రూమర్స్ వచ్చినట్లే బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. షోలో ఇదంతా ప్రసారం కాకముందే రోహిత్ తన ఇన్ స్టాలో ఈ సంగతి బయటపెట్టాడు. టాప్ కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయిన ఇతడు.. ఇలా మధ్యలో ఎలిమినేట్ కావడానికి కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత సంపాదించాడు?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఝాన్సీకి దక్కిన రెమ్యునరేషన్ ఎంత?)
ఈసారి అగ్నిపరీక్ష పోటీలో జడ్జిలని మెప్పించి హౌస్‌లోకి వచ్చిన రోహిత్‌కి ప్రారంభంలో హైప్ లభించింది. సెలబ్రిటీలు కూడా ఇతడినే టార్గెట్ చేస్తూ నామినేషన్లు చేశారు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నట్లు సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. తీరా చూస్తే బలమైన కంటెస్టెంట్, విన్నర్ అవుతాడనే కామెంట్స్ సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. హౌస్‌లో గొడవలతో ఎప్పటికప్పుడు బాగానే కనిపించేవాడు గానీ గేమ్స్ పరంగా బాగా నిరాశపరిచాడు.
రోహిత్ ఎలిమినేట్ కావడానికి ఒకటి కాదు, చాలా కారణాలే కలిసి పనిచేశాయని ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు. హౌస్‌లో గేమ్స్‌లో సరిగా ఆడకపోవడం.. ఓవర్ యాటిట్యూడ్ చూపించడం.. నోరు జారడంతో పాటు తోటీ కంటెస్టెంట్స్‌ని దూషించడం.. బిగ్ బాస్-హోస్ట్ నాగార్జున ప్రతి వారం వార్నింగ్ ఇచ్చినా మారకపోవడం.. షాలినితో గేమ్‌కి మించి క్లోజ్ అవ్వడం.. త్రిగుణ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి తన గేమ్ మర్చిపోవడం లాంటి కారణాలు ఇలా రోహిత్‌ని మధ్యలోనే బయటకు తీసుకొచ్చేశాయి.
అయితే వారానికి రూ.70 వేలు చొప్పున ఎనిమిది వారాలకుగానూ రూ.5.60 లక్షలతో పాటు అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకు రూ.50 వేలు మొత్తంగా రూ.6.10 వేలు ఇతడికి పారితోషికంగా దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఎలిమినేషన్ టైంలో రోహిత్ ఏవీ వేయకపోవడంతో రీఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?)


