రజినీకాంత్ జైలర్-2.. అలా జరిగితే తొలి తమిళ చిత్రంగా..! | Rajinikanth Jailer 2 Movie collections In just 17 days | Sakshi
Sakshi News home page

Jailer 2 Movie: రజినీకాంత్ జైలర్-2.. అలా జరిగితే తొలి తమిళ చిత్రంగా..!

Nov 1 2026 6:26 PM | Updated on Nov 1 2026 6:26 PM

Rajinikanth Jailer 2 Movie collections In just 17 days

రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్-2(Jailer 2) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జైలర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. మూడో వారంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజైన 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.790.85 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది.

ఈ మూవీ 17వ రోజు సైతం భారీగా వసూళ్లు కలెక్ట్ చేసింది. శనివారం ఒక్కరోజే రూ.9.35 కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ వీకెండ్‌లో తమిళంలో రూ.6.70 కోట్లు, హిందీలో రూ.1.45 కోట్లు, తెలుగులో రూ.90 లక్షలు, కన్నడ వర్షన్‌లో రూ.30 లక్షలు వసూలు చేసింది.

దేశవ్యాప్తంగా చూస్తే రూ.520.35 కోట్ల గ్రాస్‌ వసూళ్ల రాగా.. రూ.444.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రాబోయే రోజుల్లో ఇదే జరిగితే త్వరలోనే రూ.1000 కోట్ల వసూళ్ల మార్కు చేరుకోనేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌  బ్యానర్‌లో నిర్మించారు. ఈ మూవీలో ఎస్‌జే సూర్య, మిథున్‌ చక్రవర్తి, విద్యాబాలన్‌ కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement