విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. గతంలో వెంకీ హీరోగా నటించిన పలు చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు కానీ..దర్శకత్వం వహించలేదు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని సినీ ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆదర్శ కుటుంబం చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో వెంకీకి జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం రేపు(అక్టోబర్ 30న) విడుదల కానుంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సెన్సార్ పూర్తయింది. మరి సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది? రన్ టైమ్ ఎంత? ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన టాక్ ఏంటి? ఓ లుక్కేద్దాం.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే 16 ఏళ్లకు పైబడిన వాళ్లు ఈ సినిమాను వీక్షించొచ్చు. మూవీ నిడివి 149 నిమిషాలు. అంటే రెండు గంట 29 నిమిషాలు అన్నమాట. ఇటీవల వచ్చిన పెద్ద సినిమాలతో పోలిస్తే ఇది డీసెంట్ నిడివి అని చెప్పొచ్చు. ఇక సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రియాక్షన్ వచ్చినట్లు సమాచారం. పెద్దగా కట్స్ ఏవి చెప్పలేదట. అంతేకాదు సినిమా మొత్తం బాగా ఎంజాయ్ చేశారట.
(చదవండి: అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా: త్రివిక్రమ్)
ఈ మూవీ కథ విషయానికొస్తే.. చిట్టిబాబు(వెంకటేశ్) బ్యాంకు ఎంప్లాయ్. భార్య స్వర్ణ(శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారం పేరుతో అప్పులు చేస్తూ ఉంటుంది. కూతురు సంపూర్ణ (యువీనా) ప్రతి సారి ప్రేమలో పడుతూ తండ్రికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మరోవైపు కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్)కు చదువు రాదు. అల్లరి పనులు చేస్తూ చిట్టిబాబుకి తలనొప్పి తెప్పిస్తుంటాడు. ఇలా సాధారణ జీవితం గడుపుతున్న చిట్టిబాబు ప్యామిలీపై కొంతమంది అటాక్ చేస్తారు. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ దామోదర్ నాయుడు(నారా రోహిత్) ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో చిట్టిబాబు ఫ్యామిలీ విలాసవంతమైన బంగ్లాలోకి షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు చిట్టిబాబు ఫ్యామిలీపై దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు? చిట్టిబాబు గతం ఏంటి? సమస్యల్లో కూరుకుపోయిన తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి చిట్టిబాబు ఏం చేశాడు? అనేదే ఈ సినిమా కథ.
(చదవండి: రామాయణ రిలీజ్.. పాకిస్తాన్‌లో సంబరాలు..!)
వెంకటేశ్‌కి ఉన్న ఇమేజ్‌కి తగ్గట్లుగా త్రివిక్రమ్ మంచి ఫ్యామిలీ స్టోరీతో ఈ సినిమాను తీర్చిదిద్దాదు. కుటుంబ బంధాలు, వినోదం, భావోద్వేగాలతో పాటు క్రైమ్, యాక్షన్‌ని యాడ్ చేసి మంచి కమర్షియల్ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. ఫస్టాఫ్ అంతా కామెడీగా సాగితే..సెకండాఫ్‌లో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయట. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతో కథ మొత్తం మారిపోతుందట. కథలో కొత్తదనం లేకున్నా.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రం కొదవ లేకుండా చేశారట. మరి అసలు టాక్ ఏంటనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.
(చదవండి: 'బాగలేకపోతే వాళ్లే చెబుతారు'.. ఆదర్శ కుటుంబంపై వెంకీమామ)
తాజాగా ఈ చిత్రం బృందం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను మేము చాలా కొత్తగా ప్రయత్నించాము. త్రివిక్రమ్ ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. థియేటర్లలో ప్రేక్షకులంతా గొప్ప అనుభూతిని పొందుతారు. ఈ సినిమా మిమ్మల్ని ఏ మాత్రం నిరాశపరచకుండా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో అలరిస్తుందని నమ్ముతున్నాము. మేము కొత్తగా ప్రయత్నించిన ఈ ఆసక్తికర కుటుంబ కథా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తర్వాత ఓ అద్భుతమైన కథతో రావాలనే ఉద్దేశంతోనే ఇంత సమయం తీసుకోవడం జరిగింది’ అన్నారు.
మొత్తానికి ఇప్పటివరకు అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది. మరి రిలీజ్ తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా ఒరిజినల్ రివ్యూ కోసం సాక్షి.కామ్‌ని ఫాలో అవ్వండి.


