నిర్మాత చలసాని వెంకటేశ్వర రావు కన్నుమూత | Producer Chalasani Venkateswara Rao passes away | Sakshi
Sakshi News home page

నిర్మాత చలసాని వెంకటేశ్వర రావు కన్నుమూత

Oct 29 2026 4:36 AM | Updated on Oct 29 2026 4:36 AM

Producer Chalasani Venkateswara Rao passes away

ప్రముఖ నిర్మాత చలసాని వెంకటేశ్వర రావు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. సినిమా థియేటర్‌లో టికెట్‌ బుకింగ్‌ క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాతి కాలంలో ఓ థియేటర్‌కి ఓనర్‌ కావడం విశేషం. సినిమా పంపిణీ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన.

జగపతి ఆర్ట్స్‌ సంస్థలో చిన్న ఉద్యోగిగా చేరి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, సినీ నిర్మాతగా ఎదిగారు. అదే విధంగా విజయవాడలో జగపతి పేరుతో హోటల్‌ వ్యాపారం నిర్వహించారాయన. చలసాని వెంకటేశ్వర రావుని చిత్ర పరిశ్రమలో జగపతి వెంకటేశ్వర రావు అని, జేవీఆర్‌ అని సంబోధిస్తుంటారు. జగపతి మూవీ క్రియేషన్స్‌ పతాకంపై ఆయన సినిమాలు నిర్మించారు. 

వినోద్‌ కుమార్‌ హీరోగా తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చిన ‘నేటి దౌర్జన్యం’ (1990), బి. విఠలాచార్య దర్శకత్వంలో ‘కరుణించిన కనకదుర్గ’ (1992) వంటి పలు సినిమాలు నిర్మించారు. అదే విధంగా నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌తో ‘దాన వీర శూర కర్ణ’ (2015) సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి బాలరాజు మరో నిర్మాత. ఇదిలా ఉంటే... విజయవాడలో వృద్ధాశ్రమం కూడా నడిపారు. చలసాని వెంకటేశ్వర రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement