంది.బర్మింగ్‌హామ్: పరాజయంతో ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు... రెండో టెస్టును మెరుగ్గా మొదలు పెట్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం మొదలైన రెండో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (216 బంతుల్లో 114 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్‌తోనే సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్... కెప్టెన్సీ ప్రభావం తన బ్యాటింగ్‌పై ఏమాత్రం లేదని మరోసారి నిరూపించాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్... రెండో టెస్టులోనూ దాన్ని పునరావృతం చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 87; 13 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా (67 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కరుణ్ నాయర్ (50 బంతుల్లో 31; 5 ఫోర్లు), రిషబ్ పంత్ (42 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2 వికెట్లు పడగొట్టగా... కార్స్, స్టోక్స్, బషీర్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత జట్టు రెండో రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం. జైస్వాల్ దూకుడు గత మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టు... ఈ సారి కూడా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. లీడ్స్‌తో పోల్చుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటుందనే అంచనాల మధ్య తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 2) తొమ్మిదో ఓవర్లో అవుటయ్యాడు. తొలి స్పెల్‌ను కట్టుదిట్టంగా వేసిన వోక్స్‌కు ఈ వికెట్ దక్కింది. ఈ దశలో కరుణ్ నాయర్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న ఈ జంట... ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన నాయర్... ఈసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు సాధికారికంగా ఆడిన అతడు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో జైస్వాల్ అలవోకగా పరుగులు రాబట్టాడు. వన్డే తరహాలో ఆడుతూ పాడుతూ... 59 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో హాఫ్‌సెంచరీ పూర్తిచేసుకున్నాడు. లంచ్ విరామానికి కాస్త ముందు కార్స్ బౌలింగ్‌లో నాయర్ అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ సంయమనం... రెండో సెషన్లో గిల్, జైస్వాల్ జోరు చూస్తే భారత్‌కు తిరుగులేనట్లు అనిపించింది. మంచి బంతులను గౌరవించిన ఈ జంట... గతి తప్పిన బంతులపై విరుచుకుపడి పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో జైస్వాల్ మరో సెంచరీ చేయడం ఖాయం అనుకుంటే... ఇంగ్లండ్ కెపె్టన్ స్టోక్స్ అతడిని ఔట్ చేసి జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. చివరి సెషన్లో పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. శార్దుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన నితీశ్ ఆరు బంతులాడి వోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం పెరగగా... గిల్ సంయమనంతో ముందుకు సాగాడు. మరో ఎండ్ లో జడేజా అతడికి చక్కటి సహకారం అందించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (బ్యాటింగ్) 114 ; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (బ్యాటింగ్)41; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం (85 ఓవర్లలో 5 వికెట్లకు) 310. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211. బౌలింగ్: వోక్స్ 21–6–59–2; కార్స్ 16–2–49–1; టంగ్ 13–0–66–0; స్టోక్స్ 15–0–58–1; బషీర్ 19–0–65–1; రూట్ 1–0–8–0. -
‘ఇదేం సెలక్షన్’
ప్రపంచంలో బెస్ట్ బౌలర్ మీ జట్టులో ఉన్నాడు... అప్పుడప్పుడు ఫిట్నెస్ సమస్యలు ఉన్నా రెండు టెస్టుల మధ్య ఏడు రోజుల విరామం వచ్చింది. గత మ్యాచ్‌లో ఒక వేళ ఏమైనా ఇబ్బంది కలిగినా...ఫిట్నెస్ ట్రైనర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉన్నప్పుడు కోలుకునేందుకు ఏడు రోజుల సమయం కూడా సరిపోతుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడి జట్టు వెనుకంజలో ఉంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి సింగిల్ హ్యాండ్‌తో గెలిపించగల సత్తా అతనికి ఉంది. అయినా సరే... భారత జట్టు జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించలేదు. పైగా తర్వాతి టెస్టులో పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆడతాడని కెప్టెన్ గిల్ వ్యాఖ్యానించడం క్షమించరానిది! అతని స్థానంలో ఆకాశ్‌దీప్‌కు అవకాశం లభించింది. మరో వైపు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ అన్యాయం జరిగింది. రెండో స్పిన్నర్‌గా అతనికి ఈ మ్యాచ్‌లోనూ అవకాశం లభించలేదు. అటాకింగ్ బౌలర్ అయిన కుల్దీప్ గత టెస్టులో లేకపోవడం లోటుగా కనిపించింది. ఈ సారి ఇంగ్లండ్‌పై చెలరేగే అవకాశం ఉందని భావించగా ఈ సారి స్థానమే దక్కలేదు. పైగా గత మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ విఫలమైంది కాబట్టి బ్యాటింగ్ చేయగల బౌలర్ కావాలంటూ సుదర్శన్ స్థానంలో సుందర్‌ను తీసుకున్నారు. ఒక రెగ్యులర్ బౌలర్‌ను అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేయడం ఏమిటో అర్థం కాలేదు! శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా అదే తరహా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్రకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డికి చాన్స్ ఇచ్చినా అతనూ విఫలమయ్యాడు. ‘బుమ్రాను తప్పించడం నమ్మశక్యంగా లేదు. అతని పని భారం తగ్గించాలని చూస్తే ఇప్పటికే తగినంత విశ్రాంతి లభించింది. ఎంతో కీలకమైన మ్యాచ్‌కు అతను లేకపోవడం ఆశ్చర్యకరం. ఆటగాడు తన ఇష్ట్రపకారం మ్యాచ్‌ను ఎంచుకునే అవకాశం ఇవ్వరాదు. ఇక్కడ టెస్టు గెలిచి 1–1తో సిరీస్‌ను సమం చేస్తే ఆ తర్వాత విశ్రాంతి ఇచ్చుకోవచ్చు’ అని రవిశాస్త్రి దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ఇలా బ్యాటింగ్ బలమే కావాలంటే సిరీస్ చివరకు వచ్చే సరికి బుమ్రా, మరో పది మంది బ్యాటర్లే బరిలోకి దిగుతారేమో! -
ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ 'గిల్' సెంచరీ
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్‌కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్‌కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్‌మన్ గిల్ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్‌కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్‌కు దక్కింది. వోక్స్ బౌలింగ్‌లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 310/5గా ఉంది. -
‘రెండో’ సవాల్‌కు సిద్ధం!
ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు మరో సవాల్‌కు సై అంటోంది. తొలి పోరులో భారీ స్కోర్లు, ఐదు సెంచరీల తర్వాత కూడా పరాజయాన్ని ఎదుర్కొన్న జట్టు ఈ సారి తప్పులు దిద్దుకొని లెక్క సరి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే సిరీస్‌లో కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆతిథ్య జట్టు పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడతాడా లేదా అనేదే చివరి నిమిషం వరకు సస్పెన్స్‌గా ఉండవచ్చు! బర్మింగ్‌హామ్: సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత బరిలోకి దిగిన తొలి సిరీస్‌లో భారత జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు నిరాశే ఎదురైంది. బ్యాటర్‌గా అతను సెంచరీ సాధించినా... ఫలితం మాత్రం సానుకూలంగా రాలేదు. ఇప్పుడు నాయకుడిగా తన సమర్థతను నిరూపించుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది. తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఈ మైదానంలో మన జట్టు రికార్డు పేలవంగా ఉంది. 8 టెస్టులు ఆడితే 7 మ్యాచ్‌లు ఓడిన టీమిండియా మరో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగింది. కుల్దీప్కు చాన్స్! గత టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన చూస్తే తుది జట్టులో మార్పులు కచ్చితంగా ఉంటాయి. టీమ్ మేనేజ్మెంట్ పదే పదే చెబుతున్నట్లుగా టాప్ బౌలర్ బుమ్రా మిగిలిన నాలుగు టెస్టుల్లో రెండు మాత్రమే ఆడతాడు. తొలి, రెండో టెస్టుకు మధ్యలో తగినంత విశ్రాంతి లభించింది కాబట్టి అతను ఈ టెస్టు ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. లార్డ్స్‌లో జరిగే మూడో టెస్టులో అతను ఆడాలని భావిస్తే ఇక్కడ తప్పుకోవచ్చు. అదే జరిగితే మన బౌలింగ్ మరింత బలహీనంగా కనిపించడం ఖాయం. గత టెస్టులో విఫలమైన శార్దుల్‌కు బదులు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జడేజాకు తోడుగా ఎవరనే విషయంలోనే కాస్త సందిగ్ధత ఉంది. బ్యాటింగ్ బలహీనంగా మారవద్దని భావిస్తే సుందర్‌కు అవకాశం లభించవచ్చు. అయితే ప్రత్యర్థిని కట్టిపడేయగల పదునైన స్పిన్నర్ కావాలంటే మాత్రం కుల్దీప్కు చాన్స్ ఇవ్వాలి. మరోవైపు బ్యాటింగ్‌లో టాప్–6కు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మార్పుల్లేకుండా... తొలి టెస్టు విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ పోరుకు సిద్ధమైన ఇంగ్లండ్ రెండు రోజుల ముందే తుది జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ వస్తే కూర్పులో మార్పు ఉండవచ్చని అనిపించినా ... అతడిని తీసుకోకుండా గత మ్యాచ్ గెలిపించిన టీమ్‌నే ఎంపిక చేసింది. మరోసారి ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకుంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌తో పాటు ఓలీ పోప్ కూడా తొలి టెస్టులో చెలరేగిపోయారు. ఫామ్‌లో ఉన్న రూట్‌ను నిలువరించడం భారత్‌కు అంత సులువు కాదు. బ్రూక్, స్టోక్స్‌లతో పాటు జేమీ స్మిత్ బ్యాటింగ్ పదును ఏమిటో గత మ్యాచ్‌లో కనిపించింది. తొలి టెస్టులో విఫలమైన వోక్స్ తన సొంత మైదానంలో సత్తా చాటా లని పట్టుదలగా ఉన్నాడు. కార్స్, టంగ్ అతడికి అండగా నిలవాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి. పిచ్, వాతావరణంఎడ్జ్బాస్టన్ మైదానం కూడా ఛేదనకే అనుకూలం. గత సిరీస్‌లో ఇక్కడే ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో భారత్‌పై 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ సందర్భంగా అక్కడక్కడా వర్షంతో అంతరాయం కలగవచ్చు. -
టీమిండియాతో రెండో టెస్ట్.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్
జులై 2వ తేదీ నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (జూన్ 30) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యథాతథంగా కొనసాగించింది. రెండో టెస్ట్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టెస్ట్‌లో రాణించిక పోయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ క్రిస్ వోక్స్‌పై నమ్మకం ఉంచింది. అతనితో పాటు జోష్ టంగ్, బ్రైడన్ కార్స్‌ను కొనసాగించింది. నాలుగో పేసర్‌గా కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ కొనసాగనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్,జో రూట్, హ్యారీ బ్రూక్ తమ యధా స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. వికెట్‌కీపర్‌గా జేమీ స్మిత్ వ్యవహరించనున్నాడు.రెండో టెస్ట్ జులై 2న భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది.ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్‌లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ -
టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్
నాటింగ్హమ్ వేదికగా నిన్న (జూన్ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మంధన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని, భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని (హర్మన్-49 బంతుల్లో) నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మంధన శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ సీవర్ బ్రంట్(66) టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం జరిమానాగా విధించబడింది. నిర్ణీత సమయంలోగా ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడింది. ఓవర్‌కు 5 శాతం చొప్పున ఐసీసీ 10 శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ స్వీకరించింది. ఇంగ్లండ్ జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.కాగా, ఇంగ్లండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్‌పై 200 ప్లస్ స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా జులై 1న జరుగనుంది. -
సెకండ్ టెస్టులో ఇండియా ఓడిపోతుందా?
-
86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్ కన్ను మూత
ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ ప్లేయర్, నార్తాంప్టన్‌షైర్ లెజెండ్ వేన్ లార్కిన్స్(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన.. శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. యూకేలోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన లార్కిన్స్.. 1979 మరియు 1991 మధ్య 13 టెస్టులు, 25 వన్డేలు ఇంగ్లండ్ తరపున ఆడాడు.1979 ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టులో లార్కిన్స్ భాగంగా ఉన్నారు. అదేవిధంగా 1989-90 వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్‌కు అద్బుతమైన విజయాలను అందించాడు. 1989లో హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాపై లార్కిన్స్(124) సంచలన సెంచరీతో మెరిశాడు.ఓవరాల్‌గా ఇంగ్లండ్ తరపున ఆయన 1084 పరుగులు చేశాడు. అయితే 1982లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన జట్టులో లార్కిన్స్ సభ్యునిగా ఉన్నాడు. దీంతో ఆయనపై మూడు సంవత్సరాలు నిషేధం విధించారు. లేదంటే లార్కిన్స్ మరిన్ని మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించేవాడు.కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం ఆయనకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. డిమాస్టిక్ క్రికెట్లో లార్కిన్స్ పేరిట 85 సెంచరీలు, 182 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు ఫార్మాట్లు కలిపి 40,736 పరుగులు సాధించారు. అటు బౌలింగ్‌లోనూ 119 పడగొట్టారు. ఆయన మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు -
ఆ ఊళ్లో నెమళ్ల బెడద..
నెమళ్లు చూడముచ్చటైన పక్షులు. ఆకాశంలో మబ్బులు ముసురుకున్నప్పుడు నెమళ్లు పురివిప్పి చేసే నాట్యం కనువిందైన దృశ్యం. సాధారణంగా పెద్దపెద్ద ఉద్యాన వనాలలోను, అడవుల్లోను కనిపించే నెమళ్లు ఊళ్లలోకి వచ్చేస్తేనో! ఆ బెడద మామూలుగా ఉండదంటున్నారు ఇంగ్లండ్‌లోని గల్వాల్ గ్రామస్థులు. ఇంగ్లండ్ నైరుతి ప్రాంతంలోని కార్న్‌వాల్ కౌంటీలో ఉన్న గల్వాల్ గ్రామానికి ఇటీవల కొంతకాలంగా నెమళ్లు పెద్ద బెడదగానే మారాయి. ‘ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయో ఈ నెమళ్లు– పెద్దసంఖ్యలో ఊళ్లోకి చేరుకున్నాయి. ఇవి యథేచ్ఛగా ఇళ్లలోకి చేరి, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేసేస్తూ ఇళ్లన్నీ కంపు చేసేస్తున్నాయి. రోడ్ల మీద తాపీగా నడకలు సాగిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి’ అని గల్వాల్ గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు. ‘నెమళ్లు చూడటానికి అందంగానే ఉంటాయి గాని, అవి ఎక్కడ పడితే అక్కడ వేసే రెట్టలను భరించడం మాత్రం చాలా కష్టం’ అని గల్వాల్ గ్రామస్థుడు డిలాన్ జాస్పర్ వాపోయారు. (చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది..) -
టీ-20 సిరీస్ లో బోణీ కొట్టిన టీమిండియా ఉమెన్స్ జట్టు
-
‘తప్పులు సరిదిద్దుకుంటా’
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ పరాజయానికి ప్రధాన కారణాల్లో బుమ్రా మినహా ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శన. ముఖ్యంగా పేసర్ ప్రసిధ్ కృష్ణ అయితే ఏకంగా ఓవర్‌కు ఆరుకు పైగా రన్‌రేట్‌తో పరుగులిచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం 15 ఓవర్లకు పైగా వేసిన సందర్భాల్లో చూస్తే టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఏ ఒక్క బౌలర్ కూడా బంతులకు మించి పరుగులివ్వలేదు. ఇలాంటి చెత్త రికార్డును సొంతం చేసుకున్న ప్రసిధ్ తన తప్పుల నుంచి నేర్చుకుంటానని, తర్వాతి టెస్టుల్లో మెరుగైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తానని అతను అన్నాడు. రెండో టెస్టు సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్‌లో పాల్గొన్న అనంతరం శనివారం ప్రసిధ్ మీడియాతో మాట్లాడాడు. ‘నా ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నా. నేను అనుకున్న లెంగ్త్‌ల ప్రకారం బౌలింగ్ చేయలేకపోయాను. పరిస్థితులకు తగినట్లుగా అర్థం చేసుకుంటూ నా బౌలింగ్‌ను మార్చుకోలేకపోయా. అక్కడే తప్పు జరిగింది. వాటిని సరిదిద్దుకొని వచ్చే సారి మంచి ఫలితాలు రాబడతా’ అని ప్రసిధ్ చెప్పాడు. తాను వేసిన కొన్ని మంచి బంతులు బ్యాటర్ ఎడ్జ్ తీసుకొని దూసుకుపోయాయని, ఆ విషయంలో అదృష్టం కలిసి రాలేదన్న భారత పేసర్...బౌన్సర్లు ప్రయత్నించినప్పుడు కూడా చాలా పరుగులు రావడం నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో ఓటమినుంచి జట్టు కోలుకుందని, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రస్తుతం సానుకూల వాతావరణం ఉందని ప్రసిధ్ పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌లో వ్యూహాలపై తన సహచర బౌలర్లతో చర్చిస్తున్నట్లు అతను వెల్లడించాడు. తొలి టెస్టులో మన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. దీనిని కూడా తాము మెరుగుపర్చుకునే పనిలో ఉన్నామని భారత పేసర్ వివరించాడు. ‘నెట్ సెషన్లో మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లంతా చాలా కష్టపడ్డాం. క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలిచి పరుగులు జోడించే ప్రయత్నంలో తీవ్రంగా శ్రమిస్తున్నాం. వాటి విలువ గత మ్యాచ్‌లో తెలిసింది. అందుకే బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాం’ అని ఈ కర్నాటక పేస్ బౌలర్ స్పష్టం చేశాడు. -
శుభారంభం లక్ష్యంగా...
నాటింగ్‌హామ్: భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతుండగా... మహిళల క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. 5 టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుండగా... దానికి ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే వెనుదిరిగిన టీమిండియా... లోపాలను సవరించుకొని మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ పర్యటన దోహద పడనుంది. ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమైన యువ ఓపెనర్ షఫాలీ వర్మ జట్టులోకి పునరాగమనం చేయడంతో భారత బలం పెరిగింది. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా... ఈ ఏడాది భారత్‌లోనే జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియాలోనూ చోటు దక్కించుకోవాలని షఫాలీ భావిస్తోంది. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ బౌలర్ శ్రీచరణి, క్రాంతి గౌడ్, సయాలీ వంటి పలువురు యువ ప్లేయర్లను పరీక్షించనున్నారు. ఇంగ్లండ్ పిచ్‌లపై కొత్త ఆటగాళ్లకు అవకాశాలిచ్చి... వారిని వచ్చే ఏడాది మెగా టోర్నీ కోసం సంసిద్ధం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ ఏడాది భారత మహిళల జట్టుకు ఇదే తొలి టి20 సిరీస్ కాగా... హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జట్టుతో జరిగిన రెండు టూర్ మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. వన్డే, టి20 ఫార్మాట్లలో జరిగిన ఈ మ్యాచ్‌ల్లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేసినా... గెలుపుగీత దాటలేకపోయింది. సీనియర్లపైనే భారం సుదీర్ఘ పర్యాటనలో టీమిండియా శుభారంభం చేయాలంటే... సీనియర్ ప్లేయర్లు రాణించాల్సిన అవసరముంది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ సత్తా చాటితేనే టీమిండియా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు రెండోసారి టైటిల్ అందించిన హర్మన్‌ప్రీత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బ్యాటర్‌గా ఇటు సారథిగా ఆమె వాటిని అందుకుంటుందా చూడాలి.ఇక ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్, వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్ నేపథ్యంలో షఫాలీ వర్మ మునుపటి మెరుపులు మెరిపించాల్సిన అవసరముంది. ఓపెనర్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకోలేకపోయిన ఉమా ఛెత్రి స్థానంలో షఫాలీ తుది జట్టులోకి రావడం ఖాయమే. పేస్ ఆల్‌రౌండర్ అమన్‌జ్యోత్ కౌర్, స్పిన్ ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. 2023 ఫిబ్రవరి తర్వాత తొలిసారి జాతీయ టి20 జట్టులో చోటు దక్కించుకున్న స్నేహ్ రాణా... ఇటీవల డబ్ల్యూపీఎల్‌లో మెరుగైన ఆటతీరు కనబర్చింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ స్నేహ్ ఆకట్టుకుంది. సీనియర్ పేస్ బౌలర్లు రేణుక సింగ్, పూజ గాయాల కారణంగా ఈ పర్యటనకు అందుబాటులో లేకుండా పోవడంతో... ఇలాంటి సమయంలో యువ క్రీడాకారిణులు జట్టును గెలిపించాలని టీమ్ ఆశిస్తోంది. సొంతగడ్డపై బలంగా ఇంగ్లండ్.. మరోవైపు సీవర్ బ్రంట్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్ జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై సిరీస్ ఆడనుండటం ఆ జట్టుకు అదనపు ప్రయోజనం. అమీ జోన్స్, టామీ బ్యూమౌంట్, డానీ వ్యాట్, సోఫీ వంటి అనుభవం గల ప్లేయర్లు ఆ జట్టుకు ప్రధాన బలం కానున్నారు. మరోవైపు ఇస్సీ వాంగ్, అలీస్ కాప్సీ, సోఫియా డాంక్లీ వంటి యువ క్రీడాకారిణిలు కూడా తమదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి సుదీర్ఘ పర్యటనలో ఎవరు బోణీ కొడతారో చూడాలి!200ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కు 200వ మ్యాచ్ కానుంది. ఇంగ్లండ్ (215), ఆస్ట్రేలియా (200) జట్ల తర్వాత 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్న మూడో జట్టుగా భారత్ నిలువనుంది. ఇప్పటి వరకు 199 టి20లు ఆడిన భారత్ 108 మ్యాచ్‌ల్లో నెగ్గి, 84 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆరు మ్యాచ్‌లు రద్దు కాగా, ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 30 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌లు. 8 మ్యాచ్‌ల్లో భారత్, 22 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి.12 ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన టి20 మ్యాచ్‌లు. 4 మ్యాచ్‌ల్లో భారత్, 8 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. -
టీమిండియాతో రెండో టెస్ట్.. ప్రమాదకర బౌలర్‌ను జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్
జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (జూన్ 26) ప్రకటించారు. ఈ జట్టులో ప్రమాదకర ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చోటు దక్కించుకున్నాడు. 30 ఏళ్ల ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. Jofra Archer is back in Test cricket.#ENGvINDpic.twitter.com/vd4VVRQmM8— CricTracker (@Cricketracker) June 26, 2025ఆర్చర్ 2021 ఫిబ్రవరిలో చివరిసారి టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను టీమిండియాతోనే ఆడాడు. ఆతర్వాత అతను వరుస గాయాల కారణంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆర్చర్ గతేడాది మేలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి తిరిగి వచ్చాడు. తాజాగా అతను టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఇటీవల కౌంటీ ఛాంపియన్షిప్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ససెక్స్‌కు ఆడుతూ డర్హమ్ను ఎదుర్కొన్నాడు. తాజాగా ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో ఆర్చర్ అదనంగా జోడించబడ్డాడు. తొలి టెస్ట్ కోసం ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగింది. ఆర్చర్ తాజాగా ఆడిన కౌంటీ మ్యాచ్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ అవకాశం దక్కలేదు. రెండో టెస్ట్‌లో ఆర్చర్‌కు తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశం ఉంది. ఆర్చర్ చేరిక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుస్తుంది. ఇప్పటికే ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో గెలిచి భారత్‌పై ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో టెస్ట్‌లో ఆర్చర్ తుది జట్టులో చేరితే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఆర్చర్ తుది జట్టులో చేరితే ఏ పేసర్‌పై వేటు వేస్తారో చూడాలి. తొలి టెస్ట్‌లో పేసర్లు బ్రైడన్ కార్స్ (4 వికెట్లు), జోష్ టంగ్ (7), స్టోక్స్ (5)అద్బుతంగా రాణించారు. వీరు ముగ్గురే 16 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ నిరాశపరిచాడు. అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. దీంతో రెండో టెస్ట్‌లో వోక్స్‌ను పక్కన పెట్టి ఆర్చర్‌కు అవకాశం ఇవ్వొచ్చు. ఆర్చర్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. ఈ అర్హతలతో అతను రెండో టెస్ట్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్ట్‌ల్లో 3 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 42 వికెట్లు తీశాడు. కాగా, టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు సెంచరీలు నమోదైన ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా.. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ -
ప్రాక్టీస్‌లో ఫ్లాప్...
బాకెన్హామ్: భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పరాజయం పాలవగా... మరోవైపు మహిళల జట్టు ప్రధాన సిరీస్‌ల ప్రారంభానికి ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ ఓడింది. 5 టి20లు, 3 వన్డేల సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టి20 జరగనుంది. దీనికి ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ ఎలెవన్‌తో జరిగిన వన్డే, టి20 టూర్ మ్యాచ్‌ల్లో భారత్ పరాజయం పాలైంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ వన్డే పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 18 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈసీబీ ఎలెవన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. మైయా బౌచర్ (84 బంతుల్లో 104; 16 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... ఎమ్మా లాంబ్ (92 బంతుల్లో 94; 15 ఫోర్లు) దంచికొట్టింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 196 పరుగులు జోడించడంతో ఈసీబీ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టగా... స్నేహ్ రాణా, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులకు పరిమితమైంది. హర్లీన్ డియోల్ (91 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) ‘శత’క్కొట్టగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీ సాధించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), జెమీమా రోడ్రిగ్స్ (5), రిచా ఘోష్ (5), షఫాలీ వర్మ (16) విఫలమయ్యారు. అమన్‌జ్యోత్ కౌర్ (32 బంతుల్లో 43; 6 ఫోర్లు), యస్తిక భాటియా (45 బంతుల్లో 32; 3 ఫోర్లు), హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఈసీబీ బౌలర్లలో ర్యానా మెక్‌డొనాల్డ్, మహికా గౌర్, సారా గ్లెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అందరికీ ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో హర్లీన్ డియోల్ శతకం అనంతరం రిటైర్డ్ నాటౌట్‌గా పెవిలియన్ చేరింది. టి20లోనూ తప్పని ఓటమి...ప్రాక్టీస్ వన్డేలో పరాజయం పాలైన టీమిండియాకు... టి20లోనూ ఓటమే ఎదురైంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్ బృందం 6 పరుగుల తేడాతో ఈసీబీ ఎలెవన్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈసీబీ ఎలెవన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బ్రియోనీ స్మిత్ (33 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం బాదగా... కెప్టెన్ హోలీ ఆర్మిటేజ్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు), మైయా బౌచర్ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టగా... దీప్తి శర్మ, రాధ యాదవ్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులకు పరిమితమైంది. స్మృతి మంధాన (28 బంతుల్లో 47; 10 ఫోర్లు) ధాటిగా ఆడగా... మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. షఫాలీ వర్మ (13), అమన్‌జ్యోత్ కౌర్ (15), హర్మన్‌ప్రీత్ కౌర్ (28), జెమీమా రోడ్రిగ్స్ (11), రాధా యాదవ్ (17) ఎక్కువసేపు నిలవలేకపోయారు. రిచా ఘోష్ (23 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడింది. ఈసీబీ బౌలర్లలో సారా గ్లెన్ 3 వికెట్లు పడగొట్టింది. -
‘పేస్ బౌలర్లను నిందించవద్దు’
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు పరాజయానికి పేలవమైన పేస్ బౌలింగ్ కూడా ఒక కారణం. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా మినహా మిగితా వారంతా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ సమష్టిగా విఫలమయ్యారు. ప్రసిధ్ అయితే ఏకంగా ఓవర్‌కు ఆరుకు పైగా పరుగులు ఇచ్చాడు. అయితే భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ పేసర్లకు అండగా నిలిచాడు. ఒక్క ఓటమికే వారిని నిందించడం భావ్యం కాదని అతను పేర్కొన్నాడు. ‘గతంలో భారత జట్టులో నలుగురు పేసర్లు ఉంటే వారంతా ఒక్కొక్కరు కనీసం 40 టెస్టుల అనుభవంతో ఉండేవారు. వన్డేలు, టి20ల్లో సమస్య లేకపోవచ్చు కానీ ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి చోట టెస్టులు ఆడేటప్పుడు అనుభవం ఎంతో కీలకం. బుమ్రా, సిరాజ్‌లకు కొంత అనుభవం ఉన్నా ప్రసిధ్ నాలుగు టెస్టులే ఆడాడు. తుది జట్టులో లేనివారిని చూసినా నితీశ్ రెడ్డికి ఐదు, హర్షిత్‌కు రెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉండగా అర్‡్షదీప్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది ఆరంభం మాత్రమే. వారు తమ ఆటను మెరుగు పర్చుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి. ప్రతీ టెస్టు తర్వాత లోపాలను వెతికితే బలమైన బౌలింగ్ బృందాన్ని ఎలా తయారు చేయగలం. వారిలో తగినంత ప్రతిభ ఉంది కాబట్టే జట్టులోకి ఎంపికై ఇక్కడ ఉన్నారు’ అని గంభీర్ సమర్థించాడు. తొలి నాలుగు రోజుల పాటు బౌలర్లు కూడా రాణించడం వల్లే భారత జట్టు ఆధిక్యం ప్రదర్శించగలిగిందని, వారిపై తనకు నమ్మకం ఉందని అతను అన్నాడు. ప్రసిధ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడని... అతనితో పాటు శార్దుల్ కూడా కీలకదశలో రెండేసి వికెట్లు తీశారని గంభీర్ గుర్తు చేశాడు. ఫలానా ఆటగాళ్ల వల్లే తాము ఓడిపోయామంటూ ఎవరినీ బాధ్యులను చేయనన్న కోచ్... తాము గెలిచినా ఓడినా అందులో అందరి పాత్ర ఉంటుందని వెల్లడించాడు. కెప్టెన్‌గా తొలి టెస్టులో ఒత్తిడి సహజమన్న గంభీర్... మున్ముందు గిల్ చాలా నేర్చుకొని మంచి ఫలితాలు రాబడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ పర్యటనలో తాము ముందుగా అనుకున్నట్లుగా బుమ్రా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని, మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో ఏ రెండు ఆడించాలనే విషయంపై టీమ్ మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోచ్ వెల్లడించాడు. తొలి టెస్టులో పంత్ రెండు సెంచరీలు సాధించిన విషయంపై మాట్లాడుతూ... ‘పంత్ మాత్రమే కాదు. మరో ముగ్గురు కూడా సెంచరీలు సాధించారనే విషయం మరచిపోవద్దు. అయినా జట్టు గెలవనప్పుడు వ్యక్తిగత ప్రదర్శనలకు విలువ లేదు’ అని గంభీర్ కాస్త ఘాటుగా జవాబిచ్చాడు. -
‘అదే కీలక మలుపు’
లీడ్స్: తొలి టెస్టులో భారత జట్టు లోయర్ ఆర్డర్‌ను కట్టడి చేయడం కూడా తమ విజయానికి ప్రధాన కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కూడా తమ బౌలర్లు ప్రత్యర్థి చివరి వరుస బ్యాటర్లను తొందరగా అవుట్ చేయడంలో సఫలమయ్యారని అతను ప్రశంసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయిన భారత్... రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. ‘ఇరు జట్లు నమోదు చేసిన స్కోర్లు చూస్తే మంచి బ్యాటింగ్ పిచ్ అని అర్థమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో పలు మలుపులున్నా అన్నింటికంటే ప్రధానమైన కారణం రెండుసార్లూ భారత్ లోయర్ ఆర్డర్‌ను మేం కట్టడి చేయడమే అని నేను భావిస్తున్నా. రెండో ఇన్నింగ్స్‌లో అయితే భారత్ స్కోరు కనీసం 500 వరకు చేరే అవకాశం కనిపించింది. అలా జరిగితే మాకు ఛేదన కష్టమయ్యేది. కానీ మా బౌలర్లు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి ఆటతో పాటు ప్రతీ సెషన్లో మా ఆటగాళ్లు చూపిన పట్టుదల కూడా ప్రశంసనీయార్హం’ అని స్టోక్స్ అన్నాడు. 371 పరుగుల ఛేదనలో శుభారంభం అందించిన ఓపెనర్లు డకెట్, క్రాలీలను కెపె్టన్ ప్రత్యేకంగా అభినందించాడు. ముఖ్యంగా జడేజా బౌలింగ్‌లో డకెట్ రివర్స్ స్వీప్‌లతో భారీగా పరుగులు రాబట్టడం అద్భుతమని... అతని సలహాతోనే తాను కూడా స్పిన్‌ను ఎదుర్కొనేందుకు రివర్స్ స్వీప్ వైపే మొగ్గు చూపానని ఇంగ్లండ్ కెపె్టన్ చెప్పాడు. హెడింగ్లీ మైదానంలో సాధారణంగా అవుట్‌ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుందని, అందుబాటులో ఉన్న ఓవర్లన్నీ ఆడగలిగితే తాము విజయం సాధిస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నామన్న స్టోక్స్... టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న నిర్ణయం చివరకు తప్పు కాకపోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. -
లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం
-
'లీడ్స్' వదిలేశారు.. ఇంగ్లండ్ చేతిలో గిల్ సేన ఓటమి
తొలి రోజు నుంచే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన... రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 835 పరుగులు... గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు... బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన... అన్నీ సానుకూలతలే కనిపించినా... చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. తొలి టెస్టుల్లో పలు సందర్భాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ తుది దశకు వచ్చేసరికి చేతులెత్తేసింది. గెలుపు కోసం చివరి రోజు 350 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్ మొదటి ఓవర్ నుంచే పరుగుల వేటలో పడింది. వ్యూహాత్మకంగా బుమ్రా బౌలింగ్‌లో సాహసం చేయని బ్యాటర్లు ఇతర బౌలర్లపై చెలరేగి జోరుగా సాగిపోయారు. తాము ఆశించిన రీతిలో ‘బజ్‌బాల్’ శైలిలో ఎక్కడా తగ్గకుండా 4.54 రన్‌రేట్‌తో దూసుకుపోయిన ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. డకెట్ మెరుపు సెంచరీకి క్రాలీ అండగా నిలవగా... చివర్లో రూట్ కీలక అర్ధ సెంచరీతో జట్టును నడిపించాడు. తొలి టెస్టులో ఓటమి పక్షాన నిలిచిన కొత్త కెపె్టన్ శుబ్‌మన్ గిల్ సిరీస్‌లో మున్ముందు ఎలాంటి ఫలితాలు రాబడతాడనేది చూడాలి. లీడ్స్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ పరాజయంతో మొదలు పెట్టింది. హెడింగ్లీ మైదానంలో మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 21/0తో ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసింది. బెన్ డకెట్ (170 బంతుల్లో 149; 21 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్రాలీ (126 బంతుల్లో 65; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా... ఆఖర్లో జో రూట్ (84 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు), జేమీ స్మిత్ (55 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రూట్, స్మిత్ ఆరో వికెట్‌కు అభేద్యంగా 71 పరుగులు జత చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పని పట్టిన స్టార్ పేసర్ బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శన ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశాలు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0తో ముందంజ వేసింది. సిరీస్‌లో రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలీ, డకెట్ చివరి రోజు ఆటను జాగ్రత్తగా మొదలు పెట్టారు. అయితే నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో ధాటిని పెంచారు. ఈ క్రమంలో ముందుగా 66 బంతుల్లో డకెట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. 42 పరుగుల వద్ద క్రాలీ ఇచ్చిన కఠినమైన రిటర్న్ క్యాచ్‌ను అందుకోవడంలో బుమ్రా విఫలమయ్యాడు. లంచ్ వరకు కూడా ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీని విడదీయడంలో భారత్ విఫలమైంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ 24 ఓవర్లలో 96 పరుగులు సాధించింది. విరామం తర్వాత 111 బంతుల్లో క్రాలీ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు మరింత జోరుగా ఆడారు. 97 పరుగుల వద్ద డకెట్ ఇచి్చన క్యాచ్ జైస్వాల్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. తర్వాతి ఓవర్లోనే డకెట్ 121 బంతుల్లో కెరీర్లో ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్వల్ప వర్షం కారణంగా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. గెలిపించిన రూట్, స్మిత్... వాన ఆగిన తర్వాత భారత్‌కు సానుకూల ఫలితం వచ్చింది. ఎట్టకేలకు క్రాలీని అవుట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించిన ప్రసిద్... తన తర్వాతి ఓవర్లోనే ఒలీ పోప్ (8)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఈ దశలో డకెట్, రూట్ మళ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ వేగంగా దూసుకుపోతున్న తరుణంలో శార్దుల్‌కు బంతి అప్పగించడం భారత్‌కు మేలు చేసింది.దూకుడుగా ఆడుతున్న డకెట్‌తో పాటు హ్యారీ బ్రూక్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసి శార్దుల్ ఒక్కసారిగాటీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే రూట్, బెన్ స్టోక్స్ (51 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు 77 బంతుల్లో 49 పరుగులు జత చేశారు. అయితే జడేజా బౌలింగ్ పదే పదే రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించిన స్టోక్స్ అదే షాట్ ఆడి నిష్క్రమించాడు. ఈ దశలో ఇంగ్లండ్ మరో 69 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత బృందంలో కాస్త ఆశలు రేగాయి. అయితే అనుభవజు్ఞడైన రూట్ అండగా యువ కీపర్ స్మిత్ ఒత్తిడిని అధిగమించి చక్కటి షాట్లు ఆడటంతో ఇంగ్లండ్ గెలుపునకు చేరువైంది. భారత్ కొత్త బంతిని తీసుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. జడేజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన స్మిత్...అదే ఓవర్ చివరి బంతికి మరో సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465; భారత్ రెండో ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 65; డకెట్ (సి) (సబ్) నితీశ్ రెడ్డి (బి) శార్దుల్ 149; పోప్ (బి) ప్రసిధ్ 8; రూట్ (నాటౌట్) 53; బ్రూక్ (సి) పంత్ (బి) శార్దుల్ 0; స్టోక్స్ (సి) గిల్ (బి) జడేజా 33; స్మిత్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (82 ఓవర్లలో 5 వికెట్లకు) 373. వికెట్ల పతనం: 1–188, 2–206, 3–253, 4–253, 5–302. బౌలింగ్: బుమ్రా 19–3–57–0, సిరాజ్ 14–1–51–0, జడేజా 24–1–104–1, ప్రసిధ్ 15–0–92–2, శార్దుల్ 10–0–51–2. 5 ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా భారత్ నిలిచింది.2 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఇది రెండో అతి పెద్ద ఛేదన. 2022లో భారత్‌పైనే బర్మింగ్‌హామ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.6 హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్ వరుసగా ఆరో టెస్టు గెలిచింది. ఈ ఆరు సార్లు జట్టు లక్ష్యాలను ఛేదించడం విశేషం.3 టెస్టు మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ 350కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే.1673 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఒకే టెస్టులో నమోదైన మొత్తం పరుగులు. ఈ రెండు జట్ల మధ్య ఇదే అత్యధికం. -
IND VS ENG 1st Test Day 5: రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. చివరి రోజు ఆటలో (371 పరుగుల లక్ష్య ఛేదనలో) తొలి రెండు సెషన్లలో (253/2) ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్.. రెండో సెషన్ చివరి దశలో అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. లక్ష్యానికి 118 పరుగుల దూరంలో ఉన్న సమయంలో శార్దూల్ వరుస బంతుల్లో సెట్ బ్యాటర్ బెన్ డకెట్ (149), ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను (0) ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టాడు.భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 52 నిమిషాల సమయంలో వర్షం మరోసారి మొదలుకావడంతో టీ బ్రేక్‌ను ముందుగానే ప్రకటించారు. టీ విరామం సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి 102 పరుగుల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. క్రీజ్‌లో జో రూట్ (14), బెన్ స్టోక్స్ (13) ఉన్నారు. ఒకవేళ టీ విరామం తర్వాత వర్షం తగ్గి మ్యాచ్ యధావిధిగా సాగితే ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. భారత్ గెలవాలంటే మరో 6 వికెట్లు తీయాలి.ఓవర్‌నైట్ స్కోర్ 21/0 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. డకెట్, జాక్ క్రాలే (65) మొండి పట్టుదలతో ఆడటంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. డకెట్, క్రాలే తొలి వికెట్‌కు 188 పరుగులు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ గెలుపుకు బలమైన పునాది వేశారు. ఈ దశలో ప్రసిద్ద్ కృష్ణ క్రాలే, పోప్‌ను (8) స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చాడు. అయితే సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత రెచ్చిపోయిన డకెట్ వేగంగా పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని చిన్నదిగా చేశాడు. ఈ దశలో శార్దూల్ వరుస బంతుల్లో డకెట్, బ్రూక్‌ను ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.ఇవాల్టి ఆటలో తొలి సెషన్ వరకు ఎలాంటి ఆటంకం కలిగించని వర్షం.. రెండో సెషన్లో ఓ సారి, టీకి ముందు మరోసారి పలకరించింది.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 269/4 (డకెట్ 149, క్రాలే 65) -
IND VS ENG 1st Test Day 5: వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్
వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్వర్షం పాక్షిక అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. రెండో ఓవర్లోనే ప్రసిద్ద్ కృష్ణ జాక్ క్రాలేను (65) ఔట్ చేశాడు. ఇంగ్లండ్ గెలుపుకు ఇంకా 183 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి. లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. చివరి రోజు ఇంగ్లండ్ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. రెండో సెషన్లో వర్షం మొదలైంది. వర్షం మొదలయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. బెన్ డకెట్ (105) సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ జాక్ క్రాలే (59) బాధ్యతాయుతంగా ఆడుతూ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతున్న వేల వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 190 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 117/0 (డకెట్ 105 నాటౌట్, క్రాలే 59 నాటౌట్) -
IND VS ENG 1st Test, Day 5: తొలి సెషన్ వారిదే.. లక్ష్యం దిశగా సాగుతున్న ఇంగ్లండ్
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసపట్టులో సాగుతోంది. 350 పరుగుల లక్ష్య ఛేదనలో చేతిలో 10 వికెట్లు పెట్టుకొని చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్ (64 నాటౌట్), జాక్ క్రాలే (42 నాటౌట్) అద్బుతమైన పోరాటపటిమ కనబరుస్తూ తొలి సెషన్లో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ ఇద్దరు తొలి సెషన్లో అజేయమైన 96 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన డకెట్ ఈ ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. క్రాలేతో పోలిస్తే డకెట్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. క్రాలే బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. చివరి రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో రెండు సెషన్లలో 254 పరుగులు చేయాల్సి ఉంది. అదే భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాల్సి ఉంటుంది. మొత్తానికి భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.వాతావరణ ముందస్తు హెచ్చరికలో ఇవాళ వర్షం పడే అవకాశముందని తెలిపింది. అయితే వరుణుడు తొలి సెషన్లో ఎలాంటి బ్రేకులు వేయలేదు. మ్యాచ్ సజావుగా సాగుతుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఒక్కో పరుగును పేరుస్తూ.. తమ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. తొలి సెషన్లో భారత బౌలర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సెషన్ ముగియడానికి ముందు బంతి మార్పిడి జరిగింది. కొత్త బంతితో కూడా భారత బౌలర్లకు ఎలాంటి ఫలితం రాలేదు. వరుణుడి నుంచి ఎలాంటి ఆటంకం ఉండకపోతే తదుపరి రెండు సెషన్లలో భారత బౌలర్లు 66 ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది.స్కోర్ వివరాలు..భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 117/0 (డకెట్ 64 నాటౌట్, క్రాలే 42 నాటౌట్) -
ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రంలోనే శతక్కొట్టిన తిలక్ వర్మ
తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు, టీమిండియా టీ20 స్పెషలిస్ట్ తిలక్ వర్మ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్-2025లో ఆడేందుకు ఇటీవలే హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న తిలక్.. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఎసెక్స్‌తో రెండు రోజుల క్రితం ప్రారంభమైన మ్యాచ్‌లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (34/2) బరిలోకి దిగిన తిలక్.. ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి కాగానే హార్మర్ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కాగా.. హ్యాంప్‌షైర్ 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది (మూడో రోజు తొలి సెషన్). తిలక్ ఔట్ కాగానే మరో హ్యాంప్‌షైర్ ఆటగాడు లియామ్ డాసన్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో చార్లీ అల్లీసన్ (101) సెంచరీతో కదంతొక్కాడు.కాగా, తిలక్ ఇటీవలే హ్యాంప్‌షైర్‌తో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 18 నుండి ఆగస్టు 2 వరకు ఈ జట్టుకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించాడు. ఈ ఒప్పందంలో తిలక్ నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. వైట్‌బాల్ గేమ్స్ ఆడతాడో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో టీ20 బ్లాస్ట్ టోర్నీ జరుగుతోంది.22 ఏళ్ల తిలక్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు 18 ఫస్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. టీమిండియా తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడిన తిలక్.. టీ20ల్లో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అతను 24 ఇన్నింగ్స్‌లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు.తిలక్‌కు ముందు మరో ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్లు, టీ20 స్పెషలిస్ట్‌లు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్తో.. రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్‌తో జతకట్టారు. ఇషాన్ కూడా తిలక్ తరహాలోనే తన కౌంటీ అరంగేట్రంలో ఇరగదీశాడు. యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. -
IND VS ENG 1st Test Day 5: టీమిండియాను కలవరపెడుతున్న చెడు శకునాలు..!
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్ గెలవాలంటే చివరి రోజు 350 పరుగులు (90 ఓవర్లలో) సాధించాలి. అదే భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి. ఆధునిక టెస్ట్ క్రికెట్లో రెండూ అసాధ్యం కాదు. ఫలితం ఏ జట్టుకైనా అనుకూలంగా రావచ్చు.అయితే, గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం ఎడ్జ్ ఇంగ్లండ్‌కే సూచిస్తున్నాయి. 2019లో ఇదే మైదానంలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ నమ్మశక్యంకాని శతకాన్ని (135 నాటౌట్) బాది ఇంగ్లండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. లీడ్స్ మైదానానికి 350 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఘన చరిత్ర ఉండటం ఐదో రోజు ఆటకు ముందు భారత ఆటగాళ్లను డిఫెన్స్‌లో పడేస్తుంది. అప్పట్లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లండే కావడం టీమిండియాను మరింత బయపెడుతుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం చివరి రోజు 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తగ్గేదేలేదంటున్నారు.చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాను మరో చెడు సూచకం కూడా బయపెడుతుంది. భారత్ తమ యావత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 ప్లస్ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఒకే ఒకసారి చతికిలపడింది. టీమిండియా 59 మ్యాచ్‌ల్లో 350 ప్లస్ లక్ష్యాలను కాపాడుకునేందుకు బరిలోకి దిగగా.. 42 సార్లు సఫలమైంది. ఒకే ఒక సందర్భంలో బోల్తా పడింది. ఆ ఒక్క ఓటమి ఇంగ్లండ్ చేతిలోనే కావడం టీమిండియాను కలవరపెడుతుంది. 2022లో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో రూట్, బెయిర్‌స్టో అద్భుత శతకాలు సాధించి ఇంగ్లండ్‌ను గెలిపించారు.మరోవైపు చివరి రోజు ఆటకు ముందు వాతావరణం కూడా భారత్ విజయానికి అడ్డుకట్ట వేసేలా కనిపిస్తుంది. మ్యాచ్ మధ్య మధ్యలో వరుణుడు పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత బౌలర్లు చివరి రోజు ఏం చేస్తారోనని టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్కోర్ వివరాలు..భారత్: 471 & 364ఇంగ్లండ్: 465 & 21/0చివరి రోజు భారత్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. అదే ఇంగ్లండ్ గెలవాలంటే 90 ఓవర్లలో 350 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజ్‌లో ఉన్నారు. -
‘పదేళ్లుగా అదే మాట వింటున్నా’
లీడ్స్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు పదేళ్లుగా ఉన్నాడు. ఐపీఎల్లో పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. అయితే కెరీర్ ఆరంభం నుంచి అతని భిన్నమైన బౌలింగ్ శైలిపై ఎన్నో చర్చలు సాగాయి. ఈ తరహా యాక్షన్‌తో ఎక్కువ కాలం కొనసాగలేడని, సుదీర్ఘ కెరీర్ సాగడం కష్టమని చాలా మంది అభిప్రాయపడ్డారు. పైగా గాయాలతో ఆటకు దూరం కాగానే ఇంతటితో కెరీర్ ముగిసినట్లే అనే విమర్శలు వినిపించాయి. కానీ బుమ్రా వాటన్నింటినీ పట్టించుకోలేదు. అద్భుత ప్రదర్శనలతో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించి ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. బరిలోకి దిగిన ప్రతీసారి కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత అతను ఈ విషయాలపై స్పందించాడు. ‘నేను ఎప్పుడైనా భారత్‌కు ఆడాలని బలంగా కోరుకున్నా. నాపై నాకున్న నమ్మకం వల్లే అన్ని ఫార్మాట్లలో ఆడగలిగా. కానే వేరేవాళ్లు ఎవరూ దానిని నమ్మలేదు. నువ్వు అసలు ఎప్పుడూ ఆడలేవు అని మొదట్లో అనేవారు. ఆ తర్వాత ఆరు నెలలు, ఆపై ఎనిమిది నెలలు ఆడితే గొప్ప అనేవారు. కానీ ఇప్పుడు భారత్ తరఫున దాదాపు పదేళ్లు ఆడితే ఐపీఎల్లో మరో మూడేళ్లు అదనంగా ఆడాను. ఇప్పుడు కూడా ఒక గాయం కాగానే నా పనైపోయిందని వెంటనే అనేస్తారు. ప్రతీ మూడు–నాలుగు నెలలకు ఇవే మాటలు వస్తాయి. నేను ఇవేమీ పట్టించుకోను. నా పని నేను చేస్తూ పోతా. భారత జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తా. ఆపై దేవుడు నాకు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. బుమ్రా ఫిట్నెస్, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతను మూడు టెస్టులే ఆడతాడని కోచ్ గంభీర్ ప్రకటించాడు. అయితే ఇదే విషయంపై బుమ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. తాను మూడు టెస్టులే ఆడతానా లేదా అనేదానిపై అతను స్పష్టతనివ్వలేదు. ‘మున్ముందు ఏం జరగవచ్చనే విషయంపై ఆలోచించడం అనవసరం. ప్రస్తుతం మైదానంలో ఏం జరుగుతోంది అనే దానిపైనే నా దృష్టి ఉంది. నేను పూర్తి చేయాల్సి పని ఉంది. పిచ్ ఎలా స్పందిస్తోంది, వికెట్ ఎలా తీయాలి, ఏ బ్యాటర్‌కు ఎలా బౌలింగ్ చేయాలి అనే అంశాలపైనే నేను ఆలోచిస్తున్నాను. అంతే తప్ప ఎన్ని టెస్టులు ఆడతానని కాదు. ఒక్కసారి మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ లెక్కలన్నీ చూసుకోవచ్చు. రాత్రయ్యాక ఈ రోజు నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని భావిస్తే ప్రశాంతంగా పడుకుంటా’ అని బుమ్రా వివరించాడు. -
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట ముగింపు
-
IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఔట్ కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు షాక్ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్‌కు జతగా రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. గిల్ వికెట్ కోల్పోవడంతో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌పై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా గౌరవప్రదమైన టార్గెట్ ఉంచాలంటే రాహుల్, పంత్ చాలా కీలకం కానున్నారు. వీరిద్దరు ఈ రోజంతా క్రీజ్‌లో ఉంటేనే భారత్ ఓ మోస్తరు స్కోర్ చేయగలుగుతుంది. -
ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్ట్ రెండో రోజు ముగిసిన ఆట
-
తొలిరోజే ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన భారత్
-
Ind vs Eng 1st Day 1: బ్యాటింగ్‌తో అదరగొట్టారు
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయం ఘనంగా మొదలైంది. అంచనాలకు మించిన ఆటతో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. సీనియర్లు తప్పుకున్నా... జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు తాము సరైనోళ్లమని యువ ఆటగాళ్లు నిరూపించారు. అసాధారణ బ్యాటింగ్‌తో ముందుగా యశస్వి జైస్వాల్, ఆపై కెప్టెన్‌గా తొలి పరీక్షలో శుబ్‌మన్ గిల్ సెంచరీలు బాది సత్తా చాటగా, రిషభ్ పంత్ తన విలువను ప్రదర్శించాడు. హెడింగ్లీ పిచ్‌పై ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లందరినీ ఒక ఆటాడుకున్న మన బ్యాటర్లు భారీ స్కోరుతో మొదటి రోజును గొప్పగా ముగించారు. లీడ్స్: ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్ భారీ స్కోరుతో చెలరేగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (175 బంతుల్లో 127 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 101; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగగా, వైస్ కెపె్టన్ రిషభ్ పంత్ (102 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది ఐదో సెంచరీ కాగా, గిల్‌కు ఆరో శతకం. జైస్వాల్, గిల్ మూడో వికెట్‌కు 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత గిల్, పంత్ నాలుగో వికెట్‌కు అభేద్యంగా 138 పరుగులు జత చేశారు. సిరీస్‌లో శుభారంభం... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 42; 8 ఫోర్లు) జట్టుకు సరైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చకచకా బౌండరీలు బాదారు. ఒకదశలో అసహనంతో జైస్వాల్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లండ్ ఏమాత్రం అవకాశం లేకపోయినా... ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరి విఫలమైంది. తొలి గంటలో భారత్ 9 ఫోర్లతో 44 పరుగులు చేసింది. ఎట్టకేలకు లంచ్ విరామానికి ముందు ఇంగ్లండ్‌కు ఊరట దక్కింది. ఆరు బంతుల వ్యవధిలో రాహుల్, తొలి టెస్టు ఆడుతున్న సుదర్శన్ (0) అవుట్ కాగా...లంచ్ సమయానికి జట్టు స్కోరు 92/2కు చేరింది. భారీ భాగస్వామ్యం... విరామానంతరం 96 బంతుల్లో జైస్వాల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్లో జైస్వాల్, గిల్ ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఆడుకున్నారు. ఓవర్‌కు దాదాపు ఐదు పరుగుల రన్‌రేట్‌తో పరుగులు రాబట్టి ప్రత్యరి్థపై ఆధిక్యం ప్రదర్శించారు. వోక్స్ వేసిన రెండు ఓవర్లలో గిల్, జైస్వాల్ చెరో 3 ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించారు. 56 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు జోరు పెంచిన జైస్వాల్ కార్స్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి 99కు చేరుకున్నాడు. తర్వాతి బంతిని సింగిల్ తీసిన అతను 144 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరడానికి జైస్వాల్ 48 బంతులే (8 ఫోర్లు, 1 సిక్స్‌తో) తీసుకోవడం విశేషం. పంత్ జోరు... టీ తర్వాత రెండో ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్‌ను స్టోక్స్ బౌల్డ్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత గిల్, పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా...గిల్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. బషీర్ ఓవర్లో పంత్ వరుసగా 4, 6 బాదడంతో స్కోరు 300కు చేరుకోగా... టంగ్ ఓవర్లో కవర్స్ దిశగా ఆడి గిల్ 140 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ హాఫ్ సెంచరీ (91 బంతుల్లో) పూర్తయింది. ఎంత ప్రయత్నించినా ...పేలవ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఈ జోడీని విడదీయలేకపోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 127; పంత్ (బ్యాటింగ్) 65; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 359. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221. బౌలింగ్: వోక్స్ 19–2–89–0, కార్స్ 16–5–70–1, టంగ్ 16–0–75–0, స్టోక్స్ 13–1–43–2, బషీర్ 21–4–66–0. -
భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం
-
భారత్ ‘పరీక్ష’ మొదలు
భారత టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర లేస్తోంది. సుదీర్ఘ కాలం జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్‌ల రిటైర్మెంట్ తర్వాత జట్టు తొలి సిరీస్ బరిలోకి దిగుతోంది. టెస్టు ఫార్మాట్లో కొత్త సారథిగా బాధ్యతలు తీసుకున్న శుబ్‌మన్ గిల్‌కు తొలి సిరీస్‌లో కఠిన పరీక్ష ఎదురవుతోంది.ప్రత్యర్థి గడ్డపై ఇప్పటి వరకు మన రికార్డు, ప్రస్తుత యువ జట్టు అనుభవాన్ని చూస్తే ఇది పెద్ద సవాల్. టీమ్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో పాటు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా గిల్ తనను తాను నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. అయితే గతంలోనూ పాత చరిత్రను మార్చిసంచలనాలు సృష్టించిన భారత బృందం మరోసారి అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే అనూహ్య ఫలితాలు ఖాయం. లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ పోరుకు సైరన్ మోగింది. ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య హెడింగ్లీ మైదానంలో నేటి నుంచి తొలి టెస్టు జరగనుంది. ఏడాది క్రితం భారత గడ్డపై జరిగిన టెస్టు పోరులో టీమిండియా 4–1తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు తమ సొంత మైదానంలో దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని స్టోక్స్ బృందం భావిస్తుండగా... అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చి పైచేయి సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. టెస్టుల్లో భారత్‌కు 37వ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన గిల్‌కు ఇది కీలక సిరీస్ కానుండగా... బ్యాటర్‌గా ఇంగ్లండ్ గడ్డపై పేలవ రికార్డు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా గెలుపుపై గురి పెట్టాడు. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్‌కు స్వదేశంలో మంచి ఫలితాలు అందించిన ‘బజ్‌బాల్’ శైలి ఆట ఈసారి ఎలాంటి ఫలితాలు అందిస్తుందనేది ఆసక్తికరం. ఆరో స్థానంలో ఎవరు? తొలి టెస్టులో భారత తుది జట్టు దాదాపుగా ఖాయమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడనుండగా మూడో స్థానంలో కరుణ్ నాయర్ బరిలోకి దిగుతాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆకట్టుకున్న జైస్వాల్‌తో పాటు రాహుల్ కూడా రాణిస్తే జట్టుకు శుభారంభం లభిస్తుంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న కరుణ్ నాయర్ తన ఇటీవలి దేశవాళీ ఫామ్‌ను కొనసాగించడంతో పాటు జట్టులో స్థానం కాపాడుకునే ఒత్తిడిని కూడా అధిగమించాల్సి ఉంటుంది. నాలుగో స్థానంలో ఆడనున్న గిల్ తన బ్యాటింగ్‌తో అంచనాలు అందుకోవడం కీలకం. ఆసీస్ గడ్డపై విఫలమైన పంత్ మరింత బాధ్యతగా ఆడాల్సిన తరుణమిది. భారత జట్టు విజయావకాశాలు పేసర్ బుమ్రాపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. సొంత మైదానంలో అయినా సరే ఇంగ్లండ్ బ్యాటర్లు అతడిని సమర్థంగా ఎదుర్కోవడం అంత సులువు కాదు. సిరాజ్ కూడా స్వింగ్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. మూడో పేసర్‌గా ప్రసిధ్ కృష్ణ ఆడటం కూడా దాదాపు ఖాయమే. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ తన సత్తాను ఈ సిరీస్‌లో నిరూపించుకోవాల్సి ఉంది. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా స్థానానికి ఢోకా లేదు. అయితే మిగిలిన ఆరో స్థానం కోసమే జట్టులో గట్టి పోటీ ఉంది. ఇక్కడా రెగ్యులర్ బ్యాటర్‌ను ఆడిస్తారా లేక ఆల్‌రౌండర్‌కు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బ్యాటర్ అయితే సాయి సుదర్శన్ అరంగేట్రం చేయవచ్చు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలంటే శార్దుల్ ఠాకూర్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. లేదా స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ రూపంలో ప్రత్యామ్నాయం ఉంది. బౌలింగ్‌లో అనుభవలేమి... దాదాపు రెండు దశాబ్దాల పాటు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బలంపైనే ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆధారపడుతూ వచి్చంది. వీరిద్దరు కలిసి ప్రత్యర్థులను కుప్పకూలుస్తూ ఎన్నో విజయాలు అందించారు. అయితే ఇప్పటి పేస్ బృందానికి చాలా తక్కువ అనుభవం ఉంది. ఈ బౌలింగ్ దళం ప్రత్యర్థిని ఏమాత్రం భయపెట్టించేలా లేదు. కార్స్ 5, టంగ్ 3 టెస్టులు ఆడగా...అనుభవజ్ఞుడే అయినా అండర్సన్, బ్రాడ్‌లతో పోలిస్తే క్రిస్ వోక్స్ స్థాయి తక్కువ. భారత బ్యాటర్ల కోణంలో చూస్తే స్పిన్నర్ బషీర్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అందుకే ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో తమ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. 13 వేలకు పైగా టెస్టు పరుగులు సాధించిన రూట్ మరోసారి బ్యాటింగ్ బాధ్యత మోస్తున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది కీలకం. ‘బజ్‌బాల్’ వచ్చాక ఎన్నో శుభారంభాలు అందించిన క్రాలీ, డకెట్ నుంచి మరో సారి జట్టు అదే ఆటను ఆశిస్తోంది. పోప్‌తో పాటు ప్రతిభావంతుడైన బ్రూక్‌పై జట్టు బ్యాటింగ్ భారం ఉంది. కెప్టెన్ స్టోక్స్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. గత మూడేళ్లుగా అతను సెంచరీనే చేయలేదు. భారత గడ్డపై ఆడిన ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన స్టోక్స్ ఎలాంటి ప్రభావం చూపించగలడనేది కీలకం. 3 ఇంగ్లండ్ గడ్డపై భారత్ 19 టెస్టు సిరీస్‌లు ఆడింది. ఇందులో 3 సిరీస్‌లను (1971లో, 1986లో, 2007లో) సొంతం చేసుకుంది. 14 సిరీస్‌లను చేజార్చుకుంది. మరో 2 సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి.67 ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టుతో భారత్ 67 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో గెలిచిన భారత్ 36 టెస్టుల్లో ఓడిపోయింది. మరో 22 టెస్టులను టీమిండియా ‘డ్రా’ చేసుకుంది.7 హెడింగ్లీ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొత్తం 7 టెస్టులు జరిగాయి. 2 టెస్టుల్లో భారత్, 4 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి. 1 టెస్టు ‘డ్రా’గా ముగిసింది. పిచ్, వాతావరణం హెడింగ్లీ మైదానంలో తొలిసారి ఆరంభంలో పేసర్లకు కాస్త అవకాశం ఉన్నా ఆట సాగిన కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలం కావొచ్చు. ఇంగ్లండ్ కూడా పూర్తిగా బౌలింగ్ పిచ్‌ను ఎంచుకునే సాహసం చేయడం లేదు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్ష సూచన లేదు. తుది జట్లు ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, టంగ్, బషీర్. భారత్ (అంచనా): గిల్(కెప్టెన్), జైస్వాల్, రాహుల్, కరుణ్ నాయర్, పంత్, సుదర్శన్/నితీశ్ రెడ్డి, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, కుల్దీప్. -
‘అప్పటికప్పుడు ఆటను మార్చుకోవాలి’
లీడ్స్: ఇంగ్లండ్ గడ్డపై భారత్ మెరుగైన ఫలితం సాధించాలంటే బ్యాటర్లు ఒకే తరహా శైలికి కట్టుబడి ఉండరాదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మైదానాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయని, దానికి అనుగుణంగా తమ బ్యాటింగ్ ను కూడా మార్చుకోవాలని అతను సూచించాడు. ‘నా ఆట ఇలాగే ఉంటుంది. నేను ఇలాగే ఆడతాను అనే వన్‌వే ట్రాఫిక్ ఇంగ్లండ్‌లో పనికి రాదు. ఇక్కడి పరిస్థితులను కొద్దిగా గౌరవించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా తమ ఆటను మార్చుకోవాలనే ఆలోచనలు మనసులో సాగుతూనే ఉండాలి. అప్పుటే ఆటపై పట్టు చిక్కి అంతా చక్కబడుతుంది. ఎప్పుడు దూకుడు పెంచాలో, ఎప్పుడు డిఫెన్స్ ఆడాలో తెలియాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని సచిన్ వివరించాడు. అయితే ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో ఆడిన అనుభవం జట్టులో అందరికీ ఉందని, వాటినుంచి నేర్చుకున్న విషయాలను మెరుగుపర్చుకుంటే ఇక్కడా మంచి ఫలితాలు వస్తాయని అతను అన్నాడు. భారత కెప్టెన్‌గా తొలి సిరీస్ ఆడనున్న శుబ్‌మన్ గిల్‌కు కూడా సచిన్ పలు సలహాలు ఇచ్చాడు. అతను బయటి విషయాలను పట్టించుకోరాదని, తన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని దిగ్గజ బ్యాటర్ సూచించాడు. ‘కెప్టెన్‌గా గిల్‌కు కొంత సమయం ఇవ్వడంతో పాటు అందరూ అతనికి అండగా కూడా నిలవాలి. భారత కెప్టెన్ అంటే తీవ్రమైన ఒత్తిడి ఉండే బాధ్యత. ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. అభిప్రాయాలు చెప్పే హక్కు బయటి నుంచి ఎవరికైనా ఉంటుంది. ఇవన్నీ గిల్ పట్టించుకోకూడదు. డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించిన వ్యూహాలను మైదానంలో అమలయ్యేలా చూడాలి’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ ఆవిష్కరణ..భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’గా పేరు పెట్టారు. ఈ ట్రోఫీని గురువారం ఆవిష్కరించారు. అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్లుగా సచిన్ (200), అండర్సన్ (188) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ (15,921) పేరిట ఉండగా... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంతో (704 వికెట్లు) అండర్సన్ కెరీర్ ముగించాడు. వీరిద్దరి పేర్లను ట్రోఫీకి పెట్టి ఈసీబీ, బీసీసీఐ సముచితంగా గౌరవించాయి. మరోవైపు ఇప్పటి వరకు ట్రోఫీకి ‘పటౌడీ’ పేరు ఉండేది. ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టు కెపె్టన్‌కు ‘పటౌడీ మెడల్’ అందజేస్తారు. పేరు మార్పు విషయంలో తాను పటౌడీ కుటుంబంతో స్వయంగా మాట్లాడానని ... ఏదో రూపంలో వారి గౌరవం కొనసాగేలా తాను ప్రయత్నిస్తానని వారితో చెప్పినట్లు సచిన్ వెల్లడించాడు. -
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విచిత్ర పరిస్థితి
ఇటీవల జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. సానుకూల వాతావరణం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది. సాధారణంగా సానుకూల వాతావరణంలో క్రికెట్ మ్యాచ్‌లు సజావుగా సాగుతాయి. ప్రతికూల వాతావరణం ఉంటేనే మ్యాచ్‌లు వాయిదా పడటం కాని, రద్దు కావడం కాని జరుగుతుంది. అయితే ఈ ఉదంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది. సానుకూల వాతావరణం ఉన్నా మ్యాచ్ వాయిదా పడింది.ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో కెంట్ స్పిట్‌ఫైర్స్, గ్లోసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెంట్ నిర్దేశించిన లక్ష్యాన్ని గ్లెసెస్టర్షైర్ ఛేదిస్తుండగా భారీగా ఎండ కాసింది. సూర్య కిరణాలు నేరుగా ఆటగాళ్ల కళ్లపై పడ్డాయి. దీంతో మ్యాచ్‌ను పాక్షికంగా వాయిదా వేశారు. ఎనిమిది నిమిషాల తర్వాత ఎండ ప్రభావం తగ్గడంతో మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు.అనుకూలమైన వాతావరణం ఉన్నా మ్యాచ్ వాయిదా పడ్డ విషయం తెలిసి ఉపఖండంలోని క్రికెట్ అభిమానులు అవాక్కయ్యారు. భారత్ లాంటి దేశాల్లో ఎంత ఎండ ఉంటే మ్యాచ్‌లు అంత సజావుగా సాగుతాయి. ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు ఉన్నా ఉపఖండపు దేశాల్లో క్రికెట్ మ్యాచ్‌కు అనుకూలమైన వాతావరణంగానే పరిగణిస్తారు.అయితే ఇంగ్లండ్ లాంటి దేశాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఇంగ్లండ్‌లో ఎండలు ఎక్కువగా ఉండవు. ఈ వాతావరణానికి అలవాటు పడ్డ ఆటగాళ్లు, కొద్దిపాటి ఎండకే బెంబేలెత్తిపోతుంటారు. ఉపఖండంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోడం చాలా సార్లు చూసుంటాము.మ్యాచ్ విషయానికొస్తే.. కెంట్‌పై గ్లోసెస్టర్‌షైర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. ఫించ్ (42), బిల్లింగ్స్ (38), ముయేయే (33) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గ్లోసెస్టర్‌షైర్.. జాక్ టేలర్ (54 నాటౌట్), ఓలివర్ ప్రైస్ (41 నాటౌట్) రాణించడంతో మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇంగ్లండ్ తో టెస్ట్ ఛాంపియన్ షిప్ కు సిద్ధమైన భారత్
-
‘తీవ్ర వేదన అనుభవించా’
లీడ్స్: భారత జట్టు 2018 ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ను 1–4తో కోల్పోయింది. నాలుగో టెస్టు ముగిసేసరికే ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టూర్లో ఆరంభం నుంచి ఉన్న కరుణ్ నాయర్‌కు నాలుగు మ్యాచుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. సిరీస్ ఫలితం ఖాయమైన నేపథ్యంలో కనీసం చివరి టెస్టులోనైనా చోటు దక్కవచ్చని అతను ఆశించాడు. అయితే కోహ్లి కెప్టెన్, రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న టీమ్ మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నాయర్ టీమ్‌తోనే ఉండగా... అసలు ప్రధాన జట్టులోనే లేని హనుమ విహారిని భారత్ నుంచి ఇంగ్లండ్‌కు రప్పించి అతనితో అరంగేట్రం చేయించింది. దాంతో నాయర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత అతను భారత జట్టుకూ పూర్తిగా దూరమయ్యాడు. నాటి ఘటన తనను తీవ్రంగా బాధించిందని నాయర్ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత అదే ఇంగ్లండ్ గడ్డపైనే అతనికి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రానుండటం విశేషం. ‘చివరి టెస్టులోనూ నాకు అవకాశం లేదని తెలిసిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మైదానంలోనే కుప్పకూలిపోయినట్లుగా అనిపించింది. నేను ఆడటం లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్లిపోయాను. బ్రాండెడ్ షూస్ మొదలు కనిపించిన ప్రతీ వస్తువును కొంటూ పోయాను. నేను గతంలో ఇలా ఎప్పుడూ చేయలేదు. ఎక్కువగా ఖర్చు చేసే అలవాటు కూడా లేదు. కానీ ఈసారి ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. బ్యాగుల నిండా వస్తువులు తీసుకొని తిరిగొచ్చాను. ఆ సమయంలో షాపింగ్ చేస్తే నాకు సంతోషం కలుగుతుందేమో అన్నట్లుగా భావించాను కానీ అది అర్థం లేని ఆలోచన. భారత్‌కు ఆడటం తప్ప మరేదో ఆనందం ఇవ్వలేదని అర్థమైంది. నాకు సంబంధించి సిరీస్ అయిపోయింది. కానీ చివరి మ్యాచ్ ముగిసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనే ఆలోచనలో ప్రతీ రోజు ఒక నరకంగా అనిపించింది’ అని కరుణ్ నాయర్ తన బాధను వ్యక్తీకరించాడు. -
నయా నంబర్ 4 గిల్
లీడ్స్: భారత టెస్టు క్రికెట్లో బ్యాటింగ్ ఆర్డర్‌కు సంబంధించి నాలుగో స్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ‘ఆల్‌టైమ్ గ్రేట్’ సచిన్ టెండూల్కర్ తన 200 టెస్టుల సుదీర్ఘ కెరీర్లో 179 టెస్టుల్లో నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. 1992లో సచిన్ ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ వరకు కొనసాగాడు. సచిన్ వీడ్కోలు పలికిన తర్వాత భారత్ ఆడిన తొలి టెస్టు నుంచే మరో దిగ్గజం విరాట్ కోహ్లి నాలుగో స్థానాన్ని భర్తీ చేశాడు. విరాట్ 99 టెస్టుల్లో ఆ స్థానంలో బరిలోకి దిగాడు. మిడిలార్డర్లో పదునైన బ్యాటింగ్‌తో టెస్టు మ్యాచ్ గమనాన్ని శాసించే అవకాశం ఉన్న ఈ స్థానంలోకి ఇప్పుడు కొత్త ఆటగాడు వస్తున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయమైంది. టీమ్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ విషయాన్ని నిర్ధారించాడు. ‘బ్యాటింగ్ ఆర్డర్లో శుబ్‌మన్ నాలుగో స్థానంలో ఆడతాడు. నేను ఎప్పటిలాగే ఐదో స్థానంలోనే కొనసాగుతాను. అయితే మూడో స్థానం విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దానిపై చర్చిస్తున్నాం’ అని పంత్ వెల్లడించాడు.తనకూ, కెప్టెన్ గిల్‌కు మధ్య మైదానం బయట ఉన్న సాన్నిహిత్యం జట్టు సానుకూల ఫలితాలు రాబట్టేందుకు ఉపయోగపడుతుందని పంత్ వ్యాఖ్యానించాడు. ‘మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. సహజంగానే ఇది మైదానంలో కూడా ప్రతిఫలిస్తుంది. మేమిద్దరం బాగా కలిసిపోయి ఏ విషయాన్ని అయినా సౌకర్యవంతంగా చర్చించుకోగలం. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతున్నా’ అని అతను అన్నాడు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లాంటి దిగ్గజాలు దూరం కావడం ఇంగ్లండ్ జట్టుకు కూడా లోటే అని పంత్ అభిప్రాయపడ్డాడు. ‘అండర్సన్, బ్రాడ్ లేకపోవడం మాకు కాస్త ఊరట అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఏళ్లు వారు జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. గత రెండు సిరీస్‌లలో నేను వారిని ఎదుర్కొన్నాను. అయితే ప్రస్తుత ఇంగ్లండ్ బౌలింగ్ బృందం కూడా పదునుగా ఉంది. మేం ఎవరినీ తక్కువగా అంచనా వేయడం లేదు. పరిస్థితులను బట్టి వారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మా యువ ఆటగాళ్లూ సిద్ధంగా ఉన్నారు’ అని పంత్ వివరించాడు. కోహ్లితో తలపడాలనుకున్నా: స్టోక్స్తమతో ఆడే సిరీస్‌లో విరాట్ కోహ్లి లేకపోవడం అవమానకరంగా అనిపిస్తోందని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. భారత్‌కు ఇది పెద్ద లోటని అతను అభిప్రాయపడ్డాడు. ‘మైదానంలో కోహ్లి ప్రదర్శించే పోరాటతత్వం, ఎలాగైనా గెలిచేందుకు పోటీ పడే శైలిని భారత్ కోల్పోయింది. 18 నంబర్ జెర్సీకి అతను ఒక స్థాయిని కల్పించాడు. ఇప్పుడు ఆ జెర్సీ మైదానంలో కనిపించదు. కోహ్లికి ప్రత్యర్థి గా తలపడాలని నేను ఎంతో కోరుకున్నాను. మైదానంలో పోటీపడే విషయం మా ఇద్దరి లక్షణాలు ఒకటే. నీతో ఆడే అవకాశం లేకపోవడం అవమానంగా భావిస్తున్నాను అని నేను కోహ్లికి మెసేజ్ పంపించా’ అని స్టోక్స్ వెల్లడించాడు. మరోవైపు భారత జట్టు ఈ సిరీస్ కోసం అన్ని విధాలుగా సన్నద్ధమై వచ్చిందని... తమకు గెలుపు అంత సులువు కాదని ఇంగ్లండ్ ప్రధాన బ్యాటర్ జో రూట్ వ్యాఖ్యానించాడు. ‘నా దృష్టిలో ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారత్ లాంటి జట్టుతో తలపడేందుకు నేను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. టీమిండియా చాలా బలంగా ఉంది. పదునైన పేస్ బౌలింగ్, ప్రతిభావంతులైన బ్యాటర్లు, బలమైన స్పిన్‌తో వారంతా సన్నద్ధమై వచ్చారు. స్వదేశంలో మా రికార్డు మాకు కొంత సానుకూలాంశం’ అని రూట్ స్పందించాడు.బ్యాటింగ్ పిచ్ సిద్ధం... తొలి టెస్టులో బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్ అందుబాటులో ఉండటం దాదాపు ఖాయమైంది. ‘బజ్‌బాల్’ శైలిలో దూకుడుగా ఆడేందుకు సిద్ధమైన ఇంగ్లండ్ తమ ఆలోచనలకు తగిన రీతిలో పిచ్‌ను సిద్ధం చేయిస్తోంది.క్రిస్ వోక్స్ పునరాగమనంతొలి టెస్టుకు రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌కు ఇందులో చోటు దక్కింది. గాయం కారణంగా వోక్స్ ఇంగ్లండ్ ఆడిన గత రెండు టెస్టులకు దూరమయ్యాడు. మూడో స్థానంలో యువ ఆటగాడు బెథెల్‌ను కాదని ఓలీ పోప్‌కు ఇంగ్లండ్ ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్టును మినహాయిస్తే దాదాపు ఏడాది కాలంగా పోప్ వరుసగా విఫలమవుతున్నా... అతని అనుభవాన్నిదృష్టిలో ఉంచుకొని టీమ్‌లోకి ఎంపిక చేసింది. ముగ్గురు పేసర్లతో పాటు ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ బరిలోకి దిగుతాడు. తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, వోక్స్, కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (ICC Women's T20 World Cup) షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్ 12న తెర లేవనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.ఈ మెగా ఈవెంట్లో పన్నెండు జట్లు భాగం కానున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి.ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్తాన్‌తో పాటు మరో రెండు జట్లు.. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు మరో రెండు టీమ్‌లు పోటీపడనున్నాయి.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి న్యూజిలాండ్కాగా చివరగా 2024లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 33 మ్యాచ్‌లు జరుగనున్నాయి.కాగా ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇంగ్లండ్- శ్రీలంక మధ్య మ్యాచ్‌తో జూన్ 12న మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌తో ముగియనుంది.భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడే..ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. జూన్ 14న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం గ్లోబ్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన టీమ్‌తో జూన్ 17న భారత్ తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న క్వాలిఫయర్ జట్టుతో, జూన్ 28న పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 పూర్తి షెడ్యూల్జూన్ 12- శుక్రవారం- ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక, ఎడ్జ్బాస్టన్జూన్ 13- శనివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 13- శనివారం: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 13- శనివారం: వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్జూన్ 14- ఆదివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఎడ్జ్బాస్టన్జూన్ 14- ఆదివారం: ఇండియా vs పాకిస్తాన్, ఎడ్జ్బాస్టన్జూన్ 16- మంగళవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్జూన్ 16- మంగళవారం: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హాంప్షైర్బౌల్జూన్ 17- బుధవారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 17- బుధవారం: ఇండియా vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 17- బుధవారం: సౌతాఫ్రికా vs పాకిస్తాన్, ఎడ్జ్బాస్టన్జూన్ 18- గురువారం: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 19- శుక్రవారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్జూన్ 20- శనివారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్జూన్ 20- శనివారం: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 21- ఆదివారం: వెస్టిండీస్ vs శ్రీలంక, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: శ్రీలంక vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, హెడ్డింగ్లీజూన్ 24- బుధవారం: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్జూన్ 25- గురువారం: ఇండియా vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 25- గురువారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 26- శుక్రవారం: శ్రీలంక vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 27- శనివారం: పాకిస్తాన్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 27- శనివారం: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 27- శనివారం: ఇంగ్లండ్ vs న్యూజిలాండ్, ది ఓవల్జూన్ 28- ఆదివారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జూన్ 28- ఆదివారం: ఆస్ట్రేలియా vs ఇండియా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జూన్ 30- మంగళవారం: సెమీ ఫైనల్ 1- ది ఓవల్జూలై 2- గురువారం: సెమీ ఫైనల్ 2- ది ఓవల్జూలై 5- ఆదివారం: ఫైనల్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.చదవండి: గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో -
కొత్త ఆరంభానికి సిద్ధం
భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై 19 సిరీస్‌లు ఆడితే 14 సిరీస్‌లలో పరాజయమే పలకరించింది. రెండు సిరీస్‌లు సమంగా ముగియగా మూడుసార్లు భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే పాత రికార్డుల్లోకి వెళ్లకుండా గత మూడు సిరీస్‌లనే చూసుకుంటే టీమిండియా ప్రదర్శనలో అక్కడక్కడ చెప్పుకోదగ్గ మెరుపులు ఉన్నాయి. చివరిసారిగా 2021–22లో పర్యటించిన సమయంలో ఐదు టెస్టుల సిరీస్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకోవడం మన జట్టు మెరుగైన ప్రదర్శనకు సూచిక.అంతకుముందు రెండు పర్యటనల్లో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన రికార్డు అంకెల్లో కనిపిస్తున్నా... భారత్ చాలా సందర్భాల్లో పైచేయి సాధించింది. దురదృష్టవశాత్తూ కీలక క్షణాల్లో పట్టు తప్పడంతో మ్యాచ్‌లు చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ బృందం పట్టుదలను, పోరాటపటిమను ప్రదర్శిస్తే ఇంగ్లండ్‌తో గట్టి పోటీనివ్వడం ఖాయం. అంచనాలకు అనుగుణంగా రాణిస్తే సిరీస్ ఏకపక్షంగా సాగకుండా ఇంగ్లండ్‌ను టీమిండియా నిలువరించవచ్చు. –సాక్షి క్రీడా విభాగం ప్రస్తుతం సిరీస్‌కు సిద్ధమైన జట్టులో ఇంగ్లండ్ గడ్డపై అనుభవంరీత్యా చూస్తే రవీంద్ర జడేజాఅందరి కంటే సీనియర్. గత మూడు సిరీస్‌లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్‌లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరమైన స్థితిలో జడేజా అనుభవం జట్టుకు కీలకం కానుంది. కేఎల్ రాహుల్, బుమ్రా, రిషభ్ పంత్ ఇంగ్లండ్‌లో గత రెండు సిరీస్‌లు ఆడగా... కుల్దీప్ యాదవ్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్లకు కూడా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్లో ఆడటాన్ని పక్కన పెడితే మిగతా ప్లేయర్లంతా అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ఇంగ్లండ్‌లో బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడున్న జట్టును చూస్తే స్టార్ అంటూ ఎవరూ లేరు. మున్ముందు సిరీస్‌లో ఇదే భారత్‌కు సానుకూలాంశం కూడా కావచ్చు. ఒక్కొక్కరి వ్యక్తిగత ఆటపై కాకుండా టీమిండియా సమష్టి ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఈ సిరీస్ సవాల్‌గా నిలవనుంది. బ్యాటర్‌గా ఇంగ్లండ్ గడ్డపై పేలవమైన రికార్డు (5 టెస్టుల్లో కలిపి 127 పరుగులు) ఉన్న గంభీర్ కోచ్‌గా తన వ్యూహాలకు పదును పెట్టి జట్టుకు ఎలా మార్గనిర్దేశం చేస్తాడనేది ఆసక్తికరం. బ్యాటర్లకు సవాల్... మబ్బు పట్టిన వాతావరణంలో బంతి అనూహ్యంగా స్వింగ్ కావడం... డ్రైవ్ కోసం ప్రయతి్నస్తే చాలు బంతి బ్యాట్ అంచులను తాకి స్లిప్స్‌లోకి దూసుకుపోవడం... ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌లలో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలాంటి స్థితిని దాటి బ్యాటర్లు రాణించాలంటే ఎంతో పట్టుదల, ఓపిక కనబర్చాల్సి ఉంటుంది. తమ బ్యాటింగ్ స్టాన్స్‌లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లది ప్రధాన పాత్ర కానుంది. ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి చూస్తే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయడం ఖాయమే. జైస్వాల్ 19 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్‌ను చూస్తే ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లపై ఆకట్టుకున్న అతను దక్షిణాఫ్రికాలో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌లో అతను సత్తా చాటాల్సిన సమయం వచి్చంది. తొలి సిరీస్‌లోనే సుదర్శన్ నుంచి అతిగా ఆశించలేం. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రెండు ఫైనల్‌లను వదిలేస్తే గిల్ ఇంగ్లండ్‌లో ఒకే ఒక టెస్టు ఆడాడు. కెప్టెన్‌గా అదనపు బాధ్యతతో అతను ఎంత బాగా ఆడతాడనేది కీలకం. గణాంకాల పరంగా చూస్తే మరో ప్రధాన బ్యాటర్ రాహుల్‌కు ఇంగ్లండ్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పుడు తన స్థానంపై సందేహాలు లేవు కాబట్టి స్వేచ్ఛగా ఆడగలడు. ఇక మిడిలార్డర్లో కరుణ్ నాయర్‌పై అందరి దృష్టీ ఉంది. నాయర్‌కు చోటు దక్కడంలో దేశవాళీ ప్రదర్శనతో పాటు నార్తాంప్టన్‌షైర్ అనుభవం కీలకపాత్ర పోషించింది. కాబట్టి అతను తనపై ఉంచిన నమ్మ కాన్ని నిలబెట్టుకునేందుకు ఏమాత్రం శ్రమిస్తాడనేది ఆసక్తికరం. ఇక పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా ఆట దిశను మార్చగల పంత్‌పై కూడా జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. మెల్బోర్న్ టెస్టు తర్వాత నిలకడ చూపించలేకపోయిన నితీశ్ రెడ్డి మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది.బుమ్రా, సిరాజ్ చెలరేగితే...ఈ సిరీస్ ఫలితాన్ని ప్రభావితం చేయగల ఏకైక ప్లేయర్లా జస్ప్రీత్ బుమ్రా కనిపిస్తున్నాడు. పని భారంతో అతను గరిష్టంగా మూడు టెస్టులే ఆడవచ్చని మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పింది. ఆ మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లకు ‘నరకం’ కనిపించడం ఖాయం. ఇటీవల ఆ్రస్టేలియాకు ఈ అనుభవం ఏమిటో బాగా తెలిసింది. కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్నెస్తో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం. ఎరుపు బంతితో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కూడా చాలా పదునెక్కింది. అక్కడి పరిస్థితుల్లో సిరాజ్ బౌలింగ్ ప్రత్యర్థి పాలిట ప్రమాదకరంగా మారడం ఖాయం. గత సిరీస్‌లో సిరాజ్ 5 టెస్టులూ ఆడి 18 వికెట్లు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ అనుభవం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. సిడ్నీ టెస్టులో ఆకట్టు కున్న ప్రసిధ్ కృష్ణ మూడో పేసర్‌గా బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ సిరీస్ కాబట్టి అర్ష్ దీప్‌కు ఏదో ఒకదశలో అవకాశం దక్కవచ్చు కానీ ఏమాత్రం ప్రభావం చూపగలడో సందేహమే. అశ్విన్ రిటైర్మెంట్తో ఇప్పుడు కుల్దీప్కు తొలిసారి ప్రధాన స్పిన్నర్‌గా చోటు ఖాయం. 2018లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్‌లో విఫలమైన అతను పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ముఖ్యం. కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా ఆల్‌రౌండర్‌గా రాణించడం ముఖ్యం. సీమ్ బౌలర్ శార్దుల్ శైలితో ఇక్కడ మంచి ఫలితం రాబట్టవచ్చు కాబట్టి మేనేజ్మెంట్ మొగ్గు శార్దుల్ వైపు ఉంది. -
నేనే కెప్టెన్సీ వద్దన్నాను: బుమ్రా
లండన్: రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటన తర్వాత భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసినప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ సాగింది. అనుభవజ్ఞుడు, జట్టు ప్రధాన బలమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాకుండా గిల్‌ను సారథిగా ఎంపిక చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. దీనిపై ఇప్పుడు బుమ్రా స్పష్టత ఇచ్చాడు. తన గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా కెప్టెన్సీవంటి అదనపు భారం మోయలేనని, నాయకుడిగా తన పేరును పరిశీలించవద్దని బీసీసీఐకి తానే చెప్పినట్లు అతను వెల్లడించాడు. ‘నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనక ఎలాంటి ఆసక్తికర నేపథ్యం కానీ, నన్ను కావాలని తప్పించారనే వివాదం కానీ ఏమీ లేదు. రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లకంటే ముందే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నా పని భారం ఎలా ఉండబోతోందో అనే విషయంపై బీసీసీఐ అధికారులతో పాటు నా వెన్ను నొప్పికి చికిత్స చేసిన వైద్యులతో కూడా మాట్లాడాను. జాగ్రత్త పాటిస్తేనే మంచిదని చెప్పారు. దాంతో నేను ఇంగ్లండ్‌లో అన్ని టెస్టులూ ఆడలేనని, సారథిగా నా పేరును పరిగణనలోకి తీసుకోవద్దని బోర్డుకు చెప్పాను. సిరీస్ మధ్యలో నేను తప్పుకొని మరొకరు కెప్టెన్సీ చేయడం సరైంది కాదు. కాబట్టి జట్టు ప్రయోజనాల కోణంలోనే నిర్ణయం తీసుకున్నా. భారత కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవం. కానీ కెప్టెన్గాకంటే ఒక ప్లేయర్‌గా నేను జట్టు కోసం ఉపయోగపడటం ముఖ్యమని భావించా’ అని బుమ్రా తెలిపాడు. -
డబ్ల్యూటీసీ ఫైనల్స్.. బీసీసీఐ ఆశలపై నీళ్లు చల్లిన ఐసీసీ?
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్‌కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న బీసీసీఐ ఆశలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నీళ్లు చల్లే సూచనలు కన్పిస్తున్నాయి. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే వచ్చే మూడు సీజన్ల ఫైనల్ ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్‌కే కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.దీనిపై వచ్చే నెలలో సింగపూర్‌లో జరిగే వార్షిక సమావేశం అనంతరం ఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే 2027, 2029, 2031 ఫైనల్స్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుంది. 2021లో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లోని సౌతాంప్టాన్ వేదికగా జరిగింది.ఆ తర్వాత రెండు సీజన్ల ఫైనల్స్‌కు లండన్‌లోని ఓవల్ మైదానం, లార్డ్స్ వేదికలు ఆతిథ్యమిచ్చాయి. అయితే ఐసీసీ ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్‌కే కట్టబెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇంగ్లండ్ గ్లోబల్ బ్రాడ్కాస్టర్స్కు అనువగా ఉండడం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రేక్షకులు ఎక్కువగా టెస్టు క్రికెట్‌కు ప్రాముఖ్యత ఇవ్వడం వంటి ఆంశాలు ఐసీసీని ప్రభావితం చేసినట్లు సమాచారం.ప్రస్తుతం లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు విశేష ప్రేక్షక ఆదరణ లభించింది. మొదటి మూడు రోజుల్లో 75,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ విజయానికి అంత్యంత చేరువైంది.చదవండి: WTC Final 2025: చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్‌గా -
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ షురూ
బెకెన్హామ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు నాలుగు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కాగా... ఆట ఆరంభానికి ముందు అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు భారత జట్టు నివాళులర్పించింది. దీనికి సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఎయిరిండియా ఏఐ–171 విమాన ప్రమాదంలో మృతిచెందిన 265 మందికి సంతాపంగా ఆటగాళ్లంతా చేతులకు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. మరోవైపు లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కూడా ఈ ప్రమాదమృతులకు ఒక నిమిషం పాటు మౌనం వహించి సంతాపం తెలిపారు. ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... అంతకుముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ జట్టు రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు ఆటగాళ్లతో కలుపుకొని ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు అభిమానులు, మీడియాకు అనుమతి లేదు. -
కరుణ్ నాయర్ ఏం చేస్తాడో!
‘ప్రియమైన క్రికెట్... నాకు మరో అవకాశం ఇవ్వు’... ఇది 2022 డిసెంబర్లో కరుణ్ నాయర్ చేసిన ట్వీట్! జాతీయ జట్టు తరఫున ఆడిన మూడో టెస్టులోనే ‘ట్రిపుల్ సెంచరీ’ చేసి రికార్డులు తిరగరాసిన కరుణ్ నాయర్... ఆ తర్వాత లైమ్ లైట్లో లేకుండా పోయాడు. కెరీర్లో తొలి శతకాన్నే మూడొందలుగా మార్చినా... ఆ మరుసటి మ్యాచ్‌లోనే అతడికి తుది జట్టులో అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత టీమిండియా ఆడిన వరుస మూడు మ్యాచ్‌ల్లో ఆడినా... వాటిలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడు! దీంతో సెలెక్టర్లు అతడి పేరు పరిశీలించడమే మానేశారు. అయినా పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూ వచ్చిన కరుణ్ నాయర్... దేశవాళీల్లో టన్నులకొద్దీ పరుగులు చేసి తిరిగి జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం వచ్చిన ‘సెకండ్ చాన్స్’ను సద్వినియోగ పరుచుకుంటూ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సత్తా చాటేందుకు నాయర్ సమాయత్తమవుతున్నాడు. –సాక్షి క్రీడావిభాగం ‘ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ ఇది కరుణ్ నాయర్ తాజా వ్యాఖ్య. ఈ నెల 20 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైన కరుణ్ నాయర్... సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన చాన్స్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తున్నాడు. 2024–25 రంజీ సీజన్లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 33 ఏళ్ల కరుణ్ నాయర్... 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు. దీంతో విదర్భ జట్టు రంజీ చాంపియన్‌గా నిలవగా... అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలోనూ నాయర్ దుమ్మురేపాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటుతో 779 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 5 శతకాలు ఉండటం విశేషం. ఈ ప్రదర్శన అతడిని మరోసారి వెలుగులోకి తేగా... తాజా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో ఖాళీ ఏర్పడగా... ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉన్న కరుణ్‌ను సెలెక్టర్లు తిరిగి జట్టుకు ఎంపిక చేశారు. అనధికారిక టెస్టులో ‘డబుల్’ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్, భారత్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టులోనూ నాయర్ ఆకట్టుకున్నాడు. తొలి ప్రాక్టీస్ పోరులో మూడో స్థానంలో బరిలోకి దిగి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శనతో తొలి టెస్టులో కరుణ్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్టు క్రికెట్లో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచిన నాయర్... సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. 2016లో ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నాయర్... తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 4, 13 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న నాయర్.. చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లను చితక్కొట్టాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న మైదానంలో తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ అండతో భారీ ఇన్నింగ్స్ ఆడి... కెరీర్లో తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. అయితే అప్పటికే టీమిండియా సిరీస్ కైవసం చేసుకోగా... ఎక్కువ ఒత్తిడి లేని మ్యాచ్ కావడంతోనే నాయర్ ‘ట్రిపుల్ సెంచరీ’ చేయగలిగాడనే వార్తలు వినిపించాయి. ఎవరేమన్నా... స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ మూడొందల పరుగులు చేయడం అంటే... ఎలాంటి స్థితిలో అయినా అషామాషీ కాదనేది వాస్తవం. యువ ఆటగాళ్లకు పెద్దన్నలా... నాయర్ ‘ట్రిపుల్ సెంచరీ’ అనంతరం బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడిన ఏకైక టెస్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు నాయర్‌ను ఎంపిక చేసినా... అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు టెస్టుల్లో ఒక్కసారి కూడా 30 పరుగుల మార్క్ దాటలేకపోయాడు. దీంతో అతడికి మరో అవకాశం దక్కలేదు. 2018 ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనా... ఐదు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అప్పటికే సిరీస్ కోల్పోయిన అనంతరం జరిగిన ఆఖరిదైన ఐదో టెస్టులో సైతం నాయర్‌కు అవకాశం ఇవ్వకుండా... తెలుగు ఆటగాడు హనుమ విహారిని భారత్ నుంచి రప్పించి మరీ అరంగేట్రం చేయించారు. ఇక అప్పటి నుంచి రేసులో వెనుకబడిపోయిన నాయర్... దేశవాళీ ధనాధన్‌తో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. అయితే గతంతో పోలిస్తే షాట్ల ఎంపికలో కచ్చితత్వం... బ్యాటింగ్‌లో నిలకడ... అనుభవం అతడిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో నాయర్ కీలకం కాగలడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జట్టులో అందరికంటే సీనియర్ అయిన కేఎల్ రాహుల్‌కు నాయర్‌తో మంచి అనుబంధం ఉండగా... ఈ పర్యటనలో ఈ కన్నడ జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి. 2023–24 సీజన్లలో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నాయర్ 56.61 సగటుతో 736 పరుగులు చేశాడు. అక్కడి పరిస్థితులపై చక్క టి అవగాహన ఉన్న నాయర్... యువ ఆటగాళ్లకు పెద్దన్నలా వ్యవహరిస్తే ఈ సిరీస్‌లో టీమిండియాకు సానుకూల ఫలితాలు దక్కే అవకాశం ఉంది. -
ఇక... మైదానంలో మ్యాచ్ ప్రాక్టీస్
బెకెన్హామ్: ఐదు టెస్టుల పూర్తిస్థాయి సిరీస్‌కు ముందు తమ బలాన్ని పరీక్షించుకునేందుకు భారత ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. విదేశీ పర్యటనకు వెళితే సాధారణంగా అక్కడి దేశవాళీ జట్టుతో ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఈసారి అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వచ్చిన భారత్ ‘ఎ’ జట్టుతోనే సీనియర్ జట్టు వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ నేటి నుంచి జరుగుతుంది. ఇక్కడికి రాగానే నెట్స్‌లో కసరత్తు చేసిన ఆటగాళ్లు ఇప్పుడు మైదానంలో ప్రాక్టీస్ చేయనున్నారు. నాలుగు రోజుల పాటు జరుగనున్నప్పటికీ ఈ వార్మప్ పోరుకు ఫస్ట్‌క్లాస్ హోదా లేదు. దీంతో బాగా ఆడినా... త్వరగా అవుటైనా ఫస్ట్‌క్లాస్ గణాంకాల్లో నమోదు కావు. కాబట్టి ఆటగాళ్లందరూ యథేచ్ఛగా ఆడుకునేందుకు అవకాశముంటుంది. ఐదు రోజుల ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైరయ్యాక జరుగుతున్న తొలి సిరీస్ కావడంతో... తుది జట్టు కూర్పు, యువ ఆటగాళ్ల నేర్పు కొంతవరకైనా తెలుసుకునేందుకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ దోహదం చేస్తుందని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. టీమిండియా బలాలు, బలహీనతలు బయటికి పొక్కకుండా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రేక్షకులు, భారత అభిమానులెవరికీ ప్రవేశం కల్పించడం లేదు. ఆ్రస్టేలియా పర్యటనలోనూ భారత్ ఇదే విధంగా చేసింది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ నెట్స్‌లో శ్రమించడం, 90 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడటం రెండు భిన్నమైనవని అన్నాడు. ముఖ్యంగా ఈ నాలుగు రోజుల పాటు 360 ఓవర్లు ఆడే ఆటగాళ్ల సామర్థ్యాన్ని భారత సహాయక బృందం పరిశీలిస్తుంది. అలాగే బౌలింగ్ విభాగానికి ఈ పర్యటనలో ఎదురయ్యే ప్రతికూలతల్నీ తెలుసుకోనుంది. పేసర్లు, స్పిన్నర్లు రోజంతా ఎన్ని ఓవర్లను ఉత్సాహంగా వేయగలరో ఒక అంచనాకు వస్తుంది. సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు అక్కడి బౌన్సీ పిచ్‌లపై ఎదురయ్యే సవాళ్లను కూడా భారత మేనేజ్మెంట్ బేరీజు వేస్తుంది. స్పీడ్‌స్టర్ బుమ్రా జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ మొత్తం ఐదు టెస్టులు ఆడే అవకాశమైతే లేదు. ఈ విషయాన్ని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. ఐదింటిలో మూడు టెస్టులే అతను ఆడతాడని వెల్లడించారు. ఏ మూడు మ్యాచ్‌లనే విషయాన్ని అపుడు సెలక్టర్లు... ఇప్పుడు కోచ్ గంభీర్... స్పష్టంగా చెప్పడం లేదు.అగ్రశ్రేణి పేసర్ బుమ్రా ఆరు నెలల తర్వాత టెస్టు బరిలోకి దిగబోతున్నాడు. తన విభిన్న శైలీ బౌలింగ్ కారణంగా తరచూ ఇబ్బందిపెట్టే వెన్నెముక గాయం నుంచి కోలుకున్నాక బుమ్రా స్వదేశంలో జరిగిన ఐపీఎల్ ఆడాడు. అది కేవలం 4 ఓవర్లకు సంబంధించిన ఫార్మాట్... కానీ ఇది సుదీర్ఘ ఫార్మాట్ ఇందులో రోజు పడే 90 ఓవర్లలో అతను ఎన్ని ఓవర్లు సమర్థంగా వేయగలడో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా తెలియనుంది. ఈ వార్మప్‌లో అందరూ భారత ఆటగాళ్లే అయినా మ్యాచ్‌కు ముందరి తుది సన్నాహకం కావడంతో ప్రత్యర్థితో ఆడే పట్టుదలే కనబరుస్తారని జట్టు మేనేజ్మెంట్ చెబుతోంది. -
ఇంగ్లండ్ పర్యటనకు రాధా యాదవ్
ముంబై: ఇంగ్లండ్‌లో పర్యటించే భారత మహిళల జట్టుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ ఎంపికైంది. శుచి ఉపాధ్యాయ్ స్థానంలో ఆమెను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 ఏళ్ల స్పిన్నర్ శుచి గత నెల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసింది. తాజాగా ఆమె ఎడమ కాలికి గాయమైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ)లో ఏర్పాటు చేసిన శిబిరంలో మహిళల జట్టు సభ్యులు పాల్గొంటున్నారు. త్వరలో అక్కడికి బయలుదేరనున్న మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడనుంది. ఐదు టి20లు సహా మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయి. ఇందులో భాగంగా జూన్ 28న నాటింగ్‌హామ్‌లో తొలి టి20 జరుగుతుంది. జూలై 1న బ్రిస్టల్‌లో రెండో మ్యాచ్, 4న ఓవల్‌లో మూడు, 9న మాంచెస్టర్‌లో నాలుగు, 12న బర్మింమంగ్హామ్లో ఆఖరి టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్లీ స్ట్రీట్ వేదికలపై వరుసగా జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, యస్తిక, హర్లీన్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్గరే, రాధా యాదవ్. వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, ప్రతీక, హర్లీన్, జెమీమా, రిచా, యస్తిక, తేజల్, దీప్తి, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్, అరుంధతి రెడ్డి, క్రాంతి, సయాలీ, రాధా యాదవ్. -
‘సిరీస్‌ను చిరస్మరణీయం చేసుకోండి’
బెకెన్హామ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ భారత ఆటగాళ్లకు గొప్ప అవకాశమని... అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దీనిని చిరస్మరణీయం చేసుకోవాలని జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఇందు కోసం తమ సహజశైలిని దాటి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాలని అతను అన్నాడు. కోహ్లి, రోహిత్, అశ్విన్ లేకుండా టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో జట్టులోని యువ ఆటగాళ్లు సత్తా చూపించాలని కోచ్ ఆకాంక్షించాడు. ‘ఈ సిరీస్‌ను రెండు విధాలుగా చూడవచ్చు. ముగ్గురు సీనియర్లు లేకుండా ఆడుతున్నామనే కోణంలో ఒకటి... వారు లేరు కాబట్టి దేశం తరఫున గొప్ప ఆటతీరు కనబర్చేందుకు దక్కిన సరైన అవకాశంగా చూడటం మరొకటి. ఏదైనా ప్రత్యేకంగా సాధించి చూపించాలనే కసి, పట్టుదల నాకు ప్రస్తుత జట్టులో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక గిరి గీసుకొని ఆడినవారు కూడా దానిని దాటి రావాలి. ప్రతీ రోజు, ప్రతీ సెషన్, ప్రతీ బంతి కోసం పోరాడితే ఈ సిరీస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌తో తొలిసారి టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్, అర్‡్షదీప్ సింగ్‌లను కోచ్ టీమ్‌లోకి ఆహ్వానించాడు. ‘తొలిసారి టెస్టు పిలుపు రావడం ఎప్పుడైనా గొప్పగా చెప్పుకోగలిగే ప్రత్యేక సందర్భం. సాయి గత మూడు నెలలుగా అద్భుతంగా ఆడుతున్నాడు. టెస్టుల్లోనూ మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటున్నా. అర్ష్ దీప్ కూడా భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎంతో బాగా ఆడాడు. ఇప్పుడు టెస్టుల్లో రాణించాల్సిన సమయం వచ్చింది’ అన్న గంభీర్... తొలిసారి టెస్టు కెపె్టన్‌గా వ్యవహరించబోతున్న గిల్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. భారత్ గురించి బాగా తెలుసు: మెకల్లమ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు బాగా సన్నద్ధమై వచ్చిందని, అయితే తాము ఏం చేయాలనేదానిపై పూర్తి స్పష్టత ఉందని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. తమ టీమ్ సభ్యులంతా సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అతను చెప్పాడు. ‘భారత్ చాలా బలమైన జట్టు. ఎన్నో అంచనాలతో ఇక్కడికి వచ్చింది. అయితే ఒక టెస్టు జట్టుగా మా లక్ష్యాలేమిటో మాకు బాగా తెలుసు. పోరు కోసం సిద్ధంగా ఉన్నాం. కొందరు కీలక బౌలర్లు అందుబాటులో లేకపోయినా ప్రస్తుత పేస్ బృందంలో వైవిధ్యం ఉంది. స్పిన్నర్ బషీర్ ప్రతీ మ్యాచ్‌కు రాటుదేలుతున్నాడు. బ్యాటర్లలో జేమీ స్మిత్, బెథెల్లాంటి వాళ్లు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో కనిపించే దూకుడుకు ఆట జత కలిస్తే మంచి ఫలితాలు ఖాయం’ అని మెకల్లమ్ తన సహచరుల గురించి విశ్లేషించాడు. -
WTC Final 2025: 145 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..!
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025 ఫైనల్ ఓ అరుదైన ఘటనకు వేదికైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు (ఓపెనర్లు) డకౌటయ్యారు. తొలుత ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా 20 బంతులు ఆడి రబాడ బౌలింగ్‌లో డకౌట్ కాగా.. ఆతర్వాత సౌతాఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్ 6 బంతులు ఆడి ఖాతా తెరవకుండా స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఇలా ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌తో కలుపుకొని ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 561 టెస్ట్ మ్యాచ్‌లు జరగగా.. ఇలాంటి ఘటన ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్కసారి కూడా జరగలేదు. 1880లో తొట్ట తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్‌లోనే జరిగిన విషయం తెలిసిందే.ఓవరాల్‌గా (ప్రపంచంలో ఎక్కడైనా) చూసినా ఓ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు డకౌట్లు కావడం ఇది 10వ సారి మాత్రమే. ఈ తరహా తొలి ఘటన 1977లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జరిగింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు నంబర్ వన్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, జాన్ డైసన్ డకౌట్లయ్యారు. ఆతర్వాత తాజా ఘటనతో కలుపుకొని ఇలాంటివి తొమ్మిది సార్లు జరిగాయి. ఇందులో చివరి నాలుగు సందర్భాలు కలుపుకొని ఆస్ట్రేలియా మొత్తంగా ఆరు సార్లు భాగమైంది. ఆసీస్ భాగమైన చివరి నాలుగు సందర్భాల్లో స్టార్క్ మూడింట భాగం కావడం (ప్రత్యర్ది వికెట్లు తీయడం) మరో విశేషం.డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 విషయానికొస్తే.. ఈ మ్యాచ్ తొలి రోజే 14 వికెట్లు పడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.ఆసీస్ ఇన్నింగ్స్‌ను రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) దెబ్బకొట్టగా.. సౌతాఫ్రికాను స్టార్క్ (2/10), హాజిల్‌వుడ్ (1/10), కమిన్స్ (1/14) ఇబ్బందుల్లోకి నెట్టారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) టాప్ స్కోరర్లు కాగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత బవుమా (3 నాటౌట్), బెడింగ్హమ్ (8 నాటౌట్) భుజస్కందాలపై ఉంది. -
ఇంగ్లండ్ బ్యాటర్ల విలయతాండవం.. మూడో టీ20లో భారీ స్కోర్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జూన్ 10) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విలయతాండవం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేశారు. ఓపెనర్లు బెన్ డకెట్ (46 బంతుల్లో 84; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమీ స్మిత్ (26 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. అనంతరం వచ్చిన జోస్ బట్లర్ (10 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (22 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, గుడకేశ్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ తొలుత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు ఎవిన్ లెవిస్ 9, జాన్సన్ ఛార్లెస్ 9, షాయ్ హోప్ 45 (27 బంతుల్లో), షిమ్రోన్ హెట్‌మైర్ 26 (8 బంతుల్లో), రూథర్‌ఫోర్డ్ 1 పరుగుకు ఔటయ్యాడు. ఈ దశలో పోరాడితే పోయేదేముందున్నట్లు రెచ్చిపోయిన రోవ్‌మన్ పావెల్ 45 బంతుల్లో అజేయమైన 79 పరుగులు చేసి విండీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అతనికి జేసన్ హోల్డర్ (12 బంతుల్లో 25) జత కలిశాడు. అయినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులకే పరిమితమైంది. తద్వారా మ్యాచ్ కోల్పోవడమే కాకుండా, క్లీన్ స్వీప్ పరాభవాన్ని కూడా తప్పించుకోలేకపోయింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా విండీస్ ఇలాంటి పరాజయాలే ఎదుర్కొంది. దీనికి ముందు విండీస్ ఇదే ఇంగ్లండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా 0-3 తేడాతో కోల్పోయింది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌కు ఇది తొలి అసైన్మెంట్. అరంగేట్రంలోనే రెండు సిరీస్‌లకు క్లీన్ స్వీప్ చేసిన బ్రూక్.. కెప్టెన్సీ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు.