'ఆదర్శ కుటుంబం' తొలిరోజు కలెక్షన్ ఎంత? | Aadarsha Kutumbam Day 1 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Collection: వెంకీ-త్రివిక్రమ్ సినిమా వసూళ్లు ఎన్నికోట్లు?

Oct 31 2026 11:47 AM | Updated on Oct 31 2026 11:57 AM

Aadarsha Kutumbam Day 1 Collection Worldwide

'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకటేశ్ హీరోగా చేసిన సినిమా 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు మంచి హైప్ ఏర్పడింది. కానీ తర్వాత తర్వాత ఎందుకనో అది తగ్గిపోతూ వచ్చింది. రెండుసార్లు వాయిదా పడటం కూడా దీనికి ఓ రకంగా మైనస్ అయింది. అలా ఈ శుక్రవారం(అక్టోబర్ 30) థియేటర్లలోకి వచ్చింది. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి? టాక్ ఏంటి?

(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47' మూవీ రివ్యూ)

'ఆదర్శ కుటుంబం' సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో తెరకెక్కించారు. ఇంటర్వెల్ వరకు కొంతమేర కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ సెకండాఫ్ సాగదీశారని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. వీకెండ్ పూర్తయితే ఫలితం ఏంటనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

ఇకపోతే 'ఆదర్శ కుటుంబం' సినిమాకే తొలిరోజు పెద్దగా టికెట్స్ తెగలేదు. ఆంధ్రాలో అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్ ఓ కారణం కాగా, బజ్ లేకపోవడం మరో రీజన్. అయినా సరే మొదటిరోజు డీసెంట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.16.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వెంకీ-‍త్రివిక్రమ్ రేంజ్‌కి ఇది చాలా తక్కువే అని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్‌లో రూ.50-60 కోట్ల మార్క్ అయినా రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: రిలీజ్‌ రోజే ట్విస్ట్‌.. ఆదర్శ కుటుంబం నుంచి క్రేజీ సాంగ్‌ తొలగింపు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement