పెద్దిలో ఆ సీన్లు.. గిల్టీగా ఫీల్‌ అయ్యా: జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Admits Feeling Guilty Over Her Role In Ram Charan Peddi Amid Controversy Over Women Portrayal, Read Story Inside | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: 'ఆ సీన్లు నాకూ నచ్చలేదు'.. పెద్ది సినిమాపై జాన్వీ తీవ్ర వ్యాఖ్యలు!

Oct 29 2026 8:29 AM | Updated on Oct 29 2026 10:41 AM

Janhvi Kapoor Reacts To Peddi Controversy Says She Felt Guilty About Her Role

టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్‌ పాత్రపై గతంలో పలు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో మహిళలను చూపించిన తీరుపై సోషల్‌ మీడియాలో చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్‌ ఈ వివాదంపై స్పందించారు. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో మాట్లాడిన ఆమె.. సినిమాలో తన రోల్, మహిళలను చూపించిన విధానంపై వచ్చిన విమర్శలు నిజమేనని ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు.

గిల్టీగా ఫీలయ్యా!
‘పెద్ది మూవీ చిత్రీకరణ సమయంలోనే కొన్ని సన్నివేశాల విషయంలో అసౌకర్యంగా అనిపించింది. వాటిపై మరింత గట్టిగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండాల్సింది. కొన్ని సన్నివేశాల విషయంలో మరింత బలంగా మాట్లాడాల్సింది. కొన్ని సీన్లు నాకూ నచ్చలేదు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు మళ్లీమళ్లీ జరగకుండా చూసుకోవడమే నాకున్న ఏకైక మార్గం. దీని గురించి ఇప్పటివరకూ నేను స్పందించకపోవడానికి కారణం ఏంటంటే.. ఆ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. అందుకే మౌనంగా ఉన్నాను’ అని తెలిపారు.

వివాదం ఏంటంటే..?
పెద్ది థియేటర్లలో విడుదలైన తర్వాత జాన్వీ పాత్రపై, ముఖ్యంగా కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళలను కొన్ని సీన్లలో చూపించే విధానంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు సైతం గతంలో స్పందించారు. ఆ తర్వాత వెంటనే స్పందించి వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు.

(ఇదీ చదవండి: వర్షిణి, ముకేశ్‌ లిప్‌ సీన్‌.. రూ.300 కొన్న రోహిత్‌! కానీ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement