తేజకు దారుణమైన పనిష్మెంట్‌.. త్యాగానికి రోహిణి రెడీ! | Bigg Boss Telugu 8, Nov 9th Full Episode Review: Tasty Teja Selected as Worst Player of BB | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: తేజ షోకి వచ్చిందే అందుకోసం.. అది దక్కకుండా చేశారు! రోహిణికి ప్రేరణ వెన్నుపోటు!

Nov 9 2024 11:46 PM | Updated on Nov 10 2024 10:10 AM

Bigg Boss Telugu 8, Nov 9th Full Episode Review: Tasty Teja Selected as Worst Player of BB

టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్‌ షీల్డ్‌ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్‌ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్‌మేట్స్‌ వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్‌ (నవంబర్‌ 9) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

సిగ్గు లేకుండా..
మెగా చీఫ్‌ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్‌లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్‌ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్‌పై ఫైర్‌ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్‌బాస్‌కు మాటిచ్చిన నబీల్‌.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.

తేజకు శిక్ష
ఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్‌ షీల్డ్‌ గేమ్‌ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్‌ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్‌ కంటెండర్‌వి కాలేవని శిక్ష విధించాడు.

ఎవిక్షన్‌ షీల్డ్‌ ఎవరికివ్వాలో డిసైడ్‌ చేసిన ప్రేరణ
ఇక ఎవిక్షన్‌ షీల్డ్‌ రేసులో మిగిలిన రోహిణి, నబీల్‌, నిఖిల్‌లలో ఎవరికి ఆ షీల్డ్‌ ఇవ్వాలో హౌస్‌మేట్స్‌ డిసైడ్‌ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్‌ చేయగా నిఖిల్‌కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్‌ చేశారు. నబీల్‌కు గౌతమ్‌, యష్మి, అవినాష్‌ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్‌ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్‌కు సపోర్ట్‌ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్‌ షీల్డ్‌ అందుకున్నాడు.

అంతరాత్మపై ఒట్టేసి..
అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్‌లో వరస్ట్‌ ప్లేయర్‌ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్‌.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్‌ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. నిఖిల్‌.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్‌ ప్లేయర్‌ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్‌, తేజ.. పృథ్వీని, అవినాష్‌.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్‌ అని పేర్కొన్నారు. 

తేజకు కోలుకోలేని దెబ్బ
ప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్‌ ప్లేయర్‌ అని తెలిపింది. వరస్ట్‌ హౌస్‌మేట్స్‌ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్‌లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్‌ బాంబు పేల్చాడు. ఈ సీజన్‌లో తేజను వరస్ట్‌ ప్లేయర్‌గా డిసైడ్‌ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్‌కు వచ్చాను సర్‌ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.

గంగవ్వ ఎలిమినేట్‌
దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్‌బాస్‌ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్‌ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్‌ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement