అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేశారట.
నవంబర్ ఫస్ట్ వీక్‌లో
సినిమా మొత్తానికే హైలేట్‌గా నిలిచే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను నవంబర్ ఫస్ట్ వీక్‌లోనే చిత్రీకరించేందుకు సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఇప్పటివరకు వచ్చిన బన్నీ సినిమాలకు పూర్తి భిన్నంగా, అత్యంత సహజంగా, ఉండేలా ఈ ఇంటర్వెల్ ఫైట్‌ను మేకర్స్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే తెరపై అల్లు అర్జున్ చేసే స్టంట్స్ మంచి అనుభూతిని అందించడం ఖాయమని అభిమానులు సంబర పడుతున్నారు.
కాగా ఈ సినిమాని ఈ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఉండగానే త్రిగుణ్ కొత్త సినిమా అప్‌డేట్


