అనసూయ డైరెక్టర్‌తో కంగనా.. రానా ప్లాన్ మామూలుగా లేదుగా! | Rana Daggubati Announces Horror Thriller Scary Picture With Kangana Ranaut, Ravi Babu To Direct, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Rana Daggubati - Scary Picture: రానా నిర్మాతగా కంగనా సినిమా.. టైటిల్‌ ఇదే..

Nov 1 2026 4:52 PM | Updated on Nov 1 2026 5:16 PM

Rana Daggubati Announces Horror Thriller Scary Picture With Kangana Ranaut, Ravi Babu To Direct

Rana Daggubati Horror Thriller With Kangana Ranaut And Ravi Babu

టాలీవుడ్ నటుడు, నిర్మాత దగ్గుబాటి రానా బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఓ హారర్ థ్రిల్లర్ సినిమాను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించనున్నారు. న్యూఢిల్లీలో హాలోవీన్ సందర్భంగా నిర్వహించిన ‘హారర్‌కాన్ ఇండియా 2026’ కార్యక్రమంలో రానా ఈ విషయాన్ని ప్రకటించారు.

కంగనాతో రవిబాబు హారర్ ప్రయోగం
‘స్కేరీ పిక్చర్’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కంగనా రనౌత్ కథానాయికగా నటించనున్నారు. తెలుగులో విలక్షణమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు ఈ సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నారు. రానా దగ్గుబాటి తన నిర్మాణ సంస్థలైన సురేశ్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు.

హారర్ సినిమాలకు కేరాఫ్ రవిబాబు
రవిబాబుకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను తెరకెక్కించడంలో ఆయనది భిన్నమైన శైలి. గతంలో ఆయన దర్శకత్వం వహించిన ‘అనసూయ’, ‘అవును’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ‘అదుగో’ సినిమాతో మరో ప్రయోగం చేశారు. ఇప్పుడు కంగనా రనౌత్‌తో కలిసి హిందీలో ఎలాంటి హారర్ కథను చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

ఇక కంగనా రనౌత్ కూడా రానా వెల్లడించిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ‘RC17’ పై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్‌ భార్య)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement