కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీఅంటూ.. | Keerthy Suresh Faces Unpleasant Experience During Flight | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌కు వేధింపులు.. భర్త ఆగ్రహం..

Oct 29 2026 1:33 PM | Updated on Oct 29 2026 1:41 PM

Keerthy Suresh Faces Unpleasant Experience During Flight

నటి కీర్తి సురేశ్‌కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ కోసం ఓ ప్రయాణికుడు తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె తాజాగా వెల్లడించారు. అభిమానులతో ఫొటోలు దిగేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే వ్యక్తిగత హద్దులను దాటితే మాత్రం ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. మిలాన్ నుంచి భారత్‌కు తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

భర్త ఆగ్రహం.. సిబ్బంది జోక్యం
‘విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగారు. అతడు సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో ఉండటంతో కొద్దిసేపు ఆగాలని సూచించా. అయినప్పటికీ అతడు వినకుండా వెంటనే ఫొటో దిగాలని పట్టుబట్టాడు.  ఈ ఘటనతో భర్త ఆంటోనీ తట్టిల్ కూడా అసహనానికి గురయ్యారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విమాన సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చింది’ అని కీర్తి సురేశ్‌ చెప్పారు. అయితే అభిమానులందరూ ఇలాగే ప్రవర్తించరని కీర్తి పేర్కొన్నారు. కొందరు ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారని, తమ అభిమానాన్ని చాటుకుంటారని గుర్తుచేశారు.

(ఇదీ చదవండి: 14 ఏళ్ల ప్రేమబంధం.. భార్యపై నాని పోస్ట్‌ వైరల్‌)

 #KeerthySuresh about a bad experience happened recently to her https://t.co/CHrszsI81F

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement