అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన ముగిసింది.
అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది.
మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో వాటర్ బాటిల్స్‌ను, కూర్చీలను మైదానంలోకి విసిరి రచ్చ రచ్చ చేశారు.
ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్లను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు.
దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.


