తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ యేటికాయేడు షోకి వచ్చే సెలబ్రిటీలు తగ్గిపోతున్నారు. ఈసారి కూడా అదే జరగబోతుందని ఊహించిన బిగ్‌బాస్ టీమ్ కామనర్స్‌కు వెల్‌కమ్ చెప్తూ అగ్నిపరీక్ష షో పెట్టింది. తద్వారా ఆణిముత్యాలను వెలికి తీసి బిగ్‌బాస్ 9కి పంపింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగుర్ని హౌస్‌లోకి పంపింది.
కామనర్స్
వాళ్లే కల్యాణ్, హరిత హరీశ్, డిమాన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మర్యాద మనీష్. లెక్క సరిపోలేదనుకున్నాడో ఏమోకానీ బిగ్‌బాస్.. అగ్నిపరీక్ష నుంచి దివ్యను సైతం హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్‌గా పంపించాడు. అయితే షో ప్రారంభంలో కామనర్లు మూటగట్టుకున్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు. తామేదో తోపులం, బిగ్‌బాస్ ఇంటికి మహారాజులం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేసరికి మనీశ్, ప్రియ, హరీశ్, శ్రీజను బయటకు పంపించేశారు.
హౌస్‌లో 9 మంది
దివ్య కూడా వెళ్లిపోయేదే కానీ గొడవలకోసం తనను ఆపేశాడు బిగ్‌బాస్. ఫైర్‌స్ట్రామ్స్ అయితే ఒక్కరూ మిగల్లేదు. ఇప్పుడు బిగ్‌బాస్ 12వ వారం నడుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది మిగిలారు. వారే భరణి, కల్యాణ్, పవన్, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ, దివ్య. వీరిలో తనూజ మొదటినుంచి విన్నింగ్ రేస్‌లో ఉంది. ఏడుపు గోల ఉన్నప్పటికీ సహనం కోల్పోకుండా అన్నింట్లోనూ ది బెస్ట్ ఇస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

నెగెటివిటీ నుంచి టాప్ 2కి..
కల్యాణ్ (Pawan Kalyan Padala).. మొదటి మూడు వారాలు ఆడిందే లేదు. పైగా అమ్మాయిలను అదోలా చూస్తూ నెగెటివిటీ సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే నాగార్జున హింట్స్ ఇచ్చాడో వెంటనే తీరు మార్చుకుని గేమ్‌పై ఫోకస్ పెట్టాడు. అలా ఇప్పుడేకంగా కప్పు కోసం పోటీపడుతున్నాడు. ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే.. ఇతడు ఆల్‌రౌండర్. గేమ్స్ బాగా ఆడతాడు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడు. కానీ సేఫ్ గేమ్ ఒక్కటే అతడికి పెద్ద మైనస్. దానివల్లే కాస్త వెనకబడ్డాడు. 11వ వారాలు నామినేషన్స్‌లోకి రాకపోవడం కూడా అతడికి దెబ్బేసింది.
టాప్ 5లో ఎవరు?
తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్.. ఈ ముగ్గురు టాప్ 3లో ఉండటం ఖాయం. మరి తర్వాతి రెండు స్థానాల్లో ఎవరన్నది అసలైన ప్రశ్న. గుడ్డు దొంగతనంతో ఈ సీజన్‌పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసిన సంజనా తర్వాత మాత్రం దారి తప్పింది. ఇటీవల జరిగిన నామినేషన్స్‌లో అయితే రీతూ క్యారెక్టర్‌ను తప్పు పడుతూ మాట్లాడింది. అసలే పెద్దగా ఫ్యాన్ బేస్ లేని తనకు ఇది కచ్చితంగా నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఆమె టాప్ 5 బెర్త్ గల్లంతయినట్లే!
ఈ ముగ్గురు కష్టమే!
దివ్య ఆల్‌రెడీ గతవారమే ఎలిమినేట్ అవాల్సిన క్యాండిడేట్.. పైగా తనూజను టార్గెట్ చేయడం సీరియల్ ఆడియన్స్‌కు అస్సలు నచ్చలేదు. పైగా భరణికి కనీస గౌరవం ఇవ్వకుండా నోరు పారేసుకోవడం చూసేవారికి కూడా కోపం తెప్పిస్తోంది. ఇవన్నీ దివ్యను టాప్ 5కి వెళ్లకుండా ఆపుతున్నాయి. సుమన్ కూడా టాప్ 5కి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. మిగతావారందరితో పోలిస్తే గేమ్‌లో సుమన్ చాలా వెనకబడి ఉన్నాడు. పైగా హౌస్‌లో మెరుపుతీగలా ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఫైనల్స్‌కు వెళ్లడం కష్టమే!
భరణికి ఛాన్స్
తనూజ, దివ్య మధ్య నలిగియిన భరణి (Bharani Shankar)ని జనాలు పట్టించుకోవడం మానేశారు. అందుకే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, రీఎంట్రీ తర్వాత తనలో కామెడీ యాంగిల్ చూపించాడు. తనూజ, దివ్యను నామినేట్ చేశి వారికే ఎదురెళ్లాడు. ఇది జనాలకు నచ్చింది. అతడిపై పాజిటివిటీ పెరుగుతోంది. కాబట్టి టాప్ 5లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.
పవన్ - రీతూ..
ఏ సీజన్‌లో అయినా లవ్‌ట్రాక్ వల్ల పేరొస్తుంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం బోలెడంత నెగెటివిటీ వచ్చింది. కొన్నివారాలపాటు వీళ్లిద్దరినీ విమర్శించనివాళ్లే లేరు. కానీ, రానురానూ ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారింది. ఎవరెన్ని మాటలన్నా కలిసే ఉండటంతో వీళ్ల బంధం నిజమైనదే అని జనాలు అభిప్రాయపడ్డారు. ఒకరి కోసం ఒకరు నిలబడటాన్ని మెచ్చుకున్నారు. దీంతో వీళ్లిద్దరు లేదా ఎవరో ఒకరు టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది.
అదే పవన్‌కు మైనస్
నిజం చెప్పాలంటే పవన్ ఆటకు, మాటతీరుకు అతడు టాప్ 3లో ఉండాల్సినవాడు. కానీ, అతడికి రావాల్సినంత హైప్ రాలేదు. పైగా అతడేం చేసినా నెగెటివే అవుతోంది. పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా అతడికి మైనస్‌గా మారింది. మరి అతడు ఈ అడ్డంకులను దాటుకుని ఫినాలేకు వెళ్తాడేమో చూడాలి! రానున్న రోజుల్లో కంటెస్టెంట్ల ఆటతీరు, మాట తీరును బట్టి టాప్ 5 స్థానాలు మారే ఛాన్స్ ఉంది!


