
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగబోయే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. దాదాపుగా ఏడాది తర్వాత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ప్లేయింగ్ ఎవెవెన్‌లోకి వచ్చాడు. తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో బంతితో (12 వికెట్లు), బ్యాట్‌తో (238 పరుగులు) అద్బుత ప్రదర్శనలు చేయడంతో సామ్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపందింది.
అతను చివరిగా 2024 నవంబర్‌లో (వెస్టిండీస్ టూర్) ఇంగ్లండ్ తరఫున టీ20 ఆడాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ టీ20 జట్టు కోచ్ అయ్యాక సామ్ ఆడనున్న తొలి టీ20 ఇదే. సామ్‌తో పాటు ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ కూడా ఇంగ్లండ్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
సాల్ట్ పితృత్వ సెలవు కారణంగా ఇంగ్లండ్ ఆడిన గత టీ20 సిరీస్ (విండీస్) ఆడలేదు. ఆర్చర్, ఓవర్టన్ ఇంగ్లండ్ చివరిగా ఆడిన టీ20లో లేరు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది.
కాగా, సౌతాఫ్రికాతో తొలి టీ20 కార్డిఫ్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో సాల్ట్‌తో పాటు జోస్ బట్లర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. బేతెల్, బ్రూక్, సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్ ఆతర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తారు. బౌలర్లుగా ఓవర్టన్, డాసన్, ఆర్చర్, ఆదిల్ రషీద్ ఉంటారు.
దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ఇంగ్లండ్ XI: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్