వీడియో: బెంజ్‌ కారులో వచ్చి డబ్బులు నేలకేసి కొట్టాడు.. ఆమె ఏం చేసిందో చూడండి

Mercedes Owner Throws Cash On The Ground At Petrol Station Viral - Sakshi

Viral Video: డబ్బు మనిషికి అవసరం. కానీ, ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చనే ఆలోచన ఎంతమాత్రం సరికాదనే మంచి మాట ఒకటి ఉంది. డబ్బుంది కదా అని తలపొగరు ప్రదర్శిస్తే.. దానికి కాలమే సమాధానం చెబుతుంది కూడా. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
మెర్సిడెజ్‌ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి.. ఇంధనం కోసం ఓ బంక్‌ వద్దకు వచ్చాడు. తీరా ఇంధనం నిండాక.. డబ్బుల్ని అక్కడున్న సిబ్బంది చేతికి ఇవ్వకుండా నేలకేసి విసిరికొట్టాడు. అయితే.. ఆ సిబ్బంది మహిళ మాత్రం సహనం కోల్పోలేదు. నిదానంగా.. ఆ డబ్బులు ఏరి తన బ్యాగ్‌లో వేసుకుంది. ఆపై ఆ కారు ముందుకు వెళ్లిపోగా.. బాధతో కన్నీళ్లు కార్చింది. 

చైనాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెడ్డిట్‌ ద్వారా ఈ వీడియో వైరల్‌ కాగా, పని హడావిడిలో తాను డబ్బు అలా వదిలేసి పోయానే తప్ప.. ఆమెను అవమానించడం తన అభిమతం కాదని ఆ కారు ఓనర్‌ వివరణ ఇచ్చినట్లు స్థానిక మీడియా ఓ కథనం ప్రచురించింది. కానీ, నెటిజన్లు మాత్రం ఆ సమాధానంతో సంతృప్తి చెందకుండా ఆ కారు ఓనర్‌ను ఏకిపడేస్తున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top