ఏదో కోల్పోయాననే బాధ కలిగింది  | Aamir Khan became emotional at the Singapore International Film Festival | Sakshi
Sakshi News home page

ఏదో కోల్పోయాననే బాధ కలిగింది 

Oct 29 2026 4:28 AM | Updated on Oct 29 2026 4:28 AM

Aamir Khan became emotional at the Singapore International Film Festival

– ఆమిర్‌ ఖాన్‌

మూడు దశాబ్దాలుగా సినిమాలే లోకంగా జీవించి, కుటుంబ సభ్యులతో గడిపే విలువైన సమయాన్ని కోల్పోయానని ఆమిర్‌ ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. ఈ వేడుకలో ‘మీ కెరీర్‌లో మీరు అత్యంత బలహీనంగా భావించిన క్షణాలు ఏవి?’ అనే ప్రశ్నకు ఆమిర్‌ ఈ విధంగా స్పందించారు. ‘‘కోవిడ్‌ టైమ్‌లో నేను ఆలోచనలో పడ్డాను. 

అసలు విశ్రాంతి అన్నదే లేకుండా 30 ఏళ్లు నా జీవితం నటుడిగా గడిచిపోయిందని అర్థం చేసుకున్నాను. మనం చేస్తున్న పనిలో ఐదారేళ్లు పూర్తిగా నిమగ్నమైపోవచ్చు. అదే 30 ఏళ్లు గడిచిపోతే... మన కుటుంబంతో మనం గడిపే విలువైన సమయాన్ని ఎంతో కోల్పోతాం. నా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లు. వాళ్ల ఎదుగుదలను చూడలేనంత బిజీగా ఉండేవాణ్ణి. అందుకే నాకు ఏదో కోల్పోయిన బాధ కలుగుతోంది. అందుకే గత నాలుగు సంవత్సరాలుగా నా కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తున్నాను’’ అని ఆమిర్‌ ఖాన్‌ భావోద్వేగంగా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement