బిగ్‌బాస్ చరిత్రలో సంచలనం.. ఇలా కూడా జరుగుతుందా? | Bigg Boss Malayalam Neha Fathima Love And Parents Entry Issue | Sakshi
Sakshi News home page

Bigg Boss Neha Fathima: ఒక్క ప్రేమకథ.. ఎంత పనిచేసింది

Nov 2 2026 12:52 PM | Updated on Nov 2 2026 1:04 PM

Bigg Boss Malayalam Neha Fathima Love And Parents Entry Issue

బిగ్‌బాస్ షోలో పుట్టేది నిజమైనా ప్రేమ? కాదా అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే షో హైప్ కోసం ప్రేమికుల్లా నటిస్తుంటారు. కొందరు మాత్రం నిజంగానే తోటి కంటెస్టెంట్‌తో ప్రేమలో పడుతుంటారు. మలయాళ బిగ్‌బాస్ లేటెస్ట్ సీజన్‌లోనూ ఇలాంటిది ఒకటి జరిగింది. అయితే ఈ సీన్‌లోకి సదరు అమ్మాయి తరఫు తల్లిదండ్రులు రావడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. అసలు ఈ ప్రేమకథ సంగతేంటి? చివరకు ఏం జరిగింది?

(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?)

మలయాళంలో ప్రస్తుతం బిగ్‌బాస్ 8వ సీజన్ ప్రసారమవుతోంది. దీనికి హీరో మోహన్ లాల్ హోస్ట్. ఈ షోలో ప్రస్తుతం ఆడుతున్న నేహా ఫాతిమా అనే అమ్మాయి.. సంతోష్ రాజ్(తషి) అనే మరో కంటెస్టెంట్‌ని షోలోనే ప్రపోజ్ చేసింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుందామని చెప్పుకొచ్చింది. సాధారణంగా ఈ షో అంటేనే ఇలాంటి ట్రాక్స్ కామన్. వాటినే ఎక్కువగా హైలైట్ చేస్తుంటారు. అలా నేహా-సంతోష్ ప్రేమని మలయాళ బిగ్‌బాస్ నిర్వాహకాలు ఆసక్తికరంగా మలుస్తూ షోను నడిపిస్తున్నారు. చెప్పాలంటే షో మొత్తం వీరిద్దరి ప్రేమ వ్యవహారం చుట్టూనే తిరుగుతోంది.

అయితే లైవ్‌లో ఇదంతా గమనించిన నేహా ఫాతిమా తల్లిదండ్రులు.. నేరుగా బిగ్‌బాస్ షోకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని మరీ తమ కూతురిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు కుమార్తె, మధ్యలో ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఇలా మంచి ఎమోషన్లతో సదరు ఎపిసోడ్‌ని మోహన్‌లాల్ నడిపించాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇదంతా నిజంగా జరిగిందా? లేదంటే వైరల్ అయ్యేందుకు చేసిన స్కిప్టా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. మరోవైపు సంతోష్ రాజ్ హిందువు కావడం వల్లే నేహా తల్లిదండ్రులు ఈ ప్రేమని వ్యతిరేకించి, ఆమెను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఇంతవరకు బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ లవ్ స్టోరీస్ ఉన్నప్పటికీ అవి స్క్రిప్టెడ్‌గానే ఉండేవి. కాబట్టి ఆడియెన్స్ కూడా సదరు జంటల్ని చూసి లైట్ తీసుకునేవారు. కానీ ఇలా తల్లిదండ్రులే వచ్చి స్వయంగా కూతుర్ని తీసుకెళ్లిపోవడం మాత్రం బహుశా ఇదే తొలిసారేమో!

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? పారితోషికం ఎంత?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement