breaking news
Aadarsha Kutumbam Movie
-
‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో అప్డేట్
విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’(AK 47). ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి, నారా రోహిత్, నివేతా పేతురాజ్, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్‌ను ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్, శ్రీనిధి శెట్టి పాత్రలను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా యువినా పార్థవి క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో చిట్టిబాబుగా వెంకీ, స్వర్ణగా శ్రీనిధి నటిస్తున్నారు. చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది. ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి. కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
అదండీ ఆడదంటే.. నవ్వులు పూయిస్తున్న ‘ఏకే 47’ వీడియో
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’(AK 47). శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్, నారా రోహిత్, నివేతా పేతురాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే వెంకటేశ్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆయన చిట్టిబాబు అనే పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇక తాజాగా శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేశారు.‘ఇల్లాలే దేవత అని చెబుతూ.. ‘ఈ ఆడవాళ్లకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు. ఆదండి ఆడదంటే.. కనపడగానే పువ్వులాగా ఎలా నవ్వుతుందో చూడండి(పక్కింటి అమ్మాయిని చూపిస్తూ..). నా పెళ్లం ఉంది ఎందుకు..ఎప్పుడో పెళ్లి ఫోటోలో స్మైల్ ప్లీజ్ అంటే అప్పుడు నవ్వింది. మళ్లీ ఇప్పటిదాకా నవ్వలేదు. ఎప్పుడు మొహం ఇలా పెట్టుకుంటుంది’ అంటూ వెంకీ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో శ్రీనిధి..స్వర్ణగా నటిస్తోంది.‘చిట్టిబాబుకు భార్యగా, చిరునవ్వే చిరునామాగా ఉండే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకోనుంది. చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం, చిలిపి సంభాషణలు, అనురాగం, కుటుంబ విలువలు సినిమాకు మరింత ఆత్మను, ఆహ్లాదాన్ని అందించనున్నాయి’ అని మేకర్స్ తెలిపారు. -
'ఆదర్శ కుటుంబం' చిట్టిబాబు.. భలే ఫన్నీగా ఉన్నాడు
ఒకప్పటితో పోలిస్తే ఫ్యామిలీ కాన్సెప్ట్‌తో తీస్తున్న సినిమాలు చాలా తగ్గిపోయాయి. అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్పితే వేరే ఎవరూ ఈ టైపు మూవీస్ చేయట్లేదు. ఇకపోతే త్రివిక్రమ్-వెంకటేశ్ చాన్నాళ్ల తర్వాత కలిసి చేస్తున్న మూవీ 'ఆదర్శ కుటుంబం'. అక్టోబరు 02న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)ఈ మూవీలో చిట్టిబాబు అనే భార్య చాటు భర్తగా వెంకటేశ్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన క్యారెక్టర్ వీడియోలో కామెడీ, మ్యూజిక్ బాగున్నాయి. గతంలో త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ కామెడీ ఉండబోతుందని అనిపిస్తుంది. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ కాగా నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు వెంకీ వీడియో వదిలారు. త్వరలో ఒక్కో పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఫ్యామిలీ స్టార్స్
సూపర్ పవర్స్ లేని సూపర్ హీరో నాన్న. అయినా కుటుంబం కోసం సూపర్ కష్టాలను తట్టుకుని మరీ కుటుంబ సంక్షేమం కోసం తపన పడతాడు... ఒక్కోసారి తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తాడు. బాధ్యతలనే ఇష్టంగా చేసుకుంటాడు. కుమారుడు, కుమార్తెల సంతోషమే తన ఆస్తిగా ఫీలవుతాడు. అందుకే ప్రతి కుటుంబానికి నాన్నే ఫ్యామిలీ స్టార్. ఇలా తండ్రి ఎమోషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే... ఫాదర్ ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ జానర్లో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నేడు (ఆదివారం) నేషనల్ పేరెంట్స్ డే. ఈ సందర్భంగా తండ్రి ఎమోషన్‌తో రానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేయండి.గ్యాంగ్‌స్టర్ నాన్న కూతురు సంరక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ తండ్రి కథ వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషనే అని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట.కొన్ని సీన్స్‌లో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని కొంత భాగం గోదావరి నేపథ్యంలో, మరికొంత భాగం కోల్‌కతా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల పాత్రలో చిరంజీవి, మలయాళ నటి అనశ్వర రాజన్ నటిస్తున్నారని టాక్. నివేతా పేతురాజ్ మరో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి భార్యగా నివేతా పేతురాజ్ కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో చిత్రయూనిట్ షూటింగ్ చేస్తోందని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటు క్లాస్... అటు మాస్ సమాజంలో వారిది ‘ఆదర్శ కుటుంబం’. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, ఈ కుటుంబం పెద్ద అయిన తండ్రి గన్ పడతాడు? తన కుటుంబ సభ్యుల చేత ఫైట్ చేయిస్తాడు. ఈ మాస్ ఫాదర్ డీటైల్స్ ఏంటో తెలుసుకోవాలంటే అక్టోబరు 2 వరకు ఆగాల్సిందే. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47’ (ఏకే 47). ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫాదర్ రోల్ చేస్తున్నారు వెంకటేశ్. అలాగే వెంకటేశ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. క్లాస్‌గా ఉంటూనే తన కుటుంబం ఆపదలో ఉందంటే మాత్రం ఫైర్ అయి పోయే మాస్ ఫాదర్ రోల్ చేస్తున్నారట వెంకటేశ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ ఫిల్మ్స్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం.కూతురు కోసం... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ తండ్రి పాత్రలో నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ నటించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. ఏదో మానసిక బాధలో ఉన్న తండ్రిని మందు మానేయమని కూతురు రిక్వెస్ట్ చేయడం, కుమార్తె కోసం ఆ తండ్రి తనను తాను మార్చుకోవాలనుకోవడం, ఆ కుమార్తె రక్షణ కోసం తన ప్రాణాలనైనా లెక్క చేయని తండ్రి సాహసం... వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘ఇరుముడి’ సినిమా కథనం సాగుతుందని టాక్. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. తండ్రి ఆదేశం తన తండ్రి లక్ష్యం కోసం రుద్ర ఓ సాహసోపేతమైన ప్రయాణం మొదలుపెట్టాడు. కాలానికి అతీతంగా ఖండాల మధ్య ప్రయాణం చేస్తున్నాడు. మరి... రుద్రకు అతని తండ్రి అప్పగించిన మిషన్ ఏంటి? తండ్రి కోసం రుద్ర ఏం చేశాడు? అన్న అంశాల నేపథ్యంలోనే ‘వారణాసి’ సినిమా కథనం రూపొందుతోందనే ప్రచారం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంక చో్ర పా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, అడ్వెంచరస్ అంశాలు ఉన్నప్పటికీ ‘వారణాసి’ ప్రధాన కథాంశం తండ్రీ కొడుకుల అనుబంధమే అని ఇటీవల పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు రాజమౌళి. దీంతో ‘వారణాసి’ సినిమా కథపై విభిన్న ప్రచారాలు తెరపైకి వచ్చాయి. పైన పేర్కొన్న కథాంశం కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు...ఈ చిత్రంలో మహేశ్‌బాబు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారని భోగట్టా. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.ఓ తండ్రి... ఇద్దరు కొడుకులు ఓ తండ్రి తన ఇద్దరు కొడుకుల కోసం ఎలాంటి త్యాగం చేశాడు? ఈ ఇద్దరు కొడుకులకు, తండ్రికి మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? అనే అంశాల ఆధారంగా ‘రాకా’ సినిమా తెరకెక్కుతోందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ తండ్రీ కొడుకుల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని సమాచారం. అంతే కాదండోయ్..‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ చేస్తున్న మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్ విలన్ అని టాక్. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ‘రాకా’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మేజర్‌గా ఈ సెట్స్‌లోనే ఈ సినిమాను షూట్ చేస్తున్నారు అట్లీ అండ్ టీమ్. కాగా, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో భాగంగా ఆస్ట్రియాలో ఉన్నారు అల్లు అర్జున్. ఈ వెకేషన్ పూర్తి కాగానే, ముంబై చేరుకుని ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందట. ఎందుకంటే... ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించారు దర్శకుడు అట్లీ. అందుకోసం చాలా వీఎఫ్ఎక్స్ పనులు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే ‘రాకా’ సినిమా విడుదల వచ్చే ఏడాది ఉంటుంది. నటీమణులు దీపికా పదుకోన్, ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవాల్ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ఈ సినిమాలో భాగమయ్యారని బాలీవుడ్ సమాచారం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి హీరో... కొడుకు విలన్? ఏ తండ్రికైనా తన కొడుకే హీరో. కానీ ఓ తండ్రి పాలిట ఓ కొడుకు విలన్ అయ్యాడు. మరి... ఈ తండ్రీ కొడుకుల కహానీ ఏంటి? కొడుకు తనపై పెంచుకున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చేందుకు ఓ తండ్రి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు? అన్న అంశాలతో ‘టాక్సిక్’ సినిమా రూపొందుతోందని సమాచారం. యశ్ ద్వి పాత్రాభినయం చేసిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అండ్ అప్స్’. గోవా నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రాయ, టాక్సిక్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు యశ్.‘టాక్సిక్’ కథనం తండ్రీ కొడుకుల ప్రతీకారం, అనుబంధం నేపథ్యంలో సాగుతుందని, 1940–1970 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రధానాంశం తండ్రిపై కొడుకు ప్రతీకారమే అయినా, క్లైమాక్స్‌లో వీరిద్దరూ కలిసి మెయిన్ విలన్‌ను ఓ ఆటాడిస్తారట. మరి... ఈ సినిమా కథనం ఇలానే సాగుతుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం ఆగస్టు 26 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.ఇక ఈ చిత్రంలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కా రోల్లో తారా సుతారియా, మెలిస్సాగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో కలిసి ఈ సినిమాకు కథ అందించారు యశ్. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ విశ్వనాథ్ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టైటిల్లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఉండటం, ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా ఈ చిత్రంలో సూర్య చేసినది ఫాదర్ రోల్ అని స్పష్టం చేస్తున్నాయి. మరి... సంజయ్ విశ్వనాథ్‌గా తండ్రి పాత్రలో సూర్య ఎలా నటించారు? ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ బాండింగ్స్ ఏంటి? అన్న అంశాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్గా మమితా బైజు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.⇒ కార్తీ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఈ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తీ అద్భుతమైన నటన కనబరచారు. పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి, తన కుమార్తె అముదను కలసుకునేందుకు ఢిల్లీ తిరిగి వస్తాడు. మరి... ఈ తండ్రీకూతుళ్ల కథ ఏంటి? ఢిల్లీ భార్యకు ఏం జరిగింది? డ్రగ్స్ మాఫియా నుంచి అముదకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఢిల్లీ ఏ విధంగా అడ్డుకుంటాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘ఖైదీ 2’ చిత్రంలో చూడాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఏఆర్ ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ ‘ఖైదీ 2’ కూడా రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేసే పనిలో ఉన్నారు లోకేష్. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణను షురూ చేస్తారు కార్తీ, లోకేష్.⇒ మదర్ సెంటిమెంట్‌తో ‘బిచ్చగాడు’ సినిమా తీసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ ఆంటోనీ. తాజాగా ఆయన ఫాదర్ సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ‘నాన్న కుట్టి’. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, చిత్ర లక్ష్మణన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ము. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మిస్తుండగా, రామాంజనేయులు జవ్వాజీ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇలా తండ్రి భావోద్వేగాలతో కూడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే తల్లి ఎమోషన్‌తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' ఇదే
వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ ఈ ఏడాది దసరాకి థియేటర్లలోకి వస్తుందని ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. కానీ గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. రీషూట్స్ వల్ల ఈ టైంకి రాకపోవచ్చని గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెడుతూ విడుదల తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేశ్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా చేస్తోంది. 'పెద్ది' ఫేమ్ దివ్యేందు, నివేతా పేతురాజ్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారని టాక్ వచ్చింది గానీ క్లారిటీ రావాలి. తమన్ సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని దసరాకు కాకుండా గాంధీ జయంతి వీకెండ్ క్యాష్ చేసుకునేందుకు అక్టోబరు 02న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.ఇందులో వెంకటేశ్, శ్రీనిధి.. మధ్య తరగతి భార్యభర్తల్లా కనిపించారు. జంట కూడా బాగానే ఉంది. అయితే ఈ చిత్రం.. రీసెంట్ టైంలో వచ్చిన మా ఇంటి బంగారం, బ్లాస్ట్ సినిమాల్లోని స్టోరీని కాస్త పోలి ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే పైకి సౌమ్యంగా కనిపించే ఓ కుటుంబం.. ఆపద వచ్చినప్పుడు ఫైట్స్ చేయడం లాంటివి ఉండబోతున్నాయని టాక్. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్‌కి అసలు కారణాలు.. దిల్ రాజు మాటల్లో) -
మెట్రో స్టేషన్లో ఆదర్శ కుటుంబం
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47’ (ఏకే 47) అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సికింద్రాబాద్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్లో వెంకటేశ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌కి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ‘‘కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’.ఈ చిత్రంలో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు వెంకటేశ్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఆయన ఫస్ట్ లుక్‌పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ కథ అందించడంతో పాటు డైలాగులు రాశారు. అలాగే ‘వాసు’ సినిమాకి మాటలు రాశారు. అయితే దర్శకుడిగా మాత్రం వెంకటేశ్‌తో ఆయన తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
పెద్ద టైటిల్.. ఇప్పుడు ఇదే ట్రెండ్ గురూ!
టైటిల్ క్యాచీగా ఉంటే ఆడియన్స్ అటెన్షన్‌ని ఈజీగా క్యాచ్ చేస్తుంది... అది చిన్న టైటిలా? పెద్ద టైటిలా? అన్నది కాదు. అయితే ఒక్కోసారి రెండక్షరాలతోనే టైటిల్ కుదరొచ్చు... ఇరవై అక్షరాలతోనూ కుదరొచ్చు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ చూస్తే మాత్రం ‘పెద్ద’ టైటిల్ ట్రెండ్ సాగుతున్నట్లనిపిస్తోంది. ఆ లెంగ్తీ టైటిల్స్ అన్నీ అచ్చ తెలుగులో చక్కగా క్యాచీగా ఉన్నాయి. ఆ టైటిల్స్, ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోలు, ఆ కథా కమామీషులోకి వెళదాం. మన శంకరవరప్రసాద్‌గారు... ‘ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్, విశ్వంభర’ వంటి చిన్న టైటిల్స్ చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తున్న పెద్ద టైటిల్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ కావడం విశేషం. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్, శశిరేఖల ప్రేమకథ, కుటుంబ గాథల కహానీ ఏంటి? అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ (2019) చిత్రం తర్వాత చిరంజీవి–నయనతార జోడీగా నటిస్తున్న సినిమా ఇది (‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో అన్న, చెల్లెలుగా నటించారు). ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, కేథరీన్ , సచిన్ ఖేడేకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార (శశిరేఖ), చిరంజీవి (వరప్రసాద్ పాత్రలో) భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెండితెరపై వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? అన్నది ‘మీసాల పిల్ల...’ అనే పాటలో చూపించారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. అంతేకాదు... తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి–వెంకటేశ్ కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో నటస్తుండటంతో ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి΄ాట ‘మీసాల పిల్ల...’, ద్వితీయ పాట ‘శశిరేఖ...’ ఏ స్థాయిలో శ్రోతలను అలరించాయో తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47... కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని., మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలరించడంలో వెంకటేశ్ దిట్ట. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అంతేకాదు... కెరీర్లో తొలిసారి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సాధించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక– హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, ఈ నెల 10న ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘‘కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో రానున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా వెండితెరపై వినోదాల విందుని అందించనుంది. వెంకటేశ్–త్రివిక్రమ్ కలయిక ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘నారప్ప, దశ్యం 2, ఎఫ్ 3, సైంధవ్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి షార్ట్ టైటిల్స్ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న బిగ్ టైటిల్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి.... హీరో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవితేజ కెరీర్లో 76వ సినిమాగా రూ΄÷ందుతోన్న ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామసత్యనారాయణ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోలో.. ‘‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, చాట్ జీపీటీ, జెమిని.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను.. ఆశ్చర్యపోయారే తప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ పలికిన సంభాషణలకు మంచి స్పందన వచ్చింది. ‘‘చాలా రోజుల తర్వాత రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంది. అద్భుతమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేశారు రవితేజ. కిషోర్ తిరుమల టచ్‌తో ఈ టైటిల్ ఫ్యామిలీ ఫీలింగ్ కలిగించింది. మా సినిమా పక్కా ఎంటర్టైనింగ్గా, మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత హీరో రవితేజ–సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘బెల్లా బెల్లా...’, ‘అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే...’ వంటి ΄ాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ‘ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర’ వంటి చిన్న టైటిల్స్ సినిమాల తర్వాత రవితేజ నటిస్తున్న పెద్ద టైటిల్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వీరి కలయికలో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదల చేసిన పవన్ కల్యాణ్ ప్రత్యేక ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ ΄ాటను భాస్కరభట్ల రాయగా, విశాల్ దడ్లానీ ΄ాడారు. ఇప్పటికే టాకీ ΄ార్ట్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నారీ నారీ నడుమ మురారి బాలకృష్ణ హీరోగా శోభన, నిరోషా హీరోయిన్లుగా రూ΄÷ందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నరసింహ నాయుడు నిర్మించిన ఈ మూవీ 1990 ఏప్రిల్ 27న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజైన ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. ‘నారీ నారీ నడుమ మురారి’ పేరుతో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త, సాక్షీ వైద్య బావా మరదల్లుగా నటించారట. మరి... ఇద్దరు మరదల్లు కలిసి బావని ఎలా ఆటపట్టించారు? ఈ బావా–మరదల్లు వెండితెరపై చేసిన సందడి ఏ స్థాయిలో నవ్వులు పంచింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016’, ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగి హిట్స్ అందుకున్న శర్వానంద్, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో 2026 సంక్రాంతికి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ‘‘ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియ¯Œ ్సను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అనగనగా ఒకరాజు ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీ¯Œ ΄÷లిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా వినోదాత్మక చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్రోమోస్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకించి సంక్రాంతి ప్రోమో అంటూ రిలీజ్ చేసిన నవీన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి కళ్లజోడు పెట్టుకుని పక్కా సంక్రాంతి బుల్లోడిలా ఉన్నారు నవీన్. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో జాయింట్ వీల్, భారీ ఎత్తున ప్రజలు ఉన్నారు. ఆ పోస్టర్ పక్కాగా సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి నవంబరు 27న విడుదలైన ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే ΄ాటకి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘‘సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేలా మా చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ప్రేక్షకులముందుకొస్తోంది. ఓం శాంతి శాంతి శాంతి ‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. దర్శకుడిగా తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ఆయన నటుడిగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. నూతన దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్–మూవీవెర్స్ స్టూడియోస్‌పై సజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ఇతర పాత్రలు పోషించారు. మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని తొలుత ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ విడుదల వాయిదా పడింది. 2026 జనవరి 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఓ వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, ఈషా రెబ్బా కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి ΄ాత్ర చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. అంబటి, ప్రశాంతిల పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు ఆరంభమవుతాయి. ఈ సమయంలో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది?’’ అనేది మా సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మా మూవీ ఆడియన్స్‌ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఆకాశంలో ఒక తార ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. అంతేకాదు... మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు కథానాయకుడే అన్నట్లు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారాయన. మలయాళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకెళుతున్న ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం మంచి ఫ్యాన్ బేస్ సం΄ాదించుకున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జూలై 28న దుల్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌కి చక్కని స్పందన వచ్చినట్లు చిత్రబందం పేర్కొంది. దుల్కర్ సల్మాన్ ఓ సాధారణ రైతు ΄ాత్ర చేశారు. ఓ పల్లెటూరికి చెందిన ఆయన అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కలని ఎలా నెరవేర్చుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని తెలుస్తోంది. ‘‘సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకెళుతున్న దుల్కర్ సల్మాన్.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం మా సినిమాకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ టైటిల్స్ మాత్రమే కాదు... ఇంకా లెంగ్తీ టైటిల్ ఉన్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఏఎన్నార్ టైటిల్‌తో త్రివిక్రమ్-వెంకీ కొత్త సినిమా
వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోకి టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. అలా అని వీళ్లు దర్శకుడు-హీరోగా కలిసి పనిచేయలేదు. త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకీ హీరోగా చేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' మూవీస్‌కి పనిచేశారు. వాటిల్లో కామెడీ గానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ గానీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి పనిచేయాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకున్నారు. అది కొన్నాళ్ల ముందు నెరవేరింది.ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్లు అప్డేట్ ఇచ్చారు. 'ఆదర్శ కుటుంబం హౌస్ నం.47' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు వచ్చే ఏడాది వేసవిలో మూవీ రిలీజ్ అవుతుందని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇదే టైటిల్‌తో 1969లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే పేరుని టైటిల్‌గా ఉపయోగిస్తున్నారు. పేరు, పోస్టర్ చూస్తుంటేనే మంచి హోమ్లీ ఫీల్ అనిపిస్తుంది.ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సంగీత దర్శకుడిగా 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు వినిపిస్తుండగా.. హీరోయిన్గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతేడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమా రిలీజైన తర్వాత నుంచి త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ చేయలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఓ సినిమా అనుకున్నారు కానీ తర్వాత ఎన్టీఆర్‌తో ఫిక్స్ అయ్యారు. కుమారస్వామి దేవుడు బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఇది తీయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ తీయడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశముండటంతో ఇంతలో వెంకీతో ఈ సినిమాని త్రివిక్రమ్ తీస్తున్నారు.ఇకపోతే త్రివిక్రమ్.. ఈ సినిమాతో మరోసారి 'ఆ' సెంటిమెంట్ రిపీట్ చేశారని చెప్పొచ్చు. గతంలో అతడు, అత్తారింటికి దారేది, అఆ, అల వైకుంఠపురములో, అరవింద సమేత.. ఇలా అ లేదా ఆ అక్షరంతో ఎక్కువగా టైటిల్స్ పెట్టారు. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. ఇప్పుడు తన సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ వెంకీతో తీస్తున్న చిత్రానికి 'ఆదర్శ కుటుంబం' అని పేరు పెట్టారా అనిపిస్తుంది.


