
బాలీవుడ్ నటి సాగరిక ఘట్గే, భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ భార్య. ఇటీవలే ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు.

‘చక్ దే ఇండియా’తో సహా అనేక చిత్రాలలో నటించిన సాగరిక ఘట్గే, భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

సాగరిక ఘట్గే తాజాగా తన ఇన్‌స్టా పోస్ట్‌లో తనకు చీరలంటే ఎంత ఇష్టమో తెలిపింది.

చీరలు కట్టుకునే సందర్భంగా ప్రతీసారీ రాదని, అటువంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చీర కట్టుకుంటానని తెలిపింది.

చీర అనేది మంచి ఫ్యాషన్ అని భావిస్తానని, అది మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందని సాగరిక అన్నారు.

ప్రస్తుత పండుగల రోజుల్లో చీర కట్టుకునేందుకే తన ప్రాధాన్యత అని తెలిపారు.













