బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది పెద్ది మూవీతో అలరించింది. ఈ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా మెప్పించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హలోవిన్ వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా తన మదర్ శ్రీదేవి లుక్‌ను రీ క్రియేట్ చేసింది. నగీనా' చిత్రంలోని శ్రీదేవి లుక్‌లో కనిపించి శ్రీదేవిని గుర్తుకు తెచ్చింది.
ఈ వేడుకలో జాన్వీ కపూర్‌తో పాటు ప్రియాంక చోప్రా పాల్గొంది. ప్రియాంక కింగ్ కైలీగా కనిపించగా.. ఆమె భర్త నిక్ జోన్ కౌబాయ్‌గా.. వారి కుమార్తె యువరాణిగా దెయ్యం లుక్‌లో కనిపించింది. ఈ హలోవిన్ వేడుకలో జాన్వీ కపూర్‌తో ఆమె పలువురు బాలీవుడ్ నటుడు కూడా పాల్గొన్నారు. జాన్వీ స్నేహితుడు వైష్ణవ్ ప్రవీణ్.. అమ్రిష్ పూరి పాత్రలో కనిపించాడు. కాగా.. ప్రియాంక చోప్రా ఈ హాలోవీన్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీపావళి, హాలోవీన్ దాదాపు ఒకే సమయంలో వస్తాయని తెలిపారు.


