‘ఇరుముడి’ వంటి కుటుంబ ప్రాధాన్యంతో సాగే యాక్షన్ మూవీతో ఇటీవల ఘనవిజయం అందుకున్న రవితేజ ఇప్పుడు అందుకు భిన్నమైన సినిమా చేస్తున్నారు. ‘తులాభారం’ టైటిల్‌తో వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామాతో ఈ చిత్రాన్ని లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లోకి రవితేజ బుధవారం ఎంటర్ అయ్యారు.
‘‘రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ యునిక్ స్టయిల్ స్టోరీ టెల్లింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇప్పటివరకూ ‘మాస్ మహారాజా’ అనిపించుకున్న రవితేజ ఈ చిత్రంతో ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం అవుతున్నారు. తాజా షెడ్యూల్‌లో రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. క్రైమ్, భారీ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామాతో ఈ చిత్రం సరికొత్త అనుభూతిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


