Priyanka Mohan
-
దురంధర్, బోర్డర్-2 కాదు.. ఆ చిన్న సినిమానే నంబర్‌వన్..!
ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సౌత్ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు.ఈ మూవీ ఓటీటీకి వచ్చిన తొలివారంలోనే నంబర్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో బోర్డర్-2, దురంధర్ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.వరుసగా రెండవ వారం కూడా మేడ్ ఇన్ కొరియా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది చిత్రం ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని రాసుకొచ్చారు. ఈ మూవీకి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన మీ ప్రేమకు, సందేశాలకు, ఫోన్ కాల్స్‌కు ధన్యవాదాలు.. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఓ మహిళా ఓరియంటెడ్ మూవీ ఇంతటి ఆదరణను పొందడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రియాంక మోహన్.. నీ నీ కృషికి తగిన ఫలితం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Really happy to share that #madeinkorea is trending globally NO 1 for the 2nd week in the Non-English Movies category on Netflix 🌍For the first time, a South Indian film has reached this kind of global scale and to sustain it into the second week makes it even more special ❤️… pic.twitter.com/3LNAdVkxpM— Ra.Karthik (@Rakarthik_dir) March 25, 2026 -
'ఒత్తిడిలో మెడిసిన్‌లా ఈ సినిమా..' డైరెక్టర్‌పై నాగార్జున ప్రశంసలు
మేడ్ ఇన్ కొరియా మూవీపై టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్ఏ కార్తీక్‌ను అభినందించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశానని.. పూర్తిగా అస్వాదించానంటూ ట్వీట్ చేశారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని నాగ్ కొనియాడారు. ఈ సినిమాలో మెప్పించిన ప్రియాంక మోహన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.కొరియన్ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రశంసించారు. Congratulations to my director @Rakarthik_dir for this uplifting film feel good #MadeinKorea on Netflix!! Totally enjoyed it 😊the right medicine for these stressful times💐 special shout out to @priyankaamohan https://t.co/vV5Kqa3Pdq— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2026 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేశారు.నంబర్‌వన్‌గా ట్రెండింగ్..ఈనెల 12న స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. #MadeInKorea… Such a Warm, feel-good storytelling with lovely visuals. The small-town innocence of @priyankaamohan’s character stands out.. she delivered a beautiful performance… @Rakarthik_dir keeps it simple and engaging! Congratulations to the entire team 🫶 @NetflixIndia… pic.twitter.com/a3jKrMKep1— Naga Vamsi (@vamsi84) March 15, 2026


