'ఒత్తిడిలో మెడిసిన్‌లా ఈ సినిమా..' డైరెక్టర్‌పై నాగార్జున ప్రశంసలు | Tollywood hero nagarjuna akkineni praised ott movie director | Sakshi
Sakshi News home page

Nagarjuna Akkineni: 'ఒత్తిడిలో మెడిసిన్‌లా ఈ సినిమా..' డైరెక్టర్‌పై నాగార్జున ప్రశంసలు

Mar 18 2026 5:00 PM | Updated on Mar 18 2026 5:06 PM

Tollywood hero nagarjuna akkineni praised ott movie director

మేడ్ ఇన్ కొరియా మూవీపై టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్‌ఏ కార్తీక్‌ను అభినందించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశానని.. పూర్తిగా అస్వాదించానంటూ ట్వీట్ చేశారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని నాగ్ కొనియాడారు.  ఈ సినిమాలో మెప్పించిన ప్రియాంక మోహన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

కొరియన్‌ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ఓజీ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో నంబర్‌వన్‌గా ట్రెండ్‌ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రశంసించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement