throw
-
నీరజ్ 90.23 మీటర్లు
దోహా: 90 మీటర్లు... ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? అని కొన్నేళ్లుగా అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం సమాధానం ఇచ్చాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు భారత స్టార్ తన కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ చోప్రా తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనను నమోదు చేశాడు.27 ఏళ్ల నీరజ్ తన మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో నీరజ్ తన పేరిటే ఉన్న (2022 స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ మీట్లో 89.94 మీటర్లు) జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. విఖ్యాత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ ప్రారంభించాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం విశేషం. 11 మంది మేటి జావెలిన్ త్రోయర్లు పోటీపడ్డ దోహా డైమండ్ లీగ్ మీట్లో జూలియన్ వెబెర్ (జర్మనీ; 91.06 మీటర్లు) అగ్రస్థానాన్ని క్కించుకున్నాడు. నీరజ్ చోప్రా (90.23 మీటర్లు) రెండో స్థానం సంపాదించగా... అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 86.64 మీటర్లు) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కే చెందిన కిశోర్ కుమార్ జేనా (78.60 మీటర్లు) ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డైమండ్ లీగ్ మీట్లలో అథ్లెట్లకు పతకాలు బదులుగా పాయింట్లు కేటాయిస్తారు. టాప్–8లో నిలిచిన వారికి వరుసగా 8, 7, 6, 5, 4, 3, 2, 1 పాయింట్లు లభిస్తాయి. వెబెర్‌కు 8 పాయింట్లు, నీరజ్‌కు 7 పాయింట్లు, పీటర్స్‌కు 6 పాయింట్లు దక్కాయి.నిర్ణిత నాలుగు మీట్లు ముగిశాక టాప్–7లో నిలిచిన వారు ఫైనల్ మీట్లో పోటీపడతారు. సీజన్ తొలి మీట్లో నీరజ్ తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 88.44 మీటర్ల దూరం విసిరి శుభారంభం చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో అతను ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ 90.23 మీటర్లకు వెళ్లింది. నాలుగో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 80.56 మీటర్ల దూరం విసరగా... ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 88.20 మీటర్లు విసిరాడు. 3 ఆసియా నుంచి జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరిన మూడో ప్లేయర్‌గా నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 92.97 మీటర్లు), చావో సున్ చెంగ్ (చైనీస్ తైపీ; 91.36 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్‌గా 25 మంది క్రీడాకారులు జావెలిన్‌ను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరారు. -
దారుణం: డెడ్‌బాడీని కాలువలో పడేసిన పోలీసులు
పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులే అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఓ బాధితుని మృతదేహాన్ని కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ మృతదేహాన్ని మళ్లీ వెలికితీసి మార్చురీకి తరలించారు. పోలీసు కానిస్టేబుళ్లు ఓ బాధిత మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా.. ఓ బాటసారి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించారు. అయితే.. ఓ ప్రమాదంలో చిధ్రమైన మృతదేహాన్ని ఇలా కాలువలో పడేసినట్లు తెలిపారు. ఆ బాధిత మృతదేహం ఎవరిదో కూడా గుర్తించినట్లు స్పష్టం చేశారు. పోలీసు కానిస్టేబుళ్లు చేసిన ఘటన అమానవీయమని పేర్కొన్న జిల్లా ఎస్పీ రాకేశ్ కుమార్.. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆ కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆ చిధ్రమైన మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: యువకుడి బ్యాంక్ ఖాతాలో 753 కోట్లు -
బావిలోకి తోసి.. భార్య విలవిలలాడుతుంటే వీడియో తీసి..
మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో ఒక గృహిణి హింసకు గురైన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కట్నం కోసం ఒక భర్త తన భార్యకు తాడుకట్టి బావిలోకి వదిలాడు. తరువాత ఆమె బావిలో నుంచి కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తుండగా వీడియో తీసి, దానిని భార్య పుట్టింటివారికి పంపాడు. ఈ ఉదంతం జాదవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిర్‌ఖెడా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేష్ కీర్‌కు మూడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా నివాసి ఉషతో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి రాకేష్ తన భార్యను కట్నం కోసం వేధిస్తున్నాడు.ఈ మధ్య కాలంలో రాకేష్ భార్య విషయంలో మరింత క్రూరంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా తన భార్య ఉషకు తాడు కట్టి బావిలోకి వేలాడదీశాడు. నీటితో నిండిన బావిలో మునిగిన ఆమె భయంతో తనను బయటకు తీసుకురావాలంటూ భర్తను వేడుకుంది. అయితే భర్త ఆమె ఆవేదనను పట్టించుకోకుండా, ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. కొద్దిసేపటి తరువాత చుట్టుపక్కలవారు జోక్యం చేసుకుని ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఉదంతం పోలీసుల వరకూ చేరడంతో వారు నిందితుడు రాకేష్‌ను అరెస్టు చేశారు. జాదవ్ పోలీస్ స్టేషన్ అధికారి అస్లం పఠాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉదంతంలో నిందితుడు రాకేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామన్నారు. అలాగే రాకేష్‌ను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టామని, అనంతరం జైలుకు తరలించామన్నారు. ఇది కూడా చదవండి: అది ‘ఇత్తడి నగరం’ ఎందుకయ్యింది? నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి? -
మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌పూర్ నుంచి గుజరాత్ వెళుతున్న సూరత్ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు దుండగులు ఒక మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. బాధితురాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ దుండగులు బాధితురాలితో పాటు ఆమె బంధువును కూడా రైలు నుంచి కిందకు తోసేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గ్వాలియర్‌లోని బిలౌవా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూన్ 19న కూలి పనులు చేసుకునే ఒక మహిళ తన బంధువుతో పాటు సూరత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి.. లక్నో మీదుగా గుజరాత్‌లోని సూరత్ వెళుతోంది. బాధిత మహిళ జార్ఖండ్‌లోని పాలమూ జిల్లాకు చెందినది. ఆమె ప్రయాణిస్తున్న రైలులోకి గ్వాలియర్‌లో ఐదుగురు పురుషులు ఎక్కారు. వారంతా బాధితురాలు కూర్చున్న సీటు ఎదురుగా కూర్చున్నారు. కొద్దిసేపటి తరువాత వారంతా ఆ మహిళను చూసి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ దుండగులు ఆమెకు ఫొటోలు తీసే ప్రయత్నం చేశారు. ఆమె వ్యతిరేకించడంతో ఆమెను, ఆమె బంధువుకు కొట్టారు. దీంతో బాధితురాలు, ఆమె బంధువు రైలు బోగీలోని డోర్ దగ్గరకు వెళ్లి నిలుచున్నారు. ఇంతలో ఆ దుండగులు వారి దగ్గరకు వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దీనిని ఆమె వ్యతిరేకించడంతో ఆ దుండగులు ఆమెను, ఆమె బంధువును నడుస్తున్న రైలులో నుంచి కిందకు తోసివేశారు. వారు బరౌడీ గ్రామ సమీపంలో పడిపోయారు. సోమవారం రాత్రంతా బాధితులు రైలు పట్టాల సమీపంలో స్పృహ తప్పిన స్థితిలో పడి ఉన్నారు. మంగళవారం ఉదయం గ్రామస్తులు వారిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించడంతోపాటు, వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: స్నేహితురాలిపై ప్రేమతో అమె.. ’అతని‘గా మారాలనుకుంది.. కానీ.. -
మెడల్స్ ను గంగ లో విసరనున్న రేస్లర్స్ ..
-
బెంజ్‌కారులో వచ్చి.. డబ్బులు నేలకేసి కొట్టాడు
Viral Video: డబ్బు మనిషికి అవసరం. కానీ, ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చనే ఆలోచన ఎంతమాత్రం సరికాదనే మంచి మాట ఒకటి ఉంది. డబ్బుంది కదా అని తలపొగరు ప్రదర్శిస్తే.. దానికి కాలమే సమాధానం చెబుతుంది కూడా. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెర్సిడెజ్ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి.. ఇంధనం కోసం ఓ బంక్ వద్దకు వచ్చాడు. తీరా ఇంధనం నిండాక.. డబ్బుల్ని అక్కడున్న సిబ్బంది చేతికి ఇవ్వకుండా నేలకేసి విసిరికొట్టాడు. అయితే.. ఆ సిబ్బంది మహిళ మాత్రం సహనం కోల్పోలేదు. నిదానంగా.. ఆ డబ్బులు ఏరి తన బ్యాగ్‌లో వేసుకుంది. ఆపై ఆ కారు ముందుకు వెళ్లిపోగా.. బాధతో కన్నీళ్లు కార్చింది. చైనాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెడ్డిట్ ద్వారా ఈ వీడియో వైరల్ కాగా, పని హడావిడిలో తాను డబ్బు అలా వదిలేసి పోయానే తప్ప.. ఆమెను అవమానించడం తన అభిమతం కాదని ఆ కారు ఓనర్ వివరణ ఇచ్చినట్లు స్థానిక మీడియా ఓ కథనం ప్రచురించింది. కానీ, నెటిజన్లు మాత్రం ఆ సమాధానంతో సంతృప్తి చెందకుండా ఆ కారు ఓనర్‌ను ఏకిపడేస్తున్నారు. -
భారీ వర్షాలు.. ట్రాఫిక్ కష్టాలు
-
భారీ వర్షాలు.. ట్రాఫిక్ కష్టాలు
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఉదయం ఎడ తెరపి లేకుండా కురిసన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణీకులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు కుదిపేశాయి. ఉధృతంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షం దెబ్బకు ఢిల్లీ ప్రజలు ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకున్నారు. ఉదయం ఆఫీసులకు, స్కూళ్ళకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్ళలోకి వచ్చేయడంతో నగరవాసులు తీవ్ర కష్టాలు పడ్డారు. అశోక్ విహార్, జసోలా, ఓక్లా, ఐఐటీ గేట్, పహర్‌గంజ్ రోడ్, సరై కలే ఖాన్ నుంచి డీఎన్డీ కి వెళ్ళే రింగ్ రోడ్, సరితా విహార్, డిఫెన్స్ కాలనీ, ఐఎన్ఏ, రాజ్ ఘాట్ నుంచి ఐటీవో వైపు వెళ్ళే మార్గం, అరబిందో మార్గ్, ఆనంద్ విహార్, వజిర్బాద్ ప్రాంతాలు వర్షానికి పూర్తిగా నీటితో నిండిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు మోటారిస్టులకు ఇబ్బందులు కలగకుండా ఇతర మార్గాల్లోకి తరలించారు. పాలం అబ్జర్వేటరీ రికార్డుల ప్రకారం ఉదయం 8.30 వరకూ సుమారు 43.4 సెంటీమీటర్ల వర్షం పడగా 41.66 సెంటీమీటర్లు రికార్డ్ అయినట్లు మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. ఈ కాలంలో నగరంలో ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కన్నా మూడు డిగ్రీలు తక్కువగా ఉండి 24.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. రోజంతా వర్షంకొనసాగితే ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే అత్యధిక ఉష్ణోగ్రత 31 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
బోయ్ ఫ్రెండ్ పై యాసిడ్ పోసింది!
ముల్తాన్: సాహసం చేసి గెలిచిన మహిళను వీరనారి అంటాం. కానీ, ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకుని, వారితో విడిపోయి ఇంకో వ్యక్తిని ప్రేమించి.. అతడు పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో అతనిపై యాసిడ్ పోసిన ఈ మహిళను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. పాకిస్తాన్ లోని ముల్తాన్‌లో సంభవించిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె బోయ్ ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోమ్లీ మాయ్ అనే నగరానికి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన సద్దాఖ్ అలీ (25) గత కొద్ది ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ ఇంతకుముందు విడివిడిగా పెళ్లిళ్లు అయ్యాయి. కానీ, ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నాం, కలిసి జీవిస్తున్నాం.. ఇకనైనా తనను రెండో భార్యగా చేసుకోవాలని మోమ్లీ అలీపై ఒత్తిడి తీసుకురావడంతో, పెళ్లి చేసుకోనని అతడు తెగేసి చెప్పేశాడు. ముస్లింలలో బహుభారత్వం చట్టబద్ధమే అయినా.. పెళ్లయిన మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా విడాకులు తీసుకోవాల్సిందే. అలీ ఇదే విషయాన్ని సాకుగా చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాడు. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య పెళ్లి విషయమై పెద్ద గొడవ జరిగింది. కోపంతో రగిలిపోయిన మోమ్లీ అలీపై యాసిడ్ తో దాడి చేసింది. బాధితుడు వెనక్కు తిరగడంతో అదృష్టవశాత్తు ముఖం మీద పడకుండా శరీరం మీద పడి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 60 శాతానికి పైగా శరీరంలో యాసిడ్ గాయాలయ్యాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అలీని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మామ్లీపై కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడులు ఎక్కువగా మహిళలపై జరుగుతాయని కానీ, ఈ కేసులో మాత్రం ఒక మహిళ పురుషుడిపై యాసిడ్ దాడి చేసిందని పేర్కొన్నారు. కాగా, యాసిడ్ ను పంజాబ్ ప్రావిన్సులో వ్యవసాయంలో విరివిగా ఉపయోగిస్తారు. -
గన్‌తో బెదిరిస్తే.. స్వీట్లతో కొట్టింది!
మాల్మో: ఓ షాపింగ్ మాల్లో దోపిడి చేయడానికి వచ్చిన ఘరానా దొంగకు షాపులో పనిచేసే యువతి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. గన్ చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుండగా ఆ యువతి స్వీట్లతో ఎదురు దాడి చేసింది. ఏం జరుగుతుందో అర్థం కాని సదరు దొంగ పరుగులంకించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. స్వీడన్‌లోని మాల్మో పట్టణంలో జైనాబ్ సలీం అనే యువతి ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తోంది. లేట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న జైనాబ్‌కు మంగళవారం ఊహించని ఘటన ఎదురైంది. క్యాష్ కౌటర్ వద్ద ఉన్న ఆమె వైపు ఓ దోపిడి దొంగ గన్‌తో వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. క్షణాల్లో తేరుకున్న జైనాబ్.. చేతికందిన స్వీట్లతో ఎదురుదాడికి దిగింది. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన దొంగ డబ్బులొద్దు ముర్రో అంటూ షాపు నుండి బయటకు పరుగులు పెట్టాడు. సమీపంలోనే ఉన్న తన సోదరుడికి సమాచారం ఇచ్చిన జైనాబ్ దొంగను వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై జైనాబ్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే ఐదు సార్లు దోపిడి దారులు బారిన పడ్డాను. ఒకడు గొడ్డలితో, మరొకడు ఇనుప రాడ్డుతో బెదిరించాడు. అయితే ఈ సారి మాత్రం అప్రయత్నంగానే నేను స్పందించాను. ఒకవేళ ఆ గన్ లోడ్ చేసి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటే భయమేస్తోంది' అని తెలిపింది. -
ముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ దాడి
కాబూల్: స్కూల్‌కు వెళుతున్న ముగ్గురు బాలికలపై దుండగులు శనివారం యాసిడ్‌తో దాడిచేశారు. ఈ సంఘటన ఆఫ్ఘనిస్తాన్ లోని వెస్టర్న్ హెరాట్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. వివరాలు.. ముగ్గురు విద్యార్థినులు హెరాట్ సిటీలో బాలికల పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజు మాదిరిగానే స్కూల్‌కి బయలుదేరిన వీరిపై మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు యాసిడ్‌తో దాడిచేశారు. ఈ దాడిలో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరు హెరాట్‌లోని నూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూల్‌కు వెళ్లే వారికి ఇదే మా శిక్ష అంటూ యాసిడ్ దాడి అనంతరం దుండగులు అన్నారని బాధితులు తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడ్డ వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.