బిగ్ బాస్ 8వ సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది.
14 మంది హౌస్‌మేట్స్ జంటలుగా హౌసులోకి అడుగుపెట్టారు.
వీళ్లలో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు.
మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే ప్రేరణ కంభం అందరి దృష్టిని ఆకర్షించింది.
కన్నడ అమ్మాయి అయిన ఈమె.. 'కృష్ణ ముకుందా మురారీ' సీరియల్తో మన దగ్గర పాపులర్ అయింది.
ఇకపోతే స్టార్ హీరోయిన్ రష్మిక తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ప్రేరణ షాకిచ్చింది.
మోడలింగ్ చేసే టైంలో రష్మిక-ప్రేరణ రూమ్మేట్స్‌గా ఉండేవాళ్లు.
అర్థరాత్రి టైంలో స్కూటీపై రష్మిక తాను కలిసి తిరిగిన రోజులు కూడా ఉన్నాయని చెప్పింది.
ఈ ఏడాది మొదట్లో శ్రీపాద్ అనే కుర్రాడిని ప్రేరణ పెళ్లి చేసుకుంది.
ఈమెని చూస్తుంటే వాగుడుకాయలా అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపిస్తోంది.
అలానే గ్లామర్ పరంగానూ ఏ మాత్రం లోటు చేయదేమో అని కూడా అనిపిస్తోంది.


