సూర్య ‘సీన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. | Hero Suriya Scene Movie Trailer Released | Sakshi
Sakshi News home page

SCENE Trailer: సూర్య ‘సీన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

Oct 31 2026 8:58 PM | Updated on Oct 31 2026 8:58 PM

Hero Suriya Scene Movie Trailer Released

హీరో సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్‌’. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్‌గా కనిపించనుంది. నస్లెన్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌, రాజ్‌ ప్రియన్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు. ఈ  సినిమాలో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరిసారి సూర్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించడంతో ఇంతటి ఆసక్తి నెలకొంది. కాగా ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో జ్యోతిక, సూర్యనే  నిర్మిస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు.

(ఇదీ చదవండి: కొద్ది రోజుల్లో కావ్య మారిన్‌తో పెళ్లి.. షాక్‌ ఇచ్చిన అనిరుధ్‌?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement