బిగ్‌బాస్ షో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అశ్విని శ్రీ. తన అందంతో పాటు ఆటతోనూ రియాలి షోలో అదరగొట్టింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. 2వ వారం వరకు హౌస్‌లో కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. సోషల్ మీడియాలో డబ్స్‌మాష్, రీల్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న అశ్విని శ్రీ తెలుగులో పలు సినిమాల్లోనూ నటించారు. స్టార్ హీరోల చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలతో అలరించింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయేవాడి గురించి మనసు విప్పి మాట్లాడింది. నిన్ను చేసుకునేవాడు ఎలా ఉండాలని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బిగ్‌బాస్ బ్యూటీ స్పందించింది. తనకు కాబోయే భర్త గ్లామర్ ఎలా ఉన్న పర్లేదని తెలిపింది. వాడు నల్లగా ఉన్నా.. చండాలంగా ఉన్నా నాకు ఓకే.. కానీ మంచి మనసు ఉంటే చాలని తన మనసులో మాట చెప్పింది. నాకు అతని డబ్బులు కూడా అవసరం లేదని వెల్లడించింది.
తనకు ప్రస్తుతానికి బాయ్‌ఫ్రెండ్ లేడని.. చాలామంది ట్రై చేస్తున్నారని.. కానీ మనకు కూడా నచ్చాలి కదా అని వెల్లడించింది. ఈ రోజుల్లో అమ్మాయిలను వెంటపడని అబ్బాయిలు ఎవరు ఉంటారని తెలిపింది. నాలాంటి అందమైన అమ్మాయికి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందని పేర్కొంది. నన్ను బాగా చూసుకునే వాడు దొరికితే చాలని.. అతన్ని నేనే పోషిస్తానని అశ్విని శ్రీ చెబుతోంది. ఈ వీడియో పాతది కాగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


