హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ వర్క్స్ వద్ద జరిగిన ‘ప్రీమిథాన్’ రన్‌లో నగర వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనారోగ్యం, బలహీనత వంటి సమస్యలతో సతమతమయ్యే అకాల నవజాత శిశువులకు అండగా నిలవాలని పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. టీవీ నటి కరుణ దంపతుల చిన్నారులు దియా అండ్ సియా ఈ రన్‌లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


