విక్టరీ వెంకటేశ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో నడుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఇందులో వాడిన ‘జిమ్ జిమ్‌తార’ పాటపై సింగర్ లక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనుమతి లేకుండానే
తన అనుమతి లేకుండానే ఈ పాటను సినిమాలో ఉపయోగించారని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 10 సెకన్ల పాటను అయినా ఎవరి అనుమతితో సినిమాలో పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో తనకు కానీ, ‘పర్ణశాల’ సినిమా బృందానికి కానీ డబ్బులు చెల్లించారా? అని నిలదీశారు. అంతేకాకుండా వెంటనే సినిమాలోని ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. పల్లెటూళ్లలో పిచ్చోళ్లు ఎవరూ లేరని పేర్కొన్నారు. దీంతో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో పాట వినియోగంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Jim Jim thara original singer Lakshmi accuses Aadarsha Kutumbam music director of using that song in background with out taking rights. https://t.co/dBwmhV7dTI
— idlebrain jeevi (@idlebrainjeevi) November 1, 2026


