ధర్మశాల: భారత జట్టులో ఎక్కువ మంది ప్లేయర్లు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని... హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం మూడో మ్యాచ్ జరగనుండగా... దానికి ముందు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తిలక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిలక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘జట్టులో ఓపెనర్లు తప్ప మిగిలిన వాళ్లు ఎవరైనా ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్లు ఇమిడిపోయే విధంగా ఉండాలి. ఏ నిర్ణయమైనా జట్టు కోసమే. ఈ అంశంపై టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టంగా ఉంది. నా వరకైతే మూడో స్థానం నుంచి మొదలు ఎక్కడ బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధమే. అందరూ అలాగే ఉన్నారు. వన్‌డౌన్‌లో అక్షర్ ఎన్నోసార్లు ఆకట్టుకున్నాడు. అది పరిస్థితులను బట్టి తీసుకునే నిర్ణయమే’అని తిలక్ అన్నాడు.
ధర్మశాలలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని... అందుకు తగ్గట్లే జట్లు సన్నద్ధత ఉంటుందని తిలక్ అన్నాడు. ‘నేను అండర్–19 స్థాయిలో ఇక్కడ మ్యాచ్‌లు ఆడాను. పిచ్‌ను పరిశీలిస్తే భారీ స్కోర్లు నమోదయ్యేలా కనిపిస్తోంది. చలితీవ్రత అధికంగా ఉండే ధర్మశాలలో పిచ్ పేసర్లకు అనుకూలించనుంది. టాస్ మన చేతిలో ఉండదు. అందుకే దేనికైనా సిద్ధంగా ఉండాలి. బంతిపై పట్టు చిక్కించుకునేందుకు తడిచిన బంతితో సైతం ప్రాక్టీస్ చేస్తున్నాం.


