Bigg Boss Telugu 9: ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్లాక హౌస్‌మేట్స్ ముఖాలు వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోతున్నాయి. ఈవారం చివరి కెప్టెన్సీని చేజిక్కించుకునేందుకు అందరూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముందుగా కెప్టెన్సీ కంటెండర్ అవడానికి మాజీ కంటెస్టెంట్లతో గేమ్ ఆడి గెలవాలి. అలా ప్రియాంకతో కలిసి గేమ్ ఆడి కల్యాణ్ గెలిచి కంటెండర్ అయ్యాడు. గౌతమ్‌తో ఆడి భరణి ఓడిపోయాడు.
తనూజ అవుట్
తాజాగా ప్రేరణ.. తనూజతో గేమ్ ఆడింది. ఈమేరకు ఓప్రోమో వదిలారు. మీరు టఫ్ ప్లేయర్.. మీతో ఆడాలని ఉంది అని చెప్పింది తనూజ. ఇద్దరూ గేమ్‌లో బాగా కష్టపడ్డారు. కానీ చివరకు ప్రేరణ తనూజను ఓడించినట్లు తెలుస్తోంది. దీంతో తనూజ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయింది. హౌస్‌లోకి మానస్, యావర్, శోభాశెట్టి వంటి సెలబ్రిటీలు కూడా రానున్నారు. వీరితో కంటెస్టెంట్లు గేమ్ ఆడి గెలిచిన డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్లు అయినట్లు తెలస్తోంది. వీరి వీరిలో ఎవరు కెప్టెన్ అన్నది చూడాలి!


