Prerana Kambam
-
టాటూ సీక్రెట్ బయటపెట్టిన యష్మి.. మణికంఠ సింపతీ డ్రామాలొద్దు!
వైల్డ్‌కార్డులు లేకుండా ఈరోజే లాస్ట్డే.. రేపు ఈ సమయానికల్లా ఎనిమిది మంది మాజీలు హౌస్‌లో తిష్ట వేస్తారు. సింపతీ ఏడుపులు వద్దంటూ నాగార్జున నాగమణికంఠకు క్లాసు పీకాడు. ఇదే మంచి తరుణమని హౌస్మేట్స్ అంతా కూడా మణిపైనే పడ్డారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే నేటి(అక్టోబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మణికంఠకు క్లాస్ పీకిన నాగ్నాగార్జున వచ్చీరావడంతోనే సింపతీకి ఫుల్స్టాప్ పెట్టమని మణికంఠకు గట్టిగా క్లాస్ పీకాడు. ఎంత బాధున్నా ఇప్పుడే ఏడ్చేసేయ్, కానీ తర్వాత మాత్రం ఏడవడానికి వీల్లేదన్నాడు. అయినా మణి కంట నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. దీంతో నాగ్.. నీ భార్య నీదగ్గరకు రానంటే ఏం చేస్తావ్? నీకు ఫుడ్ పంపించింది కూడా నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావని తిట్టాడు.ఫైర్? అదెలా ఉంటుంది సర్?మణికి ఈ రేంజ్లో క్లాస్ పీకడంతో హౌస్మేట్స్ అంతా కూడా అతడి మీదే పడ్డారు. మొదటగా ప్రేరణ.. మణి అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడంది. విష్ణుప్రియ, పృథ్వీ కూడా అతడిని సెల్ఫిష్ అనేశారు. ఈ సందర్భంగా నాగ్.. విష్ణుప్రియలో ఫైర్ చూడాలనుందనగా.. అదెలా ఉంటుంది సర్? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది విష్ణు. దీంతో నాగార్జున మారు మాట్లాడలేక తన నోటికి తాళం వేసుకున్నాడు. ప్రేరణను సెల్ఫిష్ అనేసిన యష్మినబీల్ వంతురాగా.. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందన్నాడు. యష్మి మళ్లీ మణి దగ్గరకే వచ్చి అతడు ప్రవర్తన అన్నోయింగ్గా అనిపిస్తుందంది. అలాగే ప్రేరణ సెల్ఫిష్‌గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. నాగ్ మాత్రం.. ప్రేరణ గేమ్ అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఇక యష్మికి తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు నాగ్. కాకపోతే ఏదైనా సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు. మోసపోయిన యష్మిదీంతో యష్మి ఓపెన్ అవుతూ.. కాలేజీలో ఒకర్ని ప్రేమించాను.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. తర్వాత తెలిసిందేంటంటే.. ఇది జపనీస్ భాష అంట.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్‌ను తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, వారియర్‌లా పోరాడు, మిస్ అవుతున్నానని సందేశం పంపాడన్నాడు. మణికంఠ కన్నీళ్లుసీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక పేర్కొన్నారు. మణికంఠ వంతు వచ్చేసరికి.. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ గద్దించడంతో సీతకు జెలసీ ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదనేసిందని చెప్పాడు. కిచెన్‌లో ప్రేరణ ప్రవర్తించిన తీరు నచ్చలేదన్నాడు. ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్, నబీల్ను సేవ్ చేశారు.ఆ నలుగురికీ ఆదిత్య పంచ్తర్వాత వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆదిత్యను స్టేజీపైకి పిలిచి జర్నీ చూపించాడు. అతడితో హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడించాడు. నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్‌కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, నాగమణికంఠకు పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవా లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. ఇక పుట్టినరోజునాడే ఆదిత్య బిగ్‌బాస్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని ఆడుకున్న బిగ్‌బాస్.. ఏడ్చినా కరుణించలేదు!
ఆదిత్య ఎలిమినేషన్‌తో హౌస్‌లో తొమ్మిది మందే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చాడు. ఇంటి వంటను కళ్లముందుంచాడు. కానీ దాన్ని తినే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే నేటి (అక్టోబర్ 04) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..జాతకం చెప్పిన మణిమణికంఠకు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మనల్నే విలన్ చేస్తున్నాడని సీత అభిప్రాయపడింది. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడంది. ఇదిలా ఉంటే తర్వాతి రోజు మార్నింగ్ మస్తీ పేరిట బిగ్‌బాస్ మణికంఠతో హౌస్‌మేట్స్‌కు జ్యోతిష్యం చెప్పించాడు. ఈ సందర్భంగా మణి తనలోని ఫన్ యాంగిల్‌ను బయటపెట్టాడు. తర్వాత హౌస్మేట్స్ మణి జాతకం చెప్పారు. ఈ వారం వెళ్లిపోయేలా ఉన్నావని నబీల్, ప్రతిదానికి ఏడవొద్దని యష్మి సెటైర్లు వేశారు.భార్య మెసేజ్ కోసం మణి ఆరాటంఅనంతరం అసలైన ఆట మొదలుపెట్టాడు. మొదటగా యష్మిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. నిఖిల్ కోసం అతడి అమ్మ చేసిన వంటను, నాగమణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను ముందు పెట్టాడు. వీరికి మెసేజెస్ కూడా వచ్చాయన్నాడు. అయితే ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకుని వారికి ఫుడ్, లెటర్ ఇవ్వాలన్నాడు. యష్మి.. క్షణం ఆలోచించకుండా నిఖిల్ పేరు చెప్పింది. అది విని మణికంఠ గుండె బద్ధలయ్యింది. తన భార్య ఏమని మెసేజ్ పంపిందోనని దిగులు చెందాడు. అంతలోనే తనకోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా మనసు నింపుకున్నాడు.నువ్వు వారియర్‌వి..అమ్మ చేతి వంట తిన్న తర్వాత నిఖిల్.. 'ఎవరి కోసమూ మారాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని మర్చిపోకు' అంటూ తల్లి పంపిన మెసేజ్ చూసుకుని మురిసిపోయాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన పృథ్వీ విష్ణుప్రియకు బదులుగా నైనిక కోసం ఆమె తల్లి చేసిన ఇడ్లీసాంబార్ తీసుకెళ్తానన్నాడు. విష్ణు ముందుగానే త్యాగం చేసేందుకు రెడీ అని హింటివ్వడంతోనే పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వారియర్‌వి, నీ బలం చూపించు అంటూ అమ్మ పంపిన మెసేజ్ చూసి నైనిక మురిసిపోయింది.యష్మి ఎమోషన్స్‌తో ఆడుకున్న బిగ్బాస్మణికంఠ వంతురాగా యష్మీని పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్లిచ్చాడు. దీంతో యష్మి బోరుమని ఏడ్చేసింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటూ తల్లి నుంచి వచ్చిన మెసేజ్ చూసి పృథ్వీ ఖుషీ అయ్యాడు. ఇంతలో బిగ్‌బాస్ యష్మి కోసం తండ్రి పంపిన మెసేజ్‌ను సైతం టీవీలో వేశాడు. కానీ ఒక లైన్ చదివేలోపే దాన్ని తీసేయడంతో యష్మి ఒక్కసారి మెసేజ్ చూపించు బిగ్‌బాస్ అని ఏడుస్తూ వేడుకుంది. కానీ బిగ్‌బాస్ కనికరించలేదు. ఒంటరి పోరాటం..ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే.. హాయ్ అమ్మూ, నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే నీ పోరాటాలను ఎదుర్కొన్నావు.. ఆ సమయంలో నీకు తోడుగా లేను. నీ కలలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరమూ నీకు సపోర్ట్ చేయలేదు. అయినా నువ్వు వారియర్‌లా పోరాడావు, మేము తప్పని నిరూపించావు. మేము గర్వపడేలా చేశావు. ధైర్యంగా ఉండు, మిస్ యూ మగలే.. ఇట్లు నీ పప్పా అని రాసి ఉంది.పెళ్లయి 10 నెలలే..తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన నిఖిల్.. ప్రేరణ, నబీల్, సీత.. ముగ్గురిలో ప్రేరణను సెలక్ట్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పావ్ బాజీని ప్రేరణ ఆవురావురుమని ఆరగించింది. 'మన పెళ్లయి పది నెలలే అవుతోంది.. నీకు ఈ షో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నిన్ను కలవలేనప్పటికీ టీవీలో సంతోషంగా చూస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను. మిస్ యూ.. ఇట్లు నీ పుట్టు' అని భర్త మెసేజ్ చదివి సంతోషించింది.విష్ణుకు మెసేజ్చివరగా ఇంటి నుంచి భోజనం అందుకోలేకపోయినవారికోసం బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్, నైనిక, ప్రేరణ, పృథ్వీ కలిసి.. మిగతా హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఫుడ్ తీసుకెళ్లొచ్చనగా అందరూ విష్ణుప్రియ పేరు చెప్పారు. చెల్లి పంపిన చికెన్ బిర్యానీ చూసి విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏమని మెసేజ్ వచ్చిందంటే. ఆట మీద దృష్టి పెట్టి రేసుగుర్రంలా ఆడు, సైలెంట్‌గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. టాస్కుల్లో ఫైర్ చూపించు.. ప్రేక్షకుల మనసు గెలుచుకో అని రాసుంది. మరి ఇప్పుడైనా విష్ణు.. పృథ్వీపైనే కాకుండా గేమ్‌పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై విషం కక్కిన యష్మి, ఆదిత్యను దగ్గరుండి సాగనంపారు!
బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త చీఫ్ సెలక్ట్ అయ్యాడు. ఓరుగల్లు పిలగాడు నబీల్ అఫ్రిది చీఫ్ పోస్ట్ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓంను బయటకు పంపించారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పోరాడి ఓడిన ప్రేరణహ్యాపీ పప్పీ టాస్క్‌లో నబీల్, ఆదిత్య, ప్రేరణ, నిఖిల్ మాత్రమే మిగిలారు. ఎలాగైనా చీఫ్ అవ్వాలని ప్రేరణ చివరిదాకా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కు నెట్టి చివరకు నబీల్ చీఫ్ కంటెండర్‌గా నిలిచాడు. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ, నబీల్‌లకు బిగ్‌బాస్ 'రాజయ్యేది ఎవరు?' అన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటగా టాస్క్ పూర్తి చేశాడు. కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు.ఫ్రెండ్ అని ఊరుకున్నా..ఆలస్యంగానైనా నబీల్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్చేసింది. సంచాలకురాలిగా ప్రేరణ.. నబీల్‌కే ఫేవర్ చేసిందని ఆరోపించింది, అతడే గెలవాలని తన మనసులో ఉందంటూ ఏవేవో నిందలు వేసింది. ఫ్రెండ్ అని సైలెంట్‌గా ఊరుకుంటున్నాను, లేకపోయుంటే మాత్రం వదిలేసేదాన్నే కాదని నిఖిల్, పృథ్వీ దగ్గర ఫైర్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ కనిపిస్తే కూడా.. పృథ్వీ మిస్టేక్ చేసినప్పుడు సరిచేయొచ్చు కదా అని నిలదీసింది. సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఎవరికీ సాయం చేయనని ప్రేరణ మొహం మీదే చెప్పేసింది.లేడీస్ గ్యాంగ్ ఏడుపురాత్రిపూట బిగ్‌బాస్ మిడ్‌వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. నామినేషన్లో ఉన్నవారిలో నిఖిల్, నబీల్, మణికంఠ.. ఈరోజుకైతే సేఫ్ అని తెలిపాడు. విష్ణుప్రియ, ఆదిత్య, నైనికలలో ఒకరు ఈరోజు బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నాడు. దీంతో నైనిక ఏడుపందుకుంది. వాళ్లను చూసి సీత సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత బిగ్‌బాస్.. ఆదిత్య, నైనిక, విష్ణుప్రియను వరుసగా నిల్చోబెట్టి.. వీరిలో ఎవరు ఈరోజు వెళ్లిపోతారని భావిస్తున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు.ఆదిత్య ఎలిమినేట్కొన్ని విషయాల్లో ఆదిత్య వెనకబడుతున్నాడని, అతడు ఎలిమినేట్ అవుతాడని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. మణికంఠ, సీత, యష్మి సైతం.. ఆదిత్య వెళ్లిపోతాడని భావించారు. నబీల్ వంతురాగా.. మాటలు జారిన విష్ణుప్రియ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చేమోనని గెస్ చేశాడు. ప్రేరణ, పృథ్వీ.. నైనిక వెళ్లిపోతుందేమోనని అభిప్రాయపడ్డారు. చివర్లో బిగ్‌బాస్.. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే ఆదిత్య అందరికీ ఓ ఫ్లయింగ్ కిస్ వదిలి హౌస్ నుంచి నిష్క్రమించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నీకే నోటిదూల'.. కోపంతో మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య!
గమ్యం లేకుండా ఆట ఆడుతున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? అంటే విష్ణుప్రియ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఆదిత్య కూడా అసలు హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు కానీ తనకు ఈ షో అవసరమని ఒకానొక సందర్భంలో చెప్పాడు.గేమ్‌ను లైట్ తీసుకున్న విష్ణు?విష్ణుప్రియ మాత్రం అవసరం కాదుకదా టైం పాస్ అన్నట్లుగా గేమ్‌ను లైట్ తీసుకుంటోంది.. పృథ్వీతో లవ్ యాంగిల్ ట్రై చేస్తూ గేమ్‌ను పక్కన పడేసింది. పైగా నోటికి ఎంతొస్తే అంత వాగేస్తోంది. పతివ్రత, పుణ్యస్త్రీ వంటి పదాలు వాడిన ఆమె పోయినవారం నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ దారుణంగా మాట్లాడింది.ఈయనకే నోటిదూలఇదే పాయింట్‌ను ప్రస్తావిస్తూ నిఖిల్.. విష్ణుప్రియను నామినేట్ చేశాడు. కానీ దాన్ని ఒప్పుకోని విష్ణు.. ఈయనకే పెద్ద నోటిదూల ఉంది, అయినా నా దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నాడో అర్థం కావట్లేదని నవ్వేసింది. తర్వాత నిఖిల్.. మణికంఠను నామినేట్ చేశాడు.మంటలో చేయి పెట్టిన ఆదిత్యప్రేరణ వంతు రాగా.. ఎక్కువ మంచిమాటలు చెప్పి నెగెటివ్ విషయాల్ని మాత్రం చెప్పడం లేదని ఆదిత్యను నామినేట్ చేశాడు. నాజీవితంలో ఇలాగే ఉంటాను.. వచ్చేవారం కూడా ఇలాగే ఉంటానని ఆదిత్యబదులిచ్చాడు. వచ్చేవారం దాకా హౌస్‌లోనే ఉంటావన్న నమ్మకం నీకు లేదటూ ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. ఈ నామినేషన్‌ను ఒప్పుకోని ఆదిత్య మంటల్లో చేయి పెట్టి తన ఫోటో బయట పడేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాగ్‌తో అడ్డంగా వాదించిన సోనియా.. హౌస్‌లో జీరో అతడే!
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హీరోగా నబీల్నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్‌లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్‌తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్‌లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.సీత హీరో, మణి జీరోఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్‌కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్‌ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు. చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?నా ఆట నేనే ఆడతాసోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్‌ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.నాగ్‌తో వాదించిన సోనియాఅందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్‌నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్‌లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది. ఇది జోక్ కాదువిష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.యష్మిపై ఫైర్అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్‌గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుకు మొట్టికాయలు.. సోనియా గ్యాంగ్‌కు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ 8 ప్రారంభమైన తొలినాళ్లలో సోనియా.. తన తెలివిని ఉపయోగించి ఆటలో ముందుకు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అతి తెలివి ఉపయోగించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. గ్రూప్ గేమ్ అంటూ నిఖిల్, యష్మిలపై నింద వేసిన ఆమె ఇప్పుడు నిఖిల్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతోంది. ఇది చూసిన జనాలు సోనియాకు నిందించకుండా ఎలా ఉంటారు?గ్రూప్ గేమ్పైగా ఫైర్ బ్రాండ్లా ఉండే నిఖిల్.. సోనియా చెంత చేరాక ఆమె చేతిలో కీలుబొమ్మలా మారాడు. ఇక సోనియాను ఎవరైనా ఏమైనా అంటే చాలు నిఖిల్, పృథ్వి.. వారి మీద పడిపోయేవారు. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడే సోనియా.. నామినేషన్లోనూ యష్మి.. ఆ ఇద్దరు అబ్బాయిలనే చూస్తోందని చులకనగా మాట్లాడింది. ఈ గ్రూప్ గేమ్‌ను చూసీచూడనట్లు ఊరుకున్న నాగ్ ఇన్నాళ్లకు పెదవి విప్పాడు. సోనియా ఆట కూడా చెడగొట్టండితాజా ప్రోమోలో.. నీ ఆట కనిపించడం లేదంటూ యష్మి సోనియాను నామినేట్ చేసింది. ఆ సమయంలో నిఖిల్, పృథ్వి పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. ఇక్కడ పృథ్వీ సోనియాను వెనకేసుకురాబోయాడు. కానీ నాగ్ అందుకు ఒప్పుకోలేదు. ఇలాగే ఏం అర్థం చేసుకోకుండా మీ ఆటను పాడు చేసుకోండి.. అలాగే సోనియా ఆట కూడా చెడగొట్టండని క్లాస్ పీకాడు.బొట్టు ఒక్కటే తక్కువఇక బిగ్‌బాస్ షోకు పిక్నిక్ కోసమే వచ్చిన విష్ణుప్రియ.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ హేళన చేయడాన్ని సైతం తప్పుపట్టాడు. ఇది చాలా తప్పని నాగ్ చెప్తున్నా సరే విష్ణు దాన్ని నెత్తినెక్కించుకోకుండా ఊరికే నిఖిల్‌ను కాంచన అని ఆటపట్టిస్తామని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇది జోక్ కాదని, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావని గద్దించడంతో అప్పుడు తన గొంతు తగ్గించింది. మరి ఇప్పటికైనా విష్ణు తన నోటిని అదుపులో పెట్టుకుంటుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హీరో నుంచి జీరో స్థాయికి పడిపోయిన నిఖిల్.. క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ ప్రోమో రానే వచ్చింది.. కింగ్ నాగార్జున ఇంటిసభ్యులతో హీరో- జీరో గేమ్ ఆడించాడు. అంటే హౌస్‌లో మీకు హీరోగా కనిపించిన వ్యక్తికి రాజకిరీటం పెట్టమని.. ఆటలో జీరో అనిపించిన వ్యక్తి ముఖంపై రాంగ్ సింబల్ అచ్చు దింపాలని ఆదేశించాడు. అలా ఎక్కువమంది నబీల్, నిఖిల్, సీత హీరో అని అభిప్రాయపడగా నైనిక, మణికంఠను ఎక్కువమంది జీరో అని తేల్చేశారు.కేవలం శక్తి టీమ్ విజయం కోసంఈ క్రమంలో ప్రేరణ.. నిఖిల్‌కు జీరో ట్యాగ్ ఇచ్చింది. అందుకు బలమైన పాయింట్ కూడా చెప్పింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను ఆపడానికి హౌస్ అంతా కలిసి ఆడదామన్నాడు. కానీ చివరికి తన టీమ్ కోసం హౌస్‌ను పక్కనపడేశాడంది. అందుకు నాగార్జున సైతం తనకూ అలాగే అనిపించిందన్నాడు. నబీల్ను గేమ్‌లో నుంచి తీసేయడం కరెక్టేనా? అని అడగ్గా.. అందుకు నిఖిల్ ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయిందన్నాడు. బ్యాలెన్స్ తప్పడానికి ఏ మిస్ కారణం? అని నిలదీయడంతో నిఖిల్ బిక్కముఖం వేశాడు.ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు క్లాన్ చీఫ్ (టీమ్ లీడర్)గా ఉన్నప్పుడు హౌస్ అంతా కూడా నీ టీమ్‌లోకి రావడానికి ఇష్టపడలేదు. అది ఎందుకో ఒక్కసారైనా ఆలోచించావా? అని నాగ్ సూటిగా అడిగాడు. ఏం చేసినా మేం ముగ్గురమే కలిసి చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారని తెలిపాడు నిఖిల్. అది నిజమేనా? అని నాగ్ అడగ్గా హౌస్ అంతా కూడా అవును అని బదులిచ్చింది.చదవండి: -
ఆడాళ్ల ప్రతాపం.. మాట్లాడాలంటే భయమేస్తోందని ఏడ్చిన మణి
పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని బాంబు పేల్చిన బిగ్‌బాస్.. వాటిని వీలైనంతవరకు తగ్గించవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు. కానీ అందులో మూడు మాత్రమే గెలవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్యను తొమ్మిది వరకే నరుక్కుంటూ రాగలిగారు. ఈ ఛాలెంజ్‌ల మధ్యలో బోలెడు గొడవలు. అవేంటో నేటి (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదుర్స్ అనిపించిన నబీల్, పృథ్వీవైల్డ్కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు బిగ్‌బాస్ మూడో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో నబీల్, పృథ్వి పోటీపడ్డారు. పావుగంటసేపు బెలూన్ పగలకుండా చూసుకోమంటే వీళ్లు ఏకంగా మూడుగంటలకుపైగా అలానే ధ్వజస్థంభాల్లా నిలబడి ఔరా అనిపించారు. ఈ గేమ్‌లో పృథ్వి (శక్తి) టీమ్ విజయం సాధించడంతో 11 మందిలో ఒక వైల్డ్‌కార్డ్ ఎంట్రీని అరికట్టారు. అంతేకాదు, అవతలి టీమ్‌లో నుంచి ఒకరిని గేమ్‌లో నుంచి తీసేసే పవర్‌ను శక్తి టీమ్‌కు ఇచ్చాడు. చిల్లర గేమ్..దొరికిందే ఛాన్స్ అనుకున్న శక్తి క్లాన్.. కాంతార టీమ్‌లో నుంచి నబీల్ను అవుట్ చేసింది. బాగా ఆడే వ్యక్తిని ఎలా గేమ్‌లో నుంచి తీసేస్తారని కాంతార టీమ్ ఉడికిపోయింది. చిల్లర గేమ్ ఆడుతున్నారని ప్రేరణ మండిపడింది. సీత అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కలిసి ఆపుదామనుకున్నాక మళ్లీ నీ టీమ్ కోసం స్వార్థంగా ఆలోచించావని నిఖిల్‌ను తప్పుపట్టింది. విష్ణుప్రియ అయితే.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువైంది.. అలా అని ఆడవాళ్లను తక్కువ చేయట్లేదు అంటూనే నిఖిల్ మీద సెటైర్లు వేసింది. బలవంతమైన త్యాగం!అసలు శక్తి టీమ్‌లో మణిని ఎలా సైడ్ చేశారన్న డౌట్ ప్రేరణకు వచ్చింది. అదే ప్రశ్నను ముక్కుసూటిగా అడగ్గా మణికంఠయే స్వయంగా త్యాగం చేశాడని సోనియా అంది. అందుకు మణి.. అది నిజం కాదంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో శక్తి టీమ్ బిక్కముఖం వేసింది. మన టీమ్‌లోని ముగ్గురు నేను సైడ్ అవ్వాలని కోరుకున్నారు. అందుకే నేను కూడా పక్కకు తప్పుకున్నానే తప్ప నా అంతట నేనుగా త్యాగం చేయాలనుకోలేదని మణి క్లారిటీ ఇచ్చాడు. కన్నీళ్లు పెట్టుకున్న మణికంఠఅయినా వెనక్కు తగ్గని సోనియా, యష్మి .. అప్పటిదాకా త్యాగం అని చెప్పి ఇప్పుడేమో మాట మార్చేశాడంటూ నోరేసుకుని పడిపోయారు. నీ వయసెంత? చిన్నపిల్లాడిలా ప్రవర్తించకు. ఎవర్నీ బ్యాడ్ చేయొద్దంటూ యష్మి వార్నింగే ఇచ్చింది. దీంతో ఎమోషనలైన మణి.. తప్పంతా నాదే! ఇకమీదట నోరు మూసుకుని కూర్చుంటాను అంటూ ఎమోషనలయ్యాడు. వీళ్ల అరుపులతో పసిపిల్లాడిలా భయపడిపోయిన మణికంఠ.. మాట్లాడాలంటేనే భయమేస్తోందంటూ ఏడ్చేశాడు. ధైర్యం నూరిపోసిన నబీల్అతడి బాధను అర్థం చేసుకున్న నబీల్.. ఎవరికీ భయపడాల్సిన పని లేదు, నీకు మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడాలంతే. అని తనకు ధైర్యం చెప్పాడు. ఇక బిగ్‌బాస్ రంగురంగుల పజిళ్లు అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో ఏ టీమ్ గెలవకలేకపోయింది. నచ్చిన స్టెప్పులేసుకోండి అంటూ ఐదో ఛాలెంజ్ ఇవ్వగా ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలుపొందింది. దీంతో 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కాస్తా తొమ్మిదికి చేరాయి. 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా..అప్పుడే బిగ్‌బాస్ ఓ బాంబు పేల్చాడు. ఇంతటితో ఛాలెంజ్‌లు పూర్తయ్యాయని, ఇప్పటివరకు మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మాత్రమే ఆపగలిగారని చెప్పాడు. అంటే ఇంకా తొమ్మిదిమంది హౌస్‌లోకి వచ్చేస్తున్నారని హౌస్మేట్స్ గుండెల్లో గుబులు పుట్టించాడు. వీరిలో ఆరేడుగురు మాజీ కంటెస్టెంట్లు కాగా మరో ఇద్దరు ఈ సీజన్లో ఎలిమినేట్ అయినవారితో రీఎంట్రీ ప్లాన్ చేయిస్తున్నట్లు టాక్!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న సోనియా.. నామినేషన్స్ ఆరుగురు!
నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవపడ్డట్లు ఆ కొట్లాటలేంటి? ఆ మాటలేంటి? అని విష్ణుప్రియ, ప్రేరణ.. ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగ్. పోయినవారం గుడ్డు దగ్గర మొదలైన వైరం గుడ్డుతోనే ముగిసిపోవాలని ఐదు ఎగ్స్ ఇచ్చి మరీ ఒకరికొకరు తినిపించుకోమన్నాడు. అప్పుడు సరేనంటూ తలూపిన వీళ్లు నామినేషన్స్ రాగానే మళ్లీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి దిగిపోయారు.నబీల్ వర్సెస్ సోనియావిష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేయడంతో ఆమె షాకైంది. అయితే ప్రేరణ మాత్రం విష్ణును వదిలేసి నైనిక, మణికంఠలను నామినేట్ చేసింది. ఇక సోనియా.. తన యాటిట్యూడ్ చూపించింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్‌కు ట్యాగ్ ఇచ్చింది. అటు ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ.. మీరేం పర్ఫామెన్స్ ఇవ్వలేదు కాబట్టి చెప్పడానికి పెద్దగా పాయింట్లు కూడా లేవంది.వెళ్తాననుకున్నారుగా.. వెళ్లిపోండిఎలాగో ఈవారం వెళ్తాననుకున్నారు కదా.. కాబట్టి ఈ హౌస్ నుంచి వెళ్లిపోండి అని ఆదిత్య ముఖం మీదే చెప్పింది. మొత్తానికి ఈ వారం ప్రేరణ, నబీల్, ఆదిత్య, సోనియా, పృథ్వి, మణి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. నిజానికి నైనిక కూడా నామినేషన్లో ఉండాల్సింది కానీ తనను నిఖిల్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్
ఈ వారం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూసినవాళ్లకు నాగార్జున ఎవరికి క్లాస్ పీకనున్నాడనేది ముందే తెలుసు. అయితే అందరూ ఊహించినదానికన్నా రెట్టింపు స్థాయిలో నాగ్ ఫైర్ అయ్యాడు. అభయ్ నవీన్‌ను మెడ పట్టి బయటకు గెంటినంత పని చేశాడు. కానీ బూతులు మాట్లాడిన పృథ్వీని సుతిమెత్తగా మందలించడం గమనార్హం. మరి ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అభయ్కు రెడ్ కార్డ్నాగార్జున వచ్చీరాగానే అభయ్‌ను వాయించడం మొదలుట్టాడు. మొదట బెలూన్ గేమ్ గురించి, తర్వాత బిగ్‌బాస్‌ను చులకన చేస్తూ తిట్టిన వీడియో ప్లే చేశాడు. సైకోలా ఉన్నావ్.. మనిషి పుట్టుక పుట్టావా? అన్నీ నీమాటలే అంటూ నాగ్.. అభయ్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వకపోతే నేను సహించను. ఇది మళ్లీ రిపీట్ అవకూడదు అంటూ అభయ్కు రెడ్ కార్డ్ చూపించాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. దీంతో అభయ్ మోకాళ్లపై కూర్చుని తనను క్షమించమని వేడుకున్నాడు.అభయ్ తరపున నాగార్జున క్షమాపణ..ఒక్క ఛాన్స్ ఇవ్వండి సర్.. నేను ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనేది నేర్చుకోవడానికి లైఫ్‌లో దొరికిన అదృష్టం సర్ ఇది అని దండం పెట్టి బతిమాలాడు. బిగ్‌బాస్ హౌస్‌లో నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలేనన్న నాగ్ ఇక్కడ బిగ్‌బాస్ కంటే ఎవరూ తోపు కాదని నొక్కి చెప్పాడు. అభయ్ తరపున నాగార్జున బిగ్‌బాస్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇంట్లో వాళ్లందరూ అభయ్కు ఒక్క ఛాన్స్ ఇద్దామనడంతో నాగ్ శాంతించాడు.రూ.6 లక్షలు గెలుచుకున్న లేడీస్తర్వాత ఎగ్ టాస్క్ గురించి ప్రస్తావించాడు. లేడీస్‌లో ఎవరు బాగా ఆడారన్న ప్రశ్నకు నిఖిల్.. సీత పేరు చెప్పాడు. దీంతో నాగ్.. కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు ఇచ్చావని కౌంటరిచ్చాడు. ఎగ్స్ టాస్క్ లేడీస్ అందరూ కుమ్మేశారని నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతేకాదు వారి పర్ఫామెన్స్ మెచ్చి ఏకంగా రూ.6 లక్షల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.11,60,000కు చేరుకుంది. క్లాస్ పీకిన నాగ్తర్వాత ప్రేరణ, విష్ణు మధ్య గొడవను నాగ్ లేవనెత్తాడు. ముందుగా ప్రేరణ మాట్లాడుతూ..నేను పర్సనల్‌గా కనెక్ట్ అయింది విష్ణుతో! కానీ, తనను నామినేట్ చేసినప్పటి నుంచి ఆమెలో చాలా మార్పులు కనిపించాయి. నాపై ద్వేషం పెంచుకుంది. ఆ ద్వేషంతోనే గేమ్‌లో నాపై రక్కింది అని చెప్పింది. అప్పుడు.. సీతను తన్నిన, విష్ణుప్రియను క్యారెక్టర్‌లెస్ అన్న వీడియో ప్లే చేసి మరీ ప్రేరణకు నాగ్ క్లాస్ పీకాడు.పతివ్రత..పంపులదగ్గర కొట్టుకున్నట్లు ఆ మాటలేంటి? అని గద్దించగా ప్రేరణ.. తప్పు పదం వాడేశానని, అందుకు సారీ చెప్పానంటూనే మరోసారి క్షమాపణలు చెప్పింది. అటు విష్ణుప్రియ కూడా పతివ్రత పదం వాడిందని, మరోసారి అలాంటి పదాలు రిపీట్ కావద్దని నాగ్ హెచ్చరించాడు. గుడ్డు దగ్గరే గొడవ మొదలు కావడంతో వీళ్లిద్దరికీ కలిపి ఐదు గుడ్లు పంపించి శత్రువులను మిత్రువులు చేశారు.ఎందుకంత సీన్ చేశారు?తర్వాత దోస వివాదానికి చెక్ పెడుతూ ఓ వీడియో ప్లే చేశారు. అందులో ప్రేరణ.. విష్ణుకు మామూలుగానే దోస వేసి ఇచ్చింది. అడుక్కునేవారికి వేసినట్లు వేయలేదుగా.. దానికి మణి, విష్ణు ఎందుకంత సీన్ చేశారని నాగ్ అడిగాడు. మధ్యలో నువ్వు ఉండటం వల్లే ఆ గొడవ పెద్దదైందని, నీ గేమ్ నువ్వు ఆడు అని మణికి సలహా ఇచ్చాడు.ఆడపిల్ల ఇబ్బందిపడితే..తర్వాత అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తన హగ్గుల వల్ల యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని వీడియో ద్వారా చూపించారు. నీ వల్ల ఆడపిల్ల ఇబ్బందిపడితే బయటకు పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఈ షోకి ఎందుకు వచ్చావన్నది గుర్తుపెట్టుకుని ఆడమని చెప్పాడు. ఒక్క యష్మి విషయంలోనే కాదని, ఇది చాలాసార్లు రిపీట్ అవుతోందని తెలిపాడు.తప్పు తెలుసుకున్న మణిమొత్తానికి తప్పు తెలుసుకున్న మణి.. ఇంకోసారి అలా జరగదని మాటిచ్చాడు. కొత్తగా చాలామంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానన్నాడు. పృథ్వీకి తన కోపమే బలహీనతగా మారిపోతుందని, బూతులు తగ్గించుకోవాలన్నాడు. వరుసగా చీఫ్ అవుతున్న నిఖిల్‌ను అభినందించాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ గెలవాలంటే ఈ ఐదు తప్పనిసరి!
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది. ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు. 1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం.ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.స్వీయ అవగాహన (Self-Awareness)మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.స్వీయ నియంత్రణ (Self-Regulation)పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.సహానుభూతి (Empathy)నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.సామాజిక నైపుణ్యాలు (Social Skills)ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్లెస్', 'యూజ్లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.ప్రేరణ (Motivation)అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.ఎవరు ఎలిమినేట్ కావచ్చు? ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comబిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కొట్టుకు చస్తుంటే సినిమా చూస్తాడేంట్రా బాబూ.. చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్!
లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ముందుండి నడిపించాలి. అంతేకానీ ఏదైతే నాకేంటి? ఎవరెటు పోతే నాకేంటి? అనుకోకూడదు. కానీ అభయ్ అచ్చంగా అదే చేశాడు. తన టీమ్ కష్టపడి సంపాదించిన గుడ్లను కాపాడటం కూడా చేతకాలేదు. పైగా తమ గుడ్లు పోతున్నాయని టీమ్ మెంబర్స్ లబోదిబోమంటే అరవకుండా ఊరుకోమని చెప్తున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం వింతలు, విశేషాలు జరిగాయో నేటి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..కాంతార టీమ్‌పై విరుచుకుపడ్డ శక్తి టీమ్బిగ్బాస్ హౌస్‌లో నిన్నటి గుడ్ల టాస్క్ నేడు కూడా కొనసాగింది. కోడికూత వినబడగానే కంటెస్టెంట్లు ముందూవెనకా చూసుకోకుండా పరిగెత్తి మరీ గుడ్లను సంపాదిస్తున్నారు. వాటిని జేబుల్లో, టీషర్ట్స్‌లో.. ఎక్కడపడితే అక్కడ దాచేసుకున్నారు. తర్వాత తీరికగా బుట్టల్లో భద్రపరుస్తున్నారు. ఇంతలో కాంతార టీమ్ దగ్గరి నుంచి శక్తి టీమ్ గుడ్లు దొంగిలించింది. ఈ విషయాన్ని టీమ్ సభ్యులు తమ చీఫ్ అభయ్కు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. నబీల్‌పై నింద వేశా: విష్ణుప్రియకానీ యష్మి, ప్రేరణ మాత్రం దాన్ని అలాగే వదిలేసి ఉండలేకపోయారు. నువ్వానేనా చూసుకుందామన్నరీతిలో పోట్లాడారు. ఈ రౌండ్లో శక్తి 66, కాంతార 30 గుడ్లు సంపాదించింది. తర్వాత పెట్టిన గేమ్‌లో కాంతార టీమ్ గెలిచి 90 గుడ్లు సంపాదించింది. ఇక నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ ఈరోజు దానిపై క్లారిటీ ఇచ్చింది. అతడు తనను టచ్ చేయలేదని, ఎక్కడ టచ్ చేస్తాడోనన్న భయంతో అలా అరిచానంది. నబీల్ మంచి బాలుడు అని సర్టిఫికెట్ ఇస్తూ సారీ చెప్పింది. సైకోగాళ్లు.. బిగ్‌బాస్‌నే తిట్టిన అభయ్కిచెన్ విషయంలో బిగ్‌బాస్ మరిన్ని ఆంక్షలు విధించాడు. ఒక సమయంలో ఒక టీమ్‌కు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో వంట చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. వారిది పూర్తయ్యాకే మరో టీమ్ కిచెన్‌లో అడుగుపెట్టాలన్నాడు. ఈ నిర్ణయం విన్న అభయ్.. వీళ్లేమైనా మనిషి పుట్టుక పుట్టారా? దిమాక్ లేదు, సైకోగాళ్లు అంటూ బిగ్‌బాస్‌నే ధిక్కరించాడు. కానీ బిగ్‌బాస్ ఆదేశించాక ఇంకా ఆలోచించాల్సిందేం ఉండదు గనుక హౌస్మేట్స్ వెంటనే ఆ రూల్ ఫాలో అయిపోయారు.రాక్షసుడిలా పృథ్వీతర్వాతి రోజు నిఖిల్ ప్రభావతి కోడి దగ్గర ఎర్రగుడ్డు ఉండటం చూశాడు. అదే విషయం తన టీమ్ దగ్గరకు వెళ్లి చెప్పగా వెంటనే వెళ్లి తీసుకోమని సీత తొందరపెట్టింది. ఆమె సూచనతో ఎవరికీ కనబడకుండా ఎగ్ తీసుకొచ్చాడు. అటు సోనియాకు ఏమైందో ఏమో కానీ సడన్‌గా నైనిక మీదకెళ్లి ముద్దులు పెట్టింది. అనంతరం గేమ్ మొదలవగానే పృథ్వీ మళ్లీ రాక్షసుడిగా మారిపోయాడు. ఎటుపడితే అటు తోసేసి, రక్కేసి, లాగేసి, నెట్టేసి చూసేవారినే భయపెట్టించేశాడు.చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్అటు కాంతార చీఫ్ అభయ్ మాత్రం మరోసారి తన టీమ్‌కు సపోర్ట్ చేయడం మానేసి ఏం జరిగినా సరే ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించాడు. తనటీమ్ కష్టపడి సాధించిన గుడ్లకు కాపలాగా ఉన్న అభయ్.. తన కళ్లముందే ఎగ్స్ ఎత్తుకుపోతుంటే కూడా పోతే పోనీ అని చూస్తూ ఊరుకుండిపోయాడు. పోయినవాటిని తిరిగి తీసుకొద్దామని యష్మి, ప్రేరణ ప్రయత్నిస్తే కూడా అందుకు అభయ్ ఒప్పుకోలేదు. తన టీమ్ ఓడిపోవడానికి అభయే ప్రత్యక్ష కారకుడయ్యాడు. అతడి నిర్లక్ష్యం వల్ల అవతలి టీమ్ మరింత రెచ్చిపోయారు.తన్నుకున్న లేడీ కంటెస్టెంట్లుఆడాళ్లు అయితే కిందపడి కొట్టుకున్నారు, తన్నుకున్నారు, జుట్టు పీక్కున్నారు. ప్రేరణపై విష్ణుప్రియ, సీత దాడి చేయడంతో ఆమె ఆవేశంలో విష్ణును క్యారెక్టర్‌లెస్ అనేసింది. అటు సోనియా మీద నబీల్ అరవడంతో పృథ్వీ, నిఖిల్ అతడి మీదకు దూసుకెళ్లిపోయారు. చివరగా ఈ రౌండ్లో శక్తి టీమ్ దగ్గర 263, కాంతార టీమ్ దగ్గర 25 గుడ్లు మాత్రమే మిగిలాయి. లీడ్‌లో ఉన్న శక్తి టీమ్ కాంతార టీమ్‌లో నుంచి ప్రేరణను గేమ్‌లో నుంచి ఎలిమినేట్ చేసింది. అయితే ఈ రోజు గేమ్‌లో యష్మి, ప్రేరణ శివంగిలా ఫైట్ చేశారని తప్పకుండా చెప్పుకుని తీరాల్సిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ
బిగ్‌బాస్ ఐదో సీజన్లో వచ్చిన ప్రభావతి అలియాస్ కోడిగుడ్డు టాస్క్ మళ్లీ రిపీట్ అయింది. గుడ్డు పోయిందని కంటెస్టెంట్లు అరిచిగోల చేయలేదు, ఏకంగా కిందపడేసి రక్కి మరీ అవతలివారి దగ్గరనుంచి సాధించారు. ఈ గుడ్డు కంటే ముందు దోస గురించి ప్రేరణ, విష్ణుప్రియ పంచాయితీ పెట్టుకున్నారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..'శక్తి'కి లగ్జరీ రేషన్ఆడింది అయిదునిమిషాలైతే అరుచుకోవడం అరగంట.. కాదు, హాఫ్‌డే అన్నట్లుంది బిగ్‌బాస్ హౌస్ పరిస్థితి. రేషన్ కోసం పెట్టిన గేమ్ శక్తి టీమ్ గెలవడంతో వారికి లగ్జరీ రేషన్ అందింది. ఓడిన కాంతార టీమ్ కేవలం ఆకుకూరలు, కూరగాయలతోనే సరిపెట్టుకుంది. మరోవైపు వంటరాని విష్ణుప్రియ ఒక దోసె అడిగితే చేసివ్వడానికి ప్రేరణ ఒప్పుకోలేదు. తనకు దోసె వేసుకోవడం రాదు, కాబట్టి ఒకటి వేసిస్తే తప్పేంటని మణి నచ్చజెప్పడంతో ప్రేరణ అయిష్టంగానే దోసె వేసిచ్చింది.ఏడుపందుకున్న విష్ణుఇలా ముఖం మాడ్చుకుని ఫుడ్ విసిరేయడం నచ్చలేదంటూ విష్ణు శోకమందుకుంది. తిండి విషయంలో ఎందుకీ గొడవలు? అని మణి, నిఖిల్ చెప్పడంతో ప్రేరణకు మరింత చిరాకెత్తిపోయింది. అటు విష్ణుప్రియ తనకొద్దని మారాం చేయడంతో పృథ్వీ వెళ్లి ప్రేమగా తినిపించడంతో కూల్ అయింది. తర్వాత కాసేపటికి ప్రేరణ కూడా వెళ్లి తాను కావాలని అలా చేయలేదని విష్ణుకు క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా మణి వల్లే ఈ గొడవ పెద్దదైందని అతడిని చులకన చేస్తూ మాట్లాడింది.సోనియాకు దూరంగా పృథ్వీ?ఇదిలా ఉంటే 'నువ్వెవడివిరా నాకు చెప్పడానికి..' అని సోనియా అన్న మాటను మర్చిపోలేక పృథ్వీ బాధపడుతూనే ఉన్నాడు. తన వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుందని ఏకంగా సోనియానే దూరంగా పెట్టాలనుకున్నాడు. కానీ నిఖిల్ అది జరగనిస్తాడా? తెల్లారే సోనియా చెవిలో జారేశాడు. అలా ఆమె పృథ్వీని ఎలా కూల్ చేయాలా? అన్న ఆలోచనలో పడింది.సోనియా ప్రేమ కబుర్లుతర్వాత సోనియా.. ప్రేరణతో తన ప్రేమవిషయాలను పంచుకుంది. మేము మూడేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. నేను ప్రారంభించిన ఒక ఎన్జీవోకు అతడు వెబ్ డిజైనింగ్‌లో సహాయపడ్డాడు, అలాగే అమెరికా నుంచి తనొక స్పాన్సర్ కూడా! అయితే ఇంతవరకు నేను ప్రపోజ్ చేయలేదు. తను నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటికీ ఆయన నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు అని చెప్పింది.14 గంటల టైమ్లైన్అనంతరం బిగ్‌బాస్ కిచెన్ విషయంలో ఓ బాంబు పేల్చాడు. కిచెన్‌లో వంట చేసుకునేందుకు వారమంతా కలిపి కేవలం 14 గంటలు మాత్రమే కేటాయిస్తునట్లు తెలిపాడు. ఆ సమయం గడిచిపోయాక వంటగ్యాస్ ఆన్ చేసేదే లేదన్నాడు. తర్వాత బంగారుకోడిపెట్ట ప్రభావతి 2.0 హౌస్‌లోకి వచ్చింది. ప్రభావతి వదిలే గుడ్లు పట్టుకునేందుకు, పట్టుకున్నవాళ్ల దగ్గర లాక్కునేందుకు రెండు టీమ్స్ బాగానే కష్టపడ్డాయి. తోసుకుని, నెట్టేసుకుని, లాగేసి, కిందామీద పడేసి నానాతంటాలు పడ్డారు.చలనం లేకుండా పడి ఉన్న మణిమొదటి రౌండ్లో శక్తి టీమ్ 21, కాంతార టీమ్ 10 గుడ్లు సంపాదించింది. కామన్సెన్స్, బ్రెయిన్ వాడని ఒకే ఒక్క వరస్ట్ పర్ఫామర్ పృథ్వీ అని అభయ్ మండిపడ్డాడు. నిఖిల్ అయితే నాగమణికంఠను లాగి పడేయడంతో అతడు కొద్ది క్షణాలపాటు లేవలేకపోయాడు. అతడి పరిస్థితి చూసి తలపగిలిందేమోనని కాంతార టీమ్ లీడర్ అభయ్ పరిగెత్తుకు వచ్చాడు. తనకేదైనా అవుతుందేమోనన్న భయంతో గేమ్‌లో నుంచి పక్కన పెట్టాలనుకున్నాడు. దీంతో హర్ట్ అయిన మణి కెమెరాలకు కనిపించకుండా గోడకు అతుక్కుని వెక్కివెక్కి ఏడ్చాడు. బిగ్‌బాస్ షో.. నా జీవితంనీకేమైనా అయితే ఎలా? నిన్ను నమ్ముకుని ఇద్దరున్నారని అభయ్ అనడంతో ఈ షోయే నా జీవితం, నా పెళ్లాంబిడ్డలు కావాలంటే ఈ షో విన్ అవ్వాలి అని ఏడుపు కొనసాగించాడు. సరే, ఆడుదువులేనని అభయ్ సముదాయించాడు. అటు నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడని విష్ణుప్రియ అనగా.. తాను కేవలం గుడ్లు తీసుకునేందుకు మాత్రమే ప్రయత్నించానని, అనవసరంగా నిందలు వేయొద్దని నబీల్ మండిపడ్డాడు. అటు పృథ్వీ ఆవేశంలో బూతులు అనేసి తలపట్టుకున్నాడు.నబీల్ అవుట్ఇంతలో బిగ్‌బాస్ రెండు టీమ్స్ ఎగ్స్ లెక్కపెట్టమన్నాడు. అలా శక్తి టీమ్ దగ్గర 66, కాంతార వద్ద 34 గుడ్లు ఉన్నాయి. దీంతో కాంతార టీమ్‌లో ఒకర్ని సైడ్ చేసే ఛాన్స్ శక్తి టీమ్‌కు ఇచ్చాడు. అలా వాళ్లు నబీల్ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడంతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ.. ఏమైందంటే?
బిగ్‌బాస్ 8లో రోజులు మారుతున్నకొద్దీ హౌస్మేట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా రేషన్ కోసం మూడు గేమ్స్ పెట్టారు. సంచాలక్స్ వ్యవహరించిన మణికంఠపై ప్రేరణ, సోనియాపై యష్మిపై తెగ అరిచేశారు. ఇదలా ఉండగానే ఇప్పుడు మరో కొత్త రచ్చ మొదలైంది. ఫుడ్ విషయంల ప్రేరణ ప్రవర్తన వల్ల విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. తాజా ప్రోమోలో ఇదే తంతు.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)16 రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ 8 నుంచి బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం ఇప్పటికే నామినేషన్స్ పూర్తి కాగా 8 మంది లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియట్లేదు. మరోవైపు ప్రేరణ తనకు ఫుడ్ ప్లేట్లో వడ్డించకుండా, విసిరేస్తుందని విష్ణుప్రియ బాధపడింది. మిగతా వాళ్లు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కన్నీళ్లు పెట్టుకుంది.ఈ గొడవ మధ్యలో దూరిన మణికంఠ.. ప్రేరణకి యాటిట్యూడ్ తగ్గించుకోమని ఏదో చెప్పబోయాడు. కానీ ఏమైనా చేసుకో పో అని ప్రేరణ అనడాన్ని ప్రోమోలో చూపించారు. అంటే బుధవారం ఎపిసోడ్లో ఈ గొడవని ఎక్కువ హైలైట్ చేసేలా ఉన్నారు. ఈ వారం గేమ్స్‌తో పాటే ఏడుపులు, అరుపులు ఎక్కువగానే ఉన్నట్లు లేటెస్ట్ ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతోంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?) -
Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం
బిగ్‌బాస్ 8 హౌస్ మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరిగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ కాగా మిగిలిన ఇంటి సభ్యులు కాస్త గట్టిగానే గొడవలు పడుతున్నారు. ఎవరికి వాళ్లే హైలైట్ అయ్యే పనిలో ఉన్నారు. ఇదంతా పక్కనబెడితే హౌసులో ఉన్న ప్రేరణ ఇంట్లో విషాదం. ఈమె భర్త వాళ్ల అమ్మమ్మ చనిపోయిందట. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)గత వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాషాకు అంతకు రెండు రోజుల క్రితమే కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని శనివారం ఎపోసిడ్‌లో నాగార్జున చెప్పాడు. ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి తనని బయటకొచ్చేస్తానని కెమెరాలకి చెప్పాడు. అవకాశముంటే తనని ఎలిమినేట్ అయ్యేలా చూడమని మిగిలిన హౌస్‌మేట్స్‌తోనూ అన్నాడు. అయితే ఈ ఫుటేజీని నిర్వహకులు ఎపిసోడ్లో చూపించలేదు. బయటకొచ్చిన తర్వాత శేఖర్ భాషా ఇదంతా చెప్పాడు.ఇక ప్రేరణ విషయానికొస్తే.. కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. పేరుకే కన్నడ అమ్మాయి గానీ తెలుగు సీరియల్స్ చేస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం టాప్-3లో కొనసాగుతోంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయం మంగళవారం ఎపిసోడ్లో ఈమెకు చెప్పే అవకాశముంది. ఒకవేళ చెబితే ఈమె ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. అలానే ఇంట్లో బాధతో గేమ్‌పై దృష్టి పెడుతుందా లేదంటే హౌస్ నుంచి బయటకు పంపే ప్లాన్ ఏమైనా చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సొహెల్ ఇంట్లో విషాదం.. ఏమైంది?) -
విష్ణుప్రియ స్వార్థాన్ని బయటపెట్టిన ప్రేరణ.. యష్మి మైండ్‌లో విషం!
శేఖర్ బాషా ఎలిమినేషన్‌తో హౌస్‌లో పన్నెండుమంది మిగిలారు. వీరిలో మళ్లీ ఒకర్ని పంపించడానికి అవసరమైన నామినేషన్ నేడు వాడివేడిగా జరిగింది. ఎప్పుడూ ఎదుటివాళ్లమీద నోరు పారేసుకునే సోనియాకు యష్మి చుక్కలు చూపించింది. అటు మణికంఠ మీద కూడా బాగానే ఫైర్ అయింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇంట్లో ఉండి వ్యర్థంఇంట్లో ఉండి వేస్ట్ అనుకునేవాళ్లపై చెత్త గుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా సీత.. మీ టీమ్ సభ్యుల ప్రవర్తన లేదంటూ యష్మిని, పక్కవాళ్లను తొక్కేసి గెలవాలనుకోవడం నచ్చలేదని పృథ్వీపై చెత్త గుమ్మరించింది. విష్ణుప్రియ వంతురాగా.. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేసింది. మీ టీమ్‌సభ్యులు తొండాట ఆడారని, చీఫ్‌గా నువ్వు దాన్ని ఆపలేదంటూ యష్మిని నామినేట్ చేసింది.ప్రతిదాంట్లో జోక్యం అవసరమా?నాగమణికంఠ మాట్లాడుతూ.. ప్రతిదాంట్లో దూరడం నచ్చడం లేదదని యష్మిని నామినేట్ చేశాడు. అందుకు యష్మి.. అప్పుడు చీఫ్‌గా ఉన్నాను కాబట్టే ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నానంది. నువ్వు ఫ్రెండ్ అంటూ డ్రామాలు చేశావు, ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ అని అరిచేసింది. ఫ్రెండ్ అయినా సరే నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్తానన్నాడు మణికంఠ. పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త గుమ్మరించాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదన్నాడు పృథ్వీ.విష్ణుప్రియ స్వార్థబుద్ధిఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయని సీతను ప్రేరణ నామినేట్ చేసింది. ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా? అని సీత సెటైర్ వేయగా నీకసలు కామన్సెన్స్ లేదంటూ ఏదేదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ.. ఉన్నవే ఐదు గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా అందులో రెండు గుడ్లు ఒక్కదానివే తినేశావంది. ఈ క్రమంలో బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణు, యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఒకరినొకరు తిట్టుకున్నారు.నువ్వసలు కాంపిటీషనే కాదుఆదిత్య వంతురాగా.. ఎవరితో కలవనంత మాత్రాన నాలో నాయకత్వ లక్షణాలు లేవనడం బాధేసిందని విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డ్ వాడుతున్నావని మణికంఠను నామినేట్ చేశాడు. నైనిక మాట్లాడుతూ.. నాకసలు కాంపిటీషనే అనిపించడం లేదని సోనియాను, సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మి వంతురాగా.. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు కాబట్టి ఈ హౌస్‌కే నువ్వు డేంజరస్‌గా కనిపిస్తున్నావు అంటూ మణికంఠపై చెత్త వేసింది. చిన్నపిల్లల్లా వెక్కిరింతలేంటో!ఇందుకు మణికంఠ స్పందిస్తూ.. ఫ్రెండ్షిప్ను, గేమ్‌ను తాను మిక్స్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత యష్మి.. పనులు సరిగా చేయడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. నబీల్ వంతురాగా.. ఒక గేమ్‌లో సంచాలకురాలు ప్రేరణను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త గుమ్మరించాడు. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, నీ వల్ల నేను రూ.1 లక్ష గెలిచే ఛాన్స్ కోల్పోయానని ప్రేరణను నామినేట్ చేశాడు.నీ మైండ్‌లో విషం.. ఈ క్రమంలో ప్రేరణ, నబీల్ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ వాదించుకున్నారు. తర్వాత పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు. సోనియా వంతురాగా.. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, లీడర్‌గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికను నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. నీ మైండ్‌ను పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతుందని, అది ఎవరికీ మంచిది కాదని పేర్కొంది. ఏడ్చేసిన యష్మిఆమె మాటలతో షాకైన యష్మి.. నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించిన ఇంట్రస్ట్ టీమ్‌పై చూపించలేదు అని ఉన్నమాట అనేసింది. ఎప్పుడూ సంచాలకురాలిగా ఉంటానన్నావే తప్ప ఎక్కడా గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చిపడేసింది. ఇంత మాట్లాడిన యష్మి.. సోనియా అన్న సూటిపోటి మాటలకు హర్టయి ఏడ్చేసింది. దీంతో సోనియా వెళ్లి తనను ఓదార్చడం గమనార్హం. నామినేషన్స్‌లో అభయ్చివర్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్‌లలో ఒకరికే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు బిగ్‌బాస్. దీంతో అభయ్.. తనకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉందంటూ నామినేషన్స్‌లోకి వచ్చేందుకు అంగీకరించాడు. అలా ఈ వారం ప్రేరణ, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.చదవండి: జరిగింది చూపించలేదు.. శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనక అసలు రహస్యం -
సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అప్పుడే అందులో ఇద్దర్ని బయటకు పంపించేశారు. ఒకరేమో చిచ్చుబుడ్డిలా ఫైర్ అయ్యే బేబక్క అయితే మరొకరు నవ్వులు పంచే ఎంటర్టైనర్ బాషా. ఈ ఇద్దరూ వెళ్లిపోవడంతో హౌస్‌లో 12 మంది మిగిలారు.త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుఆటలో తప్ప మాటలో మాత్రమే పౌరుషం చూపించే కంటెస్టెంట్లు హౌస్‌లో చాలామందే ఉన్నారు. ఇలాగైతే షోను నెట్టుకురావడం కష్టమేనని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తోంది. మరోవైపు హౌస్‌లో యథాతథంగా నామినేషన్స్ జరిగాయి. ఇందుకు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది.గాలి తీసేసిన నైనికఇందులో పృథ్వీ, సోనియా.. నైనికపై చెత్త వేసి నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నైనిక.. నాకు మీరిప్పుడు కాంపిటీషనే అనిపించట్లేదని సోనియా గాలి తీసేసింది. అటు యష్మి కూడా.. నిఖిల్, అభయ్, పథ్వీ మీద చూపించిన ఇంట్రస్ట్ క్లాన్లో చూపించలేదు అని సోనియాను ఏకిపారేసింది.ఫుల్ టార్గెట్ నువ్వేతనకైతే మణికంఠ డేంజర్‌గా అనిపిస్తున్నాడని, హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడినే నామినేట్ చేస్తానంది యష్మి. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య కూడా బాగానే ఫైట్ నడిచినట్లుంది. ఒకరిపై మరొకరు చెత్త గుమ్మరించి నామినేట్ చేసుకుంటూ బ్రెయిన్లెస్ పీపుల్, యూజ్లెస్ పీపుల్ అని తిట్టుకున్నారు.నామినేషన్లో ఎవరున్నారంటే?చివర్లో నబీల్.. అరుస్తే గెలుస్తామంటే నేను అందరికంటే ఎక్కువ అరవగలను అని ప్రేరణకు కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక, నాగమణికంఠతో పాటు చీఫ్ అభయ్ నామినేషన్లో ఉన్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అర్ధరాత్రి బిగ్‌బాస్ వార్నింగ్.. సోనియా కాళ్లు మొక్కిన విష్ణుప్రియ
నేను మరీ అంత చెడ్డోడిని కాదంటూనే తన సైకోయిజాన్ని చూపిస్తున్నాడు బిగ్‌బాస్. కెరటం టీమ్(నిఖిల్, మణికంఠ) ఆకలేస్తుందని అర్ధరాత్రి దొంగల్లా దోసెలు తిన్నందుకు అందరినీ నిద్రలేపి మరీ క్లాసు పీకాడు. ఇంకోసారి ఇలా ఫుడ్ తింటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు లూజర్ అని సోనియాతో మాటలు పడ్డ నిఖిల్ తన సత్తా చూపించాడు. ఓడిపోయేవాళ్లంటేనే గిట్టదన్న సోనియా ఒక్క గేమ్‌లో కూడా గెలవలేదు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ఈ సీజన్లో అంతులేనంత డబ్బు ప్రైజ్‌మనీగా సంపాదించుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. తాను ఇచ్చే ఛాలెంజ్‌లలో మూడు టీమ్స్ పాల్గొని డబ్బు సంపాదించుకోవాలన్నాడు. ఏ టీమ్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అది ప్రైజ్‌మనీలో యాడ్ అవుతుందన్నాడు. మొదటి ఛాలెంజ్‌లో మణి, విష్ణుప్రియ, సోనియాను స్విమ్మింగ్ పూల్‌లో దూకాలన్నాడు. సోనియా మధ్యలోనే కిందపడిపోగా మణికంఠను పృథ్వీ ముందుకు వెళ్లనీయకుండా గట్టిగా పట్టేసుకోవడంతో అతడు వెనకబడిపోయాడు. విష్ణు మొదటగా దూకేసి తన అంతులేని వీరుల టీమ్ ఖాతాలో రూ.25 వేలు పడేలా చేసింది.ఎగిసిపడ్డ కెరటంబిగ్బాస్.. రెండో ఛాలెంజ్ విలువను రూ.50 వేలుగా ప్రకటించాడు. ఈ కలర్ బాల్స్ గేమ్‌లో పృథ్వీ, నబీల్, నిఖిల్ హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ గెలవడంతో కెరటం టీమ్ ఖాతాలో అర లక్ష పడింది. మూడో ఛాలెంజ్ విలువను రూ.70 వేలుగా ప్రకటించాడు. ఈ స్పెల్లింగ్ గేమ్‌లో యష్మి, మణికంఠ, నైనిక పాల్గొన్నారు. ఇందులో ఎక్కువ పదాలు కరెక్ట్‌గా రాసిన మణికంఠ కెరటం టీమ్ ఖాతాలో రూ.70 వేలు పడేలా చేశాడు.ఆకలితో అలమటించిన నిఖిల్రేషన్ లేకపోవడంతో కేవలం రాగిజావతో సరిపెట్టుకుంటున్న మణి, నిఖిల్ అర్ధరాత్రి ఆకలేసింది. దీంతో దొంగచాటుగా పక్క టీమ్ చేసుకున్న దోశలు ఆరగించారు. ఇది చూసిన బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందర్నీ నిద్రలో నుంచి లేపి మరీ వార్నింగ్ ఇచ్చాడు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుర్తుచేశాడు. ఇంట్లో ఫుడ్ దొంగతనం మొదలుపెట్టిన యష్మికి.. తమ పాలప్యాకెట్ అవతలివారు ఎత్తుకుపోయేసరికి ఉక్రోశం పట్టలేకపోయింది. విష్ణుప్రియతో గొడవకు దిగింది. దబాయించిన యష్మిమా చికెన్ దొంగిలించలేదా? అని విష్ణు ఎదురుతిరిగితే.. నీ దగ్గర సాక్ష్యం ఉందా? అని దబాయించింది. ఎందుకు అరుస్తున్నావంటే నేనిలాగే అరుస్తానని యష్మి తెగేసి చెప్పింది. నాలుగో ఛాలెంజ్ విలువ ఏకంగా రూ.1,50,000గా ప్రకటించాడు. ఈ గేమ్‌లో అభయ్, ఆదిత్య, నిఖిల్ పోటీపడ్డారు. ఆదిత్య ఓడిపోగా.. అభయ్(అఖండ టీమ్), నిఖిల్(కెరటం టీమ్) గెలిచి చెరో రూ.75 వేలు గెలుచుకున్నారు. ఐదో ఛాలెంజ్ విలువను రూ.50 వేలుగా ప్రకటించాడు. నిఖిల్, నబీల్, పృథ్వీ వ్యాక్స్ చేయించుకోవాలన్నాడు. కాళ్లు మొక్కిన విష్ణుప్రియఅయితే ఆ నొప్పి భరించలేక తన వల్లకాదని పృథ్వీ మధ్యలోనే చేతులెత్తేశాడు. సోనియా.. నబీల్ (అంతులేని వీరులు టీమ్)ను విజేతగా ప్రకటించడంతో ఆనందం పట్టలేకపోయిన విష్ణుప్రియ ఏకంగా ఆమె కాళ్లకు నమస్కరించింది. ఆరో ఛాలెంజ్ విలువ బిగ్‌బాస్ రూ.1 లక్షగా ప్రకటించాడు. చివరి బజర్ వరకు కాళ్లకు సాక్స్ ఉండేలా చూసుకోవాలన్నాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నబీల్, అభయ్, పృథ్వీ పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో సంచాలకురాలు ప్రేరణ అందరిమీద గరమైంది. ఈ తోసుకోవడాలు, కొట్టుకోవడాలు ఆపండని అరిచింది.బిగ్‌బాస్ నుంచే వెళ్లిపోతా..పాపం, తన మాటల్ని ఎవరూ లెక్క చేయలేదు. పృథ్వీ తర్వాత విష్ణుప్రియ అవుట్ అయింది. అయితే అభయ్ నెట్టడం వల్లే తాను కిందపడ్డానని విష్ణుప్రియ, అది నిజమైతే బిగ్‌బాస్ హౌస్ నుంచే వెళ్లిపోతానని అభయ్ వాదించాడు. కాసేపటికి విష్ణుప్రియను మళ్లీ ఆడించినా చివరికి అవుట్ అయింది. అనంతరం నబీల్ను కూడా ఎలిమినేట్ చేయడంతో అతడు గరమయ్యాడు. చివర్లో నిఖిల్, అభయ్కు టై అయినట్లు ప్రకటించడంతో ఇరు టీమ్స్‌కు చెరి రూ.50 వేలు లభించాయి. ఫైనల్‌గా రూ.2,45,000తో కెరటం టీమ్ లీడ్‌లో ఉంది.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ వారం నామినేషన్స్‌లో ఎనిమిదిమంది.. ఎవరెవరంటే?
బిగ్‌బాస్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. ఫస్ట్ వీక్‌లోనే కంటెస్టెంట్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఎవరికి ఏయే కళల్లో ప్రావీణ్యం ఉందో బయటపెట్టారు. ఒక్క టాస్కుల్లోనే ఇంకా అందరి బలం బయటపడలేదు. ఫస్ట్ వీక్ బేబక్క ఎలిమినేషన్‌తో హౌస్ కాస్త నిశ్శబ్ధంగా మారింది. ఈ సైలైన్స్ నాకు నచ్చదన్నట్లుగా బిగ్‌బాస్ వెంటనే రెండోవారం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు. ఆ హక్కు లేదుఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నామన్నట్లుగా కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదలైంది. బయట ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్షిప్ను మీరు ఇంట్లో ఫాలో అవండి, కానీ పక్కవాళ్లు కూడా ఫాలో అవాలని చెప్పే హక్కు నీకు లేదంటూ ప్రేరణను నామినేట్ చేసింది సీత.మెచ్యూరిటీ రావాలి!ఈ సమయంలో వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. సోనియా.. నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉంది, నీకింకా మెచ్యూరిటీ రావాలని సూక్తులు చెప్పడంతో సీతకు మండిపోయింది. నాకెంత క్లారిటీ ఉందో నాకు తెలుసు, ముందు నువ్వు గేమ్‌ను అర్థం చేసుకుని నాకు వివరించు, అసలు నీకు క్లారిటీ లేదు.. అని ఇచ్చిపడేసింది. నామినేషన్లో..దీంతో సోనియా.. ఎక్కువ మాట్లాడొద్దు, పిచ్చి మాటలు మాట్లాడకు అని సీరియస్ అయింది. మొత్తానికి ఈ వారం నిఖిల్, నైనిక, సీత, మణికంఠ, శేఖర్ బాషా, ఆదిత్య, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
నిఖిల్‌కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు.. విష్ణుప్రియకు ఘోర అవమానం!
నామినేషన్స్‌లో ఉండటంతో నాగమణికంఠ సైలెంట్ అయిపోయాడు. బోలాగా మాట్లాడే విష్ణుప్రియను టీమ్‌లోకి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. యష్మి తనను నమ్మినందుకు అభయ్.. ఆమెను గెలిపించాడు.. ఇలాంటి ఎన్నో సంగతులను నేటి (సెప్టెంబర్ 5)ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫేస్‌వాష్‌తో బ్రషింగ్!నామినేషన్స్ రోజు మొదలుపెట్టిన ఏడుపును మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్ భయం పట్టుకుందో, ఏమో కానీ ఓరకమైన శూన్యంలోకి వెళ్లిపోయాడు. తన జీవితం ఏమవుతుందో తెలియడం లేదంటూ మళ్లీ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు బాత్రూమ్లో పృథ్వీ తనకు తెలియకుండా చేసిన పనితో అందరినీ నవ్వించాడు. టూత్‌పేస్ట్ అనుకుని అతడు తన బ్రష్‌కు ఫేస్‌వాష్ క్రీమ్ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు.చీఫ్‌లకు టీమ్స్ఇక నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ దానికింకా టైముందన్నట్లు ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. పైగా అబ్బాయి పేర్లు గెస్ చేయనా అంటుంటే కూడా వద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇంతలో బిగ్‌బాస్ ముగ్గురు చీఫ్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. రాజుకు సైన్యం ఉన్నట్లే చీఫ్‌లకు క్లాన్ ఉండాలని, అది వారే నిర్మించుకోవాలని చెప్పాడు. ఆ ముగ్గురూ చెరొకరిని..చీఫ్ అవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన బాషా, బేబక్క, అఫ్రిదిలకు మాత్రం ఏ చీఫ్ కింద చేరాలనేది సొంతంగా నిర్ణయించుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో బాషా.. యష్మిని, బేబక్క.. నిఖిల్‌ను, అఫ్రిది.. నైనికను సెలక్ట్ చేసుకున్నారు. మిగతా ఇంటిసభ్యుల్లో ఎవరు ఎవరికి కావాలనేది చీఫ్‌లు నిర్ణయించుకోవాలన్నాడు. ప్రేరణ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ కోరారు. అయితే ప్రేరణ.. యష్మి టీమ్‌లోకి వెళ్లడానికే మొగ్గు చూపుంది. నిఖిల్ టీమ్‌లో మణికంఠఅలాగే అభయ్ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే యష్మి టీమ్‌కు బలం కావాలని కోరిందని, దాన్ని నెరవేర్చేందుకు ఆమె టీమ్‌లోకి అడుగుపెడుతున్నానన్నాడు అభయ్. నాగమణికంఠకు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు నిఖిల్. పృథ్వీ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే పృథ్వీ యష్మిని ఎంపిక చేసుకోవడం గమనార్హం.విష్ణుప్రియ వంతు వచ్చేసరికి..చీఫ్ నైనిక.. తన నిర్ణయాలు బాగుంటాయంటూ ఆదిత్యను, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ సీతను తన టీమ్‌లో చేర్చుకుంది. విష్ణుప్రియ పేరెత్తేసరికి ఎవరూ తనను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని క్షణాల తర్వాత నైనిక.. విష్ణుప్రియను తీసుకుంది. యష్మి, నైనిక టీమ్‌లో నలుగురు చొప్పున ఉండటంతో సోనియాకు ఇంకో ఆప్షన్ లేక నిఖిల్ టీమ్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె.. నిఖిల్లో నాయకత్వ లక్షణాలున్నాయి, ఈ ఆడపులి నీ టీమ్‌లో ఉంటే విజయం తథ్యమన్నట్లుగా తనకు తానే డప్పు కొట్టుకుంది.నిఖిల్ ఎమోషనల్కాసేపటి తర్వాత తననెందుకు సెలక్ట్ చేసుకోలేదని విష్ణుప్రియ వెళ్లి నిలదీయడంతో నిఖిల్ ఎమోషనలయ్యాడు. తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవ్వరూ తీసుకోరు, అందుకే అతడిని చేర్చుకున్నాను.. నిన్నెవరైనా తీసుకుంటారనే ఊరుకున్నట్లు పేర్కొన్నాడు.వింత అలవాటుపృథ్వీ ఊరికనే కప్పు కూర తినే అలవాటు చూసి బేబక్క షాక్ అయింది. అలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ.. తన టవల్‌ను ఆదిత్య చూసుకోకుండా వాడేశాడంటూ తెగ ఫ్రస్టేట్ అయింది. చూసుకోలేదు, తప్పయిపోయిందంటూ ఆదిత్య పదిసార్లు క్షమాపణ చెప్పినా ఆమె మాత్రం అదే పాఠం అప్పజెబుతూనే ఉంది. దీంతో ఈ గోడు వినలేక బిగ్‌బాస్ తనకు కొత్త టవల్ పంపించాడు. బాత్రూమ్ను క్లీన్‌గా ఉంచడం లేదంటూ యష్మి, ప్రేరణ, సోనియా కాసేపు వాదులాడుకున్నారు.మాట మీద నిలబడ్డాడుగేమ్ విషయానికి వస్తే.. యష్మి, నైనిక టీమ్స్‌లో నలుగురు చొప్పున ఉండటంతో ఈ రెండు టీమ్‌లకు బాల్ పట్టు- గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో నైనిక టీమ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. యష్మి టీమ్‌లో అభయ్.. ఒక గోల్ చేయడంతో వీరి టీమ్ గెలుపొందింది. గెలిచిన యష్మి టీమ్.. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీమ్‌లో నుంచి ఒకరిని లాక్కునే ఛాన్స్ ఉంది. అయితే వాళ్లు సోనియాను లాక్కున్నారని తెలుస్తోంది. ఇలాగైతే నిఖిల్ టీమ్‌లో ఇద్దరు మాత్రమే మిగులుతారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర గౌరవం కావాలి: మణి
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో మొదటివారం నామినేషన్ ప్రక్రియలోనే కన్నీళ్ల వరద పారింది. తాను ఏడుస్తూ పక్కవాళ్లను కూడా ఏడిపించాడు మణికంఠ. అసలేం జరిగిందో, నేటి(సెప్టెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి..పని చేయట్లేదంటూ..ఆదిత్య ఓం.. వాలంటీర్‌గా పనులు చేయడం లేదని శేఖర్ బాషాను, తక్కువ పని చేస్తున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ ఇద్దరిలో చీఫ్ యష్మి.. శేఖర్ బాషా నామినేషన్‌కు మద్దతిచ్చి పృథ్వీని సేవ్ చేసింది. సీత.. బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. వీరిలో బేబక్క నామినేషన్‌ను చీఫ్ నైనిక ఫైనల్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. తర్వాత విష్ణుప్రియ.. బాషా, సోనియాను నామినేట్ చేయగా చీఫ్ నిఖిల్ బాషా నామినేషన్నే ఫైనలైజ్ చేసి సోనియాను సేవ్ చేశాడు. అన్‌ఫిట్ అయితే పోతా..అనంతరం అభయ్ నవీన్.. నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఎవ్వరి ఫ్లాష్‌బ్యాక్ ఎవడికీ అవసరం లేదు. నీకు ఎన్ని సమస్యలున్నా నాకనవసరం. గేమ్‌లో నాకేదైనా నచ్చలేదంటే చెప్పే హక్కు నాకుంది. ఈ గేమ్‌లో ఏం జరిగినా తీసుకోవడానికి రెడీ అనుకునేవాళ్లే హౌస్‌లో ఉండాలి. నీలో ఆ లక్షణం లేదని తేల్చాడు. దీంతో నాగమణికంఠ.. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే వెళ్లిపోతానని ఫ్రస్టేట్ అయ్యాడు. అనంతరం అభయ్.. బేబక్కను నామినేట్ చేశాడు. పుండు మీద కారం చల్లినట్లు చీఫ్ యష్మి.. నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది.మళ్లీ బాధలు చెప్పుకున్న మణితర్వాత ప్రేరణ.. నాగమణికంఠ పేరెత్తడంతో అందరూ నాపై ఇలా పడ్డారేంటని బోరుమని ఏడ్చేశాడు. ఏడో తరగతి నుంచి నానాకష్టాలు పడ్డాను. కన్నతండ్రిని పోగొట్టుకున్నా, సవతి తండ్రి చేతిలో అవమానాలు ఎదుర్కొన్నా. అమ్మ చనిపోతే అందరి దగ్గర డబ్బు అడుక్కుని అంత్యక్రియలు చేశాను. నాకు అందరి మీదా నమ్మకం పోయింది. నా కూతురు దూరమైన సమయంలో, చచ్చిపోదామనుకుంటున్న క్షణంలో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు చాలా అవసరం. అది మీకెవరికీ అర్థం కావడం లేదు. నేనెక్కడా విక్టిమ్ కార్డ్ వాడటం లేదు.నా జీవితం దగ్గరుండి చూశారా? నా కర్మ కాలి మొదటి రోజు నిజంగా ఎలిమినేట్ చేస్తున్నారన్న బాధలో మీకు నా గురించి తెలీదు, నేను వెళ్లిపోతున్నానంటూ కోప్పడ్డాను. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని పదేపదే నా మీద పడుతున్నారు. మీరేమైనా నా జీవితం చూశారా? అని అందరినీ నిలదీస్తూనే.. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు. మిమ్మల్ని ఏమైనా అనుంటే సారీ.. అని అపరిచితుడిలో రాములా మారిపోయాడు.ఏడిపించేసిన మణినేను గేమ్ గెలవాలనుకున్నాను. కనీసం ఐదు వారాలైనా ఉండాలనుకున్నానంటూ ఏడుస్తూనే మాట్లాడాడు. నాగమణికంఠ పడ్డ బాధలు విన్నాక అతడి కంటే కూడా యష్మినే ఎక్కువ గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ప్రేరణ.. సోనియాను నామినేట్ చేసింది. ఇద్దరికి చెప్పిన కారణాలు విన్నాక చీఫ్.. నాగమణికంఠను సేవ్ చేసి సోనియాను నామినేట్ చేశాడు.అందుకే తిరిగావా?నాగమణికంఠ.. నేను క్యూట్‌గా ఉన్నాను, నాలో ఫెమినిజం ఉందని విష్ణుప్రియ చెప్పిన మాట నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. పైగా విష్ఱుప్రియ ఏమైనా పదాలు జారుతుందేమోనని మూడురోజులుగా తనతో తిరుగుతున్నానని చెప్పాడు. అంటే ఇన్నిరోజులు ఫ్రెండ్‌గా ఉండలేదా? నన్ను చెక్ చేస్తున్నావా? అని విష్ణుప్రియ ఎమోషనలైంది.సింపతీ కార్డ్అనంతరం బాషాను నామినేట్ చేస్తూ తినే పండ్లతో ఆడటం నచ్చలేదన్నాడు. అలాగైతే నువ్వు నిద్రపోతే కుక్క మొరిగిందిగా, అది తప్పు కాదా అని బాషా కౌంటరిచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఫ్లాష్‌బ్యాక్ ఉంది, అందరూ అది చెప్పుకుని ఏడవట్లేదు.. నువ్వు ఏదో సింపతీ, రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చిపడేశాడు. ఈ వాదనలు విన్న చీఫ్ యష్మి.. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ బాషాను సేవ్ చేశాడు.నామినేషన్లో ఎవరంటే?తర్వాత పృథ్వీ.. నీకు సీరియస్‌నెస్ లేదంటూ బేబక్కను, సింపతీ కార్డ్ వాడుతున్నావు, రెండు నాలుకలు ఉన్నాయంటూ నాగమణికంఠను నామినేట్ చేశాడు. మొత్తంగా మొదటివారం బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణికంఠలు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కూడా మణికంఠ ఏడుపు ఆపలేదు. నా చివరి యుద్ధండ్యాం గేట్లు ఎత్తినట్లు ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. నాకు ఏ దిక్కూ లేదు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, రేపు నేను బయటకు వెళ్లాక నన్ను నెగెటివ్ అనుకుంటారు. ఇది నా చివరి యుద్ధం. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటూనే విగ్ నేలకేసి కొట్టాడు. దీంతో నిఖిల్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.నా భార్య నాక్కావాలిఅతడు కన్నీళ్ల టాప్‌ను కట్టేయకపోవడంతో బిగ్‌బాస్ నను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అక్కడ.. నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర నాకు గౌరవం కావాలి. నా సవతి తండ్రి నాక్కావాలి. నా పాప నాకు కావాలి. నాకు మనుషులు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను.. నాపై నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నా మైండ్ సెట్ మార్చుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కావట్లేదంటూ మళ్లీ విలపించాడు. దీంతో బిగ్‌బాస్.. నిన్ను నువ్వు నమ్ము, ధైర్యాన్ని కోల్పోకు అని నాలుగు మంచి మాటలు చెప్పి పంపించేశాడు.మరిన్నిబిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8లోకి హీరోయిన్ రష్మిక బెస్ట్ ఫ్రెండ్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
Bigg Boss 8: నాలుగో కంటెస్టెంట్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్
కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌తో నటి ప్రేరణ కంభం ఎక్కువ పాపులర్ అయింది. ఇందులో అమాయకంగా కనిపించే ప్రేరణ క్యూట్ యాక్టింగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఈ ధారావాహికలో కృష్ణగా ప్రేరణ, ముకుందగా యష్మి గౌడ నటించారు. సీరియల్లో మురారి కోసం కొట్టుకున్నట్లే బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వీరిద్దరు టైటిల్ కోసం పోటీపడటం ఖాయంగా కనిపిస్తోంది. బయట అన్నిరకాల స్పోర్ట్స్ ఆడతానంటున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌లో ఏం గేమ్ ఆడుతుందో చూడాలి. అలాగే తన గురించి తనకేం బాధ లేదని, కానీ, తనతో పోటీపడే కంటెస్టెంట్ల పరిస్థితి ఎలాగోనంటూ బాధపడుతోంది ప్రేరణ. రష్మిక మందన్నాకు ఈమె క్లోజ్ ఫ్రెండ్ కూడా! పెళ్లయి ఎనిమిది నెలలే అవుతున్న ఈ బ్యూటీ భర్తను వదిలేసి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మరి ఇక్కడ కూడా అల్లరిపిల్లగా, చలాకీగా ఉంటుందా? తన గేమ్ ఎలా ఉంటుందో చూడాలి!